విజయవాడ లోక్సభకు కోనేరు ప్రసాద్ నామినేషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ల పర్వం మంగళవారం ఊపందుకుంది. అందులోభాగంగా విజయవాడ లోక్సభ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్ర ప్రసాద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్సభ స్థానానికి మాజీ మంత్రి పి.విశ్వరూప్, విజయనగరం లోక్సభ స్థానానికి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీ నాయన) నామినేషన్ వేశారు.
అలాగే చిత్తూరు అసెంబ్లీ స్థానానికి జంగాలపల్లి శ్రీనివాసులు, శ్రీకాకుళం నరసన్న పేట అసెంబ్లీ స్థానానికి ధర్మాన కృష్ణదాస్, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానానికి తెల్లం బాలరాజు, విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి దాడి రత్నాకర్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట అసెంబ్లీ స్థానానికి చెంగల వెంకట్రావు, కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ స్థానానికి డా.దుట్టా రామచంద్రరావు , చిత్తూరు జిల్లా మదనపల్లి అసెంబ్లీ స్థానానికి దేశాయి తిప్పారెడ్డిలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.