సమైక్యాంధ్ర సాధనే లక్ష్యం
Published Sun, Nov 17 2013 3:34 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పట్టణంలోని దక్షిణదేవిడి వద్ద ఆ పార్టీ నాయకులు చేస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుజయ్ మాట్లాడుతూ మొదటి నుంచీ తమ పార్టీ విభజనను వ్యతిరేకిస్తుందన్నారు. విభజన ప్రకటన రాకముందే తమ పార్టీ ఎమ్మెలేలం తా పదవులకు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి పార్టీ తరుఫున ఉద్యమాలు, ఆందోళనలు సాగిస్తున్నామన్నా రు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులోను, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్షలు చేశారని చెప్పా రు.
కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆరోపించారు. ఈ విషయూన్ని ప్రజలంతా గమనించి, సరైన సమయంలో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను అడ్డుకుని, నిలదీయూల్సిన ్రపధాన ప్రతిపక్షం టీడీపీ విభజనకు సై అంటూ లేఖ ఇవ్వడం సరికాదన్నారు. కాగా దీక్షలో పట్టణంలోని 18వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్లు బూర్లి నాగరాజు, మాదాసి మహలక్ష్మి, మరడాన రాముతో పాటు బొంగు గౌరీ సంతోష్‌కుమార్, మా సాబత్తుల వాసుదేవరావు, చందక రమేష్, ముత్తాడ గోపమ్మ, మీసాల శంకరరావు తదితరులు కూరున్నారు. వారికి పింఛనర్ల సంఘం నాయకుడు రౌతు రామ్మూర్తి, మాజీ కౌన్సిలర్లు కాకల వెంకటరావు, బొబ్బాది తవిటినాయుడు, రామభద్రపురం నాయకులు కర్రోతు తిరుపతిరా వు, మడక తిరుపతినాయుడు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement