దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా రోగులకు ఉచితంగా వైద్యసేవలతో పాటు మం దులు పంపిణీ చేయడం అభినందనీయమని
ఉచిత వైద్యం అభినందనీయం
Dec 16 2013 3:54 AM | Updated on Oct 9 2018 7:11 PM
వేపాడ, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా రోగులకు ఉచితంగా వైద్యసేవలతో పాటు మం దులు పంపిణీ చేయడం అభినందనీయమని వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రం వేపాడలో ఎస్.కోట నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీస్పెషాలిటీ మెగా వైద్య శిబిరాన్ని సుజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు సహకారం అందిస్తున్న వైద్యులను సుజయ్ అభినందించారు.
నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఎనిమిది కౌంటర్లలో 11 మంది వైద్యులు పాల్గొని 2,358 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్.కోటనియోజకవర్గ సమన్వయకర్తలు వేచలపు వెంకట చినరామునాయుడు, గేదెల తిరుపతి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహమాన్, ఎస్.కోట మండల కన్వీనర్ ఎస్.సత్యం మోపాడ నాయు డు, ఎస్.సత్యనారాయణ, కోళ్ల కృష్ణ, ఎం. అప్పారావు, వై.మాధవరావు, విక్టరీ హై స్కూలు కరస్పాండెంట్ దాలినాయుడు, వావిలపాడు సర్పంచ్ బీల రాజేశ్వరీ, ఎన్.శ్రీనివాసరావు, జి.సన్నిబాబు, ఎన్.సింహాచలం, వెంకట రమణ, కర్రి అప్పలనాయుడు, సన్యాసినాయుడు, దేబార్కి కిరణ్ పాల్గొన్నారు. వైద్యులు లోక్‌నాథ్, అచ్చింనాయుడు, ఆదిలక్ష్మి, దేముడుబాబు,పైడిపతిరావు, వసుంధర, రమాదేవి, నవీన్‌కుమార్‌వైద్యసేవలు అందించారు.
ఓట్ల కోసమే విభజన..
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు విమర్శించారు. వైద్య శిబిరం అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం పెడితే అధికార కాంగ్రెస్‌ను కాపాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కు అయ్యారని విమర్శించడం హాస్యాస్పదం గా ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పార్టీలను ప్రజలు ఇప్పటికే గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీకి పట్టం కట్టడం ఖాయమన్నారు.
Advertisement
Advertisement