యారన్‌ సబ్సిడీ సాధిద్దాం | Sakshi
Sakshi News home page

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

Published Mon, May 6 2024 7:05 AM

యారన్

సిరిసిల్లటౌన్‌: నేతన్నలకు రావాల్సిన యారన్‌ సబ్సిడీని సాధిద్దామని పవర్‌లూమ్స్‌ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్‌ పేర్కొన్నా రు. సిరిసిల్లలో నేతకార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 8న సిరిసిల్లలో పవర్‌లూమ్స్‌ కార్మికుల సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన యా రన్‌ సబ్సిడీ సాధన సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్లుగా సిరిసిల్ల నేతకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీకి ఓట్లు వేయాలని అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకుందామన్నారు. ఈనెల 8న జరిగే సమావేశానికి సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికులు హాజరుకావాలని కో రారు. కోడం రమణ, గుండు రమేశ్‌, సబ్బని చంద్రకాంత్‌, కంది మల్లేశం, బెజుగం సురేశ్‌, సదానందం, దశరథం, దామోదర్‌, గణేశ్‌, విజయ్‌, ప్రసాద్‌, తిరుపతి, పోచమల్లు పాల్గొన్నారు.

కేటీఆర్‌ ఓటు రాజకీయం చేస్తున్నారు

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి

సిరిసిల్లటౌన్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి హితవు పలికారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ప్రచారంలో భాగంగా కేటీఆర్‌కు స్థానికుల నుంచి వచ్చిన వినతులకు స్పందించి పరిష్కరించాలని కోరారు. మైనార్టీల ఓట్లు దండుకోవడానికి హిందుత్వ వాదుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడొద్దన్నారు. పట్టణంలోని ఆలయ భూముల కబ్జాకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దుమాల శ్రీకాంత్‌, పట్నాల శేఖర్‌, పల్లికొండ నర్సయ్య, సొక్కి శ్రీనివాస్‌, ల్యాగల భాగయ్య, మహేశ్‌, రాజు, అభినయ్‌, మహేందర్‌, అజయ్‌, రాము, మధు, దేవయ్య పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లాను ఉంచుతారా.. లేదా ?

జిల్లా పరిరక్షణ సమితి నేత రామ్మోహన్‌

సిరిసిల్లటౌన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాను ఉంచుతారా.. లేదా? అనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని జిల్లా పరిరక్షణ సమితి నేత బొల్లి రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం పరిపాలన సౌ లభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిందని, ఈక్రమంలోనే సిరిసిల్లకు కలెక్టరేట్‌, వైద్యకళాశాల వచ్చాయన్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్ప ష్టత ఇవ్వాలని కోరారు. జిల్లాను తొలగిస్తే ప్ర జాపోరాటాలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆవునూరి రమాకాంత్‌రావు, ఎండీ సత్తార్‌, గడ్డం లత, దార్ల సందీప్‌, బుస్సా వేణు, సోమిశెట్టి దశరథం, మల్లేశం పాల్గొన్నారు.

దళితులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌

సిరిసిల్లటౌన్‌: తెలంగాణ ఏర్పాటు తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న కేసీఆర్‌ మాట నిలుపుకోకుండా పదేళ్లపాటు దళితులను మోసం చేశారని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్‌ నల్లాన కనకరాజు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ మాలసంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు మేడి అంజయ్య, రొడ్డ రాంచంద్రం, దుంపల జీవన్‌కుమార్‌, నాలుక సత్యం పాల్గొన్నారు.

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
1/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
2/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
3/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
4/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
5/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం
6/6

యారన్‌ సబ్సిడీ సాధిద్దాం

Advertisement
Advertisement