విజయవాడకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ఫ్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ గురువారం బొబ్బిలికోటను సందర్శించారు.
బొబ్బిలి: విజయవాడకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ఫ్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ గురువారం బొబ్బిలికోటను సందర్శించారు. ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు, సోదరుడు రామకృష్ణ రంగారావు(రాంనాయనలు) ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. దర్బార్‌మహల్‌లోని అలనాటి వస్తువులను వీక్షించారు. అప్పటి సంస్థానం, పరిపాలన, రాజులు క్రీడల్లో వినియోగించినవి, వివిధ సందర్భాల్లో వేటకు వె ళ్లినప్పుడు వేటాడిన జంతువుల గురించి సుజయ్ సోదరుడు రాంనాయన వివరించారు.
అలాగే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు, బొబ్బిలి సంస్థానాదీశులు, సిపాయిలు వినియోగించిన తుపాకీలు, బల్లేలు, ఖడ్గం వంటి వాటి గురించి తెలియజేశారు. బొబ్బిలి రాజులు 1960వ సంవత్సరంలో పండించిన చె రుకును, వాటి వివరాలను తెలుసుకున్నారు. సంస్థానం సమయంలో వినియోగించిన పల్లకి, ఇతర వస్తువులను చూశారు. అనంతరం ఎమ్మెల్యే సోదరుడు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు( బేబినాయన) వచ్చి మరికొన్ని విషయాలను వివరించారు.