చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

Published Sun, May 5 2024 4:20 AM

చక్కద

చంద్రబాబు హయాంలో

వెబ్‌ల్యాండ్‌లో అక్రమాలు

రైతులను నిండా ముంచేసిన గత టీడీపీ ప్రభుత్వం

ఒకరి భూమి మరొకరి పేరున నమోదు

గత మోసాలకు అడ్డుకట్ట వేసి,

చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

చ్చ భూచోళ్ల అక్రమాల్లో పైవి కొన్ని మాత్ర మే. టీడీపీ హయాంలో జరిగిన భూ ఘోరాలెన్నో. వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు మార్చేసి ప్రభుత్వ భూము ల్ని, ప్రైవేటు వ్యక్తుల్ని తమ పేర్లపై రాసుకుని దర్జాగా అనుభవించడం, వాటిపై బ్యాంకుల్లో పెట్టి రుణాలు కాజేయడం వంటివి ఎన్నో చేశారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్టుగా సాగిపోయారు. దీనికంతటికీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన వెబ్‌ల్యాండ్‌ విధానమే కారణం.

చంద్రబాబు హయాంలో వెబ్‌ల్యాండ్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయి. జిల్లాలో 5.66లక్షల రైతులుండగా వారిలో 40శాతం మేర రైతుల భూముల రికార్డులు తప్పుల తడకగా ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో ఉన్న భూమి కంటే ఎక్కువగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయగా, కొన్ని గ్రామాల్లో ఉన్న భూమి కంటే తక్కువ నమోదు చేశారు. ఒకరి సర్వే నంబర్లు మరొకరి పేరున, ఉన్న భూముల కన్న ఎక్కువగా, ఎక్కువ భూములున్న వారికి తక్కువ నమోదు చేయడం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూమే లేని వారికి భూమి ఉన్నట్టు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వివాదాస్పద భూములను, అమాయక రైతుల భూములను టీడీపీ నేతలు తమ పేర్లతో నమోదు చేయించుకున్నారు. వారసత్వ భూములు వారసుల పేరిట నమోదు కాకపోవడంతో మ్యూటేషన్‌కు దరఖాస్తులు చేసుకున్నా వెంటనే పని జరగని సందర్భాలు ఉన్నాయి. మాన్యువల్‌ అడంగళ్‌ నుంచి కంప్యూటరైజ్డ్‌ వెబ్‌ల్యాండ్‌ లో నమోదు చేసినప్పుడు చాలా ఖాతాలు (వన్‌బీ)లు నమోదు కాలేదు. దీన్ని సరిచేయడానికి ముప్ప తిప్పలు పడ్డారు. రిజిస్ట్రేషన్‌లు, క్రయ విక్రయాలు జరిగిన తరువాత భూములు కొనుగోలు చేసుకున్న వారి పేరిట రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీన్ని గాడిలో పెట్టేందుకు నానా అవస్థలు పడ్డారు.

అక్రమాలకు చెక్‌

● గ్రామాల సరిహద్దు నుంచి భూముల వరకు ప్రతి అంగుళం విడిచిపెట్టకుండా సర్వే చేయడం వల్ల ఎన్నో వివాదాలకు చెక్‌ పడింది.

● భూ సర్వేలో డ్రోన్‌ల సాయంతో ఫొటోలు తీయడం మొదలుకొని, మ్యాపింగ్‌ వరకూ అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి.

● రికార్డులు చెరిపేయడానికి, టాంపరింగ్‌ చేయడానికి ఆస్కారం లేని విధంగా సర్వే కొనసాగుతోంది.

● రీ సర్వే పూర్తయిన తర్వాత రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. దీని వల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది.

● రైతుల పేరున పక్కాగా రికార్డులు ఉండేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేసింది.

● వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్‌మెంట్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాల్లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

● యాజమాన్య హక్కులు ధ్రువీకరించేందుకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసే అవకాశం లేని రీతిలో అడుగులు వేసింది.

● అంతేకాకుండా గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా సచివాలయం రిజిస్ష్రేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూమి వివాదాల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమల్లోకి తెచ్చింది. దేశంలో తొలిసారిగా అత్యంత శాసీ్త్రయ పద్ధతిలో సమగ్ర భూసర్వే ప్రారంభించింది. తొలి విడత 354 గ్రామాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పూర్తి చేయగా, రెండో విడత 195 గ్రామాల లక్ష్యంతో రీసర్వే చేసింది.

చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
1/2

చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
2/2

చక్కదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

Advertisement
Advertisement