
సాక్షి, హైదరాబాద్: హిందూజా సంస్థ తన డబ్బుతో 11 ఎకరాల్ని జగన్ పరం చేసిందన్న ఆరోపణపై బహిరంగ చర్చకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు సవాల్ విసిరారు. చంద్రబాబు నిజంగా నారావారిపల్లెలో పుట్టి ఉంటే చర్చకు సిద్ధపడాలన్నారు. ఈ విషయంలో జగన్ ప్రమేయం ఉందని, ఆ భూమిని అనుభవిస్తున్నారని, ఆయన పేరు మీద రిజిస్టర్ అయినట్టుగా నిరూపించే సాక్ష్యాధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు.
సాక్ష్యాధారాలు చూపనిపక్షంలో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా చంద్రబాబు వ్యవహారం తయారైందన్నారు. హిందూజా సంస్థకు భూములకు సంబంధించి ఎల్లో మీడియా వండి వార్చిన కథనం గురించి చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడు తున్నారని, ఎల్లో మీడియాను నమ్ముకుని ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని మండిప డ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు. మరో 26 రోజుల్లో చంద్రబాబు చెంప పగులగొట్టే తీర్పును ఏపీ ప్రజలు ఇవ్వబోతు న్నారని, అయినా ఆయనకు సిగ్గురావట్లేదన్నారు.