
స్కేట్స్ పై శబరి యాత్ర
కాలుష్యరహిత సమాజమే లక్ష్యం
జోగిపేట పాలిటెక్నిక్ విద్యార్థి రాహుల్
జోగిపేట: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఎం. రాహుల్ స్కేటింగ్ పై శుక్రవారం శబరిమల కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు స్థానిక అయ్యప్ప దేవాలయంలో పూజలను నిర్వహించారు. అనంతరం తలకు హెల్మెట్ ధరించి స్కేటింగ్ పై బయలుదేరిన ఆయనకు స్థానికులు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.
ఆయున బయులుదేరేముందు విలేకరులతో మాట్లాడుతూ.... కాలుష్య నివారణే ధ్యేయంగా తాను స్కేటింగ్ పై దూర పాంత్రాలకు వెళ్తుతన్నట్లు తెలిపారు. గత ఏడాది కూడా శబరి యాత్ర స్కేటింగ్ పై చేసినట్లు ఆయన తెలిపారు. శబరి యాత్రకు స్కేటింగ్ పై వెళ్లి.. రైలులో తిరిగి వస్తానన్నారు. తన మిత్రులు సాయిబాబా, రాకేష్‌లు తనతోకలిసి ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు.