ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Mon, May 6 2024 2:15 AM

ప్రశా

తిరుపతి అర్బన్‌ : జిల్లాలో తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం పలు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ తనిఖీ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను, ఓటింగ్‌ సరళిని ఆయన ఆదివారం అధికారులతో కలసి పర్వవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫెసిలిటెషన్‌ సెంటర్లలో ఈనెల 7, 8 తేదీలో కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పీఓలు, ఏపీఓలు, అబ్జర్వర్లు, అత్యవసరశాఖ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 22,299 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసు కోగా అందులో 12.310 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌
1/2

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌
2/2

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement