వెబ్‌ల్యాండ్‌ ముసుగులో గతంలో మోసాలు | Sakshi
Sakshi News home page

వెబ్‌ల్యాండ్‌ ముసుగులో గతంలో మోసాలు

Published Sun, May 5 2024 4:20 AM

వెబ్‌ల్యాండ్‌ ముసుగులో గతంలో మోసాలు

● ఎచ్చెర్ల పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఎస్‌ఎంపురం వెళ్లే దారిలో ఉన్న కృష్ణ బంద చెరువును టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) ఆక్రమించారు. 2016లో ఈ చెరువుకు సంబంధించిన రికార్డులను మార్పు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టగా దాదాపు 3.11ఎకరాల భూమిని ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. ఆక్రమిత భూమి అంతా పూర్తిగా చెరువు గర్భమని గుర్తించి, రికార్డుల నుంచి చౌదరి బాబ్జీ పేరు తొలగించారు.

● ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురంలో సర్వే నంబరు 112లో కొండ ప్రాంతాన్ని సబ్‌ డివిజన్‌గా చేసినట్టుగా చూపిస్తూ 638లో 4.35 ఎకరాల మేర టీడీ పీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) అక్రమంగా పట్టా సంపాదించారు. తన తండ్రి చౌదరి సత్యనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడిగా కొనసాగారని, దానిలో భాగంగా తన తల్లి సరస్వతమ్మ పేరున 1999లో ప్రభుత్వ భూమి ఇచ్చారని, అది వారసుడిగా తనకు వచ్చిందని 2018లో వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించా రు. వాస్తవంగా స్వాతంత్య్ర సమరయోధుడి గా వేరే చోట భూములు పొంది విక్రయించారు. కానీ ఈ కొండలో తమకు పట్టాలిచ్చినట్టు గా ఫేక్‌పత్రాలు సృష్టించారు. దీనిపై స్థాని కులు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపారు.

వెబ్‌ల్యాండ్‌.. గుర్తుందా ఈ పేరు ? చంద్రబాబు హయాంలో తీసుకువచ్చిన ఈ విధానం సామాన్యుల భూములకు భద్రత లేకుండా చేసింది. ఒకరి పేరున ఉన్న భూమిని మరొకరి పేరుతో నమోదు చేయడం, అక్రమంగా పట్టాలు చేయించడం, పేదల భూమిని ఎక్కడో ఉండి అమ్మేయడం వంటి అక్రమాలెన్నో జరిగాయి. ఇలాంటి పచ్చ ‘భూ’చోళ్ల బారి నుంచి భూములను రక్షించడానికి వైఎస్‌ జగన్‌ సర్కారు

సంస్కరణలను

ప్రవేశ పెట్టింది.

Advertisement
Advertisement