బొబ్బిలి, న్యూస్‌లైన్ :‘ఈ ఎన్నికల్లో రాజులు ఓడిపోవడం ఖాయం... 16వ తేదీ న ఫలితాలు వచ్చిన వెంటనే రాజులను రైలు ఎక్కించి మేమే మద్రాసు సాగనంపుతాం.. ఇప్పటివరకూ రాజకీయ ప్రత్యర్థులు గా ఉండే వాసిరెడ్డి కుటుంబం కలవడంతో మరింత బలమేర్పడింది. చొక్కాపు, అప్పికొండ కుటుంబాలు పార్టీలో చేరడంతో ఇక మాకు తిరుగులేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజులను మట్టి కరిపించి విజయాన్ని అందుకుంటాం.. రెండు ఏళ్లు ముందుగానే బొబ్బిలి ప్రజలను అన్యాయం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఈ ఎన్నికల్లో వారు గెలవడం పగటి కలే.. 10 ఓట్లకు పై గా మెజార్టీ తెచ్చుకొని గెలుస్తామ’ని బహిరంగ సభలతో పాటు ఊరూరా తిరిగి చేసిన టీడీపీ నాయకుల ప్రచారాలను బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు తిప్పికొట్టారు. నిస్వార్థంగా, నిజాయితీగా పని చేస్తూ.. నిత్యం ప్రజలతో మమేకమైన రాజుల వెంటే నడుస్తామని మరోసారి నిరూపించారు. మూడోసారి ఎమ్మెల్యే పదవిని సుజయ్‌కృష్ణరంగారావుకు అందించారు. ప్రతి సారీ ఎన్నికల్లో రాజులపై దుష్ర్పచారం చేయడం ప్రత్యర్థులకు అలవాటే. ఈసారీ ఆ విధంగానే ప్రయత్నించారు. అయితే, వారి పాచిక ఇప్పుడు కూడా పారలేదు. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సుజయ్ తన సత్తాను మరోమారు చాటిచెప్పారు. తిరుగులేని నాయకుడిగా మారారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ప్రధానమైన పోటీని టీడీపీ ఇచ్చింది. ఇక్కడ రెండోసారి సుజయ్‌పై తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పోటీ చేశారు.
ఎన్నికల ప్రచారంలో పార్టీ చేయాల్సిన కార్యక్రమాల కంటే బొబ్బిలి రాజులను లక్ష్యంగా చేసుకొని దుష్ర్పచారాలు చేయడాని కే పెద్దపీట వేశారు. వీటితో పాటు కొప్పలవెలమ సామాజిక వర్గం పేరును ప్రతి ఎన్నికల్లో తెచ్చినట్టే ఈసారి కూడా తెరమీద కు తెచ్చినా ఫలితం ఇవ్వలేకపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం కాంగ్రెస్ పార్టీ చిరునామా గల్లంతు అవుతున్న సమయంలో ఈ నియోజకవర్గంలో ఉండే మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ అప్పికొండ శ్రీరాములునాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సుపల్లి ఉమాలక్ష్మి వంటి వారంతా టీడీపీలో చేరారు. దాంతో గతంలో అంతర్గతంగా టీడీపీకి సాయం అందే పరిస్థితి నుంచి నేడు నేరుగా పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. తెంటు కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన వాసిరెడ్డి వర్గం ఈ సారి టీడీపీలో చేరడంతో ఇక ఎదురులేదని భావిం చారు. రామభద్రపురం మండలంలోని కాంగ్రెస్ నాయకులంతా పార్టీలో చేరడంతో ఇంక విజయం నల్లేరుపై నడకే అని భావిం చారు.
రాజులను ఈసారి ఓడించకపోతే మరి మనకు అవకాశమే రాదన్నట్టుగా వారంతా ఒకటయ్యారు. మొన్నటివరకూ తటస్థం గా ఉండే మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు బీజేపీకి వెళ్లి నా.. టీడీపీకి పనిచేయాల్సిన రావడంతో గెలుపు సునాయసమని భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సభను కూడా బొబ్బిలిలో నిర్వహించారు. దానికి వచ్చిన జనాలు, స్పం దన చూసి అంచనాలను రెట్టింపు వేసుకున్నారు. ఇప్పటివరకూ వరుసగా బొబ్బిలి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందినవారు ఎవ్వరూ లేరని ధీమా పడ్డారు. దీంతో ఆఖరి నిమిషం వర కూ టీడీపీదే విజయం అంటూ రూ.లక్షల్లో బెట్టింగులు కట్టారు. అయితే శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఇవన్నీ తారుమారయ్యాయి. నిత్యం ప్రజలకు ఏదో ఒక సేవ చేసే బొబ్బిలి రాజుల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. దీంతో టీడీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఎక్కడెక్కడ మెజార్టీ సాధిస్తామని ప్రత్యర్థు లు భావించారో అక్కడ సీను రివర్స్ అవ్వడంతో డీలా పడ్డారు. 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో బాడంగి మండలం ముగడ, రామభద్రపురంలోని కొట్టక్కి, రొంపల్లి వంటి గ్రామాలు మినహా నియోజకవర్గంలో మరెక్కడా టీడీపీకి ఓట్లు రాలలేదు..
నామమాత్ర పోటీ ఇచ్చిన కాంగ్రెస్, జేఎస్పీ
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు నియోజకవర్గంలో నామమాత్ర పోటీని ఇచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 4,966 ఓట్లును మాత్రమే సంపాదించగా, జేఎస్పీ అభ్యర్థి వాసిరెడ్డి అనురాధకు 924 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి రాష్ర్ట వ్యాప్తంగా ఉండే పార్టీ వ్యతిరేకత ఇక్కడ కూడా పనిచేసింది. కాంగ్రెస్‌లో శంబంగి చేరినప్పుడు ఉండే నాయకులంతా ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి జంప్ అవ్వడంతో పార్టీని నడిపే వారు కూడా లేని దుస్థితి ఏర్పడింది. అలాగే జేఎస్పీ తరఫున మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు చిన్న కోడలు వాసిరెడ్డి అనురాధ పోటీకి దిగారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ మహి ళా నాయకురాలుగా ఉండే ఆమెకు.. ఈ ఎన్నికల్లో కేవలం 924 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కుతంత్రాలు ఫలించలేదు!
Published Sat, May 17 2014 1:59 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement