'సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి' | kiran kumar reddy should be resigned, demands sujay krishna ranga rao | Sakshi
Sakshi News home page

'సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి'

Published Thu, Oct 3 2013 3:07 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

kiran kumar reddy should be resigned, demands sujay krishna ranga rao

విజయనగరం: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీమాంధ్రాలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతరమైన నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఉద్యమాలతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారుతుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానకి తహతహలాటడం సరికాదన్నారు.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్ నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత సమైక్యాంధ్ర ఉద్య మం మరింత ఉధృతమైందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ర్టంలో ఏ జేఏసీ అయినా సమైక్యాంధ్ర కోసం ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతుగా తమ పార్టీ మొద టి సంతకం చేస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన మరోసారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement