మళ్లీ ఎయిర్‌పోర్టు హడావిడి
Published Sat, Nov 30 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
బాడంగి, న్యూస్‌లైన్: బ్రిటిష్ కాలంలో జిల్లాలోని బాడంగి సమీపం లో ఏర్పాటైన ఎయిర్‌పోర్టు తరచూ వార్తల్లోకి రావడంపట్ల ఈప్రాంతప్రజల్లో అసక్తికర చర్చ మొదలైంది. ఇటీవలే రక్షణశాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టరుతో బాడంగి ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై చర్చించి వెళ్లడంతో ఈ వ్యవహారం మరోమారు వార్తల్లోకి వచ్చింది. సుమారు 70 ఏళ్లక్రితం 1943లో అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ అధికారు లు రైతుల నుంచి సుమారు 300ఎకరాలను సేకరించి 100 ఎకరా ల్లో రన్‌వేను నిర్మించారు. రెండేళ్లుగా రక్షకదళ అధికారు లు ఆకస్మికంగా రావడం వేలాది ఎకరాల భూములు కావాలని రెవెన్యూ శాఖను కోరడం, హెలి కాప్టర్లపై ఏరియల్ సర్వే నిర్వహించడం కొన్నాళ్లపాటు తిరిగి ఆప్రసక్తే లేకపోవడం వంటి పరిణామాలు స్థాని కులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఎక్కడ వేలా ది ఎకరాల జిరాయితీ భూములను వదులుకోవాల్సి వస్తుందోనని గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందోనని అభద్రతా భావంతో కాలం వెళ్లదీస్తున్నారు. రెవెన్యూ శాఖను ఇదేవిషయమై ప్రశ్నించగా భుములు సర్వేచేసి అప్పగించాలన్న లిఖితపూర్వక ఆదేశాలేవీ తమకు రాలేదని చెబుతున్నారు. గతంలో ఇలాగే 2600 ఎకరాలు కా వాలని మాటగా చెప్పారని అయితే సర్వేనంబర్ల అధారంగా దిక్కులవారీగా కచ్చితమైన కొలతలతో సర్వేచేసి అప్పగించాలన్న ఆదేశాలు లేనందున అదిశగా ప్రయత్నం జరగలేదని వారు చెప్పారు.ప్రస్తుతం ఇక్కడి రన్ వే బీట లువారి శిథిలావస్థకు చేరుకుంటోంది. రన్‌వే వృ థాగా పడి ఉండడంతో రైతులకు పంటకళ్లాలుగా ఉపయోగపడుతోంది. వరిచేలు,అపరాలు వంటి పంటల ను ఆరబెట్టుకుంటూ నూర్పులు చేసుకుంటున్నారు.
Advertisement
Advertisement