జగన్ సీఎం కావాలి అదే ప్రజా కాంక్ష!
బొబ్బిలి, న్యూస్‌లైన్ : ‘ప్రజా సంక్షేమమే ధ్యే యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు గుండెల్లో స్థిరంగా ఉన్నాయి.. ఎక్కడకు వెళ్లినా వైఎస్ వల్ల మేం బతుకుతున్నాం, వైఎస్ వల్ల ప్రాణం నిలబడింది.. వైఎస్ వల్ల మా బతుకులకు భద్రత వచ్చిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలన్న బలమైన కోరిక ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోం ది’ అని వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ఆయనతో ‘న్యూస్‌లైన్’ ఇంటర్వ్యూ.
పార్టీకి ఆదరణ ఎలా ఉంది?
పార్టీకి ఎనలేని ఆదరణ ఉంది. కాం గ్రెస్ పార్టీ కుట్రలు, వైఎస్ మరణానంతరం దా రి తీసిన పరిస్థితుల వల్ల ప్రజలకు ఇచ్చిన మా ట కోసం కాంగ్రెస్‌ను వీడిన జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని ప్రారంభించడం క్షేత్రస్థాయిలో ఎంతో ఆదరణకు కారణమైంది. తరువాత జగన్‌పై జరిగిన కుట్రలను ప్రజలు గమనించా రు. ఎక్కడకు వెళ్లినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు.
మీ ప్రచారం ఎలా సాగింది?
సుజయ్: గ్రామాలు, వార్డుల్లో పర్యటించాం. పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశాం. నాతో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న తమ్ముడు బేబీనాయన, మరో తమ్ముడు రాంనాయన ఇం టింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి?
బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి నా ఎనిమిదేళ్ల పాలనలో జరి గింది. ఎన్టీఆర్ శిలాఫలకం వేసి వది లేస్తే బొ బ్బిలికి నా ఆధ్వర్యంలో పరిశ్రమలను తీసుకువచ్చాం. గ్రోత్‌సెంటరులో 33 కేవీ విద్యుత్ స్టేష న్, ఇందిరమ్మ ఒకటి, రెండు విడతల్లో రెండు వేలకు పైగా పక్కా ఇళ్లు, ఆస్పత్రుల్లో సీమాంక్ భవనం, వెంగళరాయసాగర్ అదనపు ఆయక ట్టు జలాలకు నిధులు, అంతర్గత రహదారులు, బస్సు సౌకర్యాలు, బొబ్బిలి పట్టణంలో ప్లాస్టిక్, పాలథీన్ నిషేధంతో జాతీయ స్థాయి గుర్తింపు, పట్టణంలో అన్ని వీధులకు రహదారులు, కాలువల నిర్మాణం, బాడంగికి అగ్నిమాపక కేంద్రం, ప్రధాన గ్రామాలకు సురక్షిత మంచినీటి పథకాలు ఇటువంటివెన్నో తీసుకువచ్చాం. అప్పటి తెర్లాం నియోజకవర్గంలో 30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నేను చేసి చూపించాను.
ఎన్నికల్లో మీరు ఇస్తున్న హామీలు?
నియోజకవర్గం పరిధిలో అనేక సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. ప్రధానం గా సాగునీరు, తాగునీరు పరిపూర్ణంగా పట్టణం, మండలానికి అందించాల్సి ఉంది. పట్టణంలో పాత పైపులైను మార్చడం, రోడ్లను విస్తరించ డం, కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పిం చడం, అంతర్గత రహదారులు నిర్మాణం వంటివి చేయాల్సి ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ప్రకా రం అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తాను.
ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పికొడుతున్నారు?
ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రత్యర్థులు ఎన్ని విమర్శలైనా చేస్తారు. కానీ ఇక్కడ నాయకులనుగాని, అటు చంద్రబాబునుగాని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మాపై చేసిన విమర్శలకు ప్రజలే సమాధానమిస్తారు. బీజేపీతో జత కట్టినప్పుడే టీడీపీ అసలు రంగు బయటపడింది. నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాబలాన్ని ఎదుర్కొలేక గత సహకార ఎన్నికల నుంచి నేటి వరకూ కాంగ్రెస్, టీడీపీలు కలిసే పని చేస్తున్నాయి. ఇది ప్రతి ఓటరుకు తెలుసు.. అయినా బొబ్బిలి ప్రజలతో మాకు నాలుగు వందల ఏళ్లుగా సం బంధం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయి నా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సంక్షే మం గురించి సొంత సొమ్ము ఖర్చు పెట్టాం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తమకు ప్రజలు అం దిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక దిగజారు డు రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
విజయావకాశాలు ఎలా ఉన్నాయి?
2004, 2009ల్లో ఎమ్మెల్యేగా గెలి పిం చారు. నిస్వార్థంగా సేవలందించాను. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉండగా, తమ్ముడు బేబీనాయన ఎంపీ గా బరిలో ఉన్నారు. ఇప్పటి వరకూ బొబ్బిలి ఇచ్చిన మెజార్టీతో ఎంపీలు ఢిల్లీకి వెళ్లేవాళ్లు. ఇప్పుడు బొబ్బిలి నుంచే ఎంపీని పంపాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉంది. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో పాటు పార్టీకి ఉండే ఇమేజ్ బట్టి చూస్తే గత ఎన్నికల కంటే అధిక మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.