శబరిమల యాత్రలో విషాదం | 1 died in sabarimala tour | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రలో విషాదం

Published Thu, Dec 10 2015 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

1 died  in sabarimala tour

బాడంగి: శబిరమల యాత్రకు వెళ్తున్న తెలుగు ప్రయాణికుల బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గాజరాయినివలసకు చెందిన 27 మంది యాత్రికుల బృందం ఈ నెల 5వ తేదిన శబిరమలకు బయలు దేరింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడులోని కడలూరు జిల్లాలో బస్సు చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సు ముందు నిల్చొని ఉన్న నల్ల నాగేశ్వర్‌రావు(42) మీద నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement