రుణమాఫీపై చంద్రబాబు మాయ మాటలు
బాడంగి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై మాయ మాటలు చెబుతూ రైతులు, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలు ప్రజా పక్షాన ఉండి సమస్యలపై పోరాటం చేయూలని పిలుపునిచ్చారు. సోమవారం బా డంగిలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యూరు. కార్యకర్తలకు ఏగ్రామంలో ఎలాంటి కష్టం వచ్చినా.. నాయకులు అండగా నిలవాలని సూచించారు. కొం దరి స్వార్థ రాజకీయం వల్లే మండల పరిషత్ స్థానం పోయందన్నారు. పార్టీ బలోపేతానికి వారం రోజుల్లో సభ్యత్వ నమోదులు పూర్తి చేసి కమిటీలను ఎన్నుకోవాలని, తద్వారా కమిటీలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ సమావేశం లో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తెంటు చిరంజీవరావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు పెద్దింటి రామారావు, ఎంపీటీసీ గుణుపూరు స్వామినాయుడు, మాజీ సర్పం చ్ మూడడ్ల సత్యనారాయణ, ఉడమల అప్ఫల నాయు డు, తాన్నసోములు, తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ పూర్తయ్యూకే పథకాలకు అనుసంధానం చేయూలి
బొబ్బిలి: ప్రతి ఒక్కరికీ ఆధార్ నమోదు పూర్తయ్యూకే వాటిని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయూలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరుల తో మాట్లాడారు. ఆధార్ కార్డులుంటేనే ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ పాలకులు, అధికారులు చెబుతున్నారని, ముందు జిల్లాలో ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయన్న దానిపై అధికారులు పరిశీలన చేయాలన్నా రు. పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కా కుం డా వాటిని పథకాలకు అనుసంధానం చేస్తే చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఆధార్ నమో దు చేసుకున్న వారికి కార్డులు అందలేదని చెప్పారు. వారు మళ్లీ తీయించుకోవడానికి కేంద్రాలకు వెళితే ఇప్పటికే తీసేసామంటూ తిర స్కస్తునారని తెలిపారు. అధికారులు మరిన్ని ఆధార్ నమో దు కేంద్రాలను ఏర్పాటు చేయూలని చెప్పారు.