బాడంగి (విజయనగరం) : విద్యార్థులను సత్ప్రవర్తన కలిగినవారుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడే నిర్భయ కేసులో ఇరుక్కున్నాడు. ఒక అమాయకురాలిని ప్రేమ పేరుతో వలలో వేసుకొని శారీరక సంబంధం పెట్టుకొని తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి తప్పించుకోజూసినందుకు ఆయనపై బాడంగి పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా బొబ్బలి సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం ఆనవరం గ్రామానికి చెందిన ఒక యువతి మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న కిళ్లాడ లచ్చన్న అనే ఉపాధ్యాయునితో ప్రేమలోపడింది.
మూడేళ్లుగా వారు ప్రేమించుకొంటున్నారు. శారీరక సంబంధం పెట్టుకోగా అమ్మాయి పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అమ్మాయి గురువారం రాత్రి పొలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేయగా బొబ్బిలి సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయునిపై నిర్భయ కేసు
Published Fri, Sep 16 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement
Advertisement