ఏ పార్టీని విమర్శించే అజెండా మా పార్టీకి లేదు | we do not want to blame any party | Sakshi
Sakshi News home page

ఏ పార్టీని విమర్శించే అజెండా మా పార్టీకి లేదు

Published Thu, Mar 13 2014 2:24 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

ఏ పార్టీని విమర్శించే అజెండా మా పార్టీకి లేదు - Sakshi

ఏ పార్టీని విమర్శించే అజెండా మా పార్టీకి లేదు

విజయవాడ: ఏ పార్టీని విమర్శించే అజెండా వైఎస్సార్ సీపీకి లేదని ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోనేరు ప్రసాద్ లు స్పష్టం చేశారు. ప్రజలకు ఏంచేస్తామో, అదే చెబుతూ తమ పార్టీ ముందుకు వెళుతుందన్న వారు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో వెళుతున్న నేతలపై అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వెళుతున్న వలస నేతలపై ఆపార్టీ నేతలే సందేహం వ్యక్తం చేస్తున్నారన్న సంగతిని గుర్తు చేశారు.

 

కొత్త పార్టీలు రోజుకొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని భావించే వివిధ పార్టీల నేతలు తమ పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement