తమిళనాడుకే పెద్ద హీరో ‘అన్బుచెలియన్‌’ | Sakshi
Sakshi News home page

తమిళనాడుకే పెద్ద హీరో ‘అన్బుచెలియన్‌’

Published Sun, May 5 2024 6:45 AM

తమిళనాడుకే పెద్ద హీరో ‘అన్బుచెలియన్‌’

తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇంగ నాన్‌ దాన్‌ కింగ్‌. నటి ప్రియాలయ నాయకిగా నటించిన ఇందులో నటుడు తంబిరామయ్య, కూల్‌ సురేశ్‌ తదితరులు ముఖ్య పా త్రలు పోషించారు. గోపురం ఫిలింస్‌ పతాకంపై అన్బుచెలియన్‌ సమర్పణలో ఆయన వారసురాలు సుష్మిత నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించారు. డీ.ఇమాన్‌ సంగీతం అందించిన ఇంగ నాన్‌దాన్‌ కింగ్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్బుచెలియన్‌ మాట్లాడుతూ నటుడు సంతానం హీరోగా చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, అది ఈ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు. అందరూ ఆనందించే వినోద భరిత కథా చిత్రంగా ఇంగ నాన్‌దాన్‌ కింగ్‌ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. చిత్ర కథానాయకుడు సంతానం మాట్లాడుతూ ఇంగ నాన్‌దాన్‌ కింగ్‌ చిత్రానికి తాను హీరోనని, అయితే ఈ చిత్ర సమర్పకుడు అన్బుచెలియన్‌ మాత్రం తమిళనాడుకే హీరో అని పేర్కొన్నారు. ఆయన కార్యాలయానికి వెళ్లని హీరోనే లేరన్నారు. ఒకసారి తాను కూడా ఆయన ఆఫీస్‌కు డబ్బు కోసం వెళ్లానన్నారు. ఇల్లు కొ నడానికి అప్పు అడిగానని, అందుకాయన అప్పు చేసి ఇల్లు కొనడం అంత శ్రేయస్కరం కాదని హితవు పలి కి, తాను డబ్బు ఇస్తాను దాన్ని మీరు హీరోగా నటించే తన చిత్రానికి అడ్వాన్స్‌గా పెట్టుకోండి అని చెప్పారన్నారు. అలా ఈ చిత్రం మొదలయ్యిందని సంతా నం చెప్పారు. ఆయనతో కలిసి ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా తాను హీరోగా నటించిన చిత్రం ద్వారా అన్బుచెలియన్‌ వారసురాలు సుష్మిత నిర్మాతగా మారడం మరింత సంతోషంగా ఉందనే భావాన్ని సంతానం వ్యక్తం చేశారు. లాజిక్‌లు వెతక కుండా చూసి ఎంజాయ్‌ చేసే కథా చిత్రం ఇంగ నాన్‌ దాన్‌ కింగ్‌ అని సంతానం చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement