
సాక్షి, చెన్నై : దైవ దర్శనం చేసుకుని వస్తున్న వారు అనంత లోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. వివరాలు.. తమిళనాడులోని దిండివనం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల నుంచి వస్తున్న బస్సును, లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌లో ముగ్గురు అయ్యప్ప భక్తులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని చిత్తూరు జిల్లా ఊత్తుకోట, నాగులాపురం, సత్యవేడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment