మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: మిత్రులతో అకారణంగా వివాదాలు. పనులలో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
మిథునం: నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర. పనులు మధ్యలో విరమిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
సింహం: ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కన్య: వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగాన్వేషణ ముందుకు సాగదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మకరం: విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment