sujay krishna ranga rao
-
సుజయ్ కుటుంబంలో కుంపటి..
జిల్లా మంత్రిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారా... ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా... మళ్లీ టికెట్టిస్తే గెలుస్తారన్న నమ్మకం సన్నగిల్లుతోందా... ఆయన్ను మార్చాలన్న ఆలోచనలో అధినేత ఉన్నారా... తాజా పరిణామాలు చూస్తే ఇవన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురకు మినహా... మిగిలిన వారికి మొండిచెయ్యి చూపనున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆ నలుగురైదుగురిలో మన రాజుగారు లేరంట. పదవికోసం పార్టీ ఫిరాయించి... తీరా అక్కడ టికెట్టు దక్కక పోతే... ఎంతటి అవమానం? సాక్షిప్రతినిధి విజయనగరం : అవసరం మేరకు వాడుకుని ఎవ్వరినైనా యూజ్ అండ్ త్రోలా విసిరేయగల సమర్థుడు చంద్రబాబు. టికెట్టిచ్చి గెలిపించిన పార్టీకి ఎగనామం పెట్టి... కేవలం మంత్రి పదవికోసమే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఆయన షాక్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 21మంది ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అందువల్ల పార్టీ ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణరంగారావు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సుజయ్‌కు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత భారీగా పెరగడంతో పాటు సొంత ఇంటిలో వేరు కుంపట్లు చేటు తెచ్చేలా ఉన్నాయి. పార్టీలో వ్యతిరేకత వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది 2016 ఏప్రిల్‌లో ప్రతిపక్షాన్ని వదిలి అధికార పక్షం చెంతకు చేరారు సుజయ్‌కృష్ణ రంగారావు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2017 ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కూడా అయ్యారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని, మంత్రి పదవి రాగానేఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననీ చెప్పిన సుజయ్‌పై అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మొదలైంది. మంత్రి పదవి కోసమే పార్టీని వదలి వెళ్లారని గుర్తించిన ప్రజల్లో ఆయనపై నమ్మకం సడలుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వస్తే చిత్రంగా పార్టీలో మాత్రం సుజయ్‌పై వ్యతిరేకత మొదలైంది. కొన్నేళ్లుగా సుజయ్‌ను సీఎం అనేక సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. కనీసం నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు కూడా నిర్వహించకపోవడంపై చంద్రబాబు స్వయంగా అసంతప్తి వ్యక్తం చేశారు. కేడర్‌లో అసంతృప్తి కనీసం టీడీపీలోనైనా సుజయ్‌కు గౌరవం దక్కిందా అంటే అదీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సుజయ్ సమావేశంలోనే చొక్కా చించుకుని నిరసన తెలిపారు. ఓ గ్రామ పర్యటనకు వెళితే స్థానికులు మంత్రిని గో బ్యాక్ అన్నారు. మంత్రి నాయకత్వాన్ని కాదని ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఒక సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్ళి పోయారు. ఇలాంటి అవమానాలు సుజయ్‌కు సర్వసాధారణమైపోయాయి. తెంటు లకు‡్ష్మనాయుడు, తూముల భాస్కరరావు వంటి నాయకులు సైతం సుజయ్‌పై తమకున్న వ్యతిరేకతను ఆయా సందర్భాల్లో బయటపెట్టారు. గ్రూపుల గోల రాజులు తెలుగు దేశంలోకి రాకముందు రెండేసి గ్రూపులుండేవి. గ్రామాల్లో రెండు గ్రూపులు వద్దనీ తాను అందర్నీ చూస్తాననీ వారిని టీడీపీ 1(పాతవాళ్లు), టీడీపీ 2(వైఎస్సార్ సీపీకి చెందిన వారు)అని రెండు వర్గాలుగా సుజయ్ విడదీశారు. తనకు సన్నిహితంగా ఉన్న కొద్దిమందినే దగ్గరకు తీసుకుంటున్న మంత్రి రంగారావు తీరుతో గ్రామాల్లో చిచ్చు రేగింది. రానున్న ఎన్నికల ముందే తాము ఏదో ఒకటి తేల్చుకుంటామని కలసి ఉండలేని రెండు గ్రూపుల వారు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. బలిజిపేటలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభానికి వెళ్లిన సుజయ్ సమక్షంలోనే టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రజల్లో తగ్గిన గ్రాఫ్ పోనీ జనానికేమైనా చేశారా అంటే అదీలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం బొబ్బిలి వంశానికి చెందిన రాజు సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రజలు ఎంతగానో అభిమానించారు. కానీ మంత్రి పదవి కోసం ఆశపడి టీడీపీలోకి వెళ్ళి సుజయ్ చేతులారా జనం వద్ద చులకనైపోయారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పుకుంటున్న ఆయన తన నియోజక వర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా పట్టించుకోలేదు. ఇటీవల హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్తాపనలు చేసేశారు. అవేవీ పూర్తికావని ఆయనకూ తెలుసు. కుటుంబంలో కుంపటి సుజయ్‌కు ఇంటా బయటా ప్రతికూలంగా ఉంది. సొంత తమ్ముడు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) రూపంలో కుంపటి రాజుకుంది. ఇద్దరు అన్నదమ్ముల వివాదాన్ని సుజయ్ తమ్ముడు, బేబీ నాయన అన్న రామ్‌నాయన వద్దకు, తల్లి వద్దకు కూడా తీసుకువెళ్లారు. ప్రారంభంలో సుజయ్‌కృష్ణ డెయిరీఫారం నిర్వహిస్తుండేవారు. అప్పట్లోనే బేబీనాయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రామ్ నాయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అప్పట్లో రాజకీయ అవకాశం రావడంతో వయసు రీత్యా బేబీ నాయన చిన్నవాడు కావడంతో సుజయ్‌ను రంగంలోకి దించారు. కానీ ఈసారి బేబీనాయనకు రాజకీయ పదవిపై కోరిక బలంగా ఉంది. దీంతో అన్నను పక్కకు తప్పుకోవాల్సిందిగా పంచాయతీలు చేస్తున్నారు. చివరికి అన్నదమ్ములిద్దరూ వేరు వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి టిక్కెట్టు సుజయ్‌కు రావడం దాదాపుగా లేనట్టేనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మంత్రి పదవి వచ్చింది కానీ..
బొబ్బిలి: బొబ్బిలిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతపడి నాలుగేళ్లయింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్మికులు ఆర్వీఎస్కే రంగారావుకు మిల్లును తెరిపించాలని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. తెరిపించే ప్రయత్నం అటుంచితే ఆయన వైఎస్సార్ సీపీని వీడి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత బొబ్బిలిలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో జూట్ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి ఒకటిన్నరేళ్లు అయినా నేటికీ మిల్లును తెరిపించలేదు. కనీసం కార్మికుల వేతనాలు ఇప్పించలేదు. 2013 జనవరి 23న మూసివేత.. బొబ్బిలి చుట్టు పక్కల మండలాల్లోని గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని బొబ్బిలి వచ్చిన కార్మికుల కుటుంబాలను చిదిమేస్తూ శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లు 2015 జనవరి 23న మూసేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రులకు తమ బతుకులు వీధిన పడ్డాయంటూ చెప్పుకున్నా కార్మికుల గోడును పట్టించుకునే వారే లేరు. ఈ మిల్లులో 2,300 మంది కార్మికులకు పీఎఫ్ రూ. 2.60 కోట్లు, గ్రాట్యూటి రూ.1.50 కోట్లు, ఈఎస్ఐ రూ.1.80 కోట్లు, బోనస్ రూ.50 లక్షలు, కార్మికుల ఒకరోజు వేతనం రూ.3 లక్షలు, ఎల్ఐసీ రెన్యువల్ రూ.4 లక్షలు, కార్మికుల డెత్çఫండ్ రూ.లక్ష బకాయిలు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు యాజమాన్యం పత్తా లేకుండా పోయింది. సదరు యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి మిల్లును తెరిపించాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని కార్మికులు గొల్లుమంటున్నారు. కార్మికుల కష్టం నుంచి వసూలు చేసిన ఈఎస్ఈ సొమ్ము కూడా యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల వారు ఈఎస్ఐకి కూడా అర్హులు కాకపోవడంతో అప్పులు చేసి మరీ బయట వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 35 కార్మికుల మరణం.. మిల్లు మూసేసిన తర్వాత నాలుగు మండలాలలో ఉన్న కార్మికులు దాదాపు 35 మంది చనిపోయారు. వారి బకాయిలు రాకపోవడంతో దిగాలుగా మంచం పట్టి రోగులుగా మారారు. ఈఎస్ఐకి అర్హులు కాకపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పలువురు కార్మికులు వలసబాట పోయి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జీఎస్‌ఎస్‌కే శ్రీనివాసరావును వివరణ కోరగా నవంబర్ 6న రాష్ట్రస్థాయిలో ఈ మిల్లుపై అమరావతిలో చర్చలు జరుగుతాయని తెలిపారు. మంత్రి హామీ ఏమైనట్టో..? గతంలో అనేకమార్లు సీఎంను, కార్మికశాఖా మంత్రిని, స్థానిక మంత్రి ని, అధికారులను కలిశా ం. ఎవరూ మా సమస్యలపై స్పందించ లేదు. ఇక్కడి ఎమ్మెల్యే మంత్రి అయ్యాక పెట్టిన సభలో ఆరు నెలల్లో మిల్లును తెరిపిస్తామన్నారు. సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. –వి.శేషగిరిరావు, కార్మిక సంఘం అధ్యక్షుడు, లక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు, బొబ్బిలి. నరకయాతన అనుభవిస్తున్నాం.. నా భర్త పేరు బసవ రమణ. ఇక్కడి మిల్లులో పనిచేస్తూ చనిపోయాడు. ఆయనకు కంపెనీ నుంచి రూ.3.5 లక్షలు అందాలి. అది రాలేదు. పింఛన్ రావడం లేదు. మిల్లు మూసేయడంతో íపిల్లలను కూలి పనులు చేస్తూ పోషిస్తున్నా. కుమార్తె డిగ్రీ చదువుతుంది. కుమారుడు ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాడు. భర్త జీవించినపుడు సంతోషంగా ఉన్నాం. ఆయన మరణం తర్వాత నరకయాతన అనుభవిస్తున్నాం. – బసవ కళావతి, మరణించిన కార్మికుడి భార్య.41 ఏళ్ల సర్వీసు.. మిల్లులో రూ.3 జీతం నుంచి పనిచేశా. 41 ఏళ్ల సర్వీసు ఉంది. చివరిలో యాజమాన్యం తీరు వల్ల నానా అవస్థలు పడుతున్నాం. స్థానికంగా మంత్రి ఉన్నా మా సమçస్య పరిష్కారం కావడం లేదు. హక్కుల కోసం మేం రోడ్డెక్కాల్సి రావడం దారుణం. – బొంతలకోటి సత్యం, కార్మికుడు, కింతలివానిపేట. -
దీనిని ఏమనాలి?
జ్వరం... ఇది సాదాసీదా అనారోగ్యం. చిన్నపాటి మందులతో పూర్తిగా నయం చేయొచ్చు. టైఫాయిడ్... మలేరియా... ఇలా ఎన్నో వైరస్ జ్వరాలను సైతం సునాయాసంగా అదుపు చేసిన ఘనత మన వైద్యరంగానిది. పూర్వం ఎప్పుడో జ్వరాలతో మరణాలు సంభవించినట్టు చరిత్రలో విన్నాం... మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు జిల్లాలో సంభవిస్తుంటే విస్తుపోతున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఒక గ్రామంలో తొమ్మిది మంది... జిల్లా వ్యాప్తంగా మరో డెభ్భై మంది మృత్యువాత పడితే... సర్కారు ప్రతినిధులైన జిల్లా మంత్రి, మాజీ కేంద్రమంత్రి ఎందుకో తేలిగ్గా తీసుకున్నట్టున్నారు. మనిషి ప్రాణాలు కోల్పోతే అదేమంత తీవ్రమైన అంశం కాదేమోనని భావిస్తున్నట్టున్నారు. మరి వారి వైఖరిని ఏమనాలి...? సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా రెండు నెలలుగా జ్వరాలతో సహవాసం చేస్తోంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోతోంది. ఏ పల్లె చూసినా మంచం పట్టిన పిల్లలు, వృద్ధులు, అనే తేడా లేకుం డా అన్ని వయస్సులవారూ ముసుగేసుకుని కనిపిస్తున్నారు. రోజూ ఒకటో, రెండో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలా నెలరోజుల్లో దాదాపు 80మంది ప్రాణాలు వదిలారు. దీనినిమానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్లు తీవ్రంగానే స్పందించాయి. వెంటనే జిల్లా అధికారులకు నోటీసులు ఇచ్చాయి. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెం దిన రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులో మాత్రం కొంచెమైనా చలనం లేదు. ఇంతవరకూ ఈ చావులను తీవ్రంగా తీసుకోలేదు. వ్యాధుల నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష జరపలేదు. జనం కోసమే పార్టీ మారానని చెప్పుకునే ఆయన ఆ ప్రజలకు కష్టమొస్తే మాత్రం ముఖం చాటేశారు. ఇక మరో రాజు అశోక్‌దీ అదేతీరు. ‘ముందస్తు’ వైఫల్యం సాధారణంగా సీజనల్ వ్యాధులపై అధికార యంత్రాం గం ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తుంటుంది. అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చేసరికే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జిల్లాలో ఆ ప్రయత్నంలో జిల్లా అధికారులు విషలమయ్యా రు. డ్రెయిన్లు, రహదారులు, పారిశుద్ధ్య నిర్వహణపై జాతీయ స్థాయిలో వచ్చే అవార్డులపైనే దృష్టి సారించా రు తప్ప వాస్తవ పరిస్థితులను పట్టించుకోలేదు. మరో వైపు పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం పూర్తయిం ది. ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఇంత వర కూ గ్రామాలపై పూర్తిగా దృష్టిసారించలేదు. కొందరైతే ఇంకా గ్రామాల ముఖం కూడా చూడలేదు. అక్కడి పారి శుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరే స్వయంగా అంగీకరిస్తున్నారు. పోనీ జ్వరాలు వ్యాపిస్తున్నప్పుడైనా తీవ్రతనుఅంచనా వేశారా అంటే అదీలేదు. వ్యాధుల తీవ్రతను అంచనా వేసి తగిన మందులు సమకూర్చడం, వైద్య సిబ్బందిని పెంచడం, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్లేట్లెట్స్ కొరత, వైద్యం సకా లంలో అందకపోవడం,పైపెచ్చు డెంగీ వ్యాధిని నిర్ధారిం చకపోవడం జిల్లాలో ఇన్ని చావులకు కారణమయ్యాయి. ‘హెచ్ఆర్సీ’నోటీసులు: జ్వరం వస్తే మరణమనే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో ఏర్పడటానికి కారణం ఏమిటనే చర్చ ఒకవైపు జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 80 మందికిపైగా జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం మొత్తం మీద ఇన్ని చావులు ఎక్కడా లేవు. ఒక్క సాలూ రు మండలం కరాసవలస గ్రామంలోనే రెండు వారాల్లో 9 మంది చనిపోయారు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. టీవీ, పత్రికలు, సోషల్ మీడియా జిల్లా పరిస్థితిపై దు మ్మెత్తి పోస్తున్నాయి. సాలూరు ప్రభుత్వాస్పత్రిలో గిరిజ న బాలికలను వరుసగా కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రిని, హాస్టల్‌ను సందర్శించారు. అసౌకర్యాలు వాస్తవమేనని తేల్చారు. అంతేకాకుండా మానవ హక్కు ల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా తీసుకుని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. నేతలెవ్వరూ నోరు మెదపరే... జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మోన్నామధ్య రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు వచ్చినపుడు మాత్రమే ఆయనతో కలిసి బయటకు వచ్చారు. ఆ రోజు కూడా కళావెంకట్రావు కొద్దిగా జ్వరాలపై పెదవి విప్పారు గానీ అశోక్ పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన నివాసం ఉంటున్న విజయనగరం పట్టణంలో వరుస చావులు సంభవిస్తున్నా, నవ వరుడు జ్వరం బారినపడి మరణించినా ఆయనలో చలనం లేదు. ఇక రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఏదో చేసేస్తానంటూ పార్టీ మారి ఆయన జిల్లాకు చేసిందేమీ కనిపించలేదు. కనీసం జిల్లా ఇలా సీజనల్ వ్యా ధులు, మరణాలతో అల్లాడుతున్నప్పుడైనా ప్రజలకు ఆయన అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారా అంటే అదీ లేదు. ఇంత వరకూ అధికారులతో సమీక్ష జరిపిందీ లేదు. అసలు వారి తీరును ఏమనుకోవాలన్నదే అంతుచిక్కడం లేదు. జిల్లాను పట్టించుకోని ఇలాంటి ప్రజాప్రతినిధులు అవసరమా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
టీడీపీకి భారీ షాక్
విజయనగరం / తూర్పుగోదావరి జిల్లా: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పల నాయుడుల సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ నేతలు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొనసాగుతున్న చేరికలు.. అలాగే తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన టీడీపీ నాయకుడు నరాల శ్రీనివాస్‌తో పాటు మరో 300 మంది ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చంటిబాబు సమక్షంలో చేరారు. గ్రామానికి చెందిన పుప్పాల శ్రీను, కష్ణాపురం గ్రామానికి చెందిన కట్టమూరి బంగారంల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరిన వారికి చంటిబాబు కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనరు చలగళ్ళ దొరబాబు, బోదా రామిరెడ్డి, గొల్లవిల్లి రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడర్ 25th June 2018
-
హతవిధీ.. ఏమిటిది?
ఇద్దరూ మంత్రులే... కానీ ఒకరు దర్జా ఒలకబోస్తారు. మరొకరేమో... వారి ముందు వినయంగా ఉంటారు. ఈ తేడా ఎందుకొస్తోందో అర్థం కాక.. జిల్లా ప్రజలు జుత్తు పీక్కుంటున్నారు. అధికారులతోగానీ... జిల్లా ఎమ్మెల్యేలతోగానీ... చేపట్టిన సమీక్షలు అమరావతిలోనో... పక్కనే ఉన్న విశాఖలోనో జరుగుతుంటాయి. అక్కడికే మన జిల్లా మంత్రి వెళ్తుంటారు. ఇదెంతవరకు సబబని ప్రశ్నిస్తే... అదేమీ అధికారికం అని తాను అనుకోవడంలేదని చెబుతుంటారు. చాలా విచిత్రంగా ఉన్న ఈ వ్యవహారం చూసే జిల్లావాసులకు మాత్రం తలకొట్టేసినట్టుంటోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం:జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అమరావతిలోనో... విశాఖపట్నంలోనో సమావేశాలు పెట్టి విజయనగరం జిల్లా రాజకీయ, పరిపాలనాంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన అదే హోదాలో ఉన్న మంత్రి సుజయ్ మాత్రం ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్ల్లడం జిల్లా టీడీపీలో ఓ వర్గాన్ని తీవ్రంగా బాధిస్తోంది. పార్టీ విషయాలపైనసుజయ్ సమీక్షలు జరపకపోవడంపై పార్టీ వర్గాలు, జిల్లా సమస్యలపై చర్చించకపోవడంపై ప్రజలూ అసంతృప్తితో ఉన్నారు. రాజవంశ ఠీవి.. ఆ పౌరుషం కొందరిలో కనిపించదు. అలాగని సామాన్యులుగా మామూలు జనంలో కలిసిపోయే మనస్తత్వం కూడా వారిలో ఉండదు. పేరుకు రాజులమని చెప్పుకోవడం తప్ప ఆ స్థాయిని, గౌరవాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతూనే ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే జిల్లాలో ప్రజాప్రతినిధులుగా రాజ వంశం వారే ప్రధాన పదవుల్లో ఉన్నారు. వారిలో సుజయ్‌కృష్ణ రంగారావు ఒకరు. రాష్ట్ర గనులశాఖ మంత్రిగా ఉన్న ఆయనంటే బొబ్బిలి ప్రాంతంలో ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. కానీ విశ్వసనీయతను నిలుపుకోలేక, పదవి కోసం పార్టీ జెండా మార్చి తనకు తానుగా ప్రతిష్టను దిగజార్చుకున్నారు. పోనీ టీడీపీలోకి వెళ్లిన తర్వాతైనా తన స్థాయికి తగ్గట్టుగా నడుచుకుంటున్నారా అంటే అదీ లేదు. అక్కడా గుర్తింపునకు నోచుకోవడంలేదు. ఇన్చార్జి మంత్రిదే హవా... అధికార పార్టీలో చిన్న పదవిలో ఉన్నవారైనా తామెవరికీ తీసిపోనట్టు ప్రవర్తిస్తారు. కానీ సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్న సుజయ్ మాత్రం సాటి మంత్రి దగ్గర కాస్త తగ్గి ఉన్నట్టు కనిపిస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన తర్వాత రాజకీయ, పాలన పరిస్థితులపై సమీక్షించడానికి ఆయన జిల్లాకు రావడం లేదు. గడచిన ఎనిమిది నెలల్లో తొలిసారి వచ్చినపుడు అధికారులను పరిచయం చేసుకుని వెళ్లిపోగా ఆ తర్వాత ఒకటి రెండు ప్రారంభోత్సవాలకు, ఆగస్టు 15న జెండా ఆవిష్కరణకు మాత్రమే ఆయన వచ్చి వెళ్లారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత ఉండటంతో జిల్లా నేతలను, అధికారులను తాను ఎక్కడుంటే అక్కడకు పిలిపించుకుని మొక్కుబడిగా సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధానిలోనే... రాజకీయ చర్చలు మరోవైపు తనకంటూ జిల్లాలో ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన పంచన చేరారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నేతల మధ్య ఏర్పడే వివాదాలను అమరావతిలోనే కూర్చొని గంటా సెటిల్ చేస్తున్నారు. లేదా విశాఖలో చర్చలు జరుపుతున్నారు. తాజాగా అమరావతిలో జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల క్రితం మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను విశాఖ రప్పించుని మాట్లాడారు. సుజయ్ మాత్రం గంటా ఎలా అంటే అలా, ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఆయన చెప్పినదానికల్లా తలాడిస్తున్నారు. ఇప్పటికే అశోక్‌గజపతిరాజు వ్యవహారాల్లో గంటా తలదూర్చినా ఆయన ఇంత వరకూ ఏమీ అనలేకపోతున్నారనే అపవాదు ఉంది. కానీ అశోక్ విషయంలో గంటా వ్యవహారశైలిపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, గంటాను మందలించారని ప్రచారం జరిగింది. కనీసం అలాంటిది సుజయ్ విషయంలో లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
తాడిపత్రిలో ‘లగాన్ గ్యాంగ్’
అనగనగా ఓ పెద్దమనిషి. ఆయన వద్ద ఓ పెద్ద కోటరీ. తన ప్రాంతంలో ఎవరు ఏ పెద్ద వ్యాపారం చేయాలన్నా.. ఆయనకు కప్పం కట్టాలి. కాదు.. కూడదు అంటే ఊరుదాటాలి. దారికి రాని వారిని దెబ్బతీయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆ ప్రాంతంలో పోస్టింగ్ కావాలన్నా ఆశీస్సులు తప్పనిసరి. వచ్చిన తర్వాత ‘జీ..హుజూర్’ అనకపోతే హూస్టింగ్కు సిద్ధం కావాల్సిందే. ఇప్పుడంతా అక్కడ ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గ్రానైట్ అక్రమ రవాణా సదరు పెద్దాయనకు కాసులు కురిపిస్తోంది. ఆయన చాటున.. ‘లగాన్ గ్యాంగ్’ దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. సాక్షి, అనంతపురం: తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి, కృష్ణగిరి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒక లోడు గ్రానైట్ బండలు క్వారీ నుంచి తాడిపత్రి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే లగాన్ గ్యాంగ్ రాయల్టీ లేకుండా రవాణా చేస్తామని క్వారీ, పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటోంది. గ్రానైట్ లారీ క్వారీ నుంచి.. తాడిపత్రి నుంచి పాలిష్ గ్రానైట్ బండల లారీలు బయలుదేరగానే నాలుగు పైలెట్ వాహనాలు బరిలోకి దిగుతాయి. దారిలో చెక్ పోస్టులు, అధికారులు ఎవరు ఆపినా ఈ గ్యాంగ్ ‘కార్యం’ చక్కబెడుతుంది. లోడును గమ్యం చేర్చినందుకు రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తారు. రాయల్టీతో పోలిస్తే తక్కువ మొత్తానికి పని జరుగుతుండటంతో వ్యాపారులు ‘జీరో’ వైపునకు మొగ్గు చూపుతున్నారు. విజిలెన్స్ కళ్లుగప్పి అక్రమ రవాణా విజిలెన్స్ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో 5–6లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకుంటారు. జోరో బిజినెస్ చేసేందుకు క్వారీ, మిషన్ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ముట్టజెబుతారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బు వేనకేసుకుంటున్నారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా ఆర్జిస్తున్నారు. రెండేళ్లు బ్రేక్.. మళ్లీ యథేచ్ఛగా దందా భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో సాగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలుపెట్టారు. అయితే ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్ చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమదందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు పెనాల్టీ రూపంలో వసూలయ్యేది. 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. దీంతో ప్రతాప్‌రెడ్డిని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి మరకలంటించేందుకు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వచ్చి ఇతనికి క్లీన్చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై భౌతిక దాడులకు యత్నించారు. తెలిసినా.. కన్నెత్తి చూడని అధికారులు తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా సాగిస్తోన్న అక్రమ దందా భూగర్భ గనుల శాఖ అధికారులకు తెలియనిది కాదు. అయితే ‘లగాన్ గ్యాంగ్’తో సత్సంబంధాలు ఉండటంతో వారంతా చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌రెడ్డి అడ్డుపడి కొరకరానికి కొయ్యగా తయారైతే అనంతపురంలోని గనులశాఖ అధికారులు ప్రతాప్‌రెడ్డికి కాకుండా ‘మాఫియా’కు మద్దతుగా నిలిచారు. ఇదంతా కోట్లాది రూపాయల అక్రమాదాయం వల్లేననే విషయం రాష్ట్రస్థాయి అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు. గ్రానైట్ వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని సదరు పెద్దమనిషి కోట్ల రూపాయలు గడిస్తూ రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా తాడిపత్రి వైపు, ఇక్కడి అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ప్రతాప్‌రెడ్డి తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆగస్టు 2న భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అందులో ఐదుగురి పేర్లు పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నంబర్–1గా పేర్కొన్నారు. తాడిపత్రి గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు వెల్లడించారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో వివరించారు. గత రెండేళ్లుగా గ్రానైట్ అక్రమ రవాణాకు ప్రతాప్‌రెడ్డి కొద్దిమేర బ్రేక్ వేశారు. ఈ క్రమంలో ‘గ్రానైట్ మాఫియా’ పెద్దమనిషి వద్దకు వెళ్లి అతన్ని బదిలీ చేయించాలని పట్టుబట్టింది. గ్రానైట్ ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉండటంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు చెప్పి ప్రతాప్‌రెడ్డిని 2017 అక్టోబర్ మూడోవారంలో బదిలీ చేయించారు. ఆయన బదిలీ తర్వాత దందా యథేచ్ఛగా సాగుతోంది. -
వలస నేత మా కొద్దు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీలో వలస నేతలకు పెద్దపీట వేస్తుండడంపై ఆ పార్టీ జిల్లా నేతలు భగ్గుమంటున్నారు. అధిష్టానం, మంత్రుల తీరును తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇతర జిల్లాకు చెందిన వ్యక్తిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేయడానికి ఏర్పాట్లు పూర్తికావడం, స్వయంగా కేంద్ర మంత్రి ఆయన పేరును ప్రతిపాదించడంపై టీడీపీ సీనియర్లు మండిపడుతున్నా రు. బహిరంగంగానే విమర్శిస్తున్నా రు. జిల్లాలోని తాజా రాజకీయ పరి ణామాలు ఆ పార్టీలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వలసనేతలకే తాయిలాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరగానే సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి రాగానే జిల్లా టీడీపీని భుజాన వేసుకుంటారని తెగ సంబరపడ్డారు. పదవి వచ్చిన దగ్గరనుంచి జిల్లాను పట్టించుకోకుండా, పార్టీకి ప్రయోజనకరంగా కార్యక్రమాలు చేయకుండా తన సొంత ఆస్తులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారనే అపవాదును సుజయ్ మూటగట్టుకున్నారు. కోరి తెచ్చుకుని మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబే ఇటీవల ఇదేంటయ్యా సుజయ్.. పార్టీని, జిల్లాను పట్టించుకోకపోతే ఎలా అనే పరిస్థితి వచ్చింది. వలస నేతలను నెత్తిన పెట్టుకుని సీనియర్లను పక్కనబెడితే ఎలా ఉంటుందో సుజయ్ ఉదంతం వల్ల పార్టీకి, నాయకులకు తెలిసివచ్చింది. ఇప్పుడు కేంద్ర మంత్రి అశోక్ అదే పని మళ్లీ చేయాలనుకోవడాన్ని పార్టీ సీనియర్లు ఖండిస్తున్నారు. మూడేళ్లుగా పోస్టు ఖాళీగానే... జిల్లా వ్యాప్తంగా 41 శాఖా గ్రంధాలయాలు ఉన్నాయి. వీటిలో పక్కా భవనాలు 13 గ్రంథాలయాలకు ఉండగా, 10 భవానాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలవన్నీ అద్డె భవనాల్లో నడుస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్నులలోని 8 శాతం సెస్ రూపంలో గ్రంధాలయ సంస్థకు వస్తుంది. మున్సిపాలిటీల నుంచి మీ సేవాకేంద్రాల ద్వారా చెల్లిస్తున్న పన్నుల్లో వాటా నేరుగా గ్రంథాలయ సంస్థకు చేరుతోంది. అయితే, మూడేళ్లుగా చైర్మన్ లేకపోవడంతో పంచాయతీల నుంచి రావాల్సిన రూ.6 కోట్ల బకాయిలు అలానే ఉండిపోయాయి. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి గ్రంథాలయ చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. కాంగ్రెస్ హయాంలో రొంగలి పోతన్న తర్వాత రఘురాజు కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ ఆ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు జిల్లా వ్యక్తిని కాదని... గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి టీడీపీ సీనియర్ నేత ఆనంద్ పేరును జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ అధిష్టానానికి లేఖలు ఇచ్చారు. పార్టీ సమావేశంలో రావిశ్రీధర్, జోగినాయుడు పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఎలాంటి నేర చరిత్ర, మద్యం వ్యాపారాలు లేని వారికి, విద్యాధికులకు ఈ పదవి ఇద్దామని ఆ సమయంలో అశోక్ గజపతిరాజు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచీ ఎవరినీ ఎంపిక చేయకుండా నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరునెలల కిందట బంగ్లా మరమ్మతు పనులను ద్వారపూడికి చెందిన బొద్దల నర్సింగరావుకు అప్పగించారు. ఆయన కాంగ్రెస్ నుంచి మూడేళ్ల కిందటే టీడీపీలో చేరారు. ఆయనకు మద్యం వ్యాపారాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నవారిని కాదని నర్సింగరావుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టాలని మంత్రి అశోక్ ప్రయత్నిస్తున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే తాము ఒప్పుకునేది లేదని టీడీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. కేవలం ఇంటి పనులతో దగ్గరయ్యాడనే కారణంగా నామినేటెడ్ పదవిని అందించాలనుకోవడం సమంజసం కాదంటున్నారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్క జిల్లా మంత్రికి ఇన్చార్జి పేరుతో పెత్తనం ఇచ్చి జిల్లా నేతలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని, ఇకపై నామినేటెడ్ పోస్టులను కూడా ఇలానే వలస నేతలకు ఇస్తూ పోతే పార్టీలో ఇన్నేళ్లుగా అంటిపెట్టుకున్నవారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే... తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలును అశోక్ దత్తతగా తీసుకున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తికి గ్రంథాలయ సంస్థ చైర్మన్పదవి కట్టబెట్టి ఆ అప్రతిష్టను తొలగించుకునేందుకు మంత్రి చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా.. తాజా పరిణామాలు జిల్లా మంత్రులను ఇబ్బందులకు గురిచేయడమేగాక, అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టనున్నాయి. -
‘రాజు’తున్న కుంపటి, సుజయ్‌ది తొందరపాటేనా?
► తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు ► అశోక్ గజపతికి తెలియకుండానే జిల్లాలో కార్యక్రమాలు ► ఇన్చార్జ్ మంత్రి గంటాతో అంటకాగుతున్న నేతలు ► గిరిజన వర్శిటీ ప్రహరీ సాక్షిగా బయటపడ్డ గ్రూపులు ► జిల్లా మంత్రి సుజయ్ కృష్ణకు కొత్త చిక్కులు సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’..అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. జిల్లాకు చెందిన మంత్రిని కాదని పక్క జిల్లా మంత్రితో అంటకాగుతుండటం దీనిని రుజువు చేస్తోంది. ఏమైతేనేం ఈ ప్రభావంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో కుంపటి రాజుకుంది. ఇన్చార్జి మంత్రి గంటా శ్రీని వాసరావు మెప్పు కోసం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు లేని సమయంలో గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటా బయట చులకనైపోతున్న జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ఇది కొత్త చిక్కులు తెస్తోంది. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెంపంచాయతీ తమ్మన్నమెరకల వద్ద గిరిజన యూనివర్శిటీ ప్రహరీ నిర్మాణానికి ఈ నెల 18న మంత్రి సుజయకృష్ణ రంగారావు అధికారులు అంచనాలు తయారుచేశారు. అందులో 33,963 గుంతలకు రూ 34,40,33,000 నిధులను శంకుస్థాపన చేశారు. ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హడావుడిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు గాని, ప్రతిపక్షంలోని గిరిజన ప్రజాప్రతినిధులుగాని, గిరిజన సంఘాల నేతలు గాని హాజరు కాలేదు. నిజానికి వారెవరికీ సరైన సమాచారం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేశారు. దీనికి కారణమేంటా అన్నదే ఇప్పుడు జిల్లాలో చర్చ. గంటా మెప్పుకోసం... గిరిజన యూనివర్శిటీని జిల్లాకు తీసుకురావడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేశారు. గిరిజనులకు ఇవ్వాల్సిన పరిహారంలో ఇంకా వివాదాలు పరిష్కారం కాకుండానే, హామీలు నెరవేర్చకుండానే ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో ఆ రోజు కార్యక్రమాన్ని గిరిజనులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వారికి మంత్రి సుజయకృష్ణ రంగారావు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ కార్యక్రమం అంత హడావుడిగా నిర్వహించడం వెనుక అసలు కారణం మంత్రి గంటా శ్రీనివాసరావు మెప్పు కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. యూనివర్శిటీ పనుల కాంట్రాక్టును మంత్రి బంధువుకు అప్పగించడంతో ఎలాగైనా పనులు మొదలుపెట్టించాలనే ఉద్దేశంతోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరునాడే అశోక్‌గజపతిరాజు జిల్లాకు వస్తున్నప్పటికీ ఆయనకోసం వేచి చూడకపోవడం అనుమానాలు బలపరుస్తున్నాయి. ఆయన జిల్లాలో ఉంటే ఆహ్వానించాల్సి వస్తుందనే ఈ హడావుడి ఏర్పాట్లని తెలుస్తోంది. సుజయ్‌ది తొందరపాటేనా? ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే పిలుపునందుకుని వెళ్లిన మంత్రి సుజయకృష్ణ రంగారావు తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇతర నాయకులెవరూ లేకపోవడం, గిరిజనులు ప్రతిఘటించడం చూసి ఇరకాటంలో పడ్డారు. ఎలాగో కార్యక్రమాన్ని పూర్తి చేసి బయటపడినప్పటికీ వర్గపోరులో ఆయనో పావుగా మారారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి దగ్గర్నుంచి అనేక విషయాల్లో అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరగా టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇరువురి పక్షాన చేరి వర్గాలుగా విడిపోయారు. తాజా సంఘటనతో మరోసారి వీరి మధ్య విభేదాలు పొడసూపాయి. -
సుజయ్‌కు సవాళ్లే!
► మైనింగ్ చుట్టూ మాఫియా వివాదాలు ► బోడికొండ... బడేదేవరకొండపై గిరిజనుల అభ్యంతరాలు ► చీపురుపల్లి పరిసరాల్లో లెక్కలేనన్ని అక్రమాలు ► నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వ్యవహారం ► అన్నిచోట్ల ప్రభుత్వ పెద్దల జోక్యం ► ముందుకెళ్లడంపైనే అనుమానాలు అనుమతులు ఒకచోట... మైనింగ్ చేస్తున్నది మరో చోట. పార్వతీపురం మండలంలో గల బడేదేవర కొండ మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలివి. ఇప్పుడీ కోణంలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం అందుకు సహకరిస్తున్నారని, జరిగిన తప్పిదాన్ని గుర్తించకుండా కప్పిపుచ్చేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కోరి గ్రామంలో సర్వే నంబర్ 1లో గల 16.56హెక్టార్లను 20 సంవత్సరాలకు చెన్నైకి చెందిన ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు లీజుకివ్వగా, ఇప్పుడా సంస్థ ములగ గ్రామంలో సర్వే నంబర్ 1లో గల రిజర్వు ఫారెస్టు భూముల్లో మైనింగ్ చేస్తున్నదని హైకోర్టులో పిల్ పడింది. దీనిపై ఇప్పటికే హైకోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం మండలంలోని బుదురువాడ పంచాయతీలో గల బోడికొండపై 10హెక్టార్లలో గ్రానైట్ తవ్వుకునేందుకు పొకర్నా అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 135హెక్టార్ల కోసం 18 దరఖాస్తులొచ్చాయి. కానీ, అందులో పొకర్నా కంపెనీకి మాత్రమే ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రానైట్ కంపెనీలకు అనుమతులివ్వడంపై ఇక్కడి గిరిజన గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ► జిల్లాలోని చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడితో పాటు ఎస్‌కోట, కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇక్కడొక మాఫియా నడుస్తోంది. అనధికార తవ్వకాలతో పాటు అక్రమ రవాణా చేస్తున్నారు. రూ. కోట్లలోనే పక్కదారి పడుతోంది. ► అరకు పార్లమెంట్ పరిధిలోని కొండలపై బాక్సైట్ గనులపై ప్రభుత్వ పెద్దలు కన్నేసి ఉంచారు. గిరిజనులను ఏదోఒక విధంగా మాయ చేసి దోపిడీ చేసేందుకు తహతహలాడుతున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు అడ్డు తగలకుండా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రతిపక్ష పక్షానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి లాక్కున్నారు. మిగతా ఇద్దరు లొంగకపోవడంతో బాౖక్సైట్ వ్యూహం బెడిసికొట్టింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భూగర్భ... గనుల శాఖ మొత్తం వివాదాల మయం. ఇందులో ప్రతీ అంశంలోనూ పెద్దల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ శాఖకు తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈ పోర్టుపోలియో ఆయనకొక సవాల్ కాక తప్పదు. గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా... సర్కారుకు అనుకూలంగా... జిల్లాకు నష్ట కలగకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాలి్సందే. దీనిపై ఈయన వ్యూహం ఎలా ఉంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడ విలువైన గనులు కొట్టేయాలని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కంపెనీల ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వారి విషయంలో తాజా మంత్రి ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్నార్థకం. రగులుతున్న బోడికొండ, బడేదేవరకొండ వ్యవహారం జిల్లాలో వివాదస్పదమైన బోడికొండ, బడేదేవరకొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానై ట్’ ఉంది. విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న క్వాలిటీ గల గ్రానైట్‌పై రాష్ట్రంలోని పెద్ద పెద్ద గ్రానైట్ కంపెనీలు దృష్టి సారించాయి. అందులో భాగంగా బోడికొండపై ఉన్న 135హెక్టార్ల కోసం 18దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పొకర్నా అనే కంపెనీకి మాత్ర మే 10హెక్టార్ల భూముల్లో గ్రానైట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బోడికొండ నుంచి వచ్చిన నీటితో ఆ పంచాయతీలోని గోచెక్క, బుదురువాడ, బొడ్డవలస, సంగందొరవలస, టేకులోవ, బిత్తరటొంకి తదితర గ్రామాల్లోని 1000 ఎకరాల వ్యవసాయ భూములు సాగవుతున్నాయనీ, ఈ కొండపై ఉన్న వెదురుతో 1000 గిరిజన కుటుం బాలు, ఉపాధి పొందుతున్నాయని, గ్రానైట్ తవ్వకాల వల్ల అటు సాగునీటి వనరులు అందకుండా పోతాయనీ, వెదురు సంపద ధ్వంసమవుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా అనుమతులిస్తారని పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు. మైనింగ్ కోసం లైన్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. ఉద్రిక్తతకు దారితీస్తున్న బడేదేవరకొండ గిరిజనుల ఆరాధ్యదైవమైన బడి దేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజు రూపంలో అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులొక చోట ఇస్తే తవ్వకాలు మరో చోట చేస్తున్నారని, అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. బడిదేవర కొండ గ్రానైట్ కోసం 2009లో ఎంఎస్పీ గ్రానైట్ సం స్థ దరఖాస్తు చేసుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చేందు కు ఆసక్తి చూపలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ సంస్థ తెరపైకి వచ్చింది. 2014జూన్ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 16.56హెక్టార్లు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది జూన్ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. ఇక్కడి గిరిజనులు బడేదేవర కొండ దేవతను పూజిస్తేనే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. దీనిని మైనింగ్ కోసం లీజుకివ్వడంతో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీని అనుమతుల వెనుక సీఎంకు సన్నిహితంగా ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం ఉందనే ప్రచారమూ ఉంది. దీనికి అడ్డొస్తున్నారన్న కారణంగానే రాజధాని స్థాయిలో స్కెచ్ వేసి ఓ అధికారిని బలిపశువును చేశారు. 2006లో బడిదేవరకొండ గ్రానైట్ తవ్వుకోవడానికి అనుమతి కోరిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తిని కూడా రంగంలోకి దించారు. ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు ఇచ్చిన మాదిరిగానే తమకూ అనుమతులు ఇవ్వాలని లోపాయికారీగా ప్రయత్నిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వివాదం బాక్సైట్ వ్యవహారం కూడా సీరియస్‌గా ఉంది. గిరిజనులతో ముడిపడి ఉన్నవే. వీటిన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లోనై గిరిజనుల ప్రయోజనాలకు దెబ్బతీస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలతో అంతగా సత్సంబంధాలు లేని మైనింగ్ శాఖ వచ్చినప్పటికీ దానిచుట్టూ వివాదాలు ఉండటం సుజయకృష్ణ రంగారావుకు కాసింత సవాల్‌గానే చెప్పుకోవాలి. -
సుజయ్‌కు సవాళ్లే!
⇔ మైనింగ్ చుట్టూ మాఫియా వివాదాలు ⇔ బోడికొండ... బడేదేవరకొండపై గిరిజనుల అభ్యంతరాలు ⇔ చీపురుపల్లి పరిసరాల్లో లెక్కలేనన్ని అక్రమాలు ⇔ నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వ్యవహారం ⇔ అన్నిచోట్ల ప్రభుత్వ పెద్దల జోక్యం ⇔ ముందుకెళ్లడంపైనే అనుమానాలు అనుమతులు ఒకచోట... మైనింగ్ చేస్తున్నది మరో చోట. పార్వతీపురం మండలంలో గల బడేదేవర కొండ మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలివి. ఇప్పుడీ కోణంలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం అందుకు సహకరిస్తున్నారని, జరిగిన తప్పిదాన్ని గుర్తించకుండా కప్పిపుచ్చేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కోరి గ్రామంలో సర్వే నంబర్ 1లో గల 16.56హెక్టార్లను 20 సంవత్సరాలకు చెన్నైకి చెందిన ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు లీజుకివ్వగా, ఇప్పుడా సంస్థ ములగ గ్రామంలో సర్వే నంబర్ 1లో గల రిజర్వు ఫారెస్టు భూముల్లో మైనింగ్ చేస్తున్నదని హైకోర్టులో పిల్ పడింది. దీనిపై ఇప్పటికే హైకోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం మండలంలోని బుదురువాడ పంచాయతీలో గల బోడికొండపై 10హెక్టార్లలో గ్రానైట్ తవ్వుకునేందుకు పొకర్నా అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 135హెక్టార్ల కోసం 18 దరఖాస్తులొచ్చాయి. కానీ, అందులో పొకర్నా కంపెనీకి మాత్రమే ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రానైట్ కంపెనీలకు అనుమతులివ్వడంపై ఇక్కడి గిరిజన గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ♦ జిల్లాలోని చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడితో పాటు ఎస్‌కోట, కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇక్కడొక మాఫియా నడుస్తోంది. అనధికార తవ్వకాలతో పాటు అక్రమ రవాణా చేస్తున్నారు. రూ. కోట్లలోనే పక్కదారి పడుతోంది. ♦ అరకు పార్లమెంట్ పరిధిలోని కొండలపై బాక్సైట్ గనులపై ప్రభుత్వ పెద్దలు కన్నేసి ఉంచారు. గిరిజనులను ఏదోఒక విధంగా మాయ చేసి దోపిడీ చేసేందుకు తహతహలాడుతున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు అడ్డు తగలకుండా ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రతిపక్ష పక్షానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి లాక్కున్నారు. మిగతా ఇద్దరు లొంగకపోవడంతో బాౖక్సైట్ వ్యూహం బెడిసికొట్టింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భూగర్భ... గనుల శాఖ మొత్తం వివాదాల మయం. ఇందులో ప్రతీ అంశంలోనూ పెద్దల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ శాఖకు తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈ పోర్టుపోలియో ఆయనకొక సవాల్ కాక తప్పదు. గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా... సర్కారుకు అనుకూలంగా... జిల్లాకు నష్ట కలగకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిందే. దీనిపై ఈయన వ్యూహం ఎలా ఉంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడ విలువైన గనులు కొట్టేయాలని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కంపెనీల ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వారి విషయంలో తాజా మంత్రి ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్నార్థకం. రగులుతున్న బోడికొండ, బడేదేవరకొండ వ్యవహారం జిల్లాలో వివాదస్పదమైన బోడికొండ, బడేదేవరకొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానై ట్’ ఉంది. విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న క్వాలిటీ గల గ్రానైట్‌పై రాష్ట్రంలోని పెద్ద పెద్ద గ్రానైట్ కంపెనీలు దృష్టి సారించాయి. అందులో భాగంగా బోడికొండపై ఉన్న 135హెక్టార్ల కోసం 18దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పొకర్నా అనే కంపెనీకి మాత్ర మే 10హెక్టార్ల భూముల్లో గ్రానైట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బోడికొండ నుంచి వచ్చిన నీటితో ఆ పంచాయతీలోని గోచెక్క, బుదురువాడ, బొడ్డవలస, సంగందొరవలస, టేకులోవ, బిత్తరటొంకి తదితర గ్రామాల్లోని 1000 ఎకరాల వ్యవసాయ భూములు సాగవుతున్నాయనీ, ఈ కొండపై ఉన్న వెదురుతో 1000 గిరిజన కుటుం బాలు, ఉపాధి పొందుతున్నాయని, గ్రానైట్ తవ్వకాల వల్ల అటు సాగునీటి వనరులు అందకుండా పోతాయనీ, వెదురు సంపద ధ్వంసమవుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా అనుమతులిస్తారని పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు. మైనింగ్ కోసం లైన్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. ఉద్రిక్తతకు దారితీస్తున్న బడేదేవరకొండ గిరిజనుల ఆరాధ్యదైవమైన బడి దేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజు రూపంలో అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులొక చోట ఇస్తే తవ్వకాలు మరో చోట చేస్తున్నారని, అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. బడిదేవర కొండ గ్రానైట్ కోసం 2009లో ఎంఎస్పీ గ్రానైట్ సం స్థ దరఖాస్తు చేసుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చేందు కు ఆసక్తి చూపలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ సంస్థ తెరపైకి వచ్చింది. 2014జూన్ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 16.56హెక్టార్లు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది జూన్ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. ఇక్కడి గిరిజనులు బడేదేవర కొండ దేవతను పూజిస్తేనే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. దీనిని మైనింగ్ కోసం లీజుకివ్వడంతో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీని అనుమతుల వెనుక సీఎంకు సన్నిహితంగా ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం ఉందనే ప్రచారమూ ఉంది. దీనికి అడ్డొస్తున్నారన్న కారణంగానే రాజధాని స్థాయిలో స్కెచ్ వేసి ఓ అధికారిని బలిపశువును చేశారు. 2006లో బడిదేవరకొండ గ్రానైట్ తవ్వుకోవడానికి అనుమతి కోరిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తిని కూడా రంగంలోకి దించారు. ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు ఇచ్చిన మాదిరిగానే తమకూ అనుమతులు ఇవ్వాలని లోపాయికారీగా ప్రయత్నిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వివాదం బాక్సైట్ వ్యవహారం కూడా సీరియస్‌గా ఉంది. గిరిజనులతో ముడిపడి ఉన్నవే. వీటిన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లోనై గిరిజనుల ప్రయోజనాలకు దెబ్బతీస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలతో అంతగా సత్సంబంధాలు లేని మైనింగ్ శాఖ వచ్చినప్పటికీ దానిచుట్టూ వివాదాలు ఉండటం సుజయకృష్ణ రంగారావుకు కాసింత సవాల్‌గానే చెప్పుకోవాలి. -
బంగ్లా టు కోట..!
⇔ టీడీపీలో మరో వపర్ సెంటర్ ⇔ బంగ్లా రాజకీయాలకు బ్రేక్ ⇔ బొబ్బిలి రాజులకు ప్రాధాన్యం ⇔ తగ్గుతున్న అశోక్ ప్రాబల్యం ⇔ శత్రుచర్ల రాకతో మొదలు ⇔ సుజయకృష్ణ మంత్రి పదవితో పతాక స్థాయికి చేరిన వైనం ⇔ కళా వెంకటరావు డైరెక్షన్లో వ్యూహాత్మక అడుగులు ⇔ అశోక్ అనుచరులల్లో కలవరం సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో ‘పవర్’ సెంటర్ తయారైంది. వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బంగ్లా రాజకీయా లకు బ్రేక్ పడింది. బొబ్బిలి రాజులకోట మరో రాజకీయ వేదిక కాబోతోంది. ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్ గజపతిరాజుకు ప్రాధాన్యం మసకబారుతోంది. అధిష్టానం వద్ద పట్టు సడలుతోంది. ఆయనకు తెలియకుండా పార్టీలో వ్యవహారాలు సాగిపోతుండడమే దీనికి నిదర్శనం. అశోక్‌ను సంప్రదించకుండా బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారనే వాదన బలం గా విన్పిస్తోంది. బంగ్లా ఆధిపత్య రాజకీయాలకు బ్రేక్ పడినట్టు ప్రచారం జోరందుకుంది. జిల్లాలో ని రాజకీయ పరిణామాలు అశోక్ అనుచరులను కలవరపెడుతున్నాయి. ఆలోచనలో పడేశాయి. తగ్గిన ప్రాధాన్యం.. పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీలో తిరుగులేని నేత. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ మొన్నటివరకు తనే టీడీపీ రాజకీయాలను శాసించారు. ఏ విషయంలోనైనా తనదే పైచేయి. పార్టీ, అధికారిక నిర్ణయాలన్నీ తన కనుసన్నల్లోనే నడిచాయి. రాష్ట్ర మంత్రిగా కిమిడి మృణాళిని ఉనప్పటికీ బంగ్లా వేదికగానే రాజకీయాలు కొనసాగాయి. మిగతా నేతల మాదిరిగానే అశోక్ గజపతిరాజుతో కలిసి మృణాళిని నడిచారు. ఇప్పుడా ఆధిపత్యానికి బ్రేక్ పడింది. తనకు తెలియకుండానే అధిష్టానం మరో పవర్సెంటర్ను తెరచింది. కళా వెంకటరావు డైరెక్షన్లో.. అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో...ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో... అశోక్‌కు మరో ప్రత్యామ్నాయంగా మరో కోటరీ ఉండాలనో తెలియదు గాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పినట్టుగా అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలో కళా వెంకటరావు ప్రాబల్యాన్ని దశలవారీగా పెంచి తద్వారా అశోక్ ఆధిపత్యానికి గండి కొడుతూ వస్తోంది. అశోక్‌కు నచ్చని నిర్ణయాలు తీసుకుని మానసికంగా బలహీనం చేస్తోంది. కాంగ్రెస్‌లో అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చి అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే భీజం వేసింది. విజయనగరం రాజులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అశోక్ ఆలోచనలకు భిన్నంగా కురుపాం ఇన్చార్జి బాధ్యతలను సైతం శత్రుచర్ల మేనల్లుడికి అప్పగించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయకృష్ణ రంగారావును పార్టీలోకి తీసుకు వచ్చారు. సుజయ రాకను అశోక్ తొలుత వ్యతిరేకిం చారని, చంద్రబాబు ఒప్పించడంతో వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల తన అభిప్రాయానికి భిన్నంగా శత్రుచర్ల విజయరామరాజుకు ఏకంగా శ్రీకా కుళం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌కు ధీటుగా మరో వర్గానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అశోక్‌ను పట్టించుకోకుండా... సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో అశోక్ గజపతిరాజు మాటను పట్టించుకోలేదన్నది సమాచారం. జిల్లాలో మారుతున్న సమీకరణాలను ముందుగానే పసిగట్టిన అశోక్ గజపతిరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జోరందుకోగానే తెరవెనుకుండి మంత్రాంగం నడిపించారు.ద్వారపురెడ్డి జగదీష్, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులను తెరపైకి తెచ్చి, సుజయకు వ్యతిరేకంగా స్వరం విన్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు బోగట్టా. ఆయనిచ్చిన భరో సాతోనే సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా సీఎం వద్దకు వెళ్లి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వొద్దని, బీసీలకు ఇవ్వాలని, తమలో ఏ ఒక్కరికిచ్చినా ఫర్వాలేద ని, ఓసీకిస్తే పార్టీకి నష్టం అన్న వాదన వినిపించారు. పక్కా వ్యూహంతోనే సుజయకృష్ణకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అయితే, సీఎం చంద్రబాబు ఇవేవీ పట్టిం చుకోలేదు. పార్టీలో లోకేష్ డామినేషన్ పెరిగిందో... అశోక్‌ను నమ్ముకుంటే కష్టమని చంద్రబాబు భావించారో తెలియదు గాని అసమ్మతి నేతల వాదన వినిపించుకోలేదు. అశోక్ సైతం జోక్యం చేసుకుని మనసులో మాట చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలుస్తోంది. మరో రాజకీయ కేంద్రం.. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో రాజకీయ అధికార కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇటీవల జరిగిన సమీక్షలో కళా వెంకటరావు డైరెక్షన్ ప్రకారం సమీక్షలు జరగడం, శత్రుచర్లపై అశోక్ ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినా శత్రుచర్లకే చంద్రబాబు పెద్ద పీట వేయడం, కాదన్నా సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వంటివన్ని చూస్తుంటే జిల్లాలో మరో నాయకత్వాన్ని తయారు చేసేందుకు టీడీపీ అధిష్టానం అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న అశోక్ అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఏం జరుగుతుందోనని కలవరపడుతున్నారు. చెప్పాలంటే బంగ్లా నేతలకు భయం పట్టుకుంది. కొందరు ‘ప్రత్యామ్నా య’ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. -
నాడో రకం..నేడో రకం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ప్రజల ఆలోచనలకు భిన్నంగా మేం నడుచుకోలేం. పార్టీలు మారే వారు నైతికంగా రాజీనామా చేయకుండా కండువాలు వేసుకోవడం దురదృష్టకరం. పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పు తేవాలి. చట్టంలో ఉండే లోపాల వల్ల చంద్రబాబు ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు.’ ఫిబ్రవరి 23వ తేదీన సుజయకృష్ణ రంగారావు చేసిన వాఖ్యలివి. ‘ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీలో ఉంటూ నిత్యం ప్రజల పక్షాన ఉండటం నాకు ఆనందంగా ఉంది. ైవైఎస్ అకా ల మరణం తర్వాత రాష్ట్రం స్పష్టమైన నాయకత్వం కోల్పోయింది. వెఎస్ తరహా పాలన అందించేందుకే వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. పార్టీ మారిన నాయకులు తమ వెంట ఐదు శాతం మంది కార్యకర్తలను కూడా తీసుకెళ్లలేదు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజకీయ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. అటువంటి వారు వెళ్లినా పార్టీకి నష్టం లేదు.’ మార్చి 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంలో సుజయకృష్ణ రంగారావు చేసిన వ్యాఖ్యలు ‘బొబ్బిలి రాజులు ప్రజల మనుషులు. పదవుల కోసం, ప్రలోభాలకు లొంగే వాళ్లం కాదు. నిజాయతీతో మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడుపుతున్నాం. ప్రజలకు మచ్చ తెచ్చే విధంగా నడుచుకోం. పార్టీ మారుతున్నట్టు అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఫిబ్రవరి 23వ తేదీన బేబినాయన చేసిన వాఖ్యలివి. ‘పార్టీ మారుతున్నట్టు పదపదే దుష్ర్పచారం చేయడం దురదృష్టకరం. మాకు తెరచాటు రాజకీయాలు తెలియవు. మా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. వైఎస్సార్ కుటుంబానికి మేం రుణపడి ఉంటాం. వెఎస్సార్ పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసేవి. చంద్రబాబు పాలనలో కనీసం వర్షపు మేఘం కూడా దిగడం లేదు. మార్చి 4వ తేదీన బాడంగిలో జరిగిన సమావేశంలో బేబినాయన వ్యాఖ్యలు. -
'20 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదు'
హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఎన్నికల హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో అసెంబ్లీ కార్యదర్శికి చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం సుజయకృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబుపైన, ఈ ప్రభుత్వంపైన ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు. పేద రైతుల నుంచి టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ వైపల్యాలపై విపులంగా మాట్లాడేందుకే అవిశ్వాసం పెట్టినట్లు సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. -
జగన్‌తో సుజయ్ భేటీ
బొబ్బిలి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ కార్యాలయంలో కలిసిన వీరు విజయనగరం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జిల్లాలోని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలపై చర్చించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లున్న పంచాయతీలకు ఉపాధి పనులకు అధికారులకు అంచనాలు తయారు చేయకపోవడం వంటి అంశాలను చర్చించారు. వాటిపై పార్టీ పరంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల గురించి జగన్‌కు సుజయ్ వివరించారు. -
కోటలో ‘కోనేరు’
బొబ్బిలి: విజయవాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఫ్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ గురువారం బొబ్బిలికోటను సందర్శించారు. ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు, సోదరుడు రామకృష్ణ రంగారావు(రాంనాయనలు) ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. దర్బార్‌మహల్‌లోని అలనాటి వస్తువులను వీక్షించారు. అప్పటి సంస్థానం, పరిపాలన, రాజులు క్రీడల్లో వినియోగించినవి, వివిధ సందర్భాల్లో వేటకు వె ళ్లినప్పుడు వేటాడిన జంతువుల గురించి సుజయ్ సోదరుడు రాంనాయన వివరించారు. అలాగే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు, బొబ్బిలి సంస్థానాదీశులు, సిపాయిలు వినియోగించిన తుపాకీలు, బల్లేలు, ఖడ్గం వంటి వాటి గురించి తెలియజేశారు. బొబ్బిలి రాజులు 1960వ సంవత్సరంలో పండించిన చె రుకును, వాటి వివరాలను తెలుసుకున్నారు. సంస్థానం సమయంలో వినియోగించిన పల్లకి, ఇతర వస్తువులను చూశారు. అనంతరం ఎమ్మెల్యే సోదరుడు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు( బేబినాయన) వచ్చి మరికొన్ని విషయాలను వివరించారు. -
చంద్రబాబు రైతు ద్రోహి..!
► రైతు మహా ధర్నాలో...వైఎస్సార్ సీపీ నాయకులు ► సుజయ్ కృష్ణ రంగారావు... ► ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా... పార్వతీపురం: చంద్రబాబు రైతు ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ఆర్‌కే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. సోమవారం పార్వతీపురంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ తేడా చూపిస్తూ రైతులను అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. పండగ సమీపిస్తున్న తరుణంలో కూడా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటను సైతం అమ్ముకోలేని దౌర్భాగ్యంలో టీడీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఓవైపు వర్షం భయం, మరో వైపు అగ్గి భయాలతో పొలాలు, కళ్లాల్లో పంటను కాపలా కాయలేక మంచు, చలికి రైతన్నలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రైతు పక్షపాతి టీడీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ ఎదిరించి పోరాడుతుందన్నారు. భవిష్యత్‌లో రైతుల పట్ల ప్రభుత్వం ఇదే పరిస్థితి కనబరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జమ్మాన ప్రసన్నకుమార్‌తోపాటు ఆ పార్టీ నాయకులు ప్రసంగించారు. రైతు సంఘం, సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి, బంటు దాసు తదితరులు సభా ప్రాంగణానికి వచ్చి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్ సీపీ మహా ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వంగపండు ఉష, మజ్జి వెంకటేష్, గర్భాపు ఉదయభాను, బోను రామినాయుడు, సాలా హరిగోపాల్, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఆర్వీఎస్ కుమార్, వలిరెడ్డి జగదీష్, గుర్రాజు, జొన్నాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
యువత పవన్‌ను ప్రశ్నించాలి
బొబ్బిలి: గత ఎన్నికల్లో యువత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని సినీ నటుడు పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారనీ, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదనీ, దీనిపై పవన్‌ను రాష్ట్రంలోని ప్రతీ యువకుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌కోలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు, అంగన్వాడీ పోస్టులను అమ్ముకోవడాన్ని నిరసిస్తూ, ఆయా పోస్టులను రోస్టర్ పద్ధతిలో, జీఓలను అనుసరించి భర్తీ చేసి అర్హులకు ఆయా పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్‌కృష్ణ మాట్లాడుతూ యువత టీడీపీకి ఓటు వేయడం వల్ల ఇంత నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించ కుండా షూటింగులు చేసుకుంటే కుదరదన్నారు. టీడీపీ నడుంవంచి యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిభ ఉన్నా షిప్టు ఆపరేటర్లకు డబ్బే అర్హతగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జూట్, ఫెర్రో వంటి ఫ్యాక్టరీలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. షిప్టు ఆపరేటర్లు, అంగన్వాడీ పోస్టుల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని, లేకపోతే చంద్రబాబే పెద్ద అవినీతి పరుడుగా భావించాల్సి వస్తుందనీ హెచ్చరించారు. ఆయన అండతోనే ఎంఎల్ఏలు, మంత్రులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఆయా నాయకులు గ్రామాల్లోకి అడుగుపెట్టడానికి సిగ్గు పడేలా చేయాలన్నారు. సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర మాట్లాడుతూ రాష్ట్రం లో జరుగుతున్న అవినీతి, ఆరోపణలపై ఎప్పటికప్పుడు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని, పైగా అధికారులు, పార్టీ ప్రతినిధులు పరస్పరం సహకరించుకొని అవినీతికి పాల్పడుతున్నారనీ ధ్వజమెత్తారు. షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా భ యం లేకుండా వాటిని నింపుతున్నారన్నారు. సాలూరు ముని సిపాలిటీలొని ఎస్సీ వీధికి చెందిన ఓ నిరుద్యోగి కోర్టుకు వెళితే ఆయనదగ్గర 4 లక్షలు తీసుకున్నారన్నారు. గిరిజనులకు ఇంత అన్యా యం జరిగినా ఆ పార్టీలో ఉండే నాయకులు ఎం దుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వీరందరికీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. అంగన్వాడీ, హౌసింగు డిపార్టుమెంటు ల్లో పోస్టులను అమ్మకానికి పెట్టేశారని తెలిపారు. ఈ పోస్టులు అర్హులకు సంక్రాంతిలోగా ఇవ్వకపోతే ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామ్మూర్తినాయుడు, చింతాడ సర్పంచ్ చింతాడ జయప్రదీప్, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండల నాయకులు కర్రోతు తిరుపతిరావు, తెంటు చిరంజీవిరావు, తెంటుసత్యంనాయుడు, పట్ణణనా య కుడు బొబ్బాది తవిటినాయుడు ప్రసంగించారు. బొబ్బిలి, రామభద్రపురం జెడ్పీటీసీలు మామిడి గౌరమ్మ, బోయిన లూర్థనమ్మ, జిల్లా కార్యదర్శి మడక తిరుపతిరావు, గంగుల మదన్ మోహన్, మాజీ ఎంపీపీలు తమ్మిరెడ్డి దామోదరరావు, గర్బాపు పరశురాం, పెద్దింటి రామారావు, కాకల వెంకటరావు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
'స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నాం'
హైదరాబాద్: అసెంబ్లీ తొలి సమావేశం నుంచే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వ్యవరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో స్పీకర్ అవలంభిస్తున్న ఏక్షపక్ష ధోరణిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానంకు నోటీసు ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలతో కలిసి సుజయకృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై గంటల తరబడి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక అవాస్తవాలు మాట్లాడినా సభాపతి వారి కట్టడి చేయలేదన్నారు. గతంలో స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలనుకున్నామని, తన వ్యవహార శైలిని మార్చుకుని సభను సక్రమంగా నడుపుతారని వెనక్కు తీసుకున్నామని వెల్లడించారు. తమ ఎమ్మెల్యే ఆర్ కే రోజాకు ప్రధాన అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆమెపై ఎదురుదాడి చేసి అన్యాయంగా ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారని వాపోయారు. అసెంబ్లీలో నిరసనలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ ఉందన్నారు. అసెంబ్లీ ప్రాపర్టీ అయిన వీడియోలు సోషల్ మీడియాకు లీకవడం స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు అవసరమైన సంఖ్యా బలం తమ పార్టీకి ఉందని సుజయకృష్ణ తెలిపారు. -
'స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నాం'
-
'ఆ బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
-
'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
హైదరాబాద్ : 25 మంది కార్పొరేట్ శక్తుల కోటరీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యాపార ధృక్పథంతో తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల విద్యార్థులకు పూర్తిగా నష్టం కలుగుతుందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసి ఇంతమందికి అన్యాయం చేసే బిల్లును శాసనసభలో పాస్ చేసుకోవడం దురదృష్టమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుని... కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్ విద్యా, వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తోందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చేతులు రావడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో జల్సాలు చేయడానికి మాత్రం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు అన్నారు. -
పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ
-
'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం'
విజయనగరం: ఉత్తరాంధ్రలో పార్టీ స్థితిగతులతోపాటు గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో చర్చించినట్లు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వెల్లడించారు. ఆదివారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి... సుజయ కృష్ణ రంగారావు నివాసంలో సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు అనుసరించ వలసిన వ్యూహంపై ఈ సందర్భంగా వారితో చర్చించినట్లు రంగారావు తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకుడిగా విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. దాంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి తరచుగా సమావేశమవుతున్న విషయం విదితమే. -
ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ సీఎం ఇచ్చిన హామీల వైఫల్యాలపై నిరసన తెలియజేయాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 5న జరిగే ధర్నాకు భారీగా తరలిరావాలని ఆయనీ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైవుండి జాబితాలో పేర్లు తొలగించిన బాధితులను కలుపుకుని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. పార్టీకి సంబంధించిన మండల, గ్రామ కమిటీల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. -
విఐపి రిపోర్టర్- ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు
-
కష్టాలు వింటూ...
పౌరుషానికి పుట్టినిల్లు, చరిత్రాత్మక బొబ్బిలి పట్టణ శివారున 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందిరమ్మ కాలనీ. 2004లో ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నికైన తరువాత పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇక్కడ మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రెండు విడతల్లో 20 వార్డులకు చెందిన నిరుపేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2006లో వారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం 18 వందల మంది వరకూ ఇక్కడ నివాసముంటున్నారు.. కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇక్కడ సరైన రహదారులు, వీధి లైట్లు, తాగునీటి వంటి కనీస సదుపాయాలు లేవు. చీకటి పడితే ఒకవైపు పాములు, మరో వైపు దొంగల భయంతో కాలనీవాసులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల కోసం చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి. ఈ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ‘సాక్షి’ తరఫున వీఐపీ విలేకరిగా మారారు. కాలనీ ప్రజలతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీర్చడానికి రక్షిత పథకం నిర్మించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం ముందుకు రాలేదు. పర్యటనలో నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాను. ఇక్కడ కాలనీ వాసుల కోసం ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రహదారులు, వీధిలైట్లు, కాలువల నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఫ్లోర్‌లీడరు, కౌన్సిలర్లు ద్వారా తెలియపరిచి కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు సుజయ్: నేను సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను.. మీ కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను.. ఏం బాబూ బాగున్నావా... నీ పేరేంటి.. ఏమిటీ నీ ఇబ్బంది? నా పేరు పాపారావు బాబు.. నాకు రెండు కాళ్లు రావు.. సైకిల్ అయితే ఉంది గానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదు.. సుజయ్: ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు పాపారావు: అయిదేళ్లుగా ఉంటున్నాను బాబు.. ఉండడానికి స్థలం లేదు.. ఇద్దరు పిల్లలున్నారు. సుజయ్: నీకు రేషను కార్డు ఉందా? పాపారావు: ఉందండీ సుజయ్: సరే నీకు ఇంటి స్థలం వచ్చేలా చేస్తాను.. సుజయ్: ఏమ్మా! నీ పేరేంటి. ఏమిటీ సమస్య లక్ష్మి : నాపేరు లక్ష్మి నాయన.. మాది పక్క ఊరు గున్నతోటవలస. మా ఇళ్లు కాలిపోయింది. అయినా ఇప్పటివరకూ ఇల్లు లేదు బాబు సుజయ్: ఎన్నాళ్లు అయ్యింది కాలిపోయి? లక్ష్మి: రెండు సంవత్సరాలు అయ్యింది.. ఎన్ని కాగితాలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. సుజయ్: నేను అధికారులతో మాట్లాడతాను.. నీకు ఇళ్లు ఇచ్చేలా చేస్తాను... సుజయ్: మీ పేరేమిటి... కాలనీలో సమస్యలు ఏమిటో చెప్పు? శ్రీరాములు: నా పేరు శ్రీరాములు సార్.. తమరు మాకు కాలనీ ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం వదలడం లేదు.. సుజయ్: ఏమేమి సమస్యలున్నాయి.? శ్రీరాములు: ఈ కాలనీకి బొబ్బిలి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కోడి చెరువు పక్కనుంచి మధ్యాహ్నం రాలేకపోతున్నాం.. అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ రోడ్డులోనే జరుగుతున్నాయి సార్ సుజయ్: పోలీసులు ఎవరూ రారా అటువైపు..? ఎల్లంనాయుడు: ఎప్పుడో ఫిర్యాదు ఇస్తే ఒకసారి అలా వచ్చి వెళ్లిపోతారు.. అంతే మళ్లీ మామూలే. సుజయ్: కాలనీలో వీధిలైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? బొంతు శ్రీరాములునాయుడు: లైట్లు ఇలా వేస్తే వారం రోజుల్లోనే అవి పోతున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: నీ పేరేంటింటి తాతా? చిన్నంనాయుడు: నా పేరు చిన్నంనాయుడు బాబు.. మీరు దయ ఉంచి కాలనీలో వీధిలైట్లు వెలిగేటట్టు చేయండి సుజయ్: ఎక్కడా లైట్లు వెలగడం లేదా..అసలు వేయలేదా?.. చిన్నంనాయుడు: మెయిన్ రోడ్డు తప్పించి ఎక్కడా లైట్లు లేవు.. చీకటి పడితే పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అల్లు సింగమ్మ: పాములే కాదు బాబు.. దొంగల భయం కూడా ఉంది.. బళ్లు, బక్కలు ఏవీ వీధిలో ఉంచుకోలేక పోతున్నాం సుజయ్: నీ పేరేంటమ్మ.. రత్నం: నా పేరు రెడ్డి రత్నం నాయన.. సుజయ్: ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు.. రత్నం: కాలనీ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు.. కుళాయిలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: మరి మీకు నీరు ఎలా? రత్నం: ట్యాంకరు వస్తుంది. అది కూడా రెండు రోజులకొకసారి. ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి సుజయ్: కాలనీలో బోర్లు ఉన్నాయి కదా. బాగోవా? రత్నం: ఆ నీరు మట్టివాసన కొడుతున్నాయి బాబు.. సుజయ్: నీపేరేమిటి పాప (అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో) స్రవంతి: నా పేరు స్రవంతి సుజయ్: ఏం నేర్చుకుంటున్నావు.. పాటలు పాడడం వచ్చా.. ఏమైందీ ఈ పాపకు ? కార్యకర్త: పుట్టిన దగ్గర నుంచి ఈ పాపకు రెండు కాళ్లు, చేతులు ఇలాగే ఉన్నాయి. సుజయ్: ఈ పాప పేరు ఏమిటి? కార్యకర్త: అలేఖ్య.. ఈయనే తండ్రి తాతారావు తాతారావు: పుట్టినప్పటి నుంచి కాళ్లు చేతులు ఇలాగే ఉండిపోయాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. సుజయ్: పాప ఏ పనీ చేసుకోలేదా? తాతారావు: ఏ పనీ చేయలేదు..దేనికీ సహకరించవు కూడా... సుజయ్: వయసు ఎంత ఉంటుంది? తాతారావు: అయిదేళ్లు సార్ సుజయ్: ఈ పాపకు సరైన న్యాయం చేస్తాను.. సరేనా.. సుజయ్ : నీ పేరేంటమ్మ..? శారద: నా పేరు శారద బాబు.. ఈ ఇంటి పక్కనే నలుగురు నడిచిన రోడ్డు ఉంది..అక్కడ విద్యుత్తు వైర్లు ఎలాడుతున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఎన్నాళ్లు నుంచి ఉంది ఇది? శారద: చాలా కాలం నుంచి ఉంది మధ్యలో స్తంభాలు వేసి వైర్లను మీదకు పెట్టాలి బాబు సుజయ్: ఇక్కడ ఇళ్లన్నీ పునాదులు వేసి వదిలేశారు ఎవరూ కట్టరా..? శారద: కట్టడానికి రెడీ అవుతున్న టైంలో ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల ఎవ్వరూ కట్టడానికి ముందుకు రావడం లేదు.. షేక్ షకీలా: బాబు..మేం కాలనీలో మొదటి విడతలో ఇళ్లు వచ్చిన వాళ్లం... మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఏమిటీ మీ సమస్య? షకీలా: ఎవరు ఏ పని చేసినా మొదట్లోనే చేస్తున్నారు గానీ ఇటువైపు ఎవరూ రావడం లేదు. నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం సుజయ్: మీకు బోరింగు లేదా.. ట్యాంకరు రావడం లేదా? షకీలా: బోరింగు ఆరు వీధుల తరువాత ఉంది.. ట్యాంకరు ఒక సారి వస్తే మరో సారి రాదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా పేరు రామలక్ష్మి.. బాడంగి గూడేపువలస మాది. ఇక్కడకు వచ్చి ఉంటున్నాం. మా ఆయన మూగోడు, కొడుకు పరిస్థితి కూడా అంతే, అయినా పింఛను ఇవ్వడం లేదు.. సుజయ్: వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే పింఛను ఇస్తారు కదా..? రామలక్ష్మి: ఉన్నా ఇవ్వడం లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: ఏం బాబు.. ఏం పేరు.. ఏం చేస్తున్నావు..? శ్రీనివాసరావు: నా పేరు శ్రీనివాసరావు సార్.. నేను వృత్తివిద్యాకోర్సు చేస్తున్నాను. బొబ్బిలి పట్టణంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: ఏమైంది..సమస్యేంటి? శ్రీనివాసరావు: ఎప్పుడో వేసిన పాత రోడ్లే ఇంకా ఉన్నాయి. వాటిని విస్తరించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. సుజయ్: అవును.. వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. బబ్బులు: సార్ నా పేరు బబ్బులు.. ఇక్కడ మైయిన్ రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి. సుజయ్ : అవును.. అదే చూస్తున్నాను.. బబ్బులు: మొదట వేసిన రోడ్లును అలాగే వదిలేశారు. మున్సిపాలిటీ అసలు పట్టించుకోవడం లేదు..చైర్‌పర్సన్‌ను చూడడానికి రమ్మంటే ఈ చివరకు అసలు రానేలేదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా సమస్య కాదు సార్.. ఈ కు ర్రోడు వికలాంగుడు..ఎవరూ లేరు. సర్టిఫికెట్ ఉన్నా ఫించను ఇవ్వడం లేదు సార్ సుజయ్: ఎన్నాళ్లుగా రావడం లేదు.. రామలక్ష్మి: అయిదేళ్లుగా రావడం లేదు. సుజయ్ : సరే చూస్తాను... ఏమండీ సర్పంచ్ గారు, మీ సమస్యేంటి? ఈశ్వరరావు: మా గున్నతోటవలస గ్రామానికి చెందిన 25 ఇళ్లు ఈ కాలనీ శివారున ఉన్నాయి సార్.. వాటికి విద్యుత్ సమస్య, రోడ్డు ఇబ్బంది ఉంది.. సుజయ్: విద్యుత్ సమస్య ఏంటి? ఈశ్వరరావు: ఊర్లోంచి వచ్చే మెయిన్ విద్యుత్ వైరుకు ఎక్కడా స్తంభాలు వేయలేదు. దాంతో మధ్యలో ఇళ్ల మీద నుంచి వైర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: సరే...మధ్యలో స్తంభాలు వేసేలా చూస్తా.. నీ పేరు ఏంటి మామ్మా? శాంత: నా పేరు పిట్ల శాంత బాబు.. సుజయ్: చెప్పు నీ సమస్యేంటో? శాంత: ఈ మధ్యను నాకు రెండు నెలల పింఛ ను ఇచ్చారు బాబు.. దానిలో 5 వందలు ఇరుపుకొంటున్నారు.. ఇలాగైతే మేం ఎలా బతకాలి సుజయ్: ఎవరు తీసుకుంటున్నారు... ఎందుకు తీసుకుంటున్నారో అడగలేదా..? శాంత: పెన్సన్ ఇచ్చిన రామారావే ఇరిపేశారు.. ఎందుకో చెప్పడం లేదు.. సుజయ్: పింఛను తీసుకుంటున్నవారు ఎవరికి డబ్బులు ఇవ్వక్కరలేదు.. అలా అడిగితే మీ కౌన్సిలర్లకు చెప్పండి.. వెయ్యి ఇస్తేగాని వేలి ముద్ర వేయకండి ఇందిర: సార్.. నా పేరు ఇందిర..నేను ఐద్వా జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నాను.. సుజయ్: చెప్పండమ్మా.... ఇందిర : ఈ కాలనీ ఉన్న వాళ్లకు టౌన్లో రేషను సరుకులు ఇస్తున్నారు.. అవి విడిపించడానికంటే వాటికి కాలనీకి తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. సుజయ్: సరుకుల కోసం ఎక్కడెక్కడకు వెళతారు ? ఇందిర: గతంలో ఈ కాలనీకి రాకముందు ఎక్కడున్నారో ఆ వీధుల్లోకే వెళ్లి తెచ్చుకోవాలి సార్, వీళ్లు వెళ్లేసరికి డిపో తీయకపోతే తిరుగుతుండడమే పని. ఈ కాలనీకి ప్రత్యేకమైన డిపోను ఏర్పాటు చేయించాలి సార్. సుజయ్: తప్పకుండా అలాగే ఏర్పాటు చేయిస్తాను. నీ పేరేంటమ్మా? భారతి: వియ్యపు భారతి సార్.. నా భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదు.. సార్ అప్పారావు: సార్ .. నాకు భూములున్నాయని పింఛను తీసేశార్ సార్. సుజయ్: ఎన్నాళ్లు నుంచి పింఛను తీసుకుంటన్నారు. ? అప్పారావు: 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్నాను. సెంటు భూమి లేదు..ఎవరు చెప్పారో తీసేశారు. సార్.. సుజయ్: ఏమైందయ్యా నీకు..ఏం పేరు నీ పేరు? సత్యారావు: కోట సత్యారావు సార్.నేను ఒకటో వార్డుకు చెందిన వాడిని. నాకు వికలాంగుడి ధ్రువీకరణ పత్రం ఉన్నా ఫించను మాత్రం ఇవ్వడం లేదు.. సుజయ్: ఏమంటున్నారు..ఎందుకు ఇవ్వడం లేదు.? సత్యారావు: ఏమీ చెప్పడం లేదు.. ఈ సర్టిఫికెట్ చేయించుకోవడానికే నాలుగు వేలు ఖర్చు పెట్టాను.. సుజయ్: సరే నేను చూస్తాను. అక్కడ నుంచి కొత్తగా పెట్టిన పాఠశాలకు వెళ్లారు.. మాస్టారు ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు? సత్యనారాయణ: ఇక్కడ ప్రస్తుతం 25 మంది ఉన్నారండీ.. కానీ ఈ కాలనీలో సుమారు 50 మందికి పైగా పిల్లలున్నారు.. సుజయ్: ఇక్కడకు ఎప్పుడు వచ్చారు.. మీరు డెప్యుటేషన్‌పై వచ్చారా.? సంతోష్‌కుమార్: ఆగస్టు నెలలో ఇక్కడ స్కూలు పెట్టారు సార్.. టౌన్లో రెండు స్కూళ్లు మూసేసి ఇక్కడ పెట్టారు. మమ్మల్ని బదిలీపై వేశారు.. సుజయ్: అదేంటి ఇక్కడ గతంలో స్కూలు లేకుండా బదిలీపై ఎలా వేశారు? సత్యనారాయణ: ఏమో సార్ ఆర్డర్ అలా ఇచ్చారు.. సునీత: నమస్తే సార్, నేను ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని నడుపుతున్నాను.. సుజయ్: చెప్పమ్మా! నీ సమస్య ఏంటో..? సునీత: స్కూలు ఇక్కడ పెట్టినా వంటకు ఇక్కడ స్టవ్, గ్యాస్, వంట పాత్రలు వంటివి ఇవ్వలేదు. రోజూ ఇంటి దగ్గర వండి తెస్తున్నాను. సుజయ్: బిల్లులు ఇచ్చేస్తున్నారా..? సునీత : రెండు మాసాలుగా అదీ లేదండీ ధనలక్ష్మి: సార్ నమస్తే సార్.. నా పేరు ధనలక్ష్మి.. నేను ఇందిరా గాంధీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. సుజయ్: నమస్తే చెప్పమ్మా! ఏం చదువుతున్నావు ధన లక్ష్మి: బీకాం ఫస్ట్ ఇయర్ సార్..మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. సుజయ్: నీ పేరేంటమ్మా తులసి: నా పేరు తులసి., మేం నక్కలోల్లం సార్.. మమ్మల్ని ఎస్టీలో కలపాలని ఎన్ని సార్లు కోరుతున్నా అది జరగడం లేదు. సార్ సుజయ్: గతంలో ఎక్కడైనా ఎస్టీలో చేర్చినట్లు ఇచ్చారా? తులసి: చోడవరంలో ఇచ్చారు సార్.. అది చూపించినా ఇక్కడ ఇవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: దీనిని గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తాను.. ఏమ్మా: పిల్లల్ని బడికి పంపుతున్నారా.. మర్రి ఉమ: లేదండీ... సుజయ్: పంపకుండా ఏమి చేస్తున్నారు..? ఉమ: వాళ్లు పనికి వెళితే మా కడుపులు ఎలా నిండుతాయి. బాబు.. సుజయ్: మీ కడుపులు నిండడానికి, వాళ్లని పనిలో పెడతారా... ఇక్కడే ఉన్న స్కూలుకు పంపండి అక్కడ భోజనాలు పెడతారు..చదువులు చెబుతారు సరేనా.. నారాయణమ్మ: బాబూ ఇక్కడ ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది. సుజయ్: దీని గురించి అధికారులకు చెప్పలేదా..? నారాయణమ్మ: చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఈ బావి నీరు తోడేసి రాతికట్టు కట్టి గట్టు ఎత్తు చేయాలి. అలాగే ప్లాట్‌పారం కట్టాలి బాబు.. సుజయ్: సరే చూద్దాం.. మీకు రుణమాఫీ అందుతుందా? నారాయణమ్మ: ఏం అందడం సార్.. చంద్రబాబు అసలు కట్టవద్దంటే మానేశాం. ఇపుపడు వడ్డీల కింద బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఇరుపుకుంటున్నారు. సుజయ్: ఇప్పటివరకూ ఎంత జమచేశారు? నారాయణమ్మ: 5 లక్షలు తెచ్చాం సార్... నెలకు పది వేలు చొప్పున ఆరుమాసాలకు 60 వేలు ఇరిపేశారు. సుజయ్: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..? నారాయణమ్మ: రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీలు పడకుండా ప్రతీ నెలా కట్టేస్తున్నాం. సరే వస్తానమ్మా... -
సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్
పార్టీ నేతలకు, శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు సాక్షి, హైదరాబాద్ : పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మానవతా చర్యలన్నింటిలోనూ పాల్గొనాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం కూడా హెచ్చరికలు చేసిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో హుదూద్ సృష్టించిన విలయం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జగన్మోహన్రెడ్డి ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పార్టీ నేతలు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబి నాయన, ధర్మాన కృష్ణదాస్, రెడ్డిశాంతి, గుడివాడ అమర్నాథ్లతో ఫోన్లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులను సమీకరించి సహాయక చర్యలకు ఉపక్రమించాలని వారికి ఆయన సూచించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ‘కోలగట్ల’
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని నియమిస్తూ బుధవారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావును నియమించారు. సుజయ్‌కృష్ణ రంగారావు ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కోలగట్ల గతంలో ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పని చేశా రు. వీరి నియామకంపై పార్టీనాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రుణమాఫీపై చంద్రబాబు మాయ మాటలు
బాడంగి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై మాయ మాటలు చెబుతూ రైతులు, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలు ప్రజా పక్షాన ఉండి సమస్యలపై పోరాటం చేయూలని పిలుపునిచ్చారు. సోమవారం బా డంగిలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యూరు. కార్యకర్తలకు ఏగ్రామంలో ఎలాంటి కష్టం వచ్చినా.. నాయకులు అండగా నిలవాలని సూచించారు. కొం దరి స్వార్థ రాజకీయం వల్లే మండల పరిషత్ స్థానం పోయందన్నారు. పార్టీ బలోపేతానికి వారం రోజుల్లో సభ్యత్వ నమోదులు పూర్తి చేసి కమిటీలను ఎన్నుకోవాలని, తద్వారా కమిటీలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ సమావేశం లో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తెంటు చిరంజీవరావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు పెద్దింటి రామారావు, ఎంపీటీసీ గుణుపూరు స్వామినాయుడు, మాజీ సర్పం చ్ మూడడ్ల సత్యనారాయణ, ఉడమల అప్ఫల నాయు డు, తాన్నసోములు, తదితరులు పాల్గొన్నారు. ఆధార్ పూర్తయ్యూకే పథకాలకు అనుసంధానం చేయూలి బొబ్బిలి: ప్రతి ఒక్కరికీ ఆధార్ నమోదు పూర్తయ్యూకే వాటిని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయూలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరుల తో మాట్లాడారు. ఆధార్ కార్డులుంటేనే ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ పాలకులు, అధికారులు చెబుతున్నారని, ముందు జిల్లాలో ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయన్న దానిపై అధికారులు పరిశీలన చేయాలన్నా రు. పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కా కుం డా వాటిని పథకాలకు అనుసంధానం చేస్తే చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఆధార్ నమో దు చేసుకున్న వారికి కార్డులు అందలేదని చెప్పారు. వారు మళ్లీ తీయించుకోవడానికి కేంద్రాలకు వెళితే ఇప్పటికే తీసేసామంటూ తిర స్కస్తునారని తెలిపారు. అధికారులు మరిన్ని ఆధార్ నమో దు కేంద్రాలను ఏర్పాటు చేయూలని చెప్పారు. -
బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
గజపతినగరం: జిల్లాకు చెందిన 24 మంది కూలీల మృతికి కారణమైన చెన్నై భవన యజమానిపై న్యాయ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా, మరింత పరిహారం అందేలా కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితుల తరఫున చెన్నై హైకోర్టులో పోరాడేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమి స్తున్నట్టు తెలిపారు. చెన్నైలోని 12 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురంలో కూలీల కుటుంబీకులకు బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. మృతులు పతివాడ బంగారునాయుడు, సిరిపురపు రాము, కర్రితౌడమ్మ, పేకేటి అప్పలరాము, పేకేటిలక్ష్మి(భార్యాభర్తలు), వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన మంత్రి మీనమ్మకు పార్టీ తరఫున చెక్కులు పంపి ణీ చేశారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికిరూ.75 వేలు చొప్పున, గాయపడిన మీనమ్మకు రూ.20 వేలు సాయం అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ చెన్నై ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ఆదుకోలేదని విమర్శించారు. జిల్లాలో ఉపాధి హా మీ పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో కూలీ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వె ళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నా యన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉపాధి హామీ పథకంలో లోపాలపై ప్రశ్నించనున్నట్టు తెలిపారు. సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం పరిధిలో తూరుమామిడి, గైశీల గ్రామాల్లో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డా వారిని పట్టించుకోలేదన్నారు. గైశీల గ్రామానికి చెందిన సుశీల తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌కు వెళితే రెండు రోజుల పాటు నామమాత్రంగా వైద్య పరీక్షలు జరిపి ఇంటికి పం పించివేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె వికలాంగురాలై మంచం దిగలేని పరిస్థితిలో ఉందన్నారు. సుశీలకు విక లాంగ పింఛన్ కింద రూ.1500 తక్షణమే అందజేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్లనున్నట్టు తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకొస్తే, శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తున్నట్టు చెప్పారు. బాధితులు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని చె ప్పారు. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు బాధితుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మిగతా నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జ్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే చత్రుచర్లచంద్రశేఖర్ రాజు, పార్వతీపురం, ఎస్‌కోట నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, మాజీ ఎంపీపీ వర్రి నర్సింహమూర్తి,పార్టీనాయకులు పరీక్షీత రాజ్, ఎస్. బంగారునాయుడు, బమ్మిడి అప్పలనాయుడు, గంటా తిరుపతిరావు, రెడ్డి గురుమూర్తి, ఎం.శ్రీనివాసరావు, బోడసింగిసత్తిబాబు,వింద్యవాసి, ఎం. లింగాలవలస సర్పంచ్‌లు కోలావెంకటసత్తిబాబు, పప్పలసింహచలం, కోడి బాబుజి, దనానరాంమూర్తి, మృత్యంజయరావు,రౌతు సరిసింగరావు. తదితరులు పాల్గొన్నారు. -
కుతంత్రాలు ఫలించలేదు!
బొబ్బిలి, న్యూస్‌లైన్ :‘ఈ ఎన్నికల్లో రాజులు ఓడిపోవడం ఖాయం... 16వ తేదీ న ఫలితాలు వచ్చిన వెంటనే రాజులను రైలు ఎక్కించి మేమే మద్రాసు సాగనంపుతాం.. ఇప్పటివరకూ రాజకీయ ప్రత్యర్థులు గా ఉండే వాసిరెడ్డి కుటుంబం కలవడంతో మరింత బలమేర్పడింది. చొక్కాపు, అప్పికొండ కుటుంబాలు పార్టీలో చేరడంతో ఇక మాకు తిరుగులేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజులను మట్టి కరిపించి విజయాన్ని అందుకుంటాం.. రెండు ఏళ్లు ముందుగానే బొబ్బిలి ప్రజలను అన్యాయం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో వారు గెలవడం పగటి కలే.. 10 ఓట్లకు పై గా మెజార్టీ తెచ్చుకొని గెలుస్తామ’ని బహిరంగ సభలతో పాటు ఊరూరా తిరిగి చేసిన టీడీపీ నాయకుల ప్రచారాలను బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు తిప్పికొట్టారు. నిస్వార్థంగా, నిజాయితీగా పని చేస్తూ.. నిత్యం ప్రజలతో మమేకమైన రాజుల వెంటే నడుస్తామని మరోసారి నిరూపించారు. మూడోసారి ఎమ్మెల్యే పదవిని సుజయ్‌కృష్ణరంగారావుకు అందించారు. ప్రతి సారీ ఎన్నికల్లో రాజులపై దుష్ర్పచారం చేయడం ప్రత్యర్థులకు అలవాటే. ఈసారీ ఆ విధంగానే ప్రయత్నించారు. అయితే, వారి పాచిక ఇప్పుడు కూడా పారలేదు. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సుజయ్ తన సత్తాను మరోమారు చాటిచెప్పారు. తిరుగులేని నాయకుడిగా మారారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రధానమైన పోటీని టీడీపీ ఇచ్చింది. ఇక్కడ రెండోసారి సుజయ్‌పై తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ చేయాల్సిన కార్యక్రమాల కంటే బొబ్బిలి రాజులను లక్ష్యంగా చేసుకొని దుష్ర్పచారాలు చేయడాని కే పెద్దపీట వేశారు. వీటితో పాటు కొప్పలవెలమ సామాజిక వర్గం పేరును ప్రతి ఎన్నికల్లో తెచ్చినట్టే ఈసారి కూడా తెరమీద కు తెచ్చినా ఫలితం ఇవ్వలేకపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం కాంగ్రెస్ పార్టీ చిరునామా గల్లంతు అవుతున్న సమయంలో ఈ నియోజకవర్గంలో ఉండే మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ అప్పికొండ శ్రీరాములునాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సుపల్లి ఉమాలక్ష్మి వంటి వారంతా టీడీపీలో చేరారు. దాంతో గతంలో అంతర్గతంగా టీడీపీకి సాయం అందే పరిస్థితి నుంచి నేడు నేరుగా పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. తెంటు కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన వాసిరెడ్డి వర్గం ఈ సారి టీడీపీలో చేరడంతో ఇక ఎదురులేదని భావిం చారు. రామభద్రపురం మండలంలోని కాంగ్రెస్ నాయకులంతా పార్టీలో చేరడంతో ఇంక విజయం నల్లేరుపై నడకే అని భావిం చారు. రాజులను ఈసారి ఓడించకపోతే మరి మనకు అవకాశమే రాదన్నట్టుగా వారంతా ఒకటయ్యారు. మొన్నటివరకూ తటస్థం గా ఉండే మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు బీజేపీకి వెళ్లి నా.. టీడీపీకి పనిచేయాల్సిన రావడంతో గెలుపు సునాయసమని భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సభను కూడా బొబ్బిలిలో నిర్వహించారు. దానికి వచ్చిన జనాలు, స్పం దన చూసి అంచనాలను రెట్టింపు వేసుకున్నారు. ఇప్పటివరకూ వరుసగా బొబ్బిలి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందినవారు ఎవ్వరూ లేరని ధీమా పడ్డారు. దీంతో ఆఖరి నిమిషం వర కూ టీడీపీదే విజయం అంటూ రూ.లక్షల్లో బెట్టింగులు కట్టారు. అయితే శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఇవన్నీ తారుమారయ్యాయి. నిత్యం ప్రజలకు ఏదో ఒక సేవ చేసే బొబ్బిలి రాజుల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. దీంతో టీడీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఎక్కడెక్కడ మెజార్టీ సాధిస్తామని ప్రత్యర్థు లు భావించారో అక్కడ సీను రివర్స్ అవ్వడంతో డీలా పడ్డారు. 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో బాడంగి మండలం ముగడ, రామభద్రపురంలోని కొట్టక్కి, రొంపల్లి వంటి గ్రామాలు మినహా నియోజకవర్గంలో మరెక్కడా టీడీపీకి ఓట్లు రాలలేదు.. నామమాత్ర పోటీ ఇచ్చిన కాంగ్రెస్, జేఎస్పీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు నియోజకవర్గంలో నామమాత్ర పోటీని ఇచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 4,966 ఓట్లును మాత్రమే సంపాదించగా, జేఎస్పీ అభ్యర్థి వాసిరెడ్డి అనురాధకు 924 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి రాష్ర్ట వ్యాప్తంగా ఉండే పార్టీ వ్యతిరేకత ఇక్కడ కూడా పనిచేసింది. కాంగ్రెస్‌లో శంబంగి చేరినప్పుడు ఉండే నాయకులంతా ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి జంప్ అవ్వడంతో పార్టీని నడిపే వారు కూడా లేని దుస్థితి ఏర్పడింది. అలాగే జేఎస్పీ తరఫున మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు చిన్న కోడలు వాసిరెడ్డి అనురాధ పోటీకి దిగారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ మహి ళా నాయకురాలుగా ఉండే ఆమెకు.. ఈ ఎన్నికల్లో కేవలం 924 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
జగన్ సీఎం కావాలి అదే ప్రజా కాంక్ష!
బొబ్బిలి, న్యూస్‌లైన్ : ‘ప్రజా సంక్షేమమే ధ్యే యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు గుండెల్లో స్థిరంగా ఉన్నాయి.. ఎక్కడకు వెళ్లినా వైఎస్ వల్ల మేం బతుకుతున్నాం, వైఎస్ వల్ల ప్రాణం నిలబడింది.. వైఎస్ వల్ల మా బతుకులకు భద్రత వచ్చిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలన్న బలమైన కోరిక ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోం ది’ అని వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ఆయనతో ‘న్యూస్‌లైన్’ ఇంటర్వ్యూ. పార్టీకి ఆదరణ ఎలా ఉంది? పార్టీకి ఎనలేని ఆదరణ ఉంది. కాం గ్రెస్ పార్టీ కుట్రలు, వైఎస్ మరణానంతరం దా రి తీసిన పరిస్థితుల వల్ల ప్రజలకు ఇచ్చిన మా ట కోసం కాంగ్రెస్‌ను వీడిన జగన్మోహన్రెడ్డి పార్టీని ప్రారంభించడం క్షేత్రస్థాయిలో ఎంతో ఆదరణకు కారణమైంది. తరువాత జగన్‌పై జరిగిన కుట్రలను ప్రజలు గమనించా రు. ఎక్కడకు వెళ్లినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మీ ప్రచారం ఎలా సాగింది? సుజయ్: గ్రామాలు, వార్డుల్లో పర్యటించాం. పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశాం. నాతో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న తమ్ముడు బేబీనాయన, మరో తమ్ముడు రాంనాయన ఇం టింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి నా ఎనిమిదేళ్ల పాలనలో జరి గింది. ఎన్టీఆర్ శిలాఫలకం వేసి వది లేస్తే బొ బ్బిలికి నా ఆధ్వర్యంలో పరిశ్రమలను తీసుకువచ్చాం. గ్రోత్‌సెంటరులో 33 కేవీ విద్యుత్ స్టేష న్, ఇందిరమ్మ ఒకటి, రెండు విడతల్లో రెండు వేలకు పైగా పక్కా ఇళ్లు, ఆస్పత్రుల్లో సీమాంక్ భవనం, వెంగళరాయసాగర్ అదనపు ఆయక ట్టు జలాలకు నిధులు, అంతర్గత రహదారులు, బస్సు సౌకర్యాలు, బొబ్బిలి పట్టణంలో ప్లాస్టిక్, పాలథీన్ నిషేధంతో జాతీయ స్థాయి గుర్తింపు, పట్టణంలో అన్ని వీధులకు రహదారులు, కాలువల నిర్మాణం, బాడంగికి అగ్నిమాపక కేంద్రం, ప్రధాన గ్రామాలకు సురక్షిత మంచినీటి పథకాలు ఇటువంటివెన్నో తీసుకువచ్చాం. అప్పటి తెర్లాం నియోజకవర్గంలో 30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నేను చేసి చూపించాను. ఎన్నికల్లో మీరు ఇస్తున్న హామీలు? నియోజకవర్గం పరిధిలో అనేక సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. ప్రధానం గా సాగునీరు, తాగునీరు పరిపూర్ణంగా పట్టణం, మండలానికి అందించాల్సి ఉంది. పట్టణంలో పాత పైపులైను మార్చడం, రోడ్లను విస్తరించ డం, కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పిం చడం, అంతర్గత రహదారులు నిర్మాణం వంటివి చేయాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ప్రకా రం అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తాను. ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పికొడుతున్నారు? ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రత్యర్థులు ఎన్ని విమర్శలైనా చేస్తారు. కానీ ఇక్కడ నాయకులనుగాని, అటు చంద్రబాబునుగాని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మాపై చేసిన విమర్శలకు ప్రజలే సమాధానమిస్తారు. బీజేపీతో జత కట్టినప్పుడే టీడీపీ అసలు రంగు బయటపడింది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాబలాన్ని ఎదుర్కొలేక గత సహకార ఎన్నికల నుంచి నేటి వరకూ కాంగ్రెస్, టీడీపీలు కలిసే పని చేస్తున్నాయి. ఇది ప్రతి ఓటరుకు తెలుసు.. అయినా బొబ్బిలి ప్రజలతో మాకు నాలుగు వందల ఏళ్లుగా సం బంధం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయి నా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సంక్షే మం గురించి సొంత సొమ్ము ఖర్చు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తమకు ప్రజలు అం దిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక దిగజారు డు రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విజయావకాశాలు ఎలా ఉన్నాయి? 2004, 2009ల్లో ఎమ్మెల్యేగా గెలి పిం చారు. నిస్వార్థంగా సేవలందించాను. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉండగా, తమ్ముడు బేబీనాయన ఎంపీ గా బరిలో ఉన్నారు. ఇప్పటి వరకూ బొబ్బిలి ఇచ్చిన మెజార్టీతో ఎంపీలు ఢిల్లీకి వెళ్లేవాళ్లు. ఇప్పుడు బొబ్బిలి నుంచే ఎంపీని పంపాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉంది. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో పాటు పార్టీకి ఉండే ఇమేజ్ బట్టి చూస్తే గత ఎన్నికల కంటే అధిక మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. -
ప్రచారంలో దూసుకెళ్తున్న బొబ్బిలిరాజులు
-
మంత్రి బొత్స వల్లే జిల్లా నాశనం
గరివిడి, న్యూస్‌లైన్:జిల్లాను మంత్రి బొత్స సత్యనారాయణ నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదాడ మోహన్‌రావు ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గ దళిత శంఖారావం కార్యక్రమం గరివిడిలోని ఫేకర్ కల్యాణ మండపంలో సొమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మంత్రి బొత్స కుటుంబ సభ్యులు జిల్లాను అన్ని విధాలుగా దోచుకుని నాశనం చేశారని ఆరోపిం చారు. మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేదలకు,దళితులకు ఉద్యోగాలను కూడా విచ్చలవిడిగా అమ్ముకున్నారని విమర్శించారు. దీని వల్ల ఎంతో మంది పేదవారు ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి బొత్స రాజకీయాన్ని వ్యాపార రంగంగా మాచ్చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు లు పంచి మళ్లీ గెలుపొందాలని మంత్రి ప్రణాళిక రూపొందిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బొత్సను ఈ సారి ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి మంత్రి బొత్స చేసిందేమీ లేదని పెదవి విరిచారు. మహానేత వైఎస్ఆర్ మరణించిన తరువాత దళితులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దళితుల గుండె చప్పుడు తమ పార్టీ అధినేత జగన్ అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆ పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ చీపురుపల్లిలో దళితులకు మంజూరైన 21 వ్యవసాయ మోటార్లను కాంగ్రెస్ నాయకులు తమ పొలాల్లో వేసుకున్నారని ఉదాహరణలతో వివరించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు తదితర పథకాలు కొనసాగించే సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాల నాయుడు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో దళితులందరరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఆదాడ మోహన్‌రావు మాట్లాడుతూ దళితులందరూ వైఎస్ఆర్సీపీకి అండ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శనపతి శిమ్మినాయుడు,తుమ్మగంటి సూరినాయుడు,సి.ఎ. సత్యనారాయణరెడ్డి,నాలుగు మండలాల దళితనేతలు గుండేల ఆదినారాయణ,సామంతుల రామస్వామి, గిడిజాల శ్రీను, సిమ్మాల రామ్మూర్తి, రేగిడి రామకృష్ణలతో పాటు సుమారు వెయ్యి మంది దళితులు పాల్గొన్నారు. -
ఉచిత వైద్యం అభినందనీయం
వేపాడ, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా రోగులకు ఉచితంగా వైద్యసేవలతో పాటు మం దులు పంపిణీ చేయడం అభినందనీయమని వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రం వేపాడలో ఎస్.కోట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీస్పెషాలిటీ మెగా వైద్య శిబిరాన్ని సుజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు సహకారం అందిస్తున్న వైద్యులను సుజయ్ అభినందించారు. నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఎనిమిది కౌంటర్లలో 11 మంది వైద్యులు పాల్గొని 2,358 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్.కోటనియోజకవర్గ సమన్వయకర్తలు వేచలపు వెంకట చినరామునాయుడు, గేదెల తిరుపతి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహమాన్, ఎస్.కోట మండల కన్వీనర్ ఎస్.సత్యం మోపాడ నాయు డు, ఎస్.సత్యనారాయణ, కోళ్ల కృష్ణ, ఎం. అప్పారావు, వై.మాధవరావు, విక్టరీ హై స్కూలు కరస్పాండెంట్ దాలినాయుడు, వావిలపాడు సర్పంచ్ బీల రాజేశ్వరీ, ఎన్.శ్రీనివాసరావు, జి.సన్నిబాబు, ఎన్.సింహాచలం, వెంకట రమణ, కర్రి అప్పలనాయుడు, సన్యాసినాయుడు, దేబార్కి కిరణ్ పాల్గొన్నారు. వైద్యులు లోక్‌నాథ్, అచ్చింనాయుడు, ఆదిలక్ష్మి, దేముడుబాబు,పైడిపతిరావు, వసుంధర, రమాదేవి, నవీన్కుమార్వైద్యసేవలు అందించారు. ఓట్ల కోసమే విభజన.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు విమర్శించారు. వైద్య శిబిరం అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం పెడితే అధికార కాంగ్రెస్‌ను కాపాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కు అయ్యారని విమర్శించడం హాస్యాస్పదం గా ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పార్టీలను ప్రజలు ఇప్పటికే గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టడం ఖాయమన్నారు. -
సమైక్యాంధ్ర సాధనే లక్ష్యం
బొబ్బిలి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పట్టణంలోని దక్షిణదేవిడి వద్ద ఆ పార్టీ నాయకులు చేస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుజయ్ మాట్లాడుతూ మొదటి నుంచీ తమ పార్టీ విభజనను వ్యతిరేకిస్తుందన్నారు. విభజన ప్రకటన రాకముందే తమ పార్టీ ఎమ్మెలేలం తా పదవులకు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి పార్టీ తరుఫున ఉద్యమాలు, ఆందోళనలు సాగిస్తున్నామన్నా రు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులోను, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్షలు చేశారని చెప్పా రు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆరోపించారు. ఈ విషయూన్ని ప్రజలంతా గమనించి, సరైన సమయంలో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను అడ్డుకుని, నిలదీయూల్సిన ్రపధాన ప్రతిపక్షం టీడీపీ విభజనకు సై అంటూ లేఖ ఇవ్వడం సరికాదన్నారు. కాగా దీక్షలో పట్టణంలోని 18వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్లు బూర్లి నాగరాజు, మాదాసి మహలక్ష్మి, మరడాన రాముతో పాటు బొంగు గౌరీ సంతోష్‌కుమార్, మా సాబత్తుల వాసుదేవరావు, చందక రమేష్, ముత్తాడ గోపమ్మ, మీసాల శంకరరావు తదితరులు కూరున్నారు. వారికి పింఛనర్ల సంఘం నాయకుడు రౌతు రామ్మూర్తి, మాజీ కౌన్సిలర్లు కాకల వెంకటరావు, బొబ్బాది తవిటినాయుడు, రామభద్రపురం నాయకులు కర్రోతు తిరుపతిరా వు, మడక తిరుపతినాయుడు సంఘీభావం తెలిపారు. -
జిల్లాలో విజయమ్మ పర్యటన నేడు
బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్టు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. విశాఖపట్నం నుంచి నేరుగా భోగాపురం మండలానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారని తెలిపారు. భోగాపురం మండలంలోని రావాడ వద్ద పాడైన వంతెన, కొబ్బరితోటలు, అలాగే నీట మునిగిన ఎస్సీ, బీసీ కాలనీలు పరిశీ లిస్తారని తెలిపారు. అక్కడ నుంచి పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామానికి వెళ్లి అక్కడ పాడైన మొక్కజొన్న పంటను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళతారని చెప్పారు. -
'సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి'
విజయనగరం: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీమాంధ్రాలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతరమైన నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఉద్యమాలతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారుతుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానకి తహతహలాటడం సరికాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్ నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత సమైక్యాంధ్ర ఉద్య మం మరింత ఉధృతమైందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ర్టంలో ఏ జేఏసీ అయినా సమైక్యాంధ్ర కోసం ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతుగా తమ పార్టీ మొద టి సంతకం చేస్తుందని జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన మరోసారి తెలిపారు. -
'జగన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక బులిటెన్ విడుదల చేయాలి'
హైదరాబాద్:రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ చంచలగూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే అధికారిక బులెటన్ విడుదల చేయాలని ఆ పార్టీ నేత సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.జగన్ ఆరోగ్య పరిస్థితిపై కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారిక బులిటెన్ విడుదల చేయకపోతే మరింత ఆందోళన చెందే అవకాశాలున్నాయని సుజయ్ కృష్ణ రంగారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో జగన్ ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష 5వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక బులిటెన్ విడుదల చేయాలని జైలు అధికారులను కోరుతున్నారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: సుజయ్ కృష్ణరంగారావు ప్రసంగం