Badangi
-
ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని ఆశించారు.. కానీ
సాక్షి,బాడంగి( విజయనగరం): ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోడ్డుప్రమాదంలో కన్నపేగు దుర్మరణం పాలవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన దాసరి దేవేంద్ర, రాధల కుమారుడు అజయ్‌కుమార్ (14) డొంకినవలస ఎత్తుకానాపై టీహబ్‌సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయనగరంలోని జమ్మునారాయణ పురం మహాత్మాగాంధీ జ్యోతి రావు పూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అజయ్‌కుమార్ పాఠశాలలు మూసివేయడంతో కొన్నినెలలుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. మేనత్తకూతురు విజయనగరం నుంచి కామన్నవలస జంక్షన్ వద్ద బస్సు దిగుతుందని, బావ గిరడ భానుప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటాలేలాండ్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. భాను ప్రసాద్‌కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. వ్యాన్‌డ్రైవర్ త్రినాథ్‌ను అదుఫులోకి తీసుకుని వ్యాన్ సీజ్ చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయునిపై నిర్భయ కేసు
బాడంగి (విజయనగరం) : విద్యార్థులను సత్ప్రవర్తన కలిగినవారుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడే నిర్భయ కేసులో ఇరుక్కున్నాడు. ఒక అమాయకురాలిని ప్రేమ పేరుతో వలలో వేసుకొని శారీరక సంబంధం పెట్టుకొని తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి తప్పించుకోజూసినందుకు ఆయనపై బాడంగి పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా బొబ్బలి సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం ఆనవరం గ్రామానికి చెందిన ఒక యువతి మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి హైస్కూల్లో పనిచేస్తున్న కిళ్లాడ లచ్చన్న అనే ఉపాధ్యాయునితో ప్రేమలోపడింది. మూడేళ్లుగా వారు ప్రేమించుకొంటున్నారు. శారీరక సంబంధం పెట్టుకోగా అమ్మాయి పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అమ్మాయి గురువారం రాత్రి పొలీస్స్టేషనులో ఫిర్యాదు చేయగా బొబ్బిలి సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరం
బాడంగి: ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం బాడంగిలోని ఐసీడీఎస్ పీఓ కార్యలయాన్ని సందర్శించారు. కొత్తగా చేపడుతున్న సీడీపీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఏడాదిలో 300 రోజుల పాటు ఫీడింగ్ ఇవ్వాలని, వేసవిలో ఉదయం 8 నుంచి 12 గంటల లోపు మాత్రమే కేంద్రాలను నిర్వహించాలన్నారు. చిన్నారులకు ఎండదెబ్బ తగలకుండా సిబ్బంది చూడాలని కోరారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలోని మొత్తం 17 ప్రోజెక్టులుండగా ఇంకా 8 ప్రోజెక్టులకు సొంత భవనాలు అందుబాటు లోకిరావాల్సి ఉందన్నారు. 3729 కేంద్రాలకుగాను 1836 కేంద్రాలకు పక్కా భవనాలు అవసరమని తెలిపారు. నిధుల కొరతలేదని వాటికి కూడా త్వరలోనే సమకూరుస్తామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ నాయక్ ప్రత్యేక నిధులను కేటాయించారని, దీనిపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పార్వతీపురం డివిజన్ మైదాన ప్రాంతంలోని 587 మంది కార్యకర్తలకు శోధన సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించామన్నారు. త్వరలోనే విజయనగరం డివిజన్లోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జాలారి వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న 427 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పక్కా భవనాలు ఉన్న కేంద్రాలకు విద్యుత్ సౌకర్యంతో పాటుగా, ఫ్యాన్లు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముగడ గ్రామానికి చేరుకొని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. -
చిన్నారిని బలిగొన్న విద్యుత్ స్తంభం
బాడంగి: విద్యుత్ స్తంభం రూపంలో విధి ఓ చిన్నారిని బలిగొంది. రోడ్డు మీద ఆట ఆడుకుంటున్న పసివాడిపై అక్కసు తీర్చుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు తీవ్ర విషాదం నింపింది. హృదయ విదారకరమైన ఈ సంఘటన గురువారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకోంది. కరెంట్ తీగలను టిప్పర్ లాగేయడంతో విద్యుత్ స్తంభం పడి తీవ్ర గాయాలపాలైన బాలుడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ వి.పాపారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పొడుగు నాగరాజు సైకిల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి యశ్వంత్ (4), భరత్(2) అనే ఇద్దరు కుమారులు. ఇక్కడి కూరాకుల వీధిలో వీరబ్రహ్మం గారి ఆలయం సమీపంలో స్టోన్‌క్రషర్ బుగ్గి తెచ్చిన టిప్పరు అన్లోడ్ చేసే క్రమంలో విద్యుత్ వైరు ట్రక్ కొక్కేనికి చిక్కుకుంది. గమనించని డ్రైవర్ ట్రిప్పర్‌ను ముందుకు లాగించగా విద్యుత్ స్తంభం విరిగి అక్కడే ఆడుకుంటున్న యశ్వంత్ (4)పై పడింది. తీవ్రగాయాలపాలైన బాలుడ్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించాలని సూచించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేయగా కొన ఊపిరితో ఉన్న బాలుడ్ని తిరిగి గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. యశ్వంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఎంతో ముద్దుగా పెంచాం కుమారులు ఇద్దరిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఇంతలో జరగరాని సంఘటన జరిగిపోయిందని త ల్లితండ్రులు సంతోషి, నాగరాజు బోరునవిలపించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు వారి రోదనను చూసి కంటతడి పెట్టారు. నాగరాజు అన్నయ్య శ్రీను గృహప్రవేశ కార్యక్రమం గురువారం రాత్రే జరగాల్సి ఉండగా.. ఇంతలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తప్పిన ప్రమాదం ప్రమాద సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అదే కండక్టరు వైరు అయితే తీవ్ర నష్టం జరిగేదని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. -
శబరిమల యాత్రలో విషాదం
బాడంగి: శబిరమల యాత్రకు వెళ్తున్న తెలుగు ప్రయాణికుల బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గాజరాయినివలసకు చెందిన 27 మంది యాత్రికుల బృందం ఈ నెల 5వ తేదిన శబిరమలకు బయలు దేరింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడులోని కడలూరు జిల్లాలో బస్సు చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సు ముందు నిల్చొని ఉన్న నల్ల నాగేశ్వర్రావు(42) మీద నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం (బాడంగి) : బాడంగి మండలం రామచంద్రాపురం వద్ద కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి రాయవలస గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ(45)గా గుర్తించారు. సత్యనారాయణ తన గేదెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అనారోగ్యంతో తహశీల్దార్ మృతి
బాడంగి : అనారోగ్యంతో బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ సోమవారం మృతి చెందారు. వివరాలు.. విజయనగరం జిల్లా బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అతను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రఘరామ్ సోమవారం మృతి చెందారు. -
రుణమాఫీపై చంద్రబాబు మాయ మాటలు
బాడంగి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై మాయ మాటలు చెబుతూ రైతులు, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలు ప్రజా పక్షాన ఉండి సమస్యలపై పోరాటం చేయూలని పిలుపునిచ్చారు. సోమవారం బా డంగిలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యూరు. కార్యకర్తలకు ఏగ్రామంలో ఎలాంటి కష్టం వచ్చినా.. నాయకులు అండగా నిలవాలని సూచించారు. కొం దరి స్వార్థ రాజకీయం వల్లే మండల పరిషత్ స్థానం పోయందన్నారు. పార్టీ బలోపేతానికి వారం రోజుల్లో సభ్యత్వ నమోదులు పూర్తి చేసి కమిటీలను ఎన్నుకోవాలని, తద్వారా కమిటీలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ సమావేశం లో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తెంటు చిరంజీవరావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు పెద్దింటి రామారావు, ఎంపీటీసీ గుణుపూరు స్వామినాయుడు, మాజీ సర్పం చ్ మూడడ్ల సత్యనారాయణ, ఉడమల అప్ఫల నాయు డు, తాన్నసోములు, తదితరులు పాల్గొన్నారు. ఆధార్ పూర్తయ్యూకే పథకాలకు అనుసంధానం చేయూలి బొబ్బిలి: ప్రతి ఒక్కరికీ ఆధార్ నమోదు పూర్తయ్యూకే వాటిని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయూలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరుల తో మాట్లాడారు. ఆధార్ కార్డులుంటేనే ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ పాలకులు, అధికారులు చెబుతున్నారని, ముందు జిల్లాలో ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయన్న దానిపై అధికారులు పరిశీలన చేయాలన్నా రు. పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కా కుం డా వాటిని పథకాలకు అనుసంధానం చేస్తే చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఆధార్ నమో దు చేసుకున్న వారికి కార్డులు అందలేదని చెప్పారు. వారు మళ్లీ తీయించుకోవడానికి కేంద్రాలకు వెళితే ఇప్పటికే తీసేసామంటూ తిర స్కస్తునారని తెలిపారు. అధికారులు మరిన్ని ఆధార్ నమో దు కేంద్రాలను ఏర్పాటు చేయూలని చెప్పారు. -
మళ్లీ ఎయిర్‌పోర్టు హడావిడి
బాడంగి, న్యూస్‌లైన్: బ్రిటిష్ కాలంలో జిల్లాలోని బాడంగి సమీపం లో ఏర్పాటైన ఎయిర్‌పోర్టు తరచూ వార్తల్లోకి రావడంపట్ల ఈప్రాంతప్రజల్లో అసక్తికర చర్చ మొదలైంది. ఇటీవలే రక్షణశాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టరుతో బాడంగి ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై చర్చించి వెళ్లడంతో ఈ వ్యవహారం మరోమారు వార్తల్లోకి వచ్చింది. సుమారు 70 ఏళ్లక్రితం 1943లో అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ అధికారు లు రైతుల నుంచి సుమారు 300ఎకరాలను సేకరించి 100 ఎకరా ల్లో రన్‌వేను నిర్మించారు. రెండేళ్లుగా రక్షకదళ అధికారు లు ఆకస్మికంగా రావడం వేలాది ఎకరాల భూములు కావాలని రెవెన్యూ శాఖను కోరడం, హెలి కాప్టర్లపై ఏరియల్ సర్వే నిర్వహించడం కొన్నాళ్లపాటు తిరిగి ఆప్రసక్తే లేకపోవడం వంటి పరిణామాలు స్థాని కులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎక్కడ వేలా ది ఎకరాల జిరాయితీ భూములను వదులుకోవాల్సి వస్తుందోనని గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందోనని అభద్రతా భావంతో కాలం వెళ్లదీస్తున్నారు. రెవెన్యూ శాఖను ఇదేవిషయమై ప్రశ్నించగా భుములు సర్వేచేసి అప్పగించాలన్న లిఖితపూర్వక ఆదేశాలేవీ తమకు రాలేదని చెబుతున్నారు. గతంలో ఇలాగే 2600 ఎకరాలు కా వాలని మాటగా చెప్పారని అయితే సర్వేనంబర్ల అధారంగా దిక్కులవారీగా కచ్చితమైన కొలతలతో సర్వేచేసి అప్పగించాలన్న ఆదేశాలు లేనందున అదిశగా ప్రయత్నం జరగలేదని వారు చెప్పారు.ప్రస్తుతం ఇక్కడి రన్ వే బీట లువారి శిథిలావస్థకు చేరుకుంటోంది. రన్‌వే వృ థాగా పడి ఉండడంతో రైతులకు పంటకళ్లాలుగా ఉపయోగపడుతోంది. వరిచేలు,అపరాలు వంటి పంటల ను ఆరబెట్టుకుంటూ నూర్పులు చేసుకుంటున్నారు.