
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. శుక్రవారం జూ పార్కు సమీపంలోని ఓ లాడ్జీలో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ నిర్వహించారు. బర్త్‌డే పార్టీ పేరున ముగ్గురు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తూ కలకలం సృష్టించారు. యువకులతో పాటు లేడీ డ్యాన్సర్లు హుక్కా, పూటుగా మద్యం సేవించి అసభ్య నృత్యాలు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించిన కాలాపత్తర్ పోలీసులు ముగ్గురు ముజ్రా డ్యాన్సర్లను, ఆరుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు.