
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరిన కోనేరు ప్రసాద్
విజయవాడ: తాను మాటలు చెప్పనని, చేతల్లో చూపిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు ప్రసాద్ చెప్పారు. ఆయన నిన్న వైఎస్ఆర్ సిపిలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్న తాను, రాజకీయాల్లోకి వచ్చి సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంకా అధ్వాన్నమైన స్థితిలోనే ఉందని చెప్పారు. విజయవాడ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ సీపీ సారథ్యం తప్పనిసరని అన్నారు.