‘ప్రజల ఆలోచనలకు భిన్నంగా మేం నడుచుకోలేం. పార్టీలు మారే వారు నైతికంగా రాజీనామా చేయకుండా కండువాలు వేసుకోవడం దురదృష్టకరం.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ప్రజల ఆలోచనలకు భిన్నంగా మేం నడుచుకోలేం. పార్టీలు మారే వారు నైతికంగా రాజీనామా చేయకుండా కండువాలు వేసుకోవడం దురదృష్టకరం. పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పు తేవాలి. చట్టంలో ఉండే లోపాల వల్ల చంద్రబాబు ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు.’
ఫిబ్రవరి 23వ తేదీన
సుజయకృష్ణ రంగారావు చేసిన వాఖ్యలివి.
‘ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీలో ఉంటూ నిత్యం ప్రజల పక్షాన ఉండటం నాకు ఆనందంగా ఉంది. ైవైఎస్ అకా ల మరణం తర్వాత రాష్ట్రం స్పష్టమైన నాయకత్వం కోల్పోయింది. వెఎస్ తరహా పాలన అందించేందుకే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించింది. పార్టీ మారిన నాయకులు తమ వెంట ఐదు శాతం మంది కార్యకర్తలను కూడా తీసుకెళ్లలేదు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజకీయ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. అటువంటి వారు వెళ్లినా పార్టీకి నష్టం లేదు.’
మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో
సుజయకృష్ణ రంగారావు చేసిన వ్యాఖ్యలు
‘బొబ్బిలి రాజులు ప్రజల మనుషులు. పదవుల కోసం, ప్రలోభాలకు లొంగే వాళ్లం కాదు. నిజాయతీతో మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడుపుతున్నాం. ప్రజలకు మచ్చ తెచ్చే విధంగా నడుచుకోం. పార్టీ మారుతున్నట్టు అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోవాలి.
ఫిబ్రవరి 23వ తేదీన
బేబినాయన చేసిన వాఖ్యలివి.
‘పార్టీ మారుతున్నట్టు పదపదే దుష్ర్పచారం చేయడం దురదృష్టకరం. మాకు తెరచాటు రాజకీయాలు తెలియవు. మా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. వైఎస్సార్ కుటుంబానికి మేం రుణపడి ఉంటాం. వెఎస్సార్ పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసేవి. చంద్రబాబు పాలనలో కనీసం వర్షపు మేఘం కూడా దిగడం లేదు.
మార్చి 4వ తేదీన బాడంగిలో జరిగిన సమావేశంలో బేబినాయన వ్యాఖ్యలు.