koneru prasad
-
కోనేరు ప్రసాద్ కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందాలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రదీప్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని సంగీత దర్శకుడు మణిశర్మ సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ వెంకన్న దర్శనానికి వచ్చారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కూడా ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేరు ప్రసాద్ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో పూజలు నిర్వహించారు. -
కోటలో ‘కోనేరు’
బొబ్బిలి: విజయవాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఫ్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ గురువారం బొబ్బిలికోటను సందర్శించారు. ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు, సోదరుడు రామకృష్ణ రంగారావు(రాంనాయనలు) ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. దర్బార్‌మహల్‌లోని అలనాటి వస్తువులను వీక్షించారు. అప్పటి సంస్థానం, పరిపాలన, రాజులు క్రీడల్లో వినియోగించినవి, వివిధ సందర్భాల్లో వేటకు వె ళ్లినప్పుడు వేటాడిన జంతువుల గురించి సుజయ్ సోదరుడు రాంనాయన వివరించారు. అలాగే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు, బొబ్బిలి సంస్థానాదీశులు, సిపాయిలు వినియోగించిన తుపాకీలు, బల్లేలు, ఖడ్గం వంటి వాటి గురించి తెలియజేశారు. బొబ్బిలి రాజులు 1960వ సంవత్సరంలో పండించిన చె రుకును, వాటి వివరాలను తెలుసుకున్నారు. సంస్థానం సమయంలో వినియోగించిన పల్లకి, ఇతర వస్తువులను చూశారు. అనంతరం ఎమ్మెల్యే సోదరుడు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు( బేబినాయన) వచ్చి మరికొన్ని విషయాలను వివరించారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పాముల ఉమాదేవి
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పాముల ఉమాదేవి ఆపార్టీకి సోమవారం రాజీనామా చేశారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు ప్రసాద్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోనేరు ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
విజయవాడ లోక్‌సభకు కోనేరు ప్రసాద్ నామినేషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ల పర్వం మంగళవారం ఊపందుకుంది. అందులోభాగంగా విజయవాడ లోక్‌సభ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్ర ప్రసాద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి పి.విశ్వరూప్, విజయనగరం లోక్‌సభ స్థానానికి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీ నాయన) నామినేషన్ వేశారు. అలాగే చిత్తూరు అసెంబ్లీ స్థానానికి జంగాలపల్లి శ్రీనివాసులు, శ్రీకాకుళం నరసన్న పేట అసెంబ్లీ స్థానానికి ధర్మాన కృష్ణదాస్, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానానికి తెల్లం బాలరాజు, విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి దాడి రత్నాకర్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట అసెంబ్లీ స్థానానికి చెంగల వెంకట్రావు, కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ స్థానానికి డా.దుట్టా రామచంద్రరావు , చిత్తూరు జిల్లా మదనపల్లి అసెంబ్లీ స్థానానికి దేశాయి తిప్పారెడ్డిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. -
'విజయవాడ అభివృద్ధికి బ్లూ ప్రింట్ '
విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్ స్థానానికి తీసుకు వస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం కోనేరు ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ నగరాభివృద్ధి కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు చెప్పారు. విజయవాడ నగరాన్ని రాజకీయ నాయకులు ఇప్పటి వరకు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. నగరాభివృద్ధికి గతంలో నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. విజయవాడ నగరం వల్ల నాయకులు అభివృద్ధి చెందారు. కానీ విజయవాడ అభివృద్ధి చెందలేదని కోనేరు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
' అభివృద్ధికి ఆమడ దూరంలో బెజవాడ'
రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ నగరం కీలకపాత్ర పోషిస్తుందని, అయితే ఆ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ శనివారం విజయవాడలో తెలిపారు.అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను విజయవాడ పంపారని చెప్పారు. విజయవాడ నగరాన్ని హెల్త్ టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన విజయవాడ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ముఫ్పై ఏళ్లపాటు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా పని చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలోని అన్ని రంగాలలో ప్రొఫిషనల్స్‌ను గ్రూప్‌గా తయారు చేసి విజయవాడను అభివృద్ధి చేస్తానన్నారు. -
ఏ పార్టీని విమర్శించే అజెండా మా పార్టీకి లేదు
విజయవాడ: ఏ పార్టీని విమర్శించే అజెండా వైఎస్సార్ సీపీకి లేదని ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోనేరు ప్రసాద్ లు స్పష్టం చేశారు. ప్రజలకు ఏంచేస్తామో, అదే చెబుతూ తమ పార్టీ ముందుకు వెళుతుందన్న వారు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో వెళుతున్న నేతలపై అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వెళుతున్న వలస నేతలపై ఆపార్టీ నేతలే సందేహం వ్యక్తం చేస్తున్నారన్న సంగతిని గుర్తు చేశారు. కొత్త పార్టీలు రోజుకొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని భావించే వివిధ పార్టీల నేతలు తమ పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. -
'పార్టీలన్నీ జగన్‌ను టార్గెట్ చేస్తున్నాయి'
రాష్ట్రంలో అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏకైక ఎజెండాగా పెట్టుకున్నాయని ఆ పార్టీ నేతలు కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. బుధవారం విజయవాడలో కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని వారు జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించే సత్తా ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని పేర్కొన్నారు. -
'మాటలు చెప్పను - చేసి చూపిస్తాను'
విజయవాడ: తాను మాటలు చెప్పనని, చేతల్లో చూపిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు ప్రసాద్ చెప్పారు. ఆయన నిన్న వైఎస్ఆర్ సిపిలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్న తాను, రాజకీయాల్లోకి వచ్చి సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంకా అధ్వాన్నమైన స్థితిలోనే ఉందని చెప్పారు. విజయవాడ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ సీపీ సారథ్యం తప్పనిసరని అన్నారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన కోనేరు ప్రసాద్