sabarimala tour
-
అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తూ..
సాక్షి, చెన్నై : దైవ దర్శనం చేసుకుని వస్తున్న వారు అనంత లోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. వివరాలు.. తమిళనాడులోని దిండివనం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల నుంచి వస్తున్న బస్సును, లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో ముగ్గురు అయ్యప్ప భక్తులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని చిత్తూరు జిల్లా ఊత్తుకోట, నాగులాపురం, సత్యవేడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శబరిమల యాత్రలో విషాదం
బాడంగి: శబిరమల యాత్రకు వెళ్తున్న తెలుగు ప్రయాణికుల బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గాజరాయినివలసకు చెందిన 27 మంది యాత్రికుల బృందం ఈ నెల 5వ తేదిన శబిరమలకు బయలు దేరింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడులోని కడలూరు జిల్లాలో బస్సు చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సు ముందు నిల్చొని ఉన్న నల్ల నాగేశ్వర్రావు(42) మీద నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. -
స్కేట్స్ పై శబరి యాత్ర
కాలుష్యరహిత సమాజమే లక్ష్యం జోగిపేట పాలిటెక్నిక్ విద్యార్థి రాహుల్ జోగిపేట: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఎం. రాహుల్ స్కేటింగ్ పై శుక్రవారం శబరిమల కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు స్థానిక అయ్యప్ప దేవాలయంలో పూజలను నిర్వహించారు. అనంతరం తలకు హెల్మెట్ ధరించి స్కేటింగ్ పై బయలుదేరిన ఆయనకు స్థానికులు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు. ఆయున బయులుదేరేముందు విలేకరులతో మాట్లాడుతూ.... కాలుష్య నివారణే ధ్యేయంగా తాను స్కేటింగ్ పై దూర పాంత్రాలకు వెళ్తుతన్నట్లు తెలిపారు. గత ఏడాది కూడా శబరి యాత్ర స్కేటింగ్ పై చేసినట్లు ఆయన తెలిపారు. శబరి యాత్రకు స్కేటింగ్ పై వెళ్లి.. రైలులో తిరిగి వస్తానన్నారు. తన మిత్రులు సాయిబాబా, రాకేష్‌లు తనతోకలిసి ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు.