Hyderabad City
-
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
-
భాగ్యనగరంలో భూకంపం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు
-
కుట్టు.. ఫొటో ఆకట్టు..
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సందర్భాలను పదిలపరుచుకుంటారు. కొందరు వీడియోల రూపంలో దాచుకుంటే మరికొందరు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటారు. పుట్టిన పిల్లలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి సంవత్సరం విభిన్నంగా ఫొటో షూట్స్ చేసుకుంటున్నారు. అందరిలాగే మనం ఎందుకు ఉండాలని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి కదా.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్తున్నారు. అలా సాధారణ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కొత్త లుక్ తీసుకొస్తారు. చీరలకు, జాకెట్లకు, డ్రెస్‌లకు ఎంబ్రాయిడరీ వర్క్స్ తరహాలోనే.. ఫొటోలకు ఎంబ్రాయిడరీ ఏంటని ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తున్నారు. అవును ఈ సరికొత్త ట్రెండ్ గురించే ఈ కథనం... ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇటీవల నగరంలో ఫేమస్ అవుతోంది. చాలా ఏళ్ల నుంచి ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పనితీరు ట్రెండింగ్‌లో ఉండగా, తాజాగా మన నగరంలోకి వచి్చంది. పెళ్లి ఫొటోలు, బర్త్‌డే ఫొటోలు, బేబీ బంప్ సందర్భంగా తీసిన ఫొటోలను ఫ్రేమ్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోవాలనుకునే వారు.. నార్మల్‌గా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఫొటోలకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి తగిలించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఫొటోలకే కాకుండా ఇంటికి కూడా సరికొత్త కళ వస్తోందని కస్టమర్లు అంటున్నారని నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ చెబుతున్నాడు. ఎంబోజ్ వంటి ప్రింటింగ్‌తో కూడా ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావొచ్చని, అయితే దానికన్నా ఎంబ్రాయిడరీకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా ఇంట్లో తగిలించుకునే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో ఎక్కువ మంది ఇలాగే అడుగుతున్నారని పేర్కొన్నాడు. ఎలా చేస్తారు..? సాధారణంగా పెళ్లి ఫొటోలు లేదా ప్రత్యేక అకేషన్లలో దిగిన ఫొటోలను బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్లో ప్రింట్ చేస్తారు. మనకు కావాల్సిన పరిమాణంలో ప్రింట్ తీసుకున్నాక.. మనకు కావాల్సిన మోడల్లో ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కలర్ ఫొటోల వెనుక తెలుపు రంగులో ఫొటో పేపర్‌ను అతికించి, దానిపై ఫ్రేమ్ మాదిరిగా, ఫ్లవర్స్ లేదా మరేదైనా మనకు కావాల్సిన డిజైన్ హ్యాండ్‌తో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేసుకున్న డ్రెస్ కానీ, ధరించిన పూల దండలు, నగలను మాత్రమే హైలైట్ చేస్తూ రంగురంగుల దారాలతో అల్లుతారు. దీంతో ఫొటోకు సరికొత్త కళ వస్తుందని చెబుతున్నారు. కాస్త సమయం పట్టినా.. సాధారణంగా ఫొటో ఎడిటింగ్, ప్రింటింగ్ నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఎంబ్రాయిడరీకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సైజును బట్టి.. ఫొటోపై కుట్టాల్సిన ఎంబ్రాయిడరీని బట్టి సమయం తీసుకుంటున్నారు. ఒక్క ఫొటో పూర్తి చేసేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని ఓ షాప్ నిర్వాహకుడు వివరించాడు. సాధారణ ఫొటోలతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువ అయినా గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ఫొటో ఎంబ్రాయిడరీని ఎంచుకుంటున్నారని చెబుతున్నాడు.బహుమతులకు పర్ఫెక్ట్.. ఫొటో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ నగరంలో కొత్తగా వచి్చంది. ఎంబోజ్, గ్లిట్టర్ వంటి ఫొటో ప్రింటింగ్ టెక్నాలజీని ఆల్బమ్‌లు రూపొందించేందుకు ఎక్కువగా వాడుతుంటాం. వీటితో ఆల్బమ్‌కు, ఫొటోలకు మంచి లుక్ వస్తుంటుంది. అయితే ఫొటో ఎంబ్రాయిడరీని ఆల్బమ్‌లో పెట్టడం కాస్త కష్టం. అందుకే చాలా మంది ఫొటో ఫ్రేమ్స్ చేయించుకునేందుకు ఫొటో ఎంబ్రాయిడరీ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పెళ్లి వంటి శుభకార్యాల్లో గిఫ్ట్‌గా ఇచ్చేందుకు దీన్ని ఎంచుకుంటున్నారు. చూసేందుకు బాగుండటమే కాకుండా రిచ్‌గా, సరికొత్తగా ఉంటోందని చెబుతున్నారు. :::బీసు విష్ణుప్రసాద్, ఫొటోగ్రాఫర్ ::: సాక్షి, సిటీబ్యూరో -
ట్రాఫిక్ లోనే సగం జీవితం.. కొవ్వొత్తిలా కరిగిపోతున్న సమయం.. సమస్య తీరేది ఎప్పుడు..?
-
మైనర్ కారు డ్రైవింగ్.. యువతి బలి
-
హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణం ఇదే
-
అక్కడే నిలబడకోయ్.. కాస్త ఉరకవోయ్..
పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అంటారు పెద్దలు. అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ప్రస్తుతం భాగ్యనగరంలో రన్నింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు రావడం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో అనేక రకాల అరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌తో ఒళ్లు కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనలు, ఫిట్నెస్ ట్రైనర్స్ సలహాల మేరకు నగర వాసులు పరుగులు పెడుతున్నారు..ఈ నేపథ్యంలో దీని గురించి పలు ఆసక్తికర అంశాలు... ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోతోంది. బుర్రనిండా ఆలోచనలతో గజిబిజి గందరగోళాల నడుమ ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారు నగరవాసులు. అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య విషయాలపై నగర ప్రజల్లో అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ ట్రెండ్ కాస్తా హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒక్కో సమస్యపై అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ నిర్వహించి పలువురిని భాగస్వాములను చేసుకుంటున్నాయి.సమస్యలపై అవగాహన కలి్పస్తూ.. యువతలో ప్రస్తుతం అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి వాటిపై అవగాహన లేక వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు నగరంలో తీవ్రతరం అవుతున్నాయి. మత్తుకు బానిసలవుతూ యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. సిగరెట్, గుట్కాలు తింటూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఇలాంటి సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకోసమే పలు ఆస్పత్రులు, సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.సాఫ్ట్వేర్ కంపెనీల్లో.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నైట్ డ్యూటీలు, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి తగ్గించేందుకు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు మారథాన్ నిర్వహిస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు తోటి ఉద్యోగులతో సరదాగా ఉంటూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. వ్యాధులపై ప్రచారానికి.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు జీవన శైలి వ్యాధులపై అవగాహన కలి ్పంచేందుకుకు నగరంలోని చాలా ఆస్పత్రులు మారథాన్ నిర్వహిస్తున్నాయి. మారథాన్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నాయి. ఇదే దారిలో చాలా సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ చారిటీ చేస్తున్నాయి. దీంతో రెండు రకాలుగా మారథాన్ ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు కూడా అప్పుడప్పుడూ మారథాన్ నిర్వహిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. డ్రగ్స్‌పై అవగాహన కలి ్పంచేందుకు ఇటీవల తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. దీనిద్వారా కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు కాళాశాలలు మారథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు పలు అంశాల గురించి వివరిస్తున్నారు.రన్నింగ్‌తో ఎన్నో లాభాలు రన్నింగ్ చేస్తే శారీరక, మానసిక లాభాలు ఎన్నో ఉన్నాయి. 2010లో ఆర్మీలో చేరాను. పుణేలో ఉన్నప్పుడు మా కోచ్ సలహాతో మారథాన్‌లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. 2013 నుంచి మారథాన్‌లో పాల్గొంటూ వస్తున్నా. దేశ, విదేశాల్లో ఎక్కడ మారథాన్ జరిగినా వెళ్లి పాల్గొంటా. ఇటీవల ముంబైలో జరిగిన మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించా. ఢిల్లీలో జరిగిన మారథాన్‌లో సిల్వర్ పతకం వచి్చంది. రేపు జరగబోయే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చాను. మారథాన్‌లో పాల్గొనేందుకు రోజూ కనీసం 30 కిమీ చొప్పున వారానికి 160– 180 కిమీ పరుగెడుతూ సాధన చేస్తుంటాను. రన్నింగ్‌తో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. – శ్రీను బుగత, బంగారంపేట, విజయనగరంఎన్నో పాఠాలు నేరి్పస్తుంది.. మారథాన్ అనేది పరుగు మాత్రమే కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాలు తెలుస్తాయి. సవాళ్లను స్వీకరించడం ఎలాగో తెలియజేస్తుంది. నలుగురితో కలిసి జీవిస్తే వచ్చే ప్రయోజనాలను గురించి నేరి్పస్తుంది. భారత్‌లో గత పది, పదిహేనేళ్ల నుంచి మారథాన్ ట్రెండ్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల్లో కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీన్నొక సామాజిక పండుగలా సంబరంగా జరుపుకొంటున్నారు. – రాజేశ్ వెచ్చా, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఫౌండర్ అద్భుతమైన అనుభూతి.. మారథాన్‌లో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి ఉంటుంది. తోటి ఉద్యోగులతో మారథాన్‌లో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పటివరకూ దాదాపు 10 మారథాన్లలో పాల్గొన్నాను. రన్నింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ కూడా వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది. – మహేశ్‌రెడ్డి మోదుగు, ఐటీ ఉద్యోగి -
వినూత్నం.. వియత్నాం కాఫీ
పొద్దున లేవగానే కాఫీ తాగనిదే చాలామందికి తెల్లారదు. కప్పులో అలా వేడి వేడి కాఫీ మన ముందుంటే ఆ పొగలతో వచ్చే ఆ వాసన చూస్తుంటే మనల్ని మనమే మైమరిచి పోతాం. పొట్టలో ఓ కప్పు కాఫీ పడితే ఉంటుంది గురూ.. ఆ లెవలే వేరు. మెదడు కూడా అంత వేగంగా పనిచేస్తుంది. చకచకా పనులు అయిపోతాయంతే.. ఇంక వేరే మాటే ఉండదు. కొందరికేమో ఇన్స్టంట్ కాఫీ అంటే ప్రాణం. మరికొందరు ఫిల్టర్ కాఫీ అంటే పడి చచి్చపోతారు. ఇంకొందరికేమో కోల్డ్ కాఫీ అంటే పిచ్చి. ఇలా జిహ్వకో రుచి అన్నట్టు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన టేస్ట్.భాగ్యనగరం అంటేనే పలు రుచులకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో దొరికే అనేక రుచులు మన నగరవాసులకు దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇటీవల మన నగరంలో ఓ కొత్త రుచి క్రేజ్‌ను సంతరించుకుంటోంది.. దీంతో పాటు నగర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది.. దాని గురించి తెలుసుకుందాం.. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్.. కోల్డ్ కాఫీ నగరంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. అందులోనూ వియత్నాం కాఫీ నగరంలో మరింత ఫేమస్ అయిపోతోంది. నగర యువత ఈ కాఫీని లొట్టలేసుకుంటూ తాగేస్తోంది. ఒకప్పుడు ఇరానీ చాయ్.. ఇప్పుడు కోల్డ్ కాఫీ.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రియమైన పానీయం టీ, కాఫీలే అయినా.. వైవిధ్యమైన రుచి ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్ టేస్టీ చాయిస్ అని చెప్పొచ్చు. విభిన్న రుచులు.. వియత్నాం కాఫీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎగ్ కాఫీ, యోగర్ట్ కాఫీ, కోకోనట్ వియత్నమీస్ కాఫీ, వైట్ కాఫీ, కాఫెసురా, ఐస్డ్ బ్లాక్ కాఫీ, వియెట్ కాఫీ, లైబేరికా కాఫీ, కులీ కాఫీ, చెర్రీ కాఫీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కోల్డ్ కాఫీల్లో కూడా కుకుంబర్ టానిక్, యాపిల్ కాఫీ యేల్, కివీ టానిక్ కాఫీ, స్పానిష్ లాటే ఇలా విభిన్నమైన రుచులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వాలనుకున్నా.. గర్ల్ ఫ్రెండ్‌తో జాలీగా గడపాలనుకున్నా ఎంచక్కా మాంచి కాఫీ షాప్‌కి వెళ్లి రెండు వియత్నాం కాఫీలు ఆర్డర్ చేసి లాగించేయండి. అథ్లెట్స్, జిమ్ చేసే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏదైనా సరే రోజుకు ఓ మోతాదులో తీసుకుంటేనే మంచిదని, అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వియత్నాం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. శక్తిని పెంచడమే కాకుండా రన్నింగ్, జాగింగ్, వ్యాయామాలు మరింత ఎక్కువగా చేసేందుకు దోహదపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు మెదడుకు మంచి చేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జ్ఞాపక శక్తి పెంచుతుంది. దీంతోపాటు ఎక్కువ విషయాలు నేర్చుకునేలా చేయడం, మానసిక సంతోషాన్ని ఇవ్వడంతో పాటు డిప్రెషన్ తగ్గించడం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడంతో, నిద్ర సరిగ్గా పట్టడంలో తోడ్పడుతుంది.నా సోల్‌మేట్.. కాఫీ అంటేనే అద్భుతం. ఇక కోల్డ్ కాఫీ అంటే మహా అద్భుతం. ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే నన్ను నేనే మైమరిచిపోతాను. కాఫీ తాగిన తర్వాత అరగంట వరకూ ఏమీ తినను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలనేది నా భావన. చల్లచల్లటి కాఫీ తాగుతుంటే మస్తు మజా వస్తుంది. మంచి లొకేషన్లో కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. స్నేహితులు తోడైతే అనుభూతి వేరే లెవల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాఫీ నా సోల్‌మేట్. బేగంపేటలోని పంచతంత్ర కాఫీ షాప్‌కి వారానికోసారి వెళ్లి కాసేపు కూర్చుని కాఫీ తాగుతుంటే భలే సరదాగా ఉంటుంది. :::మంజీర ఆరెట్టి, ప్రకాశ్‌నగర్, బేగంపేట స్వచ్ఛమైన కాఫీ అందించాలని.. కాఫీ ప్రియులకు అచ్చమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన కాఫీ అందించాలనే ఆలోచనతో పంచతంత్ర కేఫ్ ఏర్పాటు చేశాం. కాఫీతో పాటు యాంబియెన్స్ కూడా బాగా ఉండేలా ప్రయత్నించాం. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడమే మా ప్రాధాన్యం. ::: విక్రమ్, పంచతంత్ర కేఫ్ -
హైదరాబాద్ ను కుమ్మేసిన కుండపోత వర్షం
-
జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు..
-
హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం
-
హైదరాబాద్ లో మోత మోగుతున్న ఇళ్ల అద్దెలు
-
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్‌తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్‌యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్‌తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్‌తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్‌యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్‌లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి వానలు
-
రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మేడ్ ఇన్ చైనా!
సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్‌లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. టాస్క్‌లకు రూపమిచ్చేది చైనాలో.. ఈ ఫ్రాడ్‌లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్‌లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్‌లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్‌లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్‌లు రూపొందిస్తున్నారు. చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి... ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను బాధితులు డౌన్లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు. రెండు యాప్‌ల ద్వారా దుబాయ్ నుంచి.. చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్‌లో ఉంటున్నారు. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్‌లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది. లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్‌లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్‌కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్‌లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్‌టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్‌లోని వాళ్లు చూడగలుగుతున్నారు. క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు... బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్‌లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్‌కు రూ.10 కమీషన్‌గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్‌లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్‌ను దుబాయ్‌లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్‌లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అప్రమత్తం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నగరవాసులను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరకు 040-29555500కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. -
ఎల్బీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం
-
హైదరాబాద్ లో జీరో షాడో డే
-
హైదరాబాద్ లో మళ్ళీ దంచికొట్టిన వర్షం
-
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ
పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. -
హైదరాబాద్ లో వికటించిన వెయిట్ లెస్ ట్రీట్ మెంట్
-
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
-
ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇంతే.. తనిఖీలెక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, మంత్రులు, అధికారులు ప్రకటించడం పరిపాటిగా మారింది. అంతకుమించి ఆ తర్వాత చర్యలుండటం లేవు. భవనాలు కూలినా అంతే. అగ్నిప్రమాదాలు జరిగినా అదే వైఖరి. తాజాగా సికింద్రాబాద్ మినిస్టర్రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జనావాసాల మధ్య అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన గోడౌన్లు, తదితరమైన వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. గత సంవత్సరం బోయగోడలో స్క్రాప్గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించినప్పుడు సైతం ఇలాంటి ప్రకటనలే చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏంచేశారో ఎన్ని భవనాలు తనిఖీలు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం వెల్లడించలేదు. అప్పట్లో హోంమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందో తెలియదు. గోడౌన్లు, షోరూమ్‌లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్‌ల దాకా అదే పరిస్థితి వేటికీ నిబంధనల మేరకు సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు అసలే ఉండవు. గత సంవత్సరమే ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లోనూ జరిగిన అగ్ని ప్రమాదాలు నగర ప్రజలింకా మరచిపోలేదు. చర్యలేవీ? జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అగ్నిప్రమాదాలు జరిగితే ఎక్కువ మందికి అపాయం జరిగే బార్లు, పబ్‌ల వంటివాటిపై తొలుత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వాటి తర్వాత హోటళ్లు, హాస్పిటళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నగరంలో, చుట్టుపక్కల దాదాపు 20వేలకు పైగా గోడౌన్లే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం పదిశాతం భవనాలకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. గతంలో నగరంలోని భవనాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం– పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను బృందాలుగా ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించి, ఫైర్‌సేఫ్టీ లేని భవనాలపై చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం ఫైర్‌సేఫ్టీ విభాగమైనా చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు. జీహెచ్ఎంసీలో ఫైర్‌సేఫ్టీతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారాలు ఉన్న విభాగం కూడా.. ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
Fire Accident: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? ప్రమాద సమయంలో కాపాడేందుకు సరైన అగ్నిమాపక వ్యవస్థ నగరంలో అందుబాటులో లేదా?.. అంటే అవుననే నిరూపిస్తున్నాయి అగ్ని ప్రమాద ఘటనలు. సికింద్రాబాద్ పరిధిలోని ‘డెక్కన్ కార్పొరేట్’ గురువారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మంటల తీవ్రత అధికంగా ఉంది. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించినా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఫైర్ సిబ్బంది స్పందించడం, తగిన పరికరాలతో రంగంలోకి దిగడం అత్యంత ప్రధానమైంది. అలా చేస్తే మంటలను అదుపులోకి తేవడంతోపాటు ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అగ్నిమాపక సిబ్బందికి తగిన సమర్థత ఉంటున్నా.. కొన్నిసార్లు అందుబాటులో సరైన పరికరాలు లేకపోవడంతోనూ వారు ఆశించిన రీతిలో స్పందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖలోని కొందరు లంచావతారుల కారణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు అలవోకగా లభిస్తున్నాయి. నగరంలో కేవలం రెండంటే రెండు మాత్రమే బ్రాంటో నిచ్చెనలు ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌లో ఈ నిచ్చెలను అంత్యంత కీలకమైనవి. కింది అంతస్థుల్లో మంటలు, పొగ వ్యాపించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఈ భారీ నిచ్చెనల ద్వారా పై అంతస్తులకు చేరే వీలుంటుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడి వారిని సురక్షితంగా కిందకు చేర్చడంలోనూ ఈ భారీ నిచ్చెనలు ఉపయోగపడాయి. ప్రస్తుతం ఉన్న రెండు బ్రాంటో నిచ్చెనల్లో ఒకటి సికింద్రాబాద్ పరిధిలో, మరోటి మాదాపూర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. మంజూరు మంజూరు చేసినా.. అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న బ్రాంటో నిచ్చెనకు అదనంగా మరో 101 మీటర్ల బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు ప్రభుత్వం మంజూరు లభించింది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
అగ్ని ప్రమాదాలతో భయపడుతున్న జంటనగరాలు
-
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం
-
హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు: మైక్రోసాఫ్ట్
కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్ మజారీ తెలిపారు. -
సనత్ నగర్ లో లోకో పైలట్ వాసవి అదృశ్యం
-
హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ సోదాలు
-
బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. 12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్‌ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్‌కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు. ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్ టోల్ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ (చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..) -
హైదరాబాద్ లో భోగి మంటల వెలుగులు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
హైదరాబాద్ లో మళ్లీ తెరపైకి డ్రగ్స్
-
హైదరాబాద్ భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం
-
హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ తనిఖీలు
-
కార్ రేసింగ్ షో
-
హైదరాబాద్ లో అర్ధరాత్రి కుంభవృష్టి
-
కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
భాగ్యనగరంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
హైదరాబాద్ లో గంట గంటకు మారుతున్న వాతావరణం
-
హైదరాబాద్ లో కనిపించని బంద్ ప్రభావం
-
బస్సు.. గుస్సా! ప్రజా రవాణాపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ ప్రాంతానికి రావాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నచందంగా మారింది నగరంలో ఆర్టీసీ సర్వీసుల పరిస్థితి. పది వేల జనాభా ఉన్న సింగపూర్ టౌన్‌షిప్‌నకు రెండేళ్లుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెల్లారి లేస్తే అంతా ఉద్యోగాలకు వెళ్లేవారే. రెండేళ్లుగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు, పిల్లలు, ఈ టౌన్‌షిప్‌నకు వచ్చే బంధుమిత్రులు అవస్థల పాలవుతున్నారు. తాజాగా ఈ రూట్లో బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడుస్తాయా లేదా అనేది సందేహమే. ఒక్క సింగపూర్ టౌన్షిప్ మాత్రమే కాదు. గ్రేటర్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు లేవు. 10 ట్రిప్పులు నడపాల్సిన రూట్లలో కేవలం 3 లేదా 4 ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాల వైపు వెళ్లాల్సివస్తోంది. పదేళ్లుగా కొత్తవి పత్తా లేదు.. ► హైదరాబాద్ మహానగర జనాభా సుమారు కోటిన్నరకు చేరువైంది. ఔటర్‌ను దాటి నగరం విస్తరిస్తోంది. ఏటా వందలాది కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. ప్రజా రవాణా నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే కనీసం 6వేల బస్సులు అవసరం. 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ► అదే సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సుల సంఖ్య సగానికి తగ్గింది. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 2500కు పరిమితమైంది. మూడేళ్ల క్రితం 850 సిటీ బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరి కొన్నింటికి కాలం చెల్లింది. బస్సుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఉన్న వాటిలోనూ కొన్ని డొక్కు బస్సులే. కానీ కొత్త వాటిని కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్నవాటితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు. గణనీయంగా తగ్గిన ట్రిప్పులు ► గత పదేళ్లలో ఆర్టీసీ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు అన్ని రూట్లలో ట్రిప్పుల సంఖ్య పెరగాల్సి ఉండగా భారీగా తగ్గిపోయింది. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పులు తిరిగాయి. అంటే సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు నడిచాయి. ► నిజానికి పెరుగుతున్న జనాభాకు ఈ సదుపాయం తక్కువే. 2015 నాటికే కనీసం 60 వేల ట్రిప్పులకు పెరగవలసి ఉండగా అందుకు భిన్నంగా కనీసం 10 వేల ట్రిప్పులు తగ్గాయి. ‘ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది. మా బస్సెక్కాల్సిన వాళ్లు ఇతర వాహనాల్లో వెళ్లడం బాధగానే ఉంటుంది. కానీ బస్సులే తగినన్ని లేనప్పుడు ఏం చేయగలం’అని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ► ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి కొత్త బస్సులు వచ్చినా కొంతమేరకు ప్రయాణికులకు ఊరట లభించనుంది. ‘కొత్త బస్సులు కొనుగోలు చేయకపోతే ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకమవుతుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ కంటే ముందే సిటీ బస్సు కుదేలైంది. కోవిడ్‌తో పూర్తిగా నష్టపోయింది. పెరిగిన డీజిల్ ధరలు మరింత దారుణంగా దెబ్బతీశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తే ఖర్చు రూ.4.5 కోట్లు దాటుతోంది. రోజుకు కనీసం రూ.కోటి నష్టం. ఈ నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతున్నారే తప్ప బస్సుల సంఖ్య పెంచడంలేదు. ‘మెట్రో’ తారకమంత్రం కాదు.. మెట్రో రైలు ప్రజా రవాణాకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాబోదు. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు సిటీ బస్సు ఒక్కటే పరిష్కారమని సిటిజనులు చెబుతున్నారు. రోజుకు రెండు ట్రిప్పులే జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఉద్దమర్రికి గతంలో రోజుకు 6 ట్రిప్పులు ఉండేవి. ఇప్పుడు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయి. విద్యార్థులు బాగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సత్తిరెడ్డి, ఉద్దమర్రి ఎట్టకేలకు స్పందించారు సింగపూర్ టౌన్‌షిప్‌నకు రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా బస్సులను నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు ఇప్పుడు వేశారు. – వెంకట్ మాధవ రెడ్డి, సింగపూర్ టౌన్షిప్ -
డ్రగ్స్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
క్రీస్తు జనన వేళ ప్రపంచవ్యాప్తంగా వేడుకలు
-
హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు
-
అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: 2017లో 325.. 2018లో 428.. 2019లో 1393.. ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికే 2456.. ఓ పక్క సైబర్ నేరాలు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో సిబ్బంది మాత్రం అరకొరగా 58 మందే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే నెట్టుకు వస్తుండటంతో పనిభారం పెరిగిపోతోంది. ఓ పక్క ఈ ఠాణాలో నానాటికీ పెరుగుతున్న ఫిర్యాదులు, కేసుల్ని సమర్థంగా విచారించడం/దర్యాప్తు చేయడం కోసం అదనపు సిబ్బందిని కేటాయిస్తూనే.. పోలీసుస్టేషన్ల స్థాయిలోనూ సైబర్ క్రైమ్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2021లో అయినా ఈ దిశగా అడుగులు పడాలని నగరవాసులు కోరుతున్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులే.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లలో సీసీఎస్ ఆ«దీనంలో సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2010లో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ కేటాయించింది. ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌కు ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించేలా.. సహకరించడానికి ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. గడిచిన పదేళ్లలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ ప్రజలనే కాదు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్‌తో పాటు నైజీరియన్ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ తదితరాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్‌తో పాటు ఎస్ఎమ్మెస్, ఈ–మెయిల్ ఫ్రాడ్స్ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ఫిర్యాదులు.. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్ ఫ్రాడ్స్‌తో పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటిషన్లు వస్తున్నాయి. గతేడాది 325 కేసులు నమోదు కాగా.. ఆరు వేల పిటిషన్లు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 2,456 కేసులు నమోదు కాగా.. ఏడు వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్‌ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారిపోయింది. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్ యాప్‌ల్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్(ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్ వ్యూవర్ సహా వివిధ రకాలైన యాప్స్‌ను డౌన్లోడ్ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్ సెంటర్ ఫ్రాడ్స్ కేసులది మూడో స్థానం. పోలీసుస్టేషన్లలో టీమ్స్ అవశ్యం.. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జోనల్ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే పోలీసుస్టేషన్లలోనే టీమ్స్ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాటు. ఈ ఏడాది బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ కంపెనీ అకౌంట్ టేకోవర్ స్కామ్‌లో రూ.2.09 కోట్లు పోగొట్టుంది. అలాగే అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్‌లో రూ.6 వేలు కోల్పోయాడు. ఈ రెండు కేసులూ సైబర్ క్రైమ్ పోలీసులే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పోలీసుస్టేషన్లలో ఉండే యూనిట్స్ చిన్నచిన్న కేసుల్ని పర్యవేక్షించేలా రూపొందించాలి. భారీ మొత్తాలు, సంచలనాత్మక కేసుల్ని మాత్రమే ఈ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలి. అన్ని పోలీసుస్టేషన్లలోనూ యూనిట్లనూ సీసీఎస్ ఆధీనంలో ఉంచి, తరచూ శిక్షణ ఇస్తుండాలి. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ అధికారులు దాదాపు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటి వరకు వీటికి మోక్షం లభించలేదు. పోలీసుస్టేషన్లలో యూనిట్ల ఏర్పాటు అంశమూ ఇలా కాకుండా 2021లో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన వారే నిందితులుగా.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దురి్వనియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మార్కెట్ ప్లేస్, ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్పూర్.. ఓటీపీ ఫ్రాడ్‌స్టర్స్‌కు జార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్‌కాల్స్ ఆధారంగానే వీళ్లు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్ నేరాలు చేసే వాళ్లు పశి్చమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్‌లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. ఈ కారణంగానే అనునిత్యం సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన ఓ టీమ్ ఉత్తరాదిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. నేరుగా మూసేయడమూ సాధ్యం కాదు.. ఈ సైబర్ నేరగాళ్లు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్ నంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్‌గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు. ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్ అయ్యే వాటిని సైబర్ క్రైమ్ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్ చేయడానికీ ఆస్కారం లేదు. దర్యాప్తు నిమిత్తం ఒకటి రెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించిన తర్వాతే ఈ క్లోజర్‌కు ఆస్కారం ఉంటుంది. ఓ పక్క సిబ్బంది కొరత.. మరోపక్క పెరుగుతున్న నేరాలతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఠాణాలో కేసుల పెండెన్సీ ఎక్కువవుతోంది. ఇవీ సిటీ సైబర్ ఠాణా సిబ్బంది వివరాలు ఏసీపీ: 1, ఇన్స్పెక్టర్లు: 7, ఎస్సైలు: 13 కానిస్టేబుళ్లు, హెడ్–కానిస్టేబుళ్లు: 33 హోంగార్డులు: 4, మొత్తం: 58 -
జర్నలిస్టులపై కరోనా పంజా!
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కు చేరింది. వరుసగా గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పాత సచివాలయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జర్నలిస్టులు, కొందరు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా సోకినట్టు ఆదివారం ఫలితాలొచ్చాయి. ఇంతకు ముందటి మూడు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు వ్యాధి సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా వ్యాధి బారినపడిన జర్నలిస్టుల సంఖ్య 70కు చేరిందని జర్నలిస్టుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఓ తెలుగు వార్తా చానల్లో పనిచేసిన మనోజ్‌కుమార్ అనే జర్నలిస్టు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. సచివాలయంలో మరొకరికి.. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. -
బోసిపోయిన పట్టణ ప్రధాన కూడళ్లు
-
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
నిశీధి వేళలో.. నిశ్శబ్ద నగరి
సాక్షి, హైదరాబాద్: జన జీవనం ఉలిక్కపడ్డ రోజు రాత్రి చీకటి ఘనీభవించింది. రహదారులపై లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నా క్రీనీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మృగాళ్ల మరణవార్త తెల్లవారు జామునే నలు‘దిశ’లా పాకడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరం ఊరేగింపయింది. పగలంతా సందడిగా ఉన్నా.. అర్ధరాత్రి వేళ మాత్రం ఏ రోడ్డులోనూ ‘భరోసా’ కనిపించలేదు. ‘దిశ’ ఉదంతం ఇంకా వణికిస్తూనే ఉంది.. రాత్రితో పాటే భయం కూడా పాకుతూనే ఉంది. ‘దిశ’ హంతకులను అంతమొందించిన శుక్రవారం రాత్రి నగరం ఎలా ఉంది? ప్రత్యేకించి రాత్రి 11.30 నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు జనజీవనం ఏ విధంగా ఉందో? తెలుసుకునేందుకు ‘సాక్షి’ నగరంలోని పలు ప్రాంతాల్లో ‘నైట్ విజిట్’ నిర్వహించింది. అక్కడక్కడా ఆగిన పోలీసు వాహనాలు, ఫుడ్స్ట్రీట్స్లో యువకుల సందడి కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో నిబ్బరంగా, నిశ్చింతగా రాకపోకలు సాగించే మహిళల జాడ మాత్రం కనిపించలేదు. ఓ సంఘటన తర్వాత భాగ్యనగర వీధుల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్ ప్రధాన రహదారిని గతంలో మహిళా పారిశుధ్య కార్మికులు ఎవరికి వారు వేర్వేరుగా శుభ్రం చేసేవారు. కానీ శుక్రవారం అర్ధరాత్రి 12.05కు మాత్రం ముగ్గురు, నలుగురు కలిసి జట్టుగా ఒకేచోట రోడ్డు ఊడ్చే పనిలో ఉన్నారు. వారిని పలకరిస్తే.. ‘ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారు’ అంటూ గత సంఘటనలను గుర్తు చేశారు. ‘దిశ’ ఉదంతం తర్వాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మ అనే కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరం నిద్ర పోతున్న వేళ.. ఆ విశేషాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.. ⇒ గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ 1.50 శంషాబాద్ వైపు నుంచే వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కూడలి నుంచి భారీ వాహనాలు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్ల రాకపోకలతో బిజీగా ఉంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో తెల్లవారు జామున 2 గంటలకు బండరాళ్ల టిప్పర్ల రాకపోకలతో బిజీగా ఉంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 20 టిప్పర్లు బండరాళ్ల లోడ్‌తో వెళ్లాయి. టిప్పర్లతో పాటు లారీలు, వాటర్ ట్యాంకర్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ⇒ అమీర్‌పేట మెట్రోస్టేషన్ 12.05 మెట్రోస్టేషన్ ప్రధాన రహదారిని పారిశుధ్య మహిళా కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఒక టీమ్‌గా ఊడుస్తున్నారు. ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘దిశ’ ఉదంతం తరువాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మలు వాపోయారు. నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అమీర్‌పేట చౌరస్తాలో రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులు ⇒ నెక్లెస్‌రోడ్డు..1.10 నెక్లెస్‌రోడ్డులోకి అప్పటికే ప్రవేశాన్ని నిలిపివేశారు. అంతకముందే ఐ లవ్ హైదరాబాద్, జలవిహార్ తదితర చోట్ల బర్త్ డే కేక్ కటింగ్ కోసం చాలామంది నెక్లెస్ రోడ్డులోకి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చే వాహనాలను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సైదులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అయితే కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడాన్ని పోలీసులు గుర్తించారు. నెక్లెస్‌రోడ్డులో యువకులను ప్రశ్నిస్తున్న పోలీసులు ⇒ మూసాపేట వై జంక్షన్.. 11.30 ఇంకా వాహనాల రద్దీ తగ్గలేదు. అటు కూకట్పల్లి వైపు నుంచి ఇటు బాలానగర్ నుంచి వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. మూసాపేట మెట్రోస్టేషన్ సమీపంలో రహదారి చిమ్మచీకటిగా ఉంది. అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద పార్కు చేసిన ఆటోలు ⇒ ఎస్ఆర్నగర్ బస్టాపు వద్ద 11.45 ట్రావెల్స్ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. తాము వెళ్లాల్సిన బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. డీఎల్ఎఫ్ మొదటి, రెండవ గేట్ ముందు ఫుడ్ స్టాళ్ల వద్ద ఐటీ ఉద్యోగులు ⇒ మాదాపూర్ విఠల్‌రావునగర్ 12.00 కరాచీ బేకరీ నుంచి రత్నదీప్ సూపర్ మార్కెట్ వరకు సర్వీస్ రోడ్డులో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బిజీబిజీగా ఉన్నారు. వందలాది మంది ఐటీ ఉద్యోగులు అన్ని రకాల టిపిన్స్, కబాబ్స్, ఐస్‌క్రీమ్, చాట్ రుచి చూస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు వేడి వేడి వంటకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీరంతా దిశ ఎన్‌కౌంటర్‌పై చర్చించుకుంటూ కనిపించారు. చాలామంది ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తూ మాట్లాడుకున్నారు. మాదాపూర్– ఎంసీహెచ్ఆర్డీ జంక్షన్లో టిఫిన్ సెంటర్ వద్ద జనం ⇒ పంజగుట్ట చౌరస్తా .. 12.37 ఎస్ఆర్ టైర్స్‌లో 24 గంటల పాటు పంక్చర్ సేవలు అందిస్తున్నారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పంక్చర్ పడినా తన వద్దకు వస్తే పంక్చర్ వేసేందుకు వెళ్తానని అస్లాం చెప్పుకొచ్చాడు. షిప్టుల వారీగా పగలు ఒకరు, రాత్రి మరొకరు ఇక్కడ పంక్చర్ సేవలు అందిస్తున్నారు. ⇒ ట్యాంక్‌బండ్1.40 లేక్ పోలీసులు పహారా కాస్తున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్ తీరానికి వచ్చేవారిని కాపాడడం వాళ్ల ప్రధాన విధి. ఫజల్ అహ్మద్‌ఖాన్, మహబూబ్ బాషా, పవన్‌కుమార్ ట్యాంక్‌పై విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. హుస్సేన్‌సాగర్ తీరాన బర్త్ డే వేడుక ⇒ రాంగోపాల్‌పేట..1.55 క్లాక్ టవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ కొందరు కార్మికులు సీసీ కెమెరాల కోసం స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. రాంగోపాల్‌పేట్ పాత పోలీస్‌స్టేషన్ రోడ్డులో తాజ్ హోమ్ హోటల్ వద్ద నిద్రిస్తున్న యాచకులు ⇒ ప్యారడైజ్ చౌరస్తా 1.50 ఒక రెస్టారెంట్ ముందు టీ స్టాల్ తెరిచే ఉంది. చాలా మంది అక్కడ టీ తాగుతున్నారు. నగరంలో ఇలా.. రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్‌కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్ ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్ వరకు సాగింది. రాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నల్లగొండ చౌరస్తాలో పోలీస్పెట్రోలింగ్ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో రద్దీగా ఉండే పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్ రూం, లక్డీకాపూల్, మాసాబ్‌టాంక్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1 ప్రధాన రూట్లో జన సంచారం తగ్గింది. చార్మినార్–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్ 6 తో పాటు దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్ – మక్కా మసీదు గ్రానైట్ రోడ్లను శుభ్రం చేశారు. 12.10 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. షంషీర్గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది. చార్మినార్ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది. చార్మినార్ వద్ద 12.30: జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్‌గంజ్ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. 1.55 గంటలకు కంట్రోల్ రూమ్ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు. 2.15 గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నెం.1లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూకనిపించారు. రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్‌కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్ ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్ వరకు సాగింది. uరాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నల్లగొండ చౌరస్తాలో పోలీస్పెట్రోలింగ్ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో రద్దీగా ఉండే పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్ రూం, లక్డీకాపూల్, మాసాబ్‌టాంక్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1 ప్రధాన రూట్లో జన సంచారం తగ్గింది. చార్మినార్–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్ 6 తో పాటు దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్ – మక్కా మసీదు గ్రానైట్ రోడ్లను శుభ్రం చేశారు. 12.10 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. షంషీర్గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది. చార్మినార్ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది. చార్మినార్ వద్ద 12.30: జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్‌గంజ్ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. 1.55 గంటలకు కంట్రోల్ రూమ్ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు. 2.15 గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నెం.1లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూ కనిపించారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ఏపీ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మరో మార్పు చేపట్టిన ప్రభుత్వం మంత్రులు, అధికారుల పేషీల్లో సిబ్బంది కాలపరిమితి విధిస్తూ ఉత్తర్వులు మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయాల్లోని సిబ్బందివి వర్తింపు మూడేళ్లకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగి వరకు వర్తింపు పేషీల్లో బదిలీలకు సంబంధించి నిలుపుదలకు కేవలం సీఎంవోకే అధికారం డిసెంబర్ 31లోగా మార్పుచేర్పులు జరగాలని స్పష్టం చేసిన ప్రభుత్వం ► గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే అక్రమ నిర్మాణమంటూ, భవనం కూల్చివేసి భూమిని సీఆర్డీఏ సరెండర్ చేసుకోవాలని పిటిషన్ సర్వే నెంబర్ 392లో 3.65 ఎకరాల పోరంబోకు భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం 99 సంవత్సరాల పాటు లీజులకు తీసుకున్నట్టు పిటిషన్లో పేర్కొన్న ఆర్కే ఇది అక్రమమని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఆర్కే న్యాయవాది వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను ఇతరులకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్న ఆర్కే గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్ తెలంగాణ ► బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధింపు నగరంలో బైక్ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు నిషేధం ► నేడు భారత్ - వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం స్టేడియం వద్ద 1800 మంది పోలీసులతో భారీ భద్రత అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు వెస్టిండీస్‌తో మొత్తం మూడు టీ20లు ఆడనున్న భారత్ జాతీయం ► బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 27 ఏళ్లు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఉత్తరప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు ఉన్నతాధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు -
32 కాదు.. 28 దంతాలే..
సాక్షి, హైదరాబాద్: చిన్నతనంలో పాలదంతాలు వస్తాయి. 7–9 సంవత్సరాల మధ్యలో ఇవి ఊడిపోయి.. పైన, కింద కలిపి కొత్తగా 28 దంతాలు ఏర్పడతాయి. కానీ బాల్యంలో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల నోటికి సరైన వ్యాయామం ఉండటం లేదు. దీంతో దవడలు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా అమ్మాయిల్లో 16 ఏళ్లు, అబ్బాయిల్లో 18 ఏళ్లు దాటాక పుట్టుకొచ్చే నాలుగు జ్ఞానదంతాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. నేటితరం యువతీ యువకుల్లో 90 శాతం మందికి జ్ఞానదంతాలు లేవు. ఒకవేళ ఉన్నా.. అవి ఎగుడుదిగుడుగా, చిగుళ్లలోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. పిల్లల దవడ సైజు తగ్గడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంత యువతతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. జ్ఞానదంతాలు సరిగా ఏర్పడని వారు ఆహారం తీసుకునేప్పుడు ఆ దంతాలు చిగుళ్లకు గుచ్చుకుని తీవ్రమైన పంటి, తల నొప్పి కలుగుతున్నాయి. ప్రస్తుతం యువతలో వెలుగుచూస్తున్న ఈ సమస్యలకు ఇదే కారణమని సర్వేలో తేల్చారు. మన దంత ఆరోగ్యం అంతంతే! ►విదేశీయులు విధిగా రోజుకు రెండుసార్లు దంతా లు శుభ్రం చేసుకుంటారు. ఇది వారి దినచర్యలో ఒక భాగం. మన దేశంలో నూటికి 90 శాతం మందికి దంత ఆరోగ్యంపై అవగాహన లేదు. ►ఇట్టే కరిగిపోయే చాక్లెట్లు, స్వీట్లు వంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం, రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోట్లో వివిధ రకాల బ్యాక్టీరియా ఏర్పడుతోంది. ►15 నుంచి 30 ఏళ్ల యువతలో 30 – 40% మంది నోటి నుంచి దుర్వాసనతో బాధపడుతుంటే, 60 నుంచి 70 శాతం మంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ►ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి శాతం తగ్గిపోతోంది. దీంతో ‘హెచ్పైలోరే’ అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది. ఏం చేయాలి? ►ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. దీనివల్ల దవడల పరిమాణం పెరుగుతుంది. జ్ఞానదంతాల పుట్టుకకు వీలవుతుంది. ►గట్టిగా ఉన్న కాయలు, పండ్లు, గింజలు మెత్తగా నమలడం వల్ల పంటికి ఎక్సర్సైజ్ అవుతుంది. నోటిలో లాలాజలం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ►రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకుంటే దంత ఆరోగ్యం మెరుగవుతుంది. దంత కేన్సర్‌లో సిటీది మూడో స్థానం ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే దంత కేన్సర్ ఎక్కువ. పొగాకు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే ఇందుకు కారణం. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, బిహార్ ఒకటి, రెండో స్థానాల్లో ఉంటే, హైదరాబాద్ మూడో స్థానంలో నిలుస్తోంది. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారిలో 38 శాతం మంది నోటి కేన్సర్‌తో, 28 శాతం మంది నోటి చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. మనతో పోలిస్తే దంత ఆరోగ్యంపై కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వాసుల్లో అవగాహన ఎక్కువ. – డాక్టర్ బి.చంద్రకాంత్‌రావు, దంత వైద్యనిపుణుడు, మహావీర్ హాస్పిటల్, మాసబ్‌ట్యాంక్ -
నగరంలో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొంది. చలి ప్రభావంతో సాయంత్రమైందంటే చాలు శ్వాసనాళాలు మూసుకుపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇన్హేలర్ సపోర్ట్ లేనిదే ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారింది. నగరంలో 12–15 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండగా... ప్రస్తుత సీజన్లో బాధితుల సంఖ్య 15–20 శాతానికి పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణం స్వైన్‌ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్ఎస్పీఏం అధికం.. గ్రేటర్ పరిధిలో సుమారు 50వేల పరిశ్రమలు ఉండగా.. 55లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణంలో చేరుతున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడైంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం పొగతో కూడిన మంచు కురుస్తోంది. వాతావరణంలో రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఆర్‌ఎస్‌పీఎం)నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో 60 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటరు వరకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5. పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమైదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జాగ్రత్తలు అవసరం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ. ముఖ్యంగా బేగంపేట, బాలానగర్, నెహ్రూ జులాజికల్ పార్క్, జీడిమెట్ల, పంజగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా పరిసరాల్లో నివసించే వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్న శ్వాస సంబంధ సమస్యలకు ఇదే కారణం. వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారక ఉద్గారాలు గాలి ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం, ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని వృద్ధి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం తప్పనిసరి. – డాక్టర్ రఫీ,ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
చలో పల్లె‘టూర్’
-
ఆర్థిక వ్యవస్థపై రోడ్డు ప్రమాదాల ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతపై నగర ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రోడ్లు, రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఖైరతాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్లో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేప్టీ’ పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిమాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 12 లక్షల మంది మరణిస్తున్నారని, 5 కోట్ల మంది గాయపడుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవలసి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తగ్గుతున్న దేశ జీడీపీ.. ప్రమాదాల వలనే 3 శాతం దేశ జీడీపీ తగ్గిపోతుందన్నారు. వాహనాలు నడిపే వ్యక్తి అజాగ్రత్త, సేఫ్టీపై అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి సౌకర్యం సరిగా లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల విద్యలో రోడ్డు భద్రతపై సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా అవగాహన పెంచవచ్చన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో సెలబ్రెటీలు, ప్రముఖులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.. రోడ్డు భద్రత విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినగా అమలు చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు పొల్యూషన్ చెక్ చేసి వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. జాతీయ రహదారులపై అంబులెన్స్‌లు సంఖ్య పెంచాలన్నారు. బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించి వాటిని పూడిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఆర్అండ్బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్‌ల మంజూరులో నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. లైసెన్స్‌లు ఇచ్చినప్పుడే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జానార్ధన్ రెడ్డి, అర్అండ్బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ డీజీపీ కృష్ణ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చార్మినార్ ఘటనలో కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్‌లోని యునాని హాస్పిటల్ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్ కానిస్టేబుల్ పరమేశ్‌ను నగర సీపీ సస్సెండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. -
చార్సౌ సాల్ కాదు.. వేల ఏళ్ల వైభవం
భాగ్యనగరం అనగానే కులీ కుతుబ్‌షా 1591లో నిర్మించిన పట్టణం... అని చరిత్ర చెబుతుంది. మరి అంతకు పూర్వం సంగతేంటి? చరిత్ర పుటలు తిరగేస్తే 1518లో కుతుబ్‌షాహీ పాలన ఆరంభం కాకముందు ఢిల్లీ సుల్తానులు, అంతకు పూర్వం కాకతీయులు, వారికంటే ముందు చాళుక్యుల పాలన.. ఇలా కనిపిస్తాయి. కాకతీయుల కాలం కంటే పూర్వమే గోల్కొండ పట్టణం ఉండేదన్న సంగతిని చరిత్ర చెబుతుంది, కానీ ఎక్కడా ఆధారాలు కనిపించవు. దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే ఈ నగర ప్రాంతంలో మానవ సంచారం ఉందనడానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. రాతి యుగానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఆధారాలు వెలుగు చూడటం సహజమే. కానీ హైదరాబాద్ మహానగరంలో వాటి జాడలు దొరకడం అరుదు. నగరం మధ్య గుండా సాగుతున్న మూసీ నదిలో మూడు వేల ఏళ్ల క్రితం కొత్తరాతి యుగం జాడలు, దాని ఒడ్డున దాదాపు 1,500 ఏళ్ల క్రితం విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ ఉద్దేశిక స్తూపాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ చరిత్ర కొత్త పుటను పరిచయం చేస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. –సాక్షి, హైదరాబాద్ బౌద్ధానికి తెలంగాణ నేలతో ఉన్న అనుబంధం అసాధారణం. బుద్ధుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆయన బతికున్న కాలంలోనే ప్రచారం మొదలైంది తెలంగాణ నుంచే అన్న విషయం ఇప్పుడిప్పుడే ఆధార సహితంగా రూఢీ అవుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బౌద్ధ ఉద్దేశిక స్తూపాలెన్నో విస్తరించి ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రాచుర్యం కల్పించకపోవటంతో మరుగున పడిపోయాయి. ఇప్పుడు బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో కొత్త అన్వేషణ సాగుతుండటం కొంతలో కొంత శుభపరిణామం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్వేషణలోనే హైదరాబాద్ చరిత్రలో పురాతన కోణం వెలుగుచూడటం విశేషం. ఆ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎం.ఎ.శ్రీనివాసన్, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్ మూసీ తీరంలో రెండు రోజుల క్రితం జరిపిన అన్వేషణలో ఆధారాలు వెలుగు చూశాయి. దిల్సుఖ్నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయంలో బౌద్ధం జాడలున్నాయన్న సంగతిని దాదాపు 4 దశాబ్దాల క్రితమే పురావస్తుశాఖ అధికారి పరబ్రహ్మచారి గుర్తించారు. ఇక్కడ దాదాపు ఐదో శతాబ్దం నాటి శాసనాన్ని ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత అన్వేషణ ముందుకు సాగలేదు. తాజాగా బుద్ధవనం తరఫున ఈ ఇద్దరు ఆ దేవాలయం గుట్టపై అన్వేషించే క్రమంలో ఆసక్తికర విషయాలు గుర్తించారు. పెద్దగుండుపై విష్ణుకుండిల కాలానికి చెందిన గోవిందరాజ వర్మ ఏర్పాటు చేసిన శాసనాన్ని గుర్తించారు. ఇదే ప్రాంతంలో రెండు బౌద్ధ ఉద్దేశిక స్తూపాలను గుర్తించారు. సాధారణంగా బౌద్ధ స్తూపాల్లో బుద్ధుడి ధాతువు ఉంటుంది. కానీ ఉద్దేశిక స్తూపాలను నాటి ముఖ్యమైన బౌద్ధ సన్యాసుల స్మారకంగా నిర్మిస్తారు. ఇక్కడ తదనంతర కాలంలో ఏర్పాటు చేసిన ఓ శివలింగంతో కూడిన రాయి దిగువన ఉద్దేశిక స్తూపం ఉన్నట్టు గుర్తించారు. గుట్టకు ఆనుకుని వెనక వైపు ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో భూమిలో కూరుకుపోయి ఉన్న మరో ఉద్దేశిక స్తూపాన్ని గుర్తించారు. చెట్ల పొదలు, కొంత మట్టిని పక్కకు జరపగా వృత్తాకారంలో ఉన్న ఈ స్తూపం కనిపించింది. దాని చుట్టూ మట్టిని తొలగిస్తే ఆ స్తూపం పూర్తి ఆకృతి వెలుగు చూస్తుంది. నగరం నడిబొడ్డున బౌద్ధానికి చెందిన ఉద్దేశిక స్తూపం వెలుగుచూడటం ఇదే తొలిసారి. మూసీ మధ్యలో కొత్తరాతియుగం చిత్రాలు... చైతన్యపురికి సమీపంలోనే ఉన్న మూసీ నది మధ్యలో ఉన్న ఓ భారీ బండరాయి మూడు వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగం మానవ సంచారానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ బండరాయిపై నాటి మానవులు గీసిన ఎరుపు వర్ణం చిత్రం కనిపించింది. దాదాపు మూడు అడుగుల పొడవుతో ఉన్న ఈ చిత్రంలో పశువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. రాతియుగంలో మానవులు సమూహంగా ఉంటూ ఆవాసయోగ్యంగా చేసుకున్న ప్రాంతాల్లో ఇలా చిత్రాలు గీయటం సహజం. నగరంలో కూడా ఇలా ఆవాసాలు ఎన్నో ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణీకరణ క్రమంలో చాలా గుట్టలను క్వారీలతో మాయం చేయటంతో ఈ ఆధారాలు నాశనమయ్యాయి. గండిపేట సమీపంలోని కోకాపేటలో ఓ గుట్టపై ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలున్నాయి. ఆ గుట్టలన్నీ క్వారీల పేరుతో కనుమరుగు కాగా, స్థానికుల చొరవతో ఈ చిత్రాలున్న ఒక్క గుండును మాత్రం వదిలేశారు. అది తప్ప రాక్ పెయింటింగ్స్ నగరంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మూసీ మధ్యలో పెద్ద గుండుపై కనిపించటం ఆసక్తిరేపుతోంది. ఆ చుట్టుపక్కన ఉన్న రాళ్లను జల్లెడ పడితే మరిన్ని చిత్రాలు కనిపించే అవకాశం ఉందని శ్రీనివాసన్ అంటున్నారు. ప్రత్యేక పద్ధతిలో ఆ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించేలా చేయాల్సి ఉంది. నాటి మానవులు ఆయుధాలను నూరుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రూవ్స్ కూడా బండలపై ఉన్నాయి. వెలికితీసి పరిరక్షించాలని మంత్రికి వినతి ఇప్పుడు గుర్తించిన ఉద్దేశిక స్తూపాలను వెంటనే వెలికి తీసి పరిరక్షించాలంటూ బుద్ధవనం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండురోజుల క్రితం గుర్తించిన ఆధారాల వివరాలను హెరిటేజ్ తెలంగాణ విభాగం అధికారులకు, మంత్రి శ్రీనివాసగౌడ్‌కు అందజేశారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి స్తూపాలను పూర్తిగా వెలికి తీయాలని కోరారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగు చూస్తాయని శ్రీనివాసన్ అంటున్నారు. ఇది హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన విషయం అయినందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. -
నిందితులు కాదు.. బాధితులే: సినీ సెలబ్రెటీలపై సిట్ రిపోర్ట్
-
డ్రగ్స్‌కేసు : సినీ సెలబ్రిటీలకు క్లీన్ చీట్!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్ రిపోర్ట్‌లో పేర్కొంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. దీంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. అయితే చార్జిషీట్లలో సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసినట్టు సమాచారం. కేసులో హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : డ్రగ్స్‌కేసు : సినీ సెలబ్రెటీలు నిందితులు కాదు.. బాధితులే.. -
విశ్వనగరానికి పక్కా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరాన్ని అసలు సిసలు విశ్వనగరం (గ్లోబల్ సిటీ)గా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటి సమస్య లను ముందుగానే అంచనావేసి పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర ‘మాస్టర్ ప్లాన్’రూపొందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సన్నద్ధం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్లో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్‌లో రాష్ట్ర కేబినెట్ మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ నగర సమగ్రాభివద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తోపాటుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరాభివృద్ధికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిధులతోపాటు ఇతరత్రా నిధులను కూడా సమకూరుస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పనిపూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తామని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న నగరం, ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ఉన్న నగరం, ట్రిపుల్ ఆర్ అవతల విస్తరించే నగరం ఇలా మూడు యూనిట్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. పెరుగుతున్న వలసలకు తగ్గట్లుగా.. ‘హైదరాబాద్ శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్యపూర్వక జీవనం, పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలిరావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్‌కు తరలుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలరీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశాలు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే.. నగర జీవితం నరకప్రాయం కాక తప్పదు’అని సీఎం పేర్కొన్నారు. నాడు స్వర్గమే.. కానీ నేడు! ‘నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అని హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్‌షా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. రాన్రానూ పరిస్థితి మారిపోయింది. మూసీ మురికితో నిండిపోయింది. నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం మరింత దుర్భరంగా మారడం ఖాయం. అందుకే మనమంతా ఇప్పుడే మేల్కోవాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి దానికి తగ్గట్లుగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అమలు చేయాలి’అని కేసీఆర్ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ‘హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంతుంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై ఓ స్పష్టమైన నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లుగా ఏం చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఢిల్లీ, బెంగళూరులతోపాటు చైనా రాజధాని బీజింగ్ కూడా ప్రస్తుతం జనజీవనానికి అనుకూలంగా లేదు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే మనకు కూడా విషమ పరిస్థితులు తప్పవు. నగర ప్రజల జీవితాన్ని సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది’అని సీఎం చెప్పారు. పచ్చదనం పెరగాలి ‘హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండీఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. దీంతో నగరంలో పచ్చదనం కరువవుతోంది. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరమంతా కాలుష్యమయం అవుతుంది. అందుకే అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. 1.50 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి. హైదరాబాద్ నగరాన్ని ఓఆర్ఆర్ లోపలున్న నగరం, ఓఆర్ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ వరకుండే నగరం, ట్రిపుల్ ఆర్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీలను ప్లాన్ చేసి వీటికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కేబినెట్ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు. సిటీ జనాభా పెరుగుతోంది! ‘నగరాలకు వలసలను ఆపలేం. అనేక అనుకూలతలున్న హైదరాబాద్‌కు వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు. పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడం ఒక్కటే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి. వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఒక్క హెచ్ఎండీఏకి సాధ్యం కాదు. మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది’అని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనచారి పాల్గొన్నారు. -
పంజాగుట్టలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ క్రైమ్ : పంజాగుట్టలోని ఓ వైన్ షాపులో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న డ్యూ పాయింట్ వైన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చెలరేగుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారుగా రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు. -
పండులో..విషముండు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పీల్చే గాలి, తాగే నీరే కాదు.. ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతరరసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది. కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాన పౌడర్‌తో పాటు ఎసిటలిన్ గ్యాస్, కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది. ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది. మోతాదు మించితే ప్రమాదం మార్కెట్లో పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు పలువురు వ్యాపారులు చైనా పౌడర్, ఎసిటలిన్ గ్యాస్, ఫాస్పరస్, ఆర్సెనిక్ తదితర మూలకాలున్న రసాయనాలను వాడుతున్నారు. పైగా ఆయా రసాయనాలను అతిగా వినియోగిస్తుండడంతో పరిస్థితి చేయిదాటుతోంది. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఇథిలిన్ గ్యాస్‌ను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు. పండ్లను మగ్గబెట్టే ఛాంబర్లో ఈ గ్యాస్ మోతాదు 100 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) యూనిట్లకు మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. కానీ చాలామంది వ్యాపారులు ఈ నిబంధనను పాటించడంలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి గ్యాస్‌ను నేరుగా పండ్లకు తగలకుండా పేపర్లో చుట్టిన తరవాతనే గ్యాస్‌ను ప్రయోగించాలి. అయితే ఈ నిబంధనకు కూడా చాలామంది వ్యాపారులు నీళ్లొదిలి నేరుగా వాడుతున్నట్టు గుర్తించారు. ఇంకొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కంప్రెస్డ్ ఇథిలిన్ గ్యాస్, ఇథనాల్, ఇథోపాన్ వంటి రసాయనాలను అవసరాన్ని మించి వినియోగిస్తున్నారని, ఇది నేరుగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. అమ్మో చైనా పౌడర్ హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్‌ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా నగరంలో పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ దాడుల్లో బయటపడింది. ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. ఈ పండ్లలోనే ప్రమాదకర రసాయన ఆనవాళ్లు అధికంగా ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. కొనే ముందు పరిశీలించాలి.. ♦ మార్కెట్లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి. ♦ యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు. ♦ పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి. ♦ సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి. -
'ఢీ'హెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత అసెంబ్లీని గురువారం రద్దు చేస్తారనే సంకేతాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం జీహెచ్ఎంఈయూ–టీఆర్ఎస్ కేవీ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ప్రవేశ ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు, నాయకులు అక్కడకు వెళ్లకుండా కార్యాలయ అన్ని గేట్లను మూసివేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ససమిరా అనడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా జీహెచ్ఎంసీలోని 20 వేల పైచిలుకు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తారని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, వారు ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని వెళ్లిపోతే, వారినే నమ్ముకున్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారన్నారు. అయితే నాలుగున్నర ఏళ్లయినా హామీలను అమలు చేయలేదన్నారు. ఇంత కాలం ప్రభుత్వం ఉందని, తమకు న్యాయం చేస్తుందన్న భరోసాతో ఉన్నామని, ఇప్పుడు తమ గతేంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ తమను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రగతి భవన్‌కు వెళుతుంటే పోలీసులు వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన బహుమతి ఇదని వేదన వ్యక్తం చేశారు. సమ్మెలో అన్ని విభాగాల కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి పారిశుధ్య కార్మికులతో సహా వెటర్నరీ, రవాణా, ఉద్యానవన, తదితర అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ప్రకటించారు. సేవలు చేసే పేద కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కంటే మరింత ఎక్కువగా తమ సత్తా చాటుతారన్నారు. తమకు జరిగే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.. టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. దీనిపై యూనియన్ నేతలు స్పందిస్తూ తమది కార్మికులకు అనుబంధమైన సంస్థ అని, పదవులపై తమకు ఆశలు లేవన్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ కలసి ఉండమని ప్రకటించారు. కార్మికుల జీవితాలు బాగుపడతాయనే ఆశతో టీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పోలీసులను ఉసిగొలిపిన వారు రేపట్నుంచి వారితోనే తమ డ్యూటీలు చేయించుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల కోసం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా ఆ ప్రస్తావన రాకపోవడం బాధాకరమన్నారు. నేటి నుంచి జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో.. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా గురువారం నుంచి కార్మికులు విధులను బహిష్కరించనున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. శుక్రవారం నుంచి పర్మనెంట్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన తమ డిమాండ్లు నెరవేర్చాలని ఐఎన్టీయూసీ అనుబంధ విభాగం ఆ«ధ్వర్యంలో కార్మికులు బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శనకు దిగారు. ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మికుల వేతనాలు రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా కార్మికులు ఉదయం నుంచి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించడంతో అధికారులు, ఉద్యోగులు మేయర్ ద్వారం నుంచి కార్యాలయం లోనికి వెళ్లారు. -
కదిలిస్తే కన్నీటి వరదే..
ఉప్పల్: లుంబిని పార్కు, గోకుల్ చాట్ దుర్ఘటన జరిగి 11 ఏళ్లు గడిచినా వారి కుటుంబ సభ్యులు నేటికీ ఆ పేరు గుర్తు చేస్తే ఉల్లిక్కి పడుతున్నారు. ఎవరిని కదలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన గాదే అంజయ్య, వెంకటలక్ష్మిల కూతురు స్రవంతి(14), చిన్నమ్మ సుశీల(30), అంజయ్య అన్న కూతురు శ్రీలేఖ(19)తో కలసి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కొనేందుకు వెళ్లి షాపింగ్ అనంతరం గోకుల్ చాట్‌కు వెళ్లారు. వారు లోపల ఉండగానే బాబు పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సుశీల(30), శ్రీలేఖ(19), స్రవంతి(14) ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వారు భయపడుతున్నారు. ఆలస్యమైనా కఠినశిక్ష పడాల్సిందే.. ‘ఆలస్యమైనా తప్పుచేసిన నిందితులకు మాత్రం కఠిన శిక్షపడితేనే మరణించిన వారి అత్మలకు శాంతి కలుగుతుంది. గత 11 సంవత్సరాలుగా నిందితులకు రాజభోగాలు అందించడం చూసి బాధేసింది. వారికోసం రూ. కోట్లు ఖర్చు చేసారు. మాకు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మాటను ప్రభుత్వం దాటవేసింది. నింధితులను కోర్టుకు తీసుకు వచ్చినప్పుడల్లా రాజులా సెక్యూరిటీ మధ్యలో తీసుకువస్తుంటే బాధ పడ్డాం. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. అయినా పర్వాలేదు.. బాద్యులందరినీ ఉరికంభం ఎక్కించాల్సిందే’ అని మృతురాలు స్రవంతి తండ్రి అంజయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు అంటే భయమేస్తుంది.. ‘రాఖీ పండగ అంటే మా కుటుంబంలో భయంతో కూడిన విషాదం కనబడుతుంది. నేరాలు చేసినవారు రాజాలా బతుకుతున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలే వారి జ్ఞాపకాలతో రోదిస్తున్నాయి. నిందితులకు అప్పటికప్పుడే శిక్ష వేయ్యాలే తప్పా 11 ఏళ్లుగా కేసులను నానబెట్టారు. ఏం సాదించింది.. కేవలం ఇద్దరికే శిక్ష ఖరా>రు చేసింది. విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారు. చాలా బాధగా ఉంది’ అని గోకుల్ చాట్ ఘటనలో మృతిచెందిన సుశీల సోదరి చంద్రకళ ఆవేదన చెందింది. ఇప్పటికీ సుశీల కుమారుడు సాయికుమార్ నిద్రలో భయంతో కలవరిస్తాడని కన్నీటి పర్యంతమైంది. -
ఐస్‌క్రీం భామ సూపర్!
-
మ్యూజియంపై పట్టున్నవారి పనేనా!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హిజ్ ఎక్సాల్టెడ్ హైనెస్(హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో దొంగతనాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 10 టాస్క్ ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మ్యూజియం మీద పట్టు ఉన్న వ్యక్తులే పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో స్టార్ సెక్యూరిటీ ద్వారా మ్యూజియంలో గతంలో సెక్యూరిటీగా పని చేసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రూప్ 9 సెక్యూరిటీని కూడా విచారిస్తున్నారు. నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి అత్యంత విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైన విషయం తెలిసిందే. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో నిజాం పాలకులు వాడిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. ప్రతిరోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని సిబ్బంది మూసివేశారు. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గ్యాలరీలకు తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మ్యూజియాన్ని తెరిచి చూడగా దొంగతనం వెలుగు చూసింది. రెండో గ్యాలరీలో ఉన్న డైమండ్ టిఫిన్ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్లు కనిపించలేదు. మ్యూజియం వెనుకాల ఉన్న వెంటిలేటర్లను విరగ్గొట్టి లోనికి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు మ్యూజియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించాయి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మ్యూజియాన్ని సోమవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. మ్యూజియానికి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. -
క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ (సీపీఏహెచ్) ఏర్పాటుతో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం అపెక్స్ కమిటీ సభ్యులతో నూతనంగా నియమితులైన స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఏహెచ్ ఏర్పాటుతో పాటు, హెచ్ సీఏలో ఉన్న లోపాలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. త్వరలోనే ఎలక్టోరల్ అధికారిని నియమించి అతని ఆధ్వర్యంలో సీపీఎహెచ్ ఏర్పాటు కోసం ఎలక్షన్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ మధ్యలో ఎలక్షన్స్‌ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీపీఏహెచ్ ఏర్పాటయ్యేంత వరకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్లో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండబోదని అన్నారు. ఈ సమావేశంలో అపెక్స్ కమిటీ సభ్యుల మధ్యన ఉన్న విభేదాలను పక్కనపెట్టి క్రికెట్ అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. క్రీడాకారులు అయోమయానికి లోనవ్వకుండా నియమ నిబం ధనలు దృష్టిలో పెట్టుకుని అధికారికంగా ఒకే టీమ్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ సభ్యులైన అనిల్ కుమార్, శేష్‌నారాయణ్, మహేందర్, అజ్మల్ అసద్, హనుమంతుతో పాటు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్, విద్యా యాదవ్, రజిని వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. తాజా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నగర జనాభా, ఓటర్ల సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. దాదాపు 7నెలల వ్యవధిలోనే మహేశ్వరం నియోజకవర్గ జనాభా 25శాతం పెరిగింది. అలాగే ఎల్బీనగర్లో 15శాతం, నాంపల్లిలో 6.5శాతం మేర ఓటర్లు పెరిగినట్లు తాజా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్లు అగ్రస్థానంలో ఉన్నాయి. జనవరి 20న ఓటర్ల తుది జాబితా అనంతరం... తాజా ముసాయిదా విడుదల వరకు నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 17,860 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితా మేరకు నియోజకవర్గంలో 2,73,079 మంది ఓటర్లు ఉండగా... 6.5శాతం పెరిగారు. కార్వాన్ నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 2,86,436 మంది ఓటర్లుండగా.. కొత్తగా 10,879(4శాతం) మంది నమోదు చేసుకున్నారు. ఇక శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 3,23,660 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 4,02,442 మంది ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో తుది జాబితాలో 4,01,137 మంది ఓటర్లుండగా... తాజా ముసాయిదాలో 4,65,154 మంది ఉన్నారు. నగర శివార్లలో వేగంగా విస్తరిస్తుండడంతో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే చాంద్రాయణగుట్టలో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 1,49,348 మంది ఉండగా, మహిళలు 1,42,415 మంది ఉన్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పురుషులు 1,16,886 మంది కాగా... మహిళా ఓటర్లు 1,12,793 మంది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలలో మాత్ర మే థర్డ్‌జెండర్స్ లేరు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 840 మంది ఓటర్లున్నారు. తగ్గిన తొలగింపులు... గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, కోర్టులకు వెళ్తుండడం తదితర కారణాలతో ఓటర్లను తొలగించేందుకు అధికారులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది అధికారులు ఇంటింటి సర్వే చేయకుండానే ముసాయిదా రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇళ్లకు వెళ్లకుండానే తొలగిస్తే తీవ్ర సమస్యలు ఎదురవనుండడంతో చిరునామాలు మారినవారు, మరణించిన వారి పేర్లను అలాగే ఉంచారనే అభిప్రాయాలున్నాయి. -
పేదలకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అయితే గతంలో జీవో 166 కింద వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించేందుకు వెసులుబాటు కల్పించింది. జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల స్థలాలను జీవోలు 58, 89 కింద క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ తాజాగా జీవో 179 జారీ చేసింది. అదే విధంగా క్రమబద్ధీకరణ విధివిధానాలు పేర్కొంటూ, మూడు విడతల్లో రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ మరో జీవో 134 విడుదల చేసింది. నిలిచిపోయిందిలా... దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నగరంలోని ఆక్రమిత స్థలాల్లోపేదలు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ 2008 ఫిబ్రవరి 16న జీవో 166 జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,22,637 మంది ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. అర్హులకు తగిన రుసుం చెల్లించేందుకు కన్వెయన్స్ డీడ్ కూడా అందజేశారు. అయితే క్రమబద్ధీకరణ దశలవారీగా కొనసాగుతుండగా, ప్రక్రియను నిలిపి వేయాలని సీపీఎం అప్పటి నగర శాఖ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో 166 కింద క్రమబద్ధీకరణను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా క్రమబద్దీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్హులు తక్కువే... ఇళ్ల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో అర్హత సాధించినవి తక్కువే. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31,960 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. జిల్లా భూ అథారిటీ (డీఎల్సీ) 27,744 దరఖాస్తులను తిరస్కరించింది. మరో 102 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టగా... 4,114 మంది దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే అందులో కేవలం 32 మంది మాత్రమే రుసుం చెల్లించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 80చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 19,927 దరఖాస్తులు రాగా.. వాటిలో 2,342 మాత్రమే అర్హత సాధించాయి. 80–250 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 10,277 దరఖాస్తులు రాగా 1308... 250–500 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 1,133 దరఖాస్తులు రాగా 351... 501కి పైగా చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 823 దరఖాస్తులు రాగా 113 మాత్రమే అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇళ్ల భూ క్రమబద్ధీకరణకు 90,677 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో 79,549 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత సాధించిన దరఖాస్తులను మూడు దశల్లో పరిధిల్లో క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ జిల్లా స్థాయి పరిధిలో మొత్తం 7,683 దరఖాస్తులు అర్హత సాధించగా... వాటిలో 5,034 మంది దరఖాస్తుదారులకు కన్వెయన్స్ డీడ్ అందజేశారు. అయితే 92 మంది దరఖాస్తుదారులు మాత్రమే రుసుం చెల్లించారు. మిగిలిన 2,557 మంది రుసుం చెల్లించలేదు. అదే విధంగా సీసీఎల్ఏ విభాగం 996 దరఖాస్తులను ఆమోదించి... 582 కన్వెయన్స్ డీడీ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇద్దరు మాత్రమే రుసుం చెల్లించారు. ప్రభుత్వ పరిధిలో మొత్తం 351 దరఖాస్తులు అర్హత సాధించాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో అర్హులైన దరఖాస్తులకు ఊరట లభించినట్లయింది. రుసుం చెల్లింపులిలా... దరఖాస్తుదారులు ఆక్రమిత స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుం మూడు వాయిదాల్లో చెల్లించొచ్చు. నవంబర్ 1లోగా తొలి వాయిదా, డిసెంబర్ 1లోగా రెండో వాయిదా, జనవరి 1లోగా మూడో వాయిదా చెల్లించాలి. ఏక కాలంలో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తారు. క్రమబద్ధీకరణ ఇలా.. ♦ 125 గజాలకు ఉచితంగాక్రమబద్ధీకరణ. ♦ 150 గజాల లోపు భూములు నోటిఫైడ్ గుర్తించిన మురికివాడల్లో ఉంటే మార్కెట్ విలువలో 10 శాతం. ♦ 250 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 25 శాతం. ♦ 500 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 50 శాతం. ♦ 1,000 గజాల లోపు ఉంటే 75 శాతం. ♦ 1,000 గజాల కంటే అధికంగా ఉంటే పూర్తి మార్కెట్ విలువ చెల్లించాలి. ♦ ఖాళీ స్థలాలకు మాత్రం విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. ♦ జీవో 58, 59 తరహాలోనే ఆన్లైన్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులుసమర్పించాలి. ♦ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ♦ దరఖాస్తుల స్వీకరణ అనంతరం తక్షణమే ఆన్లైన్లోనే దరఖాస్తుదారుడికి నోటీసు జారీ. ♦ 1,000 గజాలు దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు సిఫార్సు. ♦ ప్రభుత్వం ఆమోదిస్తే సంబంధిత తహసీల్దార్ ద్వారా కన్వెయన్స్‌డీడ్ జారీ. ♦ జనవరి 31, 2019లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి. -
ఔటర్.. రిపేర్
సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ప్రత్యేక దారులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక రహదారుల మూసివేతపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ప్రధానంగా రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్‌వే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక మట్టి రహదారులను తొలగించడంతో పాటు ఓఆర్ఆర్ పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులుచేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెళ్లిన వాహనాల టోల్ ఫీజు చెల్లింపులపై తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అధికారులు సమవేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు వచ్చి వెళ్లిన వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టోల్ ఫీజు చెల్లించాలంటూ టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాయనున్నారు. టోల్ ఫీజుపై నేడు స్పష్టత... నగరాభివృద్ధిలో 158కి.మీ ఔటర్ కీలకంగా మారింది. వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయడంతో ఔటర్‌పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతోంది. రోజు సగటున లక్షకు పైగా వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. టోల్ రుసుములను వసూలు చేసేందుకు గాను 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద 180 టోల్ లేన్లు ఉన్నాయి. ఓఆర్ఆర్లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తద్వారా హెచ్ఎండీఏకు రోజు రూ.87లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టోల్ వసూలు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ సంస్థ ప్రతి నెలా రూ.26 కోట్లు చెల్లిస్తోంది. ఇటీవల వాహనదారుల సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్ చెల్లింపుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదా వేసిన హెచ్ఎండీఏ అధికారులు... సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలు చేస్తే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విషయాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఆ రోజు వచ్చే వాహనాలకు టోల్ చెల్లిస్తామంటూ హెచ్ఎండీఏకు లేఖ రాయడంతో అందుకు అనుమతించారు. దీంతో లక్షలాది వాహనాలు ఔటర్‌పైకి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. ఈ టోల్ ఫీజు వసూలుపైనే హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి చార్జీలు చెల్లించాలంటూ లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షంతో ఇబ్బందులు... ప్రగతి నివేదన సభకు అనుబంధంగా వాహనాల పార్కింగ్ కోసం రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో ఔటర్ నుంచి కొత్తగా నిర్మించిన 8 మట్టి రహదారుల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి వాహనదారుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతమంది వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుందని ఈ మార్గాల ద్వారా సర్వీసు రోడ్ల మీదకు వచ్చి వెళ్లారని టోల్ వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థ అధికారులు వాపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రహదారులను మూసివేయాలని కోరుతున్నారు. -
మెడిసీన్!
సాక్షి, సిటీబ్యూరో: వైద్య విద్య సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ర్యాంక్ రాకపోతే ‘రేటు’తో అయినా సీటు దక్కించుకునేందుకు అనేక మంది సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రేజ్‌నే కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాలు నగరవాసులకు టోకరా వేస్తుంటే... నగరం కేంద్రంగా కొన్ని గ్యాంగ్స్ ఉత్తరాదికి చెందిన వారిని ముంచుతున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో సైబర్ క్రైమ్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు ఘరానా ముఠాలను పట్టుకోగా... 10 రోజుల వ్యవధిలోనే మాదాపూర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. వెబ్‌సైట్స్ నుంచే డేటా... ఎంబీబీఎస్‌తో పాటు మెడిసిన్ పీజీ సీట్ల పేరుతో టోకరా వేస్తున్న ముఠాల్లో కొన్ని కన్సల్టెన్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని గ్యాంగ్స్ కేవలం ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, బల్క్ ఎస్సెమ్మెస్‌లతో ఎర వేస్తున్నాయి. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న అభిమన్యుకుమార్ సింగ్ నేతృత్వంలోని ముఠా బిహార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సోమాజిగూడలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసింది. సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ కాప్స్‌కు రెండు నెలల క్రితం చిక్కిన సంతోష్‌రాయ్ నేతృత్వంలోని గ్యాంగ్ ఢిల్లీ కేంద్రంగా కేవలం బల్క్ ఎస్సెమ్మెస్‌లతో కథ నడిపించింది. ఇలాంటి మోసగాళ్లకు అభ్యర్థుల వివరాలు ‘అధికారికంగానే’ అందుతున్నాయి. ఆయా ప్రవేశ పరీక్షలు నిర్వహించే విభాగాలు తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో అభ్యర్థుల పేర్లు, ర్యాంక్‌లతో పాటు వారి ఫోన్ నెంబర్లు సైతం పొందుపరుస్తున్నాయి. వీటిని సంగ్రహించి, వాటి ఆధారంగానే వారికి కౌన్సెలింగ్‌లో సీట్లు వస్తాయా? రావా? అనేది అంచనా వేస్తున్న మోసగాళ్లు రంగంలోకి దిగి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఫిర్యాదుకు వెనకడుగు... ఇలాంటి ముఠాల చేతిలో మోసపోతున్న వారిలో బడాబాబులతో పాటు వైద్యులూ ఉంటున్నారు. తమ పిల్లలకు అడ్డదారిలో సీట్లు ఖరీదు చేయడానికి ముందుకొచ్చి నిండా మునుగుతున్నారు. అయితే మోసపోయిన వారిలో కనీసం 10శాతం మంది కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేయట్లేదు. దీనికి ప్రధాన కారణం ఇన్కమ్ ట్యాక్స్ భయమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఘరానా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇలాంటి వారికి ప్రధానంగా బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో వివిధ కోటాల్లో సీట్లు ఇప్పిస్తామంటూ పేర్కొంటున్నారు. ఆపై ఒక్కో సీటుకు రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనికి అంగీకరించిన వారి నుంచి తొలుత అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు చేస్తున్నారు. దీనికోసం అవసరమైతే తమ అనుచరుల్ని పంపిస్తున్నారు. ఇలా చేయడంతో మోసపోయిన వారు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. పోలీసుల్ని ఆశ్రయిస్తే ముందు తామిచ్చిన నగదుకు లెక్కలు చెప్పాల్సి వస్తుందని, ఐటీ విభాగం రంగంలోకి దిగుతుందని భయపడి ఫిర్యాదులే చేయడం లేదు. ఇటు వారటు... అటు వారిటు... ఉత్తరాదికి చెందిన ముఠాలు నగరానికి చెందిన వారిని మోసం చేసి సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాయి. ఇలానే నగర కేంద్రంగా ఉత్తరాదికి చెందిన వారినీ కొందరు మోసం చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో దీనికి సంబంధించి మాదాపూర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఎర వేసిన మోసగాళ్లు అతడి నుంచి రూ.16 లక్షలు కాజేశారు. దీనికి సంబంధించి గత నెల 24న బాధితుడు మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ మోసగాళ్లు హైదరాబాద్‌తో పాటు పుణెలోనూ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ రైల్వే ఉద్యోగి నుంచి మెడిసిన్ సీట్ల పేరుతో రూ.29 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గత నెల 31న అదే మాదాపూర్ ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ రెండూ వేర్వేరు కన్సల్టెన్సీలని, బెంగళూరులోని మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తామంటూ మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ గ్యాంగ్స్ సైతం నగదు రూపంలోనే డబ్బు తీసుకున్నాయని, తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకూ ఇలా చేసి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలో, డీడీలు, చెక్కులో వినియోగిస్తే తాము చిక్కుతామని నగదునే తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఆ ఇద్దరి కస్టడీకి నిర్ణయం... బెంగళూర్‌లోని వివిధ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతూ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు శుక్రవారం చిక్కిన ముఠాలోని ఇద్దరినీ పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వీరిద్దరినీ పంజగుట్ట అధికారులు రిమాండ్‌కు తరలించినవ విషయం విదితమే. ఈ గ్యాంగ్ రెండు రాష్ట్రాల్లో అనేక మంది నుంచి రూ.90 లక్షల వరకు దండుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సిటీలో ఏర్పాటు చేసిన కార్యాలయం కేంద్రంగా 20 మందికి ఎర వేశారు. ఒక్కో సీటు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చవుతుందంటూ చెప్పారు. వీరి నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని ఉడాయించారు. అయితే కేవలం రెండు కేసులే రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన బాధితుల్ని గుర్తించడంతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడానికి అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. -
ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్ షాపులో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌కు ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్‌డే సందర్భంగా చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్‌కు గురయ్యామని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్‌క్రీమ్ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. -
చిన్ని కృష్ణుల చిద్విలాసం
-
జంట పేలుళ్ల కేసులో నేడే తుది తీర్పు
-
ప్రగతి సభకు పోస్టుమార్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదనపై టీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత మథనం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించిన సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరపకపోవడంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కొంగరకలాన్‌లో సభ నిర్వహిస్తున్నందున కనిష్టంగా ఐదారు లక్షల మందిని తరలించాలని జిల్లా నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదారు లక్షలు దేవుడెరుగు కనీసం మూడు లక్షల మందిని కూడా తరలించకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గులాబీ బాస్.. ప్రజల తరలింపుపై లెక్కలు తీశారు. అలాగే నిఘావర్గాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన అధిష్టానం.. ప్రగతి సభకు జన సమీకరణలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినట్లు అంచనా వేసింది. నివేదన సభకు ఆతిథ్యమిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలే కాకుండా షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల సెగ్మె ంట్ల నుంచి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జనాలను సమీకరించలేదని తేలింది. బహిరంగ సభకు ముహూర్తం ఖరారు కాగానే రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సెగ్మెంట్ నుంచి సగటున 35 వేల నుంచి 40వేల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. కేవలం ప్రజా ప్రతినిధులేగాకుండా ఆశావహులు సైతం బలప్రదర్శన చేసుకునేందుకు భారీగా జనాలను తీసుకొస్తారని అంచనా వేశారు. ఈ లెక్కలు తప్పడంపై తాజాగా గులాబీ నేతలు చింతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనాలు పోటెత్తుతారని ఎవరికివారు మిన్నకుండడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోవడాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నేతలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్న గులాబీ దళపతి.. త్వరలోనే వీరికి క్లాస్ పీకనున్నట్లు తెలుస్తోంది. బాగా పనిచేశారు.. బహిరంగ సభ నిర్వహణలో విశేష కృషి చేసిన వారిని అభినందించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప వ్యవధిలో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పూర్తి చేసిన వారికి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించిన ఆయన క్యాంపు ఆఫీసుకు రావాలని ఆహ్వానించారు. నిఘా విభాగం మల్లగుల్లాలు! ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజల సంఖ్య తేల్చడంలో ఇంటలిజన్స్ విభాగం తలమునకలైంది. మంగళవారం భేటీ అయిన నిఘా బృందాలు ఏయే జిల్లా, నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది వచ్చారనే అంశంపై సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అదే సమయంలో రాష్ట్రం నలు దిక్కుల నుంచి ఒకేసారి జనప్రవాహం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయినట్లు వివరించినట్లు తెలిసింది. సగం మంది సభకు రాకుండా రోడ్లపైనే నిలబడ్డారని, మరికొందరు ముందుకు రాలేక వెనక్కిపోయినట్లు పార్టీ వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. పోలీసుల బందోబస్తు నిర్వహించిన తీరుపై పెదవి విరిచినట్లు తెలిసింది. నిర్దేశిత మార్గాల గుండా వాహనాలను సభాస్థలికి చేర్చడంలో ఆ శాఖ వైఫల్యం ఉందని అన్నట్లు సమాచారం. -
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..?
సాక్షి, హైదరాబాద్: మాటల్లో చాతుర్యం. మిమిక్రీతో హాస్యంతో అలరించి.. డైలాగ్ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్ అందరికీ సుపరిచితమే. చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి. హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్ అంటూ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడింది. ఖమ్మంలో పుట్టినా.. నేను, చెల్లి పుట్టింది ఖమ్మంలోనే అయినా నా రెండో యేట నుంచే హైదరాబాద్‌లో పెరిగాను. కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని. ఇద్దరం కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. చిన్నప్పటినుంచే మేం మిమిక్రీలు, ప్రోగ్రామ్స్‌తో అలరిస్తున్నాం. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఇచ్చాం. ప్రస్తుతం నేను యూసుఫ్‌గూడ సెయింట్ మెరీస్‌లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఫైనలియర్ చదువుతున్నాను. హైదరాబాద్‌లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్‌కు వచ్చేంతవరకు నా మనసు ఊరుకోదు. మిమిక్రీ షోలకు దూరంగా.. కొత్త హిరోషిని కోమలిగా దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను. చివరగా త్రివిక్రమ్ చిత్రం ‘అ ఆ’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. థియేటర్ వర్క్‌షాప్‌లో సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా... డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన. ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్ గిర్ స్టీల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నాను. రకుల్, రానా, అంజలి, రవితేజ లాంటి వారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. పుడ్, వ్యాయాయం, యోగాలతో పాటు వర్కవుట్లకు అధిక ప్రాధాన్యమిచ్చాను. రెగ్యులర్ పాత్రల కన్నా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. -
చవులూరిస్తున్న ‘తెలంగాణ స్పైసీ కిచెన్’
చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ చేసిన వంటకాలు గుర్తొస్తే ఇప్పటికీ నోరూరుతూ ఉంటుంది. మళ్లీఆ రుచుల కోసం నాలుక తహతహలాడుతూ ఉంటుంది. మరి ఆనాటిఆ వంటకాలను రుచి చూడాలంటే పల్లెకు పరుగెత్తాల్సిందే. అలాంటి గ్రామీణ వంటకాలను సిటీ ప్రజలకు అందిస్తుంది‘తెలంగాణ స్పైసీ కిచెన్’రెస్టారెంట్. ఓసారి ఇక్కడికి మనమూ వెళ్లొద్దామా..ఆ రుచులను ఆస్వాదిద్దామా.. హిమాయత్‌నగర్ : కరీంనగర్‌కు చెందిన ‘రోహిత్‌రావు, వికాస్‌రావు, హర్ష, ఉదయ్’లు బంధువులు, స్నేహితులు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రసిద్ధి చెందిన వంటకాలతో నగరంలో రెస్టారెంట్‌ను పెట్టాలనుకున్నారు. ఈ ఏడాది మే 28న జూబ్లిహిల్స్‌లో ‘తెలంగాణ స్పైసీ కిచెన్’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక్కడ ముద్దపప్పు, పచ్చి పులుసు ఎంతో రుచికరంగా తయారుచేస్తున్నారు. వీటికోసం టెక్కీలు బారులు తీరడం విశేషం. అలాగే ‘గోలించిన మాంసం, మక్క గారెలు విత్ కంట్రీ చికెన్, దాల్చా మటన్ విత్ బగారా రైస్, పులిహోర విత్ కంట్రీ చికెన్’ వంటకాలను అందిస్తున్నారు. అలాగే కరీంనగర్‌లోనే ప్రత్యేకంగా లభించే ‘చికెన్ ఫ్రైడ్ వింగ్స్’ టేస్టీకి ఫిదా కావాల్సిందే. -
నిజాం మ్యూజియంలో చోరీ
సాక్షి, హైదరాబాద్ : నిజాం మ్యూజియంలో సోమవారం భారీ చోరీ జరిగింది. పాతబస్తీలోని డబీర్‌పూరాలో గల నిజాం మ్యూజియంలో విలువైన టిఫిన్ బాక్స్‌లు, వజ్రాలున్న కప్ సాసర్ను దొంగలు అపహరించారు. అర్థరాత్రి మ్యూజియం వెంటిలేటర్ ధ్వంసం చేసిన దుండుగులు తాడుతో లోపలకి దిగిన చోరీకి పాల్పడ్డారు. పది సీసీ కెమెరాల కన్నుగప్పి దొంగతనం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన విలువైన పురాతన వస్తువులను దుండుగులు దోచుకున్నారు. కాగా నిజాంలకు చెందిన విలువైన వస్తువులన్నీ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. -
నిజాం మ్యూజియంలో భారీ చోరీ
-
‘నాగేందర్‌కు తిక్కలేచి నాపై విమర్శలు చేస్తున్నాడు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ద్రోహం చేశారని, వాళ్లు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో వారి ఆశలు నీరుగారాయని అన్నారు. తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు నింపుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ నిరుద్యోగుల గురించి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లోన్స్ మంజూరులో సర్కార్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి అంటే అవహేళన చేసిన కేసీఆర్.. అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్స్‌కు దోచిపెట్టడానికే కేసీఆర్‌కు సమయం సరిపోయిందని చెప్పారు. నాగేందర్‌కు తిక్కలేచి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భూకబ్జా దారులున తనపై విమర్శలు చేసే నైతికత ఎక్కడుందని, అతను ఎంతకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
యువత కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయం
-
ఖాద్రి, సాగర్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ పురుషుల పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో సయ్యద్ రబ్బార ఖాద్రి, కె. సాగర్ స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 120 ప్లస్ వెయిట్ కేటగిరీలో సయేద్ విజేతగా నిలవగా... 120 కేజీల వెయిట్ విభాగంలో సాగర్ చాంపియన్‌గా నిలిచాడు. సయేద్ 730 కేజీల బరువునెత్తి తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. బి. శశాంత్ గౌడ (ఏవీ కాలేజీ) 405 కేజీలు లిఫ్ట్ చేసి రజతాన్ని గెలుచుకున్నాడు. 120 కేజీల విభాగంలో సాగర్ 520 కేజీలు, డి. నిఖిల్ రెడ్డి 430 కేజీల బరువునెత్తి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 105 కేజీల విభాగంలో కె. శ్రీకాంత్ (ఎస్ఆర్ఎం కాలేజీ; 595 కేజీలు), మహబూబ్ బాషా (కేశవ కాలేజీ; 465 కేజీలు), జునైద్ యూసుఫ్ (విద్యారణ్య కాలేజీ; 435 కేజీలు) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఫైనల్ పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ అధికారి శోభ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
క్రాస్‌కంట్రీ విజేతలు ప్రశాంత్, కావ్య
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజీ క్రాస్ కంట్రీ రేస్ పోటీల్లో బి. ప్రశాంత్, పి. కావ్య విజేతలుగా నిలిచారు. ఓయూ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఎం. నర్సింహులు ప్రారంభించారు. పురుషుల 10 కి.మీ. రేస్‌లో నిజాం కాలేజీకి చెందిన ప్రశాంత్ చాంపియన్‌గా నిలిచాడు. అతను అందరికన్నా ముందుగా 33 నిమిషాల 32.4 సెకన్లలో పరుగును పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రెండోస్థానంలో నిలిచిన హెచ్జీపీఎం అథ్లెట్ ఎస్. వినోద్ 33 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. అవంతి కాలేజీకి చెందిన ఎ. పవన్‌తేజ (33ని. 55.7సె.) మూడోస్థానంలో నిలిచాడు. మహిళల కేటగిరీలో వనితా కాలేజీకి చెందిన కావ్య 38 నిమిషాల 8.02 సెకన్లలో రేస్‌ను ముగించి విజేతగా నిలిచింది. ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్; 39ని.13.2సె.), ఎస్. అనురాగ (సెయింట్ ఆన్స్; 42ని.51సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌ను నిజాం కాలేజీ గెలుచుకుంది. 58 పాయింట్లతో నిజాం జట్టు టైటిల్‌ను అందుకుంది. అవంతి కాలేజీ (67 పాయింట్లు), భవన్స్ వివేకానంద (75 పాయింట్లు) తర్వాతి స్థానాలను సాధించాయి. మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను సెయింట్ ఆన్స్ (30 పాయింట్లు) జట్టు దక్కించుకుంది. జీసీపీఈ 35 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. భవన్స్ (78 పాయింట్లు) జట్టుకు మూడోస్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
మహానగరం గులాబీ వనం
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రగతి నివేదన మహాసభకు దారితీసింది. అభివృద్ధి, సంక్షేమ నినాదాల హోరు.. బతుకమ్మ పాటలు, బోనాల జాతరలు, పోతరాజుల విన్యాసాలు, దున్నపోతుల రంకెలు, చేతి వృత్తుల ప్రదర్శనల మధ్య టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నగర పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. రెండు రోజుల నుంచే గులాబీ వనాన్ని తలపించిన మహానగరం.. ఆదివారం ఉదయం చిరు జల్లులు కురుస్తున్నా భారీ పార్టీ జెండాలను చేతబూని కొంగరకలాన్‌కు తరలి వెళ్లారు. దీంతో దారుల వెంట బైక్ ర్యాలీలు, ప్రయాణాల్లో జై తెలంగాణ నినాదాలతో సందడి నెలకొంది. ఆర్టీసీ సర్వీసులను ప్రగతి నివేదన సభకే నడిపారు. దీంతో ప్రత్యేక పనులున్న జనాలు మాత్రమే బయటకు వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడంతో బస్తీలు, కాలనీ సంఘాల నుంచి జనం భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు. జన సమీకరణలో పోటాపోటీ నగరం నుంచి మొత్తం మూడు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అందుకు తగ్గట్టుగానే భారీ సమీకరణే చేయగలిగారు. ముఖ్యంగా శివారు నియోజకవర్గాలైన కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి జనం భారీగా ర్యాలీలు తీశారు. ఉప్పల్‌లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగిరెద్దులు, వెదురు బుట్టలను ప్రదర్శిస్తూ ప్రదర్శన సాగితే, అంబర్‌పేటలో గీత, కుమ్మరి, రజక వృత్తులను ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో తరలివెళ్లారు. కంటోన్మెంట్లో ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కాచిగూడలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దున్నపోతుల ర్యాలీని ప్రారంభించారు. సభ విజయవంతంపై నేతల సంతృప్తి మహానగరం నుంచి ఆశించిన స్థాయిలో జరిగిన జన సమీకరణపై టీఆర్ఎస్ ముఖ్య నేతలు సంతృప్తి వక్తం చేశారు. మంత్రులు పద్మారావు, తలసాని, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, నాయకులు దానం నాగేందర్‌తో పాటు ఎమ్మెల్యేలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందించారు. -
వైన్‌షాపులో సరుకు ఖాళీ
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలోని వైన్‌షాపులన్ని ఆదివారం మధ్యాహ్ననికి ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ బీర్లు, విస్కీ, రమ్, బాటిళ్లన్ని అమ్ముడు పోయాయి. ఒక పక్క పోలీసులు షాపులను మూసి వేయాలని, మరోపక్క నాయకులు మందు బాటిళ్లు కావాలని యజమానులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు మధ్యాహ్నానికి బార్లు, వైన్‌షాపులన్ని మూతపడ్డాయి. కొన్ని షాపులు ఉదయమే మూయించివేశారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ముందే మందు బాటిళ్లను కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున మందు బాటిళ్లను కొనుగోలు చేయడంతో షాపులో మధ్యం బాటీలన్నీ ఖాళీ అయ్యాయి. ఆదివారం ఉదయం బార్, వైన్‌షాపులను పోలీసులు తెరవ వద్దంటూ సూచించారు. కానీ నాయకుల ఒత్తిడితో షాపులను తెరిచి వారికి కావాల్సిన బాటిళ్లను అందించారు. ఎక్సైజ్ పోలీసులు తాము ఎవరికి షాపులు మూసివేయాలని తెలుపలేదన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం సభకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న షాపులను మూసివేయాలని తెలిపామని వెల్లడించారు. -
లేజర్ షోకులేనా?
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కులోని లేజర్ షో మసకబారుతోంది. మొత్తం ఐదెకరాల్లో పార్కు, లేజర్ షో ప్రాంతం, పార్కింగ్ ప్రదేశం ఉన్నాయి. అయితే ఇందులోని ఎకరం స్థలాన్ని ఇటీవల ఆర్అండ్బీ శాఖ తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి తీసుకుని పనులు చేపట్టింది. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి తలెత్తింది. దీనివల్ల లేజర్షోకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. బస్సులు, కార్ల పార్కింగ్‌కు చోటులేక దేశ, విదేశీ అతిథులు తమ సందర్శన జాబితాలో లుంబినీపార్కు, లేజర్ షో లేకుండానే పర్యటనను ముగించుకుంటున్నారు. ప్రస్తుతం కార్లు, బస్సులు నిలిపే స్థలాన్ని ఆర్ అండ్‌బీ స్వాధీనం చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా తీసుకోనున్నారు. అదే జరిగితే.. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోవచ్చని పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. తగ్గిపోయిన సందర్శకులు వీకెండ్లో సందర్శులు కుటుంబ సభ్యులతో ఎంచక్కా వాహనాల్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసేవారు. తర్వాత లుంబినీపార్కు చుట్టేయడంతో పాటు సాగర్ తీరాన బోటులో షికారు చేసి సాయంత్రం లేజర్ షో చూసి తిరిగి వెళ్లేవారు. ఆగస్టు తొలి రెండు వారాల్లో లుంబినీ పార్కుకు సందర్శకుల సంఖ్య రోజుకు సగటున 5 వేలు ఉంటే.. చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 3,750 వరకు తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పూర్తిగా పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని, పార్కింగ్‌కు స్థలం ఇవ్వకపోతే లుంబినీపార్కు, లేజర్ షో విశిష్టత మసకబారడం ఖాయమని అధికారులు అంటున్నారు. లేజర్ షోకు ‘నష్ట’కాలమే.. లుంబినీ పార్కుకు వచ్చే పర్యాటకుల్లో సీజన్ సమయాల్లో లేజర్ షోకు 1500 నుంచి 1800 మంది వరకు వీక్షకులు ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం (ఆన్‌సీజన్)లో ఆ సంఖ్య వెయ్యి మందికి పడిపోయింది. ఆగస్టు తొలి రెండు వారాల్లో 800కు పైగానే వీక్షించినా చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 400కు తగ్గిపోయింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం కూడా పోతే లుంబినీ పార్కు, లేజర్ షో ఆదాయంపై ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. లుంబినీ పార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా వసూలు చేస్తున్న అధికారులు లేజర్ షోకు రూ.50 తీసుకుంటున్నారు. పార్కుకు రాకుండా నేరుగా లేజర్షోకు వెళ్లేవారికి భద్రతా సిబ్బంది రూ.50 ఛార్జి తీసుకుంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే అటు పార్కుకు వచ్చే ఆదాయం, ఇటు లేజర్ షోకు వచ్చే ఆదాయం కేవలం వాహనాలకు పార్కింగ్ లేకపోవడం వల్ల దాదాపు 25 శాతం పడిపోయిందని చెబుతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యామ్నాయం చూపెడితే తప్ప ఆదాయం పెరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు. పార్కింగ్‌పై తర్జనభర్జన.. లుంబినీ పార్కులో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్ట్ బాధ్యతలు చూసుకుంటున్న సంస్థను తప్పుకోవాలని ఇప్పటికే హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌కు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ పరిమిత కాలాన్ని బట్టి సమకూర్చాలని ఆలోనచలో అధికారులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్న ఆర్అండ్బీ అధికారులు తొలిరెండు అంతస్తుల్లో లుంబినీపార్కు, లేజర్ షోకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు చోటిస్తామని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆలోపు వాహనాల పార్కింగ్ సమస్య ఏంటనేదాని పైనే అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చొరవ చూపి ఏదో ఒక మార్గాన్ని చూపాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యుత్ సంస్థలో అవినీతి చీకట్లు!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అవినీతి పుట్టగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వీరిబాటలోనే నడుస్తున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఏఈలు, ఒక లైన్మెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమ మీటర్ల వ్యవహారంలో మరో ముగ్గురి(ఒక ఏఈ సహా లైన్మెన్, ఆర్టిజన్)పై వేటు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈ శాఖ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. ఆశించిన దానికంటే అధిక మొత్తంలో వేతనాలు పెంచినా అక్రమ వసూళ్ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం గచ్చిబౌలికి చెందిన లైన్మెన్ ఎ.రాజేందర్ ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఆ తర్వాత ఏడీఈ, ఏఈలను కూడా ఏసీబీ విచారించింది. నిబంధనల ప్రకారం మీటర్లు, ప్యానల్ బోర్డు కోసం నిర్దేశించిన చార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించినప్పటికీ నెల రోజులుగా మీటర్లు జారీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం కూడాఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెట్టిన ఖర్చులు సంపాదించుకునేందుకే.. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా డిస్కంలో పనిచేసే ప్రదేశాలను యాజమాన్యమే ‘ఫోకల్.. నాన్ ఫోకల్’ కేటగిరీలుగా విభజించింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాన్‌ఫోకల్‌గా, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఫోకల్‌గా పేర్కొంటున్నారు. బదిలీ సమయంలో ఫోకల్(కొత్త నిర్మాణాలు, కొత్త వెంచర్లు అధికంగా ఉండే ప్రదేశాలు) పోస్టు కోసం ఏఈలు, ఏడీఈలు, డీఈలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి పోస్టింగ్‌లు పొందడం డిస్కంలో అందరికీ తెలిసిన తతంగమే. ముఖ్యంగా శివారు ప్రాంతలైన గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, సరూర్‌నగర్, చంపాపేట్, శంషాబాద్, హబ్సిగూడ, బోయిన్పల్లి, కూకట్‌పల్లితో పాటు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా పెట్టిన ఖర్చులను తిరిగి సంపాధించుకునేందుకు ఆ తర్వాత అడ్డదారులు తొక్కతున్నారు. కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ షిష్టింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కొత్త లైన్ల ఏర్పాటు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్తాయి కార్మికులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఎవరైనా పట్టుబడినప్పుడు తమకేమీ సంబంధం లేదని పెద్దలు తప్పించుకుంటే కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడుతోంది. పెద్దల పనికి చిరుద్యోగులు బలి ఓల్డ్ బోయిన్పల్లి సెక్షన్ పరిధిలో రోలింగ్ స్టాక్‌లోని 130 మీటర్లును మాయం చేసి, గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారుల నివాసాలకు అమర్చిన ఘటనలో లైన్మెన్ రమేషాచారి సహా ఏఈ వినోద్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయంలో ఏడీఈ, డీఈలకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. అదే విధంగా సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలో హెచ్‌టీ మీటర్ల జారీలోనూ అక్రమాలు జరిగాయి. ఒకే సర్వీసు నెంబర్‌తో ఉన్న మీటర్‌ను అధిక మొత్తంలో రీడింగ్ నమోదైన ప్రతిసారి సాంకేతిక అంశాలను కారణాలుగా చూపి ఎనిమిదిసార్లు మార్చారు. అంతేగాక డిస్కంను ఏమార్చిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులను సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఆర్టిజన్ కార్మికుపై డిస్కం వేటు వేసి విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ అంశంలో సంబంధత డివిజన్ ఉన్నతాధికారులకు ప్రమోయం ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం వెనకాడుతుండుతోంది. యాజమాన్యమే అక్రమార్కులకు కొమ్ముకాస్తోందని సంస్థలోని ఉద్యోగులే విమర్శిస్తున్నారంటే ‘డిస్కం’ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి డీఈ, ఏడీఈ, ఏఈలకు తెలియకుండా కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు సాధ్యం కాదు. ఒకవేళ మంజూరు చేసినా వెంటనే తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఛార్జీలను వినియోగదారుడు సంస్థకు చెల్లించిన తర్వాత గడువులోగా వాటిని మంజూరు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కారణాలు అన్వేశించాల్సిన బాధ్యత సదరు ఉన్నతాధికారులదే. ఉన్నతాధికారులే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తుండడంతో వినియోగదారులు తమ బాధతలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. -
ప్రియురాలి కోసం కొట్టుకున్నారు..
బంజారాహిల్స్: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్ చేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్(26) వద్దకు వచ్చింది. కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అఖిల్ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్‌ను ఫోన్లో బెదిరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్‌కు రేవంత్‌కు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనమా.. ప్రభంజనమా..
-
సినిమా స్టంట్ సీన్‌ను తలపించేలా..
-
సినిమా స్టంట్ సీన్‌ను తలపించేలా..
సాక్షి, హైదరాబాద్ : సినిమా స్టంట్ సీన్‌ను తలపించేలాంటి ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రగతి నివేదన సభ’’ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు చేశారు. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు ఓకే రహదారిపై జరిగాయి. దీంతో రహదారిపై వెళుతున్న ఓ బైక్ ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీ కొట్టగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి కొన్ని అడుగులపైకి గాల్లోకి పల్టీలు కొట్టి నేలను తాకాడు. శరీరం రోడ్డును తాకినప్పటికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అతడు వెంటనే లేచి బైక్ దగ్గరకు చేరకున్నాడు. రోడ్డుపై వెళుతున్న కొద్దిమంది అతనికి సహాయం చేయటానికి చుట్టూ చేరారు. -
భారత అథ్లెటిక్స్ జట్టులో బికాశ్, బాల్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘానికి చెందిన బికాస్ కరార్, బి. బాల్‌రాజ్ ఎంపికయ్యారు. స్పెయిన్‌లోని మలగలో ఈనెల 4 నుంచి 16 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. బికాస్ కరార్ 45ప్లస్ వయో విభాగంలో 200మీ., 400మీ. హర్డిల్స్ ఈవెంట్లలో తలపడతాడు. గతంలో అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాం డ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లోనూ బికాస్ పాల్గొనడం విశేషం. మరోవైపు బాల్‌రాజ్ 40ప్లస్ వయో విభాగంలో 800మీ. పరుగులో పాల్గొంటాడు. బాల్‌రాజ్‌కు చైనాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొన్న అనుభవం ఉంది. -
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో డ్రగ్స్ మాఫియా తోక ముడిచిందని అంతా భావించారు. కానీ అది ఇంకా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నల్లజాతీయుని వద్ద ఎక్సైజ్ శాఖ (ఎస్టీఎఫ్) అధికారులు 100 గ్రాముల కొకైన్‌ను సాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల... ప్రకారం రిపబ్లిక్ (ఆఫ్రికా)కు చెందిన పీటర్ అనే వ్యక్తి మెహిదీపట్నంలోని మక్తాలో డ్రగ్స్ అమ్ముతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్ తో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చెసుకున్నారు. -
మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్ యవ్వారం
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యయుగపు చక్రవర్తిలాగా యవ్వారం చేస్తున్నాడని కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కేరళ వరదల హడావిడి కన్నా ఏదో ఉపద్రవం వచ్చినట్లు కొంగరకలాన్ సభ ఉందని మండిపడ్డారు. సభకు వచ్చే 25 లక్షల మందిని తమ సైన్యం లాగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని ఆరోపించారు. ఊరికో ట్రాక్టర్ రావాలని కేసీఆర్ చెప్పడం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా..ట్రాక్టర్లలో ప్రజా రవాణా నిషిద్ధమని తెలియదా అని ప్రశ్నించారు. ట్రాక్టర్లలో ప్రజలను తరలించాలన్న కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అని సూటిగా అడిగారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఔటర్ రింగు రోడ్డు మీద గంపగుత్తగా టోల్ ఎత్తి వేసే అధికారం మీకెక్కడిదని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్థన్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టుకునే దిక్కుమాలిన సభకు నిబంధనలు ఉల్లంఘిస్తారా అని ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నించారు. న్యాయస్థానం ఎందుకు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. హరిత హారం అని నాటకాలు ఆడిన కేసీఆర్, సభ కోసం వేల చెట్లను నరికి వేయించి కుప్పలాగా వేశారని విమర్శించారు. గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా కేసీఆర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలో పెట్టాలని సూచించారు. ప్రభుత్వ జీతభత్యాలతో పథకాల ప్రచారం కోసం నియమించుకున్న కళాకారులను పార్టీ సభలో పాడాలని ఆదేశించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉల్లంఘనలన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. -
విజేత సామియా ఇమాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ విజేతగా నిలిచింది. మంచిర్యాలలో జరిగిన ఈ టోర్నీలో సామియా బాలికల సింగిల్స్ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల ఫైనల్లో నాలుగోసీడ్ సామియా 21–15, 21–14తో రెండోసీడ్ ఎ. అభిలాష (హైదరాబాద్)కు షాకిచ్చింది. బాలుర ఫైనల్లో ఎం. తరుణ్ (ఖమ్మం) 21–11, 21–15తో ఆదిత్య గుప్తా (హైదరాబాద్)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు బాలికల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సృష్టి జూపూడి జంట విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సృష్టి (హైదరాబాద్) – సాహితి (మెదక్) ద్వయం 21–10, 21–10తో శ్రీవిద్య–సాయి శ్రీయ (మెదక్) జోడీపై నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సృష్టి– కె. సాయి కుమార్ (రంగారెడ్డి) జంట 21–14, 21–19తో బి. నవనీత్–సాహితి (మెదక్) జోడీపై గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్లో పీఎస్కే సాయి కుమార్ (రంగారెడ్డి)–పీవీ గౌడ్ (హైదరాబాద్) ద్వయం 21–11, 21–17తో ఆకాశ్ చంద్రన్– సాయి రోహిత్ (హైదరాబాద్) జోడీపై గెలిచింది. -
రూ. 16.86 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 16.86 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 23న జరిగే నిమజ్జనానికి 35 ప్రాంతాల్లో 117 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, మరో 96 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో రోడ్డు రీకార్పెటింగ్, మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను సెప్టెంబర్ 10లోగా పూర్తి చేసేందుకు రూ. 10.52 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయా మార్గాల్లో 34,926 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా గణేష్ యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్అండ్బి ఆధ్వర్యంలో 12 కిలోమీటర్ల మేర, ప్రధానంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ రెండంచెల బారికేడింగ్, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్ వద్ద ఎస్పీడీసీఎల్ ద్వారా 48 ట్రాన్స్ఫార్మర్లు, సరూర్‌నగర్ చెరువు వద్ద ఐదు ట్రాన్స్ఫార్మర్లతో సహా అన్ని ప్రాంతాల్లో వెరసి 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.వీటితో పాటు మంచినీటి సరఫరా, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని, ఉత్సవాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సహకరించాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యులను కోరారు. విస్తృత బందోబస్తు: సీపీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గణేష్ ఉత్సవాల సమయంలోనే మొహర్రం పండుగ కూడా ఉన్నందున వేడుకలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర మార్గంలో మెట్రో రైలు స్టేషన్లు, ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నందున విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అందజేయాలని, ప్రతి విగ్రహం వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, ట్రాఫిక్ డీసీపీలు చౌహాన్, బాబురావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, ముషారఫ్ అలీ, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు సురేష్, జియాఉద్దీన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి సహకారం: గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరిస్తామని గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది. ఉత్సవ సమితి అధ్యక్ష , కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, భగవంతరావులతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పలు నియోజకవర్గాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. నిమజ్జన సందర్భంగా క్రేన్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు నగరంలో నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేయాలని, తగినన్ని మొబైల్ టాయ్లెట్లు, దారిపొడవునా విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ధూల్‌పేట వద్ద ఎంట్రీ,ఎగ్జిట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. శోభాయాత్ర మా ర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్ల లోని టాయ్లెట్లను వినియోగించుకునేందుకు చ ర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఇంటికొక్కరు రావాలె!
సాక్షి, సిటీబ్యూరో: నాలుగున్నరేళ్ల ప్రగతి, సంక్షేమాన్ని వివరించి వచ్చే ఎన్నికల కోసం సమర శంఖాన్ని పూరించేందుకు ఆదివారం నగర శివార్లలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కోసం నగరం హోరెత్తుతోంది. సభలో పాల్గొని సంఘీభావం తెలియచేయాలంటూ టీఆర్ఎస్ నాయకులు కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో బొట్టు పెడుతూ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికివివరించటంతో పాటు ఆయా కులాలు, వర్గాలకు చేసిన సంక్షేమాలు మరింత ఊపుతో ముందుకు వెళ్లాంటే కొంగర కలాన్సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరం నుండి మూడు లక్షల మందికి తగ్గకుండా కొంగర కలాన్‌కు తరలివెళ్లే ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, ప్రతి డివిజన్ నుండి 1500 నుండి 3500 మందికి తగ్గకుండా వేళ్లేలా వాహనాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీతో పాటు విద్యా సంస్థల బస్సులు, బైక్‌లు, క్యాబ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు అన్ని చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించి భారీ బైక్‌ర్యాలీలతో సభా స్థలికి బయలుదేరే ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి రావాల్సిందే... జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపులుగా విడిపోయిన వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్లతో విభేదించే నాయకులను సైతం మంత్రులు, నియోజకవర్గాల టీఆర్ఎస్ ఇన్చార్జులు పిలిచి మరీ బుజ్జగించి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో పాలు పంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విభేదాలున్న నియోకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, జనసమీకరణపై వారి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ నియోకజవర్గ కార్పొరేటర్ల సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఐదువేల బైక్‌లు, 550 ఆర్టీసీతో పాటు 700 ప్రైవేటు బస్సులతో జనాన్ని తరలించేందుకు కసరత్తు పూర్తి చేశారు. మల్కాజిగిరి నుండి భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎంఎల్సీ మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం సాయంత్రం వరకు వాహనాల ఏర్పాట్లలోనే తలమునకలయ్యారు. -
రెరాతో భరోసా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మోసాలకు ఇక తెరపడనుంది. ఆయా నిర్మాణాలకు అనుమతి పొందకుండానే అనుమతి పొందినట్లు ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్ రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్)యాక్ట్– రెరా’ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఇళ్ల కోసం ప్రజల నుంచి పెద్దమొత్తంలో అడ్వాన్సులు స్వీకరించడమే కాక మొత్తం సొమ్ము వసూలు చేసినా, నిర్ణీత వ్యవధిలో ఇళ్లు నిర్మించకుండా ముప్పుతిప్పలు పెడుతున్న రియల్టర్ల బారి నుంచి సామాన్యులకు రక్షణగా రెరా చట్టం నిలవనుంది. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టును పూర్తిచేయని వారికి పెనాల్టీలు పడనున్నాయి. 2017 జనవరి1 నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో అనుమతి పొందిన ప్రాజెకులన్నీ రెరా వద్ద నమోదు చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికావాలి. 500 చ.మీ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఇళ్లు, 8 ఫ్లాట్లు దాటిన అపార్ట్మెంట్స్ నిర్మించే అన్ని నివాస, వాణిజ్య భవనాలకు, లేఔట్స్‌కు ఇది వర్తిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నవారు అనుమతి పొందాక తమ ప్రాజెక్టును రెరా వద్ద నమోదు చేసి, వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలి. మూడునెలలకోమారు పనుల పురోగతి వివరాలు అప్డేట్చేయాలి. తద్వారా కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది. అనుమతి పొందిన ప్లాన్ అసలు ప్రతి, రివైజ్ చేస్తే ఆ వివరాలు, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుందో ఆ వివరాలు స్పష్టంగా వెల్లడించాలి. ఈ చట్టం వల్ల సామాన్యప్రజల ప్రయోజనాలకు రక్షణతోపాటు రియల్ఎస్టేట్ రంగం పురోగతికీఉపకరిస్తుందనిజీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో2985 ప్రాజెక్టులు.. 2017 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు పొందిన 2985 ప్రాజెక్టులు, హెచ్ఎండీఏ పరిధిలోని 840 ప్రాజెక్టుల వివరాలను రెరా వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. నవంబర్ నెలాఖరులోగా సంబంధిత డెవలపర్లు తమ ప్రాజెక్టుల్ని రెరా వద్ద నమోదు చేయించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శక ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇంకా.. ♦ బిల్డర్లు తమ కంపెనీ వివరాలు, స్థలంపై యాజమాన్య హక్కు,ఆర్థిక పరిస్థితి, చేపట్టే నిర్మాణాల వివరాలు, లీగల్ క్లియరెన్స్‌లు తదితరమైనవన్నీ వెబ్సైట్లో పొందుపరచాలి. ♦ రెరా అథారిటీ వద్ద వివరాలు నమోదు చేసుకున్నాకే వ్యాపార ప్రకటనలు ఇవ్వాలి. ♦ అనుమతి పొందిన ప్లాన్‌ను రివైజ్ చేయాల్సి వస్తే ఫ్లాట్లు బుక్‌చేసుకున్న వారి అనుమతితోనే రివైజ్ చేయాలి. ♦ ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రణాళిక, నిర్మిత స్థలం, కార్పెట్ ఏరియా వివరాలు పేర్కొనాలి. ♦ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలపాలి. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో ఆలస్యం అయ్యే కాలానికి కొనుగోలుదారులు చెల్లించిన సొమ్ముకు బిల్డర్లు వడ్డీ చెల్లించాలి.అలాగే కొనుగోలుదారుల చెల్లింపు ఆలస్యమైనా వడ్డీ కట్టాలి. ♦ ఇళ్ల కొనుగోలుదారులు తాము మోసపోతే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ♦ నిబంధనలను అతిక్రమించే వారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలు కూడా విధించవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు ఇలా.. ♦ ఆన్‌లైన్‌ద్వారా రెరా వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయాలి. ♦ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ నెంబరును ఫిర్యాదులో పేర్కొనాలి. ♦ నిర్ణీత ఫీజు రూ. 1000 చెల్లించాలి. ♦ డెవలపర్‌కు రెరా అథారిటీ నోటీసు జారీ చేస్తుంది. ♦ డెవలపర్ నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వాలి. నిర్ణీత తేదీన విచారణకు హాజరు కావాలి. ఫిర్యాదుదారు కూడా హాజరుకావాలి. ఉభయుల వాదనలు విన్నాక అథారిటీ తగిన ఉత్తర్వు జారీ చేస్తుంది. సంతృప్తిచెందని పక్షంలో రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చు. -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం: ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రముఖ నటుడు సుశాంత్ అనుమోలు అన్నారు. శుక్రవారం ఆర్టీసి కళ్యాణ మండపంలో అరోరా రామంతాపూర్ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఆలాప్ పేరిట సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సుశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి సారించకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మానవ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్.రమేష్ బాబు, కెఎంవి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ప్రముఖ విద్యావేత్త బాలాజి వీరమనేని, ప్రముఖ సినీ దర్శకులు పరశురాం, సంగీత దర్శకులు వివేక్ సాగర్, కళాశాల వైస్ చైర్మన్ ఎన్.అనుదీప్, డైరెక్టర్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ మోహన్ కుమార్, డాక్టర్ పి.జనార్ధన్ రెడ్డి, డిపార్ట్మెంట్ అధిపతులు సతీష్‌కుమార్, దేవేందర్ రావు,అర్పిత, శుభప్రద తదితరులు పాల్గొన్నారు. -
బీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఉస్మానియా ఆస్పత్రికి ‘బీ అలర్ట్’ అంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేయగా, ఇంజినీరింగ్ విభాగం రెండు రోజుల క్రితం నిర్మాణాన్ని పరిశీలించింది. రెండు మూడు రోజుల్లో ఆ విభాగం కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు భవనం పైకప్పు పెచ్చులూడడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందాల్సినపరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ కూడా తమకేం సంబంధం లేదని నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక వైద్యాధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండడంతో... ఇప్పట్లో కొత్త భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై ఆయా విభాగాల అధిపతులతో చర్చింది ఓ నిర్ణయం తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ భావించారు. ఈ మేరకు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నాలుగేళ్లయినా... నిర్వహణ లోపంతో పాతభవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో... అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల్లో ఏడు అంతస్తుల కొత్త భవనం నిర్మించాలని భావించారు. ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. ఓ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు. ఇప్పట్లో మోక్షం లేనట్లే... పాతభవనంలో రోగులకు చికిత్సలు ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించడంతో ఏడాది క్రితం రెండో అంతస్తులోని రోగులను ఖాళీ చేయించింది. వీరికి ప్రత్యామ్నాయంగా కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగుల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో అది కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇదే సమయంలో వైద్యులు, సిబ్బంది జేఏసీగా ఏర్పడి సుమారు 100 రోజులు నిరసన వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, వైద్యుల ఆందోళనలకు స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. కనీసం కొత్త భవనాల నమూనాలు కూడా ఆమోదం పొందలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండటంతో కొత్త భవనానికి ఇప్పట్లో మోక్షం లభించే అవకాశం కూడా లేకపోవడంతో వైద్యులతో పాటు రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హోమ్ వర్క్ ఎలా చేశావంటూ అసభ్యకరంగా..
హైదరాబాద్, సనత్‌నగర్: విద్యార్ధినుల పట్ల అభ్యకరంగా ప్రవరిస్తున్న కీచక గురువుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట పాటిగడ్డలోని బండిమెట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలకృష్ణ గత కొంతకాలంగా విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 30న ఓ బాలిక (13)ను హోమ్ వర్క్ ఎలా చేశావంటూ దగ్గరకు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం వారు స్థానిక కార్పొరేటర్ ఉప్పల తరుణి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా, మిగిలిన విద్యార్థినులు సైతం అతని వేధింపులను కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. దీంతో వారు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. -
ప్రగతి నివేదన సభకు వస్తున్నారా..?
సాక్షి, సిటీబ్యూరో: ప్రగతినివేదన సభకు వచ్చే వాహనాలు కచ్చితమైన రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, డ్రైవర్లు క్రమశిక్షణతో వాహనాలు నడపాలని ప్రాంతీయ రవాణా అధికారి, ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ పాపారావు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రగతి నివేదన సభకు తరలి రానున్న వాహనాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఆయన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌టేక్‌లకు స్థానం ఇవ్వరాదని కోరారు. లైన్ విధానాన్ని పాటించాలి. జనాన్ని సురక్షితంగా తీసుకొచ్చి తిరిగి అంతే సురక్షితంగా తమ ఇళ్ల వద్దకు చేర్చవలసిన బాధ్యత డ్రైవర్లపైనే ఉంది. ఇందుకోసం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి’ అని అన్నారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగవద్దని హెచ్చరించారు. మరోవైపు సభకు తరలి వచ్చే వాహనాల రాకపోకలు, డ్రైవర్లపై నిఘా, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. జిల్లాలవారీగా కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలపాలి. రోడ్డు భద్రతపైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. -
ఆమెకు 24.. అతడికి 19
బంజారాహిల్స్: ప్రేమ ఎలా.. ఎక్కడ.. ఎవరిపై.. ఎందుకు చిగురిస్తుందో అది ప్రేమించినవారికే తెలుస్తుంది. దానికి వయసుతో గానీ, పేదా, గొప్పా తేడాలు గానీ లేవనేందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతమే ఉదాహరణ. ఆమె వయసు 24.. అతని వయసు 19.. ఆమె ఎంబీఏ చదువుతుండగా. అతను ఏడో తరగతితో చదువుకు స్వస్తి పలికి వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమె ఐదంతస్తుల భవనంలో నివాసం ఉంటుండగా, అతను రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాడు. అయినా వారి ప్రేమ మధ్య చిగురించింది. ఇరువురి హృదయాలను ఒక్కటి చేసింది. తన ఇంటికి వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలిసి చెప్పాపెట్టకుండా ఇళ్లలోంచి వెళ్లిపోయారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు హఫీజ్‌పేట్‌లో ఉంటున్న వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చి వయసు నిర్ధారణ చేయగా ఆమె మేజర్ అని తేలింది. అతని వయసు 19 కావడంతో మైనర్‌గా తేల్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. ఇదిలా ఉండగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యువతి తల్లికి వారానికి ఓసారి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సెంచురీ ఆస్పత్రిలో డయాలసిస్ జరుగుతోంది. రెండు వారాల క్రితం తల్లికి తోడుగా వచ్చిన సదరు యువతి ఆస్పత్రిలో తల్లికి డయాలసిస్ జరుగుతుండగానే ప్రియుడిని అక్కడికి పిలిపించుకొని అతడితో కలిసి వెళ్లిపోయింది. అదే రోజు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తాజాగా వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాను ప్రియుడితోనే కలిసి ఉంటానని యువతి మొండికేయగా, మైనర్‌తో పంపేందుకు చట్టం ఒప్పుకోదని పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి పంపించారు. ప్రేమించిన వాడితో తనకు దుర్గ గుడిలో పెళ్లి కూడా జరిగిందని ఎలా విడదీస్తారని, ప్రియుడి నుంచి దూరం చేస్తే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఎటూ పాలుపోని పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. చట్టప్రకారం సదరు యువతిని ఎక్కడికి పంపించాలంటూ అడగగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్లాలని అనుకుంటే అక్కడికే పంపించవచ్చని తెలిపారు. దీంతో శుక్రవారం మరోసారి స్టేషన్లో పంచాయితీ నడిచింది. తాను ప్రేమించిన వాడితోనే వెళ్తానంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆ ప్రకారమే నడుచుకోవాల్సి వచ్చింది. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ప్రేమ వ్యవహారం పోలీసులకు గత రెండు వారాలు తలనొప్పిగా మారడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక సతమతమయ్యారు. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. శుక్రవారం జూ పార్కు సమీపంలోని ఓ లాడ్జీలో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ నిర్వహించారు. బర్త్‌డే పార్టీ పేరున ముగ్గురు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తూ కలకలం సృష్టించారు. యువకులతో పాటు లేడీ డ్యాన్సర్లు హుక్కా, పూటుగా మద్యం సేవించి అసభ్య నృత్యాలు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించిన కాలాపత్తర్ పోలీసులు ముగ్గురు ముజ్రా డ్యాన్సర్లను, ఆరుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. -
నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే...
సాక్షి, హైదరాబాద్ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ వన్‌గా, అవినీతిలో నెంబర్ 2గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమకు ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనబడుతోందని, ప్రగతి ఇంకా ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12న దీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశంలో సెక్రటేరియట్‌కు రాని నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్‌ను గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ‘‘25,000 మంది వీఆర్ఏలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలి. రింగ్ రోడ్డును మార్చుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రైతుల భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపినా వినటం లేదు. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 13,000 టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. మరో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. మన తెలంగాణలో అక్షరాస్యత 36 శాతం ఉంది. స్కూల్‌కు వెళ్లని వారు 30 శాతంపైగా ఉన్నారు. 57 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పాఠశాలలు మూసివేశారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రైతు అప్పులలో 2 స్థానంలో ఉండగా దాదాపు 35000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సగానికిపైగా ఇప్పటికీ ఖర్చు కాలేదు. పెన్షన్లు అందరికి ఇవ్వడం లేదు. ఉపాధి హామీ, పెన్షన్లపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఒక కుటుంబం కోసం, ఒక కాంట్రక్టర్ కోసం పాలన సాగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతి మయం అయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రగతి నివేదన సభకు రమ్మని అడిగితే ప్రజల సమస్యలను గురించి అడగండి. ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదని అడగండి. నేరేళ్ళలో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావు జాధవ్, గూడ అంజన్నలను కూడా మనం గౌరవించుకోవాల’’ని కోదంరామ్ అన్నారు. (చదవండి: హరికృష్ణ కారు ప్రమాదం.. మరి మా పరిస్థితి ఏంటి!?) -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. -
పచ్చదనం ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నో పార్కులు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించి వివరాలు మాత్రం లేవు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వందలాది పార్కుల నిర్వహణ కొనసాగుతోంది. వీటి అభివృద్ధి కోసం రూ.కోట్లలో నిధులు కూడా వెచ్చిస్తోంది. అయితే ఆయా పార్కుల్లో వసతుల కల్పన, అభివృద్ధికి సంబంధించి వివరాలు మాత్రం ఉండడం లేదు. పార్కును ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు? ఆ తర్వాత దశల్లో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? పచ్చదనం, ల్యాండ్‌స్కేప్, వాక్‌వే ఎంత? ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సదుపాయాలేమిటి? తొలి రోజుల్లో ఎంతమంది సందర్శకులు వచ్చేవారు, ఇప్పుడెంత మంది వస్తున్నారు? ఇలా ప్రతిదీ ప్రశ్నార్థకమే! ఈ నేపథ్యంలో పార్కులకు సంబంధించి పై వివరాలతో సమగ్రంగా ‘గ్రీన్‌బుక్’లు రూపొందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జీవవైవిధ్య విభాగం అధికారులను ఆదేశించారు. పార్కులకు సంబంధించి ఇలాంటి వివరాలు దేశంలోనే ఏ నగరంలోనూ అందుబాటులో లేవు. జీహెచ్ఎంసీనే తొలిసారిగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పార్కులివీ... జీహెచ్ఎంసీ నిర్వహణలో మేజర్ పార్కులు 17, థీమ్ పార్కులు 16, బయోడైవర్సిటీ పార్కులు 10, కాలనీ పార్కులు 806, ట్రీ పార్కులు 324 ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే గ్రీన్బుక్లు తయారు చేయనున్నారు. తొలుత మేజర్ పార్కుల గ్రీన్బుక్లను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో పాటు మేజర్ పార్కుల్లో వివరాలు తెలిసేలా బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. పచ్చదనం ఎంత? జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అయితే ఇందులో ప్రస్తుతం ఎంతశాతం పచ్చదనం ఉందో తెలుసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ పార్కులు, ఖాళీ స్థలాలు, శ్మశానవాటికలు.. అటవీశాఖల కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లోని గ్రీనరీని లెక్కించాలన్నారు. అదే విధంగా జీహెచ్ఎంసీ గుర్తించిన 1049 ఖాళీ స్థలాల్లో కొత్త పార్కుల్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ నిధులతోనే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద కార్పొరేట్ సంస్థల నుంచి సహకారం పొందాలని సూచించారు. అదనంగా 5 లక్షల మొక్కలు... ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడత హరితహారంలో నాటనున్న 40లక్షల మొక్కలకు అదనంగా మరో 5లక్షలు నాటాలని కమిషనర్ సూచించారు. తద్వారా నగరంలో గత మూడేళ్లలో రెండు కోట్ల మొక్కలు నాటినట్లవుతుందన్నారు. ప్రస్తుత హరితహారంలో ఇప్పటికే 30.60 లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో 3.59 లక్షల మొక్కల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాటినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, కృష్ణ, డైరెక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కేరళ వరద బాధితులకు అండగా నిలిచింది. రూ.10 లక్షల నగదు ఆర్థిక సాయం అందజేసినట్లు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత దాక్టర్ జడపల్లి నారాయణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా 100 క్వింటాళ్ల బియ్యం, 10 క్వింటాళ్ల కంది పప్పు, వాటర్ బాటిళ్లు, బట్టలు, బిస్కెట్ ప్యాకెట్లను ప్రత్యేక లారీలో కేరళలోని వరద బాధిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు. -
బంపర్ ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి వ్యధను వివరిస్తూ ‘సాక్షి’ ఈ నెల 27న ‘మాటలేనా’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారని... ఈ మేరకు హెచ్ఎండీఏ లేఖ రాయగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి కేటీఆర్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించడంతో పాటు ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇన్షియల్ పేమెంట్ చెల్లించని 9,833 మందికి లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెవెన్యూ, నీటి పారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎన్వోసీల దరఖాస్తుదారులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లించాలని సందేశం... హెచ్‌ంఎడీఏ ఐటీ సెల్ అధికారులు ‘మీ ఎల్ఆర్ఎస్ రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ చెల్లించాలం’ టూ 9,833 మంది దరఖాస్తుదారుల సెల్ నెంబర్లకు మెసేజ్‌లతో పాటు ఈమెయిల్స్ పంపించనున్నారు. దరఖాస్తుదారుడు ఫీజు కట్టిన వెంటనే ఆ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తి చేసి సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దర ఖాస్తుదారుడి సెల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్లు పం పుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన 1,76,036 దరఖాస్తుల్లో 1,00,322 క్లియర్ చేశా రు. 54 మంది దరఖాస్తుదారులకు పంపిన షార్ట్‌ఫాల్స్ పత్రాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. 1,694 దరఖాస్తులు క్లియరెన్స్ ప్రక్రియలో ఉన్నా యి. 2,237 ఎన్వోసీలు లేని దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. 676 దరఖాస్తులను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. రెండు వేల ఆఫ్‌లైన్ ఫైళ్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 61,122 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మ్యాన్‌ఫాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు,ఓపెన్‌స్పేస్ ఆఫ్ లేఅవుట్,నది, వాగు, నాలా బఫర్ జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన సమాచారం అందు కున్న 1,00,322 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించినా... వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటోందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్ ప్రొసిడింగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తాజాగా ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు కూడా అవకాశం ఇవ్వడంతో మరో రూ.100 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు క్లియర్ అయిన దర ఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో రూ. 700 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.250 కోట్లు చెల్లించారు. -
బిహారీల దాదాగిరి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట బిహారీ యువకులు దాదాగిరీ చేశారు. పార్కింగ్ సిబ్బంది వారిని అడ్డుకున్నందుకు ఆందోళనకు దిగారు. దీంతో గురువారం సాయంత్రం కొద్ది సేపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి గందరగోళం నెలకొంది. ఆర్మీ, ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు గోపాలపురం పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి పంపివేశారు. వివరాల్లోకి వెళితే..రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష రాసేందుకు బిహార్‌కు చెందిన యువకులు వందల సంఖ్యలో నగరానికి వచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్ వచ్చేందుకు సమయం ఉండడంతో స్టేషన్ ముందు ఉన్న పెయిడ్ పార్కింగ్ స్థలంలో సేదతీరే ప్రయత్నం చేశారు. ఇందుకు అభ్యంతరం చెప్పి పార్కింగ్ సిబ్బంది స్టేషన్‌లోపలికి వెళ్లి వెయిటింగ్‌రూంలో వేచి ఉండాలని సూచించాడు. రైలు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని భీష్మించుకున్న ఓ యువకుడు పార్కింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాటామాటా పెరిగి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో బిహారీ యువకులందరూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. గొడవకు కారణమైన యువకుడిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, వారు పోలీసు వాహనానికి అడ్డుగా నిల్చుని నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో గందరగోళం నెలకొంది. ఆర్మీ సిబ్బంది. వివిధ విభాగాల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైలు వచ్చేవరకు 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆసీనులు కావాలని రైల్వే అధికారులు అనుమతించడంతో వారు స్టేషన్‌లోపలికి వెళ్లిపోయారు. -
ఆ సవాల్‌కు సింధు, సైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారత టాప్‌స్టార్స్‌కు మింగుడు పడని చైనీస్ తైపీ ప్రత్యర్థి తై జు యింగ్‌ను త్వరలోనే ఓడిస్తామని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆసియా గేమ్స్‌లో సింధు, సైనాలిద్దరు రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరిద్దరిని ప్రపంచ నంబర్‌వన్ తై జునే ఓడించింది. భారత బ్యాడ్మింటన్ బృందం స్వదేశం చేరాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ మాట్లాడుతూ ‘సింధు, సైనాలిద్దరు మేటి షట్లర్లు. మానసిక, శారీరక స్థైర్యంతో ఉన్నారిద్దరు. ఎవరికి తీసిపోరు. అంత తేలిగ్గా ఓడిపోరు. త్వరలోనే తైపీ మిస్టరీని ఛేదిస్తారు. రచనోక్ ఇంతనోన్‌ను ఓడించినట్లే తై జుపై గెలుస్తారు. ఏటా చాలా టోర్నీలు జరుగుతున్నాయి. ఇందులో ఆడటం ద్వారా ప్రదర్శన, పోటీతత్వం మరింత మెరుగవుతాయి. అప్పుడు ఆమెను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. టాప్‌స్టార్స్ ఇద్దరు కలిసి ఆమె చేతిలో మొత్తం 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. దీనిపై గోపీ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఆమె ఓ లేడీ తౌఫిక్ హిదాయత్ (మాజీ ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్). అన్నింటా మెరుగైన ప్రత్యర్థి. కోర్టుల్లో చురుగ్గా కదం తొక్కుతుంది. తనకెదురైన ప్రత్యర్థికి దీటుగా బదులిస్తుంది. స్మార్ట్‌గా స్పందిస్తుంది. అన్ని రంగాల్లోనూ బలంగా ఉంది. ప్రస్తుతం తై జు, మారిన్ (స్పెయిన్) ప్రపంచ టాప్ షట్లర్లు. వీరిని ఓడించే వ్యూహాలతో సిద్ధమవుతాం’ అని వివరించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో తొలిసారి రెండు పతకాలు గెలవడం ఆనందంగా ఉందన్నారు. 23 ఏళ్ల సింధు మాట్లాడుతూ ‘పోడియం ఫినిష్ ఎప్పటికీ చిరస్మరణీయమే. పతక విజేతగా నిలబడి మనముందు జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేను. అయితే ఈ పతకాలను ఆస్వాదించే సమయం కూడా మాకు లేదు. జపాన్ ఓపెన్ (సెప్టెంబర్ 11 నుంచి) కోసం వెంటనే సన్నాహకాల్లో పాల్గొనాలి’ అని చెప్పింది. తన ఆసియా గేమ్స్ పతకాన్వేషణ ఎట్టకేలకు జకార్తాలో ముగిసిందని సైనా తెలిపింది. ‘నాకు ఇది నాలుగో ఏషియాడ్. గత మూడు ఈవెంట్లలోనూ ఎంతో కష్టపడ్డా సాధ్యం కాలేదు. చివరకు ఇక్కడ సాకారమైంది’ అని చెప్పింది. -
మర్యాద రామన్నలే!
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లలో జర్నీ చేసే వారిలో అధిక శాతం మర్యాద రామన్నలే. తొమ్మిది నెలల మెట్రో జర్నీలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నమోదైన కేసులు కేవలం 12కు మించకపోవడంతో ఈ విషయం విస్పష్టమవుతోంది. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మెట్రో ప్రయాణం సురక్షితంగా మారిందని అవగతమవుతోంది. సాక్షి, సిటీబ్యూరో :మహానగరవాసుల ట్రాఫిక్ అవస్థలను దూరం చేసేందుకు మెట్రో రైళ్లను గత ఏడాది నవంబరు 29 నుంచి గ్రేటర్‌వాసులకు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అత్యాధునిక భద్రతా ఏర్పాట్ల మధ్యన మెట్రో స్టేషన్లు, రైళ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో ఒక్కో మెట్రో స్టేషన్‌ను.. రూ.30 కోట్ల ఖర్చుతో ఒక మెట్రో రైలు (మూడు బోగీలను)ను తీర్చిదిద్దారు. వీటిలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పకడ్బందీగా సీసీ టీవీల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో మెట్రో జర్నీ సురక్షితమైన ప్రయాణాన్ని సిటీజన్లకు సాకారం చేస్తోంది.కాగా నగరంలో ప్రస్తునికి నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో ఇటీవలికాలంలో నిత్యం సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తుండడం విశేషం. కాగా రైళ్లలో ప్రయాణించేందుకు వచ్చేవారు సిగరెట్లు వెలిగించుకునేందుకు లైటర్లు, అగ్గిపెట్టెలను కూడా వెంట తీసుకొస్తే మెట్రోస్టేషన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సెక్యూరిటీ చెక్ ఇలా.. ⇔ ప్రతీ స్టేషన్లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్లున్నాయి ⇔ డీఎఫ్‌ఎండీడోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లున్నాయి ⇔ పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తున్నారు ⇔ బ్యాగు నిడివి 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ⇔ ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలని నిబంధనలున్నాయి ఉల్లంఘన కేసులు ఇవీ.. ⇔ ఓ గుర్తుతెలియని వ్యక్తి లైసెన్సు లేని గన్‌తో మెట్రో స్టేషన్లోకి ప్రవేశించడంతో బ్యాగేజీ తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు ⇔ మెట్రో రైలులో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఘటనపై ఓ కేసు నమోదైంది ⇔ మెట్రో స్టేషన్లలో భద్రతా సిబ్బంది, టిక్కెట్ జారీచేసే సిబ్బంది, స్మార్ట్‌కార్డు రీచార్జి చేసే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు మరో మూడు కేసులు నమోదయ్యాయి ⇔ అత్యవసరం కాకపోయినా అత్యవసరంగా మెట్రో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బటన్ నొక్కిన వైనంపై మరో కేసు నమోదైంది ⇔ అవగాహన రాహిత్యంతో మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించి ట్రాక్‌పై అనుమతి లేకుండా ప్రవేశించిన ఆరుగురిని భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు నిషేధాలివీ.. ⇔ స్టేషన్లు, బోగీలు, పరిసరాల్లో ఉమ్మి వేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం ⇔ మెట్రో రైలు పరిసరాల్లో ఆల్కహాల్ తాగవద్దు ⇔ రైలులోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయొద్దు ⇔ వస్తువులను స్టేషన్లు, బోగీల్లో మరచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ⇔ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లో కూర్చోవద్దు ⇔ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు ⇔ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం ⇔ ప్రమాదకర వస్తువులు,అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, బోగీల్లోకి తీసుకురావద్దు ⇔ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోవద్దు ⇔ ప్లాట్‌ఫాంపై రైలుకోసం వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు ⇔ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు ⇔ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టవద్దు ⇔ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు.. ఇలా తదితర నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
టీ20లో 'జేజమ్మ'
భారత మహిళల క్రికెట్ జట్టులో నగరం నుంచి మరో అమ్మాయి స్థానందక్కించుకుంది. ఇప్పటికే మిథాలీరాజ్‌కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా... మరికొంత మంది ఇండియన్ ఉమెన్స్ టీమ్‌లో ఆడగా, ఇప్పుడు మరో అమ్మాయి జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం.నగరంలోని డిఫెన్స్ కాలనీకి చెందినఅరుంధతీరెడ్డి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైంది.ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు... సాక్షి, సిటీబ్యూరో :ఆధునిక యువతులు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఆకాశంలో,అవకాశాల్లో తమ ముద్రతో ప్రగతిపథాన సాగుతున్నారు. క్రీడల్లోనూ ఎదుగుతూ పురుషులకు తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువతే అరుంధతి. భారత మహిళల టీ–20 జట్టులోకి ఎంపికయ్యింది. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనుంది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీకి చెందిన అరుంధతిరెడ్డి ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ క్రమంలోక్రికెట్ ప్రపంచంలో తన ప్రస్థానం. అంచలంచెలుగా ఎదిగిన విధానం. ఎదుర్కొన్న ఇబ్బందులుమహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన విశేషాలను, అనుభవాలను పంచుకుందిలా.. - చైతన్య వంపుగాని అన్న ఆడుతుంటే చూసేదాన్ని.. అన్న రోహిత్ మంచి క్రికెటర్. ప్రతిరోజూ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అన్నవాళ్లు ఆడుతుంటే బయట నిలబడి ఆటను చూస్తూ బాల్స్ అందించేదాన్ని. ప్రాక్టీస్ అనంతరం పిల్లలందరం కలిసి గల్లీలో క్రికెట్ ఆడేవాళ్లం. మళ్లీ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాళ్లం. దీంతో క్రికెట్‌పై ఆసక్తి బాగా పెరిగింది.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎక్కువైంది. ప్రతిరోజూ జింఖానాగ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. మిథాలీ బ్యాటింగ్ స్టైల్‌కు ఫిదా ఇండియన్ టీం కెప్టెన్ మిథాలీరాజ్ ఆటను చూస్తూ పెరిగాను. ఆమెను నేను అక్కా అని పిలుస్తా. రెండేళ్ల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వేస్‌కు సెలెక్ట్ అయినప్పుడు మిథాలీ అక్కతో నాకు మరింత అనుబంధం పెరిగింది. కోచ్ మూర్తి సర్ కూడా 3, 4 గంటల పాటు మిథాలీ బ్యాటింగ్ ఎలా చేస్తుందో గమనించు, నేర్చుకో అని చెప్పేవారు. మిథాలీ అక్క షాట్లకు ఫిదా అయ్యాను. అమ్మ ప్రోత్సాహం మరువలేను.. మా అమ్మ పేరు భాగ్య. ఆమె మంచి వాలీబాల్ ప్లేయర్. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను ఆటను మధ్యలో వదిలేసింది. ప్రస్తుతం టీచర్‌గా చేస్తోంది. నా ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచే వాళ్లం. ప్రాక్టీస్ 9.30 గంటల దాకా చేసేదాన్ని. మళ్లీ సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవాళ్లం. రాత్రి 7.30గంటల వరకు అమ్మ కూడా నాతోనే ఉండేది. అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇండియా ‘గ్రీన్’తో అందరి దృష్టిలో పడ్డా.. ఇటీవల జరిగిన ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో ‘ఇండియా గ్రీన్’ టీంలో ఆడాను. ‘ఇండియా బ్ల్యూ’ టీంలో మిథాలీ ఉన్నారు. ఓ మ్యాచ్‌లో నేను మిథాలీని బౌల్డ్ చేశాను. అన్ని మ్యాచ్‌ల్లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. దీంతో భారత టీ20 జట్టులో అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లివే.. ఇప్పటి వరకు అండర్– 19, 23, సీనియర్స్, సీనియర్ జోనల్స్, ఛాలెంజర్స్, ఇండియా ‘ఎ’, సౌత్ సెంట్రల్ రైల్వేస్ మ్యాచ్‌లలో ఆడాను. వీటన్నింటిలో ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరిచా. సెప్టెంబర్ 19 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్ ఉంది. వీటిలో సత్తా చాటి మున్ముందు వన్డేల్లోకి కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. అనన్య మెసేజ్‌తో సర్ప్రైజ్ ఈ నెల 23న ఎప్పటిలాగానే క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేశా. సాయంత్రం 6.30గంటలకు ఇంటికి బయలుదేరుతూ.. టేబుల్లో ఉన్న ఫోన్ తీసి చెక్ చేస్తుంటే నా స్నేహితురాలు అనన్య ఉపేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. ‘కంగ్రాట్స్ డియర్.. యూ ఆర్ సెలక్టెడ్ ఇన్ ఇండియా టీ20 టీమ్’ అని ఉంది. ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఆ వెంట వెంటనే ఎనిమిది మంది నుంచే కంగ్రాట్స్ మెసేజెస్ వచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి ‘అమ్మా.. నేను ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యానని చెప్పాను’. ఆ తర్వాత కెనడాలో ఉన్న అన్న రోహిత్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికి వెళ్లేసరికి బంధువులు, స్నేహితులు ఫ్లవర్ బొకేస్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. మహిళా క్రికెట్‌కు ఆదరణ.. మహిళా క్రికెట్‌పై అందరిలోనూ ఆదరణ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు క్రికెట్ వైపు చూస్తున్నారు. అరుంధతికి ఎన్నో సలహాలు ఇచ్చాను. ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నా పేరు ఒక్కటే వినిపించేది. ఇప్పుడు నాతో పాటు అరుంధతి పేరు అంతర్జాతీయంగా వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.– మిథాలీరాజ్, భారత మహిళల వన్డేజట్టు కెప్టెన్ నాకెంతో గర్వంగా ఉంది అరుంధతి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం నాకెంతో గర్వంగా ఉంది. రెండేళ్ల పాటు సౌత్‌సెంట్రల్ రైల్వేస్ తరఫున ఆడిన సమయంలో తన పట్టుదలను పసిగట్టాను. కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ ఎంపికవుతుందనే నమ్మకం వచ్చింది. మిథాలీ తర్వాత అరుంధతి ఇండియన్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. – రాయప్రోలు మూర్తి, కోచ్ -
సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు. విచారణ జరిగే సెప్టెంబర్ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్‌కు విమానంలో, వెర్నన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, లాయర్ సుధా భరద్వాజ్‌ను ఫరీదాబాద్‌లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖండించిన మేధావులు, కార్యకర్తలు.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్‌లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్ స్వామి ఆరోపించారు. మరోవైపు, గౌతమ్ నవలాఖా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. -
ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర
-
తెలుగులోనే మాట్లాడతానని చెప్పాడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్డాడని, తాను జోక్యం చోసుకుని తెలుగును ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పిన విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధీవదేహానికి వెంకయ్య నాయుడు నివాళులుల అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బ్రతికాడని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణ అని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నాఉ. తన కుటుంబానికి , హరికృష్ణ మరణం తీరని లోటని అన్నారు. -
రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు
-
త్రిశూల్, అనూప్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో త్రిశూల్, అనూప్ సెమీఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన జూనియర్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో త్రిశూల్ (ఎస్పీహెచ్ఎస్) 3–0తో యశ్ (పీఎస్ఎం)పై, అనూప్ (ఎస్పీహెచ్ఎస్) 3–2తో రాజు (పీవీఎన్‌హెచ్‌ఎస్)పై గెలిచారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో అథ ర్వ (చిరెక్) 3–0తో యశ్ చంద్ర (ఎస్పీహెచ్ఎస్)పై, సాయికిరణ్ (పీవీఎన్‌హెచ్‌ఎస్) 3–1తో ప్రణవ్ (చిరెక్)పై నెగ్గారు. మరోవైపు జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్‌పాల్స్ హైస్కూల్ 3–0తో చిరెక్ ఐసీఎస్‌సీపై, చిరెక్ సీబీఎస్ఈ 3–0తో భారతీయ విద్యా భవన్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. -
వరవరరావును హైదరాబాద్ తీసుకొచ్చిన పుణె పోలీసులు
-
హైదరాబాద్‌లో నివాసానికి వరవరరావు
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. వరవర రావుపై ఆందోళన వద్దు: హైకోర్టు నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ -
మరోసారి ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలకు తెరలేపింది. పోలీసు శాఖకు సంబంధించి జిల్లాల్లో కీలక బాధ్యతలలో ఉన్న తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్‌గా శివప్రసాద్‌ను నియమించా రు. ఇప్పటివరకు ఇదే పోస్టులో ఉన్న మురళీకృష్ణను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కార్ హెడ్‌క్వార్టర్ అదనపు కమిషనర్‌గా బదిలీ చేసింది. ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్ పోస్టును భర్తీ చేసింది. మరోసారి ఐఏఎస్‌ల బదిలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం.జగన్మోహన్ ఈ నెల 31న రిటైర్ అవుతుండటంతో ఆయన స్థానంలో రాహుల్ బొజ్జాను, ధరణి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి రజత్‌కుమార్ శైనినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించిన డి.అమోయ్‌కుమార్‌ను ప్రభుత్వం ఒక్కరోజులోనే బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిందీ ప్రస్తావించలేదు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పని చేస్తున్న భారతి హొళికెరి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తూ బదిలీ అయిన కాట ఆమ్రపాలిని నియమించింది. భారతి హొళికెరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న కె.శశాంకను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలతో ఈ పోస్టులో ఉన్న రోనాల్డ్‌రాస్‌ను రిలీవ్ చేశారు. -
ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాజీ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవచేశారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. హరికృష్ణ మృతిపట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘నా మిత్రులు కళ్యాణ్ రాం, ఎన్టీఆర్‌ల తండ్రి హరికృష్ణ మరణం చాలా బాధాకరం. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి కోరిక, ఏపీ సూచనల మేరకు అంత్యక్రియలపై నిర్ణయం జరిగింది. రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నార’’ని తెలిపారు. -
హైదరాబాద్ చేరుకున్న హరికృష్ణ భౌతిక కాయం
-
హైదరాబాద్ చేరుకున్న హరికృష్ణ భౌతిక కాయం
-
ప్రజాసంఘాల నేతలు అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ రణరంగంగా మారింది. దేశవ్యాప్తంగా వరవరరావుతో సహా అనేక మంది హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లోని ట్యాంక్బండ్వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న దళిత, పౌరహక్కుల నేతలు, కార్యకర్తలు, లాయర్లు, కవులు, రచయితలు, కార్యకర్తలను తెలంగాణ పోలీసులు బలవంతంగా గుంజుకపోయారు. మరికొంతమందిని అసలు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన చేపట్టబోతున్న ఆందోళనకారులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఒక్కసారిగా ఉద్యమకారులపై విరుచుకుపడిన తెలంగాణ పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దొరికిన వారిని దొరకినట్టు బలవంతంగా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి నాంపల్లి, బొల్లారం, గోషామహల్, బేగం బజార్, ముషీరాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముఖ్యంగా సామాజిక కార్యకర్త సజయ, సుధ, విరసం మంజుల, అరుణోదయ విమల, బండారు విజయ, లలిత, జయశ్రీ, ఖలీదా,గీతాంజలి, ప్రగతిశీల మహిళాసంఘం నాయకులు సంధ్య, ఝాన్సీ, ఇఫ్టూ అనురాధతో పాటు ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన కొనసాగిస్తున్నారు. -
స్మార్ట్ పాలన... ‘బిగ్’ ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెలాంటి హైదరాబాద్‌ను ఇక్కడ సమృ ద్ధిగా ఉన్న వనరులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి, పారదర్శక సేవలకు అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న బిగ్ డేటా అనలిటిక్స్‌తో సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న, వలసలతో పెరిగిపోతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు క్షేత్రస్థాయిలో తక్షణ సేవలందేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అవినీతికి అస్కారం లేకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదంగా.. ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తనముందున్న పెద్దప్రాజెక్టులు కాగా, చెరువుల సుందరీకరణ, ప్లేగ్రౌండ్స్, పార్కుల్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దడంపై శ్రద్ధ వహిస్తానన్నారు. రహదారులపై గుంతల సమస్యపైనా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 23 చెరువుల సుందరీకరణకు ముంబైకి చెందిన కన్సల్టెంట్ నివేదిక అందాక పనులు చేపడతామన్నారు. టాయ్లెట్ల నిర్వహణలో సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల్లో జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. చెత్తను తడిపొడిగా వేరు చేయడం జాతీయస్థాయిలో దాదాపు 25 శాతం మాత్రమే ఉండగా, నగరంలో 50 శాతం ఉందన్నారు. ఈ–వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు, వరదకాలువలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. సహకరించే పాలకవర్గం, అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఐఏఎస్‌ల సమన్వయం, సహకారాలతో తగిన ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధించగలనన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ‘ప్రజావాణి’ ‘మైజీహెచ్ఎంసీ’ యాప్, తదితరమైన వాటిని మెరుగు పరుస్తానన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా అందే ప్రజాసేవల్లో గడచిన నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ,మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానన్నారు. గత కమిషనర్ జ నార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని దానకిశోర్ పేర్కొన్నారు. థర్డ్‌పార్టీ ఫీడ్‌బ్యాక్.. వాటర్‌బోర్డులో మాదిరిగా సమస్య పరిష్కారమైందీ లేనిదీ, థర్డ్‌పార్టీ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామన్నారు. చదివే అలవాటు పెంచేందుకు కాఫీషాప్స్లో బుక్స్ ఏర్పాటుపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. చెత్త సమస్యలు తీవ్రం.. ప్రతి నగరానికీ చెత్త సమస్య తీవ్రంగా ఉందంటూ, ప్రస్తుతం ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల చెత్త వెలువరిస్తుండగా, భవిష్యత్‌లో ఇది 1500 గ్రాములకు పెరగనుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ఖాళీ ప్రదేశాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తామన్నారు. -
కుమార్తెపై లైంగికదాడికి యత్నం
రసూల్‌పురా: కన్న తండ్రే కుమార్తెపై లైంగికదాడికి యత్నించిన సంఘటన బోయిన్పల్లి పీఏస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దిల్‌కుష్‌నగర్‌కు చెందిన సమీర్షరీఫ్ పాత నేరస్తుడు. గతంలో ఇతను జీడిమెట్ల పీఎస్ పరిధిలో రేప్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిని మొదటి భార్య వదిలివేయడంతో ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె(11)పై లైంగికదాడికి యత్నించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఫాతిమా కుమార్తెను రక్షించి స్థానికులకు సమాచారం అందించడంతో వారు అతడిని చితకబాదగా నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు -
రాష్ట్రపతి.. ఓ చిరుద్యోగి
అదేంటి రాష్ట్రపతి... ఓ చిరుద్యోగి ఏంటిఅనుకుంటున్నారా? ఈయన దేశ రాష్ట్రపతి కాదండి.. ఓయూ రాష్ట్రపతి.యూనివర్సిటీలకు కూడా రాష్ట్రపతి ఉంటారా అంటారా? అయితే ఇది చదవండి..మీకే అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లుగా టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఆయన పేరే రాష్ట్రపతి. ఇది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరే. దీంతో ఆయన ఓయూ రాష్ట్రపతిగా పేరొందారు. ఈ నెల 31న రాష్ట్రపతి ఉద్యోగ విరమణ చేయనున్నారు. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలసి టీచర్‌గా పనిచేసిన పత్రి శంకరయ్య, బస్వమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో రాష్ట్రపతి చిన్నవాడు. రాష్ట్రపతి సోదరులకూ చివరికి ‘పతి’ అని వచ్చేలా విశ్వపతి, ఉమాపతి, గణపతి, గజపతి అని పేర్లు పెట్టారు. అయితే చివరి వాడైన రాష్ట్రపతి పేరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత 1980లో ఓయూలో టెక్నీషియన్ ఉద్యోగంలో చేరి... కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లు సేవలందించాడు. అతను రాష్ట్రపతి కాలేకపోయిన... ప్రతిరోజు రాష్ట్రపతి అని పిలుపించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని సహోద్యోగులు పేర్కొన్నారు. -
‘ముందస్తు ఎన్నికలు.. కాంగ్రెస్‌కు సంతోషం’
ఢిల్లీ: ముందస్తు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిథి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్కు ముందస్తు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వెళ్లినపుడు సింహంలా దూకుతుందని అభివర్ణించారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే కారణంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. మోదీతో మిత్రత్వం దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయపార్టీ అని, కొంత మంది అసంతృప్తివాదులు ఉంటారని.. కానీ యుద్ధంలోకి దిగేటపుడు అందరూ ఒక్కటవుతారని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఎవరికీ నీరు రాలేదని, కేవలం కాంట్రాక్టర్లకు నిధులు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు ప్రచారం నిర్వహించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా తెల్సిందని అన్నారు. కేసీఆర్ హామీలను విస్మరించారని, మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. -
చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేయడమేంటి?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకురావడం కూడా గొప్పే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం దుబారా కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. పంటి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని వ్యాఖ్యానించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడి ఫోటోకు పాలాభిషేకం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా, తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. స్పీకర్ కోడెల తీరు బాధాకరమన్నారు. స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పదవిని వదిలి బాబుకు పాలాభిషేకం చేసుకోండని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్న కోడెల శివప్రసాదరావు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీచైతన్యలో మరో విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేట శ్రీ చైతన్య మహిళా జూనియర్ కాలేజీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటీనా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చనిపోయింది. అర్చన స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. కాలేజీ డీన్ మమతా తిట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విద్యార్థి కుటుంబసభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
-
జిగేల్ సిగ్నల్స్
సాక్షి, సిటీబ్యూరో: ‘సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్ద ఓ బస్సు వెనుక ఉండి డ్రైవ్ చేస్తున్నాడు. దీంతో ఇతడికి సిగ్నల్ స్తంభం తప్ప దానికి ఉండే రెండు సిగ్నల్స్ కనిపించలేదు. అప్పటి వరకు ‘గ్రీన్’గా ఉన్న సిగ్నల్ హఠాత్తుగా ‘రెడ్’గా మారింది. ముందు బస్సుతో పాటే వెళ్తున్న ఇతడికి జంక్షన్ అవతల వైపు ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాతో పాటు పెనాల్టీ పాయింట్ సైతం విధించారు.’ సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్‌తో అనేక మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా జరిమానాతో పాటుపెనాల్టీ పాయింట్ తప్పట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఆ ఉల్లంఘన ప్రమాదకరం కావడంతో... సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రాణాంతకమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రాణాంతకమైనవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. సిగ్నల్ జంపింగ్ అనేది ఈ మూడో కేటగిరీ కిందికి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఓ వాహనచోదకుడు చేసిన తప్పువల్ల నిబంధనలు పాటించే ఎదుటి వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇలాంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిటీలో ఉన్న సిగ్నల్ స్తంభాల్లో రెండు చోట్ల మాత్రమే సిగ్నల్ లైట్లు ఉంటున్నాయి. రోడ్డుకు కుడి పక్కన ఉండే స్తంభం మధ్య భాగంలో, దానికి పైన రోడ్డు మధ్యలోకి వచ్చే విధంగా మరోటి (థర్సర్ సిగ్నల్) మాత్రమే ఉంటున్నాయి. దీంతో ముందు వరుసలో పెద్ద వాహనాలు ఉండే వెనుక వారికి ఆ సిగ్నల్స్ కనిపించవు. ఫలితంగా వారి తప్పు లేకుండానే ఉల్లంఘనులుగా మారిపోతున్నారు. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి... ఈ తరహా ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్తంభం కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్తంభాన్ని చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహన చోదకులు నిర్ధారించుకోవచ్చని ఓ ఆలోచన చేశారు. సిగ్నల్ స్తంభానికి రెండు ప్రాంతాల్లో ఉండే లైట్ల మధ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు వీటిని సిగ్నల్‌తో అనుసంధానిస్తున్నారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్ పడితే ఆ రంగులోకి మారతాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఆయకార్ భవన్ నుంచి కమిషనరేట్‌కు వెళ్లే సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్ కనిపిస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ఊహూ..నై..నై!
సాక్షి,సిటీబ్యూరో: పాతనగరంలో మెట్రో రైలు పనులు కష్టతరంగానే కన్పిస్తోంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా ఇటీవల అలైన్మెంట్ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ..సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనాస్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీదసాములా మారాయి. ఈనేపథ్యంలో పాతనగరంలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గాల్లో 2017 జూన్ నాటికి పూర్తిచేయాల్సిన మెట్రో ప్రాజెక్టు దాదాపు రెండేళ్లు ఆలస్యమవుతున్న విషయం విదితమే. సవాళ్లెన్నో... పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వందకోట్లకుపైగానష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓల్డ్‌సిటీలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయడంతోపాటు సాలార్‌జంగ్‌మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా> ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లపాటు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా గతంలో పాతనగరంలో మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా– కాలపత్తర్– ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లున్న విషయం విదితమే. ఈ రూట్లలో మెట్రో రైట్..రైట్.. సెప్టెంబరు తొలివారంలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రూట్లో ఇప్పటికే మెట్రో రైళ్లకు భద్రతా పరీక్షలు జరుగుతున్నాయి. నేడో రేపో కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి భద్రతా ధ్రువీకరణ జారీకానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది నవంబరులో అమీర్‌పేట–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయని పేర్కొన్నాయి. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో వచ్చే ఏడాది మార్చినాటికి మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయని తెలిపాయి. కాగా ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు 85 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే ఉంది. ఇక త్వరలో ప్రారంభంకానున్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నిత్యం అదనంగా మరో లక్షమంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనావేస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గంలో బస్సు లేదా కారు లేదా ద్విచక్రవాహనంపై ప్రయాణానికి గంటన్నర నుంచి సుమారు రెండున్నర గంటల సమయం పడుతోంది. అదే మెట్రో జర్నీ అయితే ఒక చివర నుంచి మరోచివరకి కేవలం 45–55 నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు తమ వ్యక్తిగత వాహనాల్లో వినియోగించే ఇంధన ఖర్చుతోపాటు విలువైన సమయం ఆదా అయ్యే పరిస్థితులుండడంతో మెట్రో జర్నీకి మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. ప్రధానంగా ఈ రూట్లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు, వ్యాపారులు ఈ రూట్లో మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తిచూపుతారని భావిస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఆయా మెట్రో స్టేషన్ల వద్ద తమ వ్యక్తిగత వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించడంతోపాటు ఆయా స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆధునిక సైకిళ్లు ,బైక్‌లు అద్దెకు లభిస్తాయని..క్యాబ్‌సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఈ రూట్లో మెట్రో సాకారమైతే ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ సైతం తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపాయి. -
గ్యాస్ డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్ఎంఎస్లు
అత్తాపూర్‌కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసింది. నాలుగు రోజులు తరువాత క్యాష్ మెమో కూడా జనరేట్ అయింది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆమె డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా మరో సారి బుక్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. సిలిండర్ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో చేసేదిలేక ఆమె మరోసారి బుక్ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరలేదు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గోపాల్ ఈనెల 15న గ్యాస్ బుక్ చేశారు. రెండు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేస్తే తెచ్చిన సిలిండర్ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్ ముందే మరోసారి మొబైల్ ద్వారా బుక్ చేయక తప్పలేదు. బుకింగ్ ఎస్ఎంఎస్ చూసి సిలిండర్ డెలవరీ చేసి వెళ్లాడు బాయ్. ఆ తరువాత సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. రెండో సారి బుకింగ్‌కు మరుసటిరోజు క్యాష్ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్ డెలవరీ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే సిలిండర్ మాత్రం రెండో సారి రాలేదు. సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్ ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్ బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) వంట గ్యాస్ రాజ్యమేలుతోంది. వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్ సిలిండర్లు... ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో పెద్ద హోటల్స్ ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కనెక్షన్లు అంతంతే.. మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి –మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది. -
‘ఐరన్ లెగ్’ అంటూ గేలి చేశారు..
ఇక్కడ నిరాదరణకు గురైన ఆయన ఇప్పుడు భోజ్పురిలోప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్నాడు.సొంత గడ్డపై మమకారంతో తాను దర్శకత్వం వహించే సినిమాలు ఎక్కువగా నగరంలోనే షూటింగ్ చేస్తున్నాడు. ఇక్కడి సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం భోజ్‌పురి అగ్ర నటుడు దినేశ్‌లాల్ యాదవ్ హీరోగా సుబ్బారావు తెరకెక్కిస్తున్న ‘జై వీర్’ చిత్రీకరణ సిటీలోని సారథి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీని‘సాక్షి’తో పంచుకున్నారిలా... బంజారాహిల్స్ : నాది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. తిరుపతిలో టైలరింగ్ చేస్తూ బీఏ పూర్తి చేశాక, సినిమాలపై ఆసక్తితో 1996లో హైదరాబాద్ వచ్చాను. కృష్ణానగర్‌లో సినిమా ఓనమాలు నేర్చుకున్నాను. అక్కడో గది అద్దెకు తీసుకొని, దర్శకుడు విక్టరీ మధుసూదనరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. మౌళి దగ్గర ఎక్కువ సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. తర్వాత తెలుగులో ‘కామెడీ కింగ్స్’, ‘రామ్మా చిలకమ్మా’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే అవి విడుదలకు నోచుకోలేదు. అనంతరం కుట్టి పద్మిని నిర్మించిన ‘మనసే మందిరం’ అనే టీవీ సీరియల్‌కు దర్శకుడు వై.నాగేశ్వరరావు దగ్గర పని చేయగా... ఆ సీరియల్ దర్శకత్వ బాధ్యతలు నాకే అప్పగించారు. సినీ తారలు భానుప్రియ, రంజిత, సురేష్‌లతో కలిసి ఈ సీరియల్ తీశాం. సినిమా తారలతో తీసిన మొట్టమొదటి సీరియల్ కూడా అదే. నా ప్రతిభను గుర్తించిన హీరో సురేష్.. ‘శివుడు’, ‘మనమిద్దరం’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎన్నో కథలు రాసుకొని దర్శక నిర్మాతలు, హీరోల దగ్గరికి వెళ్లాను. అయితే అందరూ నన్ను ‘ఐరన్ లెగ్’ అంటూ గేలి చేశారు. ఆ సమయంలో భోజ్‌పురి నిర్మాత నాసిర్ జమాల్ పరిచయం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నాసిర్ జమాల్ కూడా తెలుగువాడే. నగరంలోని పాతబస్తీకి చెందినవాడు. ఫస్ట్తోనే బెస్ట్... అప్పుడప్పుడే భోజ్‌పురి సింగర్‌గా రాణిస్తున్న దినేశ్‌లాల్ యాదవ్ అనే యువకుడితో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాసిర్ జమాల్ ‘కైసే కహీ తాహరాసే ప్యార్ హోగయిల్’ (నా మనసులో ఉన్నది నీతో ఎలా చెప్పను) అనే సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు ఎనలేని పేరొచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీ, భోజ్‌పురి నేర్చుకున్నాను. ఆ సినిమాతో దినేశ్‌లాల్ భోజ్‌పురిలో సూపర్ స్టార్ అయ్యారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆయనతో 12 సినిమాలు తీసి హిట్ కొట్టాను. 75 థియేటర్లలో... ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, నేపాల్, పంజాబ్, ముంబై, గుజరాత్, అసోం, ఒడిశా, రాజస్థాన్, మారిషస్, దుబాయ్‌లలో భోజ్‌పురి సినిమాలకు బాగా ఆదరణ ఉంటుంది. సౌత్ నుంచి నార్త్‌కు ఎంతోమంది తెలుగు దర్శకులు వెళ్లినా నిలదొక్కుకోలేదు. నేను మాత్రం భోజ్‌పురి సినిమాలను ఒక మలుపు తిప్పాను. ఓ సినిమా ఏకంగా 75 థియేటర్లలో ఆడింది. నా కొడుకు పేరు మీద శ్రీసాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి రెండు సినిమాలు తీసి హిట్ కొట్టాను. 35 రోజుల్లో తీసేస్తా... ఏడాదికి రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాను. నా సినిమా 35 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకుంటాను. నేను నగరంలోని చింతల్ ప్రాంతం. అక్కడ చింత చెట్ల కింద కూర్చొని సినిమా కథలు, మాటలు రాసుకుంటాను. ఒక పద్ధతి ప్రకారం సినిమా తీయడమే కాకుండా భోజ్‌పురిలో ఉన్న కొన్ని సంప్రదాయాలను తిరగరాశాను. భోజ్‌పురి సినిమా అనగానే ఒకప్పుడు 30 పాటలుండేవి. ఇప్పుడు ఆరు పాటలకు తగ్గించి కథకు ప్రాధాన్యతనిస్తున్నాను. అదేనా బాధ... నేను తెలుగులో మూడు సినిమాలు తీసినా అంతగా పేరు తెచ్చుకోలేదు. రెండు సినిమాలు మంచి ఆదరణ పొందినా... ఎందుకో నన్ను ఫెయిల్యూర్ డైరెక్టర్ అంటూ ముద్ర వేశారు. ఆ కసితోనే భోజ్‌పురిలో అడుగుపెట్టాను. తెలుగు సినిమాలకు దూరమయ్యానన్న బాధ అప్పుడప్పుడు వేధిస్తుంటుంది. అయితే ఆ సినిమాలను ఎక్కువగా తెలుగు గడ్డ మీదే తీస్తుంటాను. ఇది నాకెంతో గర్వంగా ఉంది. ఇక్కడొస్తే చేస్తా... తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. నాకు ఫలానా దర్శకుడు ఇష్టమని చెప్పను. సినిమాలో కదిలించే సన్నివేశం, మనసును హత్తుకునే దృశ్యాలుంటే ఆ దర్శకుడు ఇష్టమవుతాడు. తెలుగు సినిమాలో ఫెయిల్యూర్ అయినవారు భోజ్‌పురికి వెళ్లొచ్చని అప్పట్లో కామెంట్ చేశారు. అది నన్ను ఉద్దేశించి చేసిందేనని నాకు తెలుసు. అందుకే భోజ్‌పురి కల్చర్ తెలుసుకొని, హిందీ నేర్చుకొని పక్కా కథ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాను. ప్రస్తుతం అక్కడి ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా నిలుస్తున్నాను. కష్టపడితే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నాను. -
వృత్తి.. ప్రవృత్తి నృత్య కీర్తి
ఆమె వృత్తి సీఏ... ప్రవృత్తి నాట్యం. రెండు దశాబ్దాలకుపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నోప్రదర్శనలిచ్చారు.. ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు చార్టడ్ అకౌంటెంట్‌గా రాణిస్తూనే.. నృత్య కీర్తిని చాటుతున్నారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ సేవాపథంలో ముందుకెళ్తున్నారు. ఆమే సుభాషిణి గిరిధర్. సెప్టెంబర్ 1నరవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వనున్న సుభాషిణి కళా ప్రస్థానమిది... సాక్షి, సిటీబ్యూరో : సుభాషిణి గిరిధర్‌ది నగరంలోని కొండాపూర్. తండ్రి విజయరాఘవన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివిధ రాష్ట్రాల్లో చదివి... చివరికి నగరంలో స్థిరపడ్డారు. అమ్మ లక్ష్మీ మంచి గాయని, సంగీత విద్వాంసురాలు. తమిళంలో ఎన్నో భక్తి పాటలు పాడడంతో పాటు స్వరపరిచారు. తల్లి పరంపరలో సుభాషిణి భరతనాట్య కళలో ప్రవేశించారు. సుభాషిణి అక్క సుగుణ బ్యాంకు ఉద్యోగి. సీఏ చేయాలని అక్క ప్రోత్సహించగా అటువైపు అడుగులేశారు. అలా 1995లో సీఏ పూర్తి చేశారు. చార్టడ్ అకౌంటెంట్‌గా నగరంలోని ప్రముఖ కంపెనీల్లో పని చేశారు. ప్రస్తుతం సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సీఏ అర్హత పరీక్షకు సంబంధించి ఉచితంగా శిక్షణనిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సీఏ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు. రెండింటిలోనూ... సీఏ సవాళ్లతో కూడుకున్న వృత్తి. అలాంటి వృత్తిలో రాణిస్తూనే అంతర్జాతీయగా నృత్యకారిణిగా ఎదిగారు సుభాషిణి గిరిధర్. వృత్తి, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటూ రెండింటిలోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్‌కపూర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సంజయ్ సుబ్రమణ్యం, హరికథ కళాకారిణి విశాఖ హరి తదితర ఎందరో సీఏ చేసినా... తమకు ఇష్టమైన రంగాల వైపు మళ్లి ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ సుభాషిణి గిరిధర్ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు సీఏగా పనిచేస్తూనే భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తి, కుటుంబ పరంగా ఒత్తిళ్లు ఎదురైనా నాట్యాన్ని విడిచి పెట్టలేదు. ‘సుగుణ నృత్యాలయ’ ఏర్పాటు... సుభాషిణి తన సోదరి సుగుణ పేరుతో నృత్య శిక్షణాలయాన్ని ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా నామమాత్ర ఫీజుతో ఔత్సాహికులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు. ఆ ఫీజుతోనూ పేద విద్యార్థులకు దుస్తులు, విద్యా ఉపకరణాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సంపాదిస్తున్న మొత్తంలో సగ భాగం పేదింటి అమ్మాయిల చదవుకు వెచ్చిస్తున్నారు. సుభాషిణి ప్రతిభ, సేవను గుర్తించిన ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టడ్ అకౌంటెంట్ ఇండియా) దేశంలో సీఏ కొనసాగిస్తూ ఇతర రంగాల్లో రాణిస్తున్న జాబితాలో సుభాషిణికి చోటు కల్పించడం విశేషం. సెప్టెంబర్ 1న ప్రదర్శన సుగుణ నృత్యాలయ 28వ వార్షికోత్సవం సెప్టెంబర్ 1న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుభాషిణి గిరిధర్... శిష్యులతో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. హ్యాపీగా ఉంది.. సీఏ, శాస్త్రీయ నృత్యం పొంతనలేని రంగా లు. ఈ రెండింటిలోనూ రాణించడం చాలా కష్టం. అది క్రమశిక్షణ, అంకితభావంతోనే సాధ్యం. నేను సీఏ కంటే నృత్యం నేర్చుకోవడానికే ఎక్కువ సమయం, శ్రమ వెచ్చించా ను. ఐసీఏఐ లోగో (రెక్కలు విప్పిన గరుడ పక్షి) ప్రత్యేకతను తెలియజేస్తూ నృత్యరూప కం ప్రదర్శించాను. మోకాళ్లకు శస్త్ర చికిత్స జరిగినా... ఇప్పటికీ నాట్యంలో రాణిస్తున్నందుకు ఆనందంగా ఉంది. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు సెప్టెంబర్ 4కి వాయిదా
-
హైదరాబాద్‌లోనే ఏపీ హైకోర్టు?
సాక్షి, హైదరాబాద్ : అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఓవైపు ఏపీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. ఉమ్మడి హైకో ర్టును రెండుగా విభజించి, తెలంగాణ భూ భాగం పైనే ఏపీ హైకోర్టు ను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారం భించింది. తెలంగాణ భూ భాగంపై 2 హైకోర్టులు ఉండరాదంటూ 2015, మే 1న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గత వారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్ర చూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందిం చిన ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం రోస్టర్ ప్రకారం సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని తమ రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు ఈ వారంలో విచా రణ జరిపే అవకాశం ఉంది. ఈ లోపు ఈ వ్యాజ్యం దాఖలులో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించు కోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర తాత్సారంపై పిల్... హైకోర్టు విభజన విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధన్‌గోపాల్ రావు 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ సమయంలో ఏపీ హైకోర్టుకు తెలంగాణ భూ భాగంపై స్థలం కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనం ముందుంచింది. తెలంగాణలో ఏపీ హైకోర్టు చట్ట విరుద్ధం... అందరి వాదనలు విన్న అనంతరం 2015, మే 1న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేసేం దుకు స్థలాన్ని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఒకే ప్రాంగణంలో 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అలా చేయడం ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. తెలంగాణ హైకోర్టును హైదరాబాద్‌లోని మరో చోటుకు తరలించడం కూడా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర హైకోర్టును తెలంగాణలో ఎక్కడా ఏర్పాటు చేయడానికి వీల్లేదని, అలా చేయడం చట్ట విరుద్ధమంది. తెలంగాణ హైకోర్టును ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకి (గచ్చిబౌలి) తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర న్యాయ మంత్రి ఎలా పరిగణనలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదని, పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం ఇది అసాధ్యమని ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. హైకోర్టు విభజనపై కమిటీ... ఇదిలా ఉండగా అమరావతి పరిసర ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటునకు ఏపీ ఇటీవల చర్యలు చేప ట్టింది. శాశ్వత భవనం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభ మయ్యేలా చూడాలని ఏపీ సర్కార్ చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌కు ఓ లేఖ రాసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామ సుబ్రమణి యన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్ రావులు ఉన్నారు. ఈ కమిటీ త్వరలోనే హైకోర్టు భవ నం నిర్మితమవుతున్న నేలపాడు, తుళ్లూరు గ్రామా లకు వెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం ప్రధాన న్యాయ మూర్తికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తెలంగాణలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పావులు... ఇదిలా ఉండగానే 2015, మే1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుండ టం, ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు ఏపీలో హైకోర్టు ఏర్పాటును హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు వ్యతిరేకిస్తుండటంతో కేంద్రం మరో రకమైన ఆలోచన చేయడం ప్రారంభించింది. ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా హైకోర్టు విభజనకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదంటూ 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారడంతో దీన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను ఆమోదించి హైకోర్టు 2015లో ఇచ్చిన తీర్పును సవరిస్తే, తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటునకు రంగం సిద్ధమవుతున్నట్లే లెక్క. కేంద్రం పిటిషన్‌ను ఏపీ సర్కార్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్
-
జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా
-
ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే అభివృద్ధి
హైదరాబాద్: సమాజంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి కోరారు. శిల్పకళా వేదికలో సోమవారం వ్యర్థ పదార్థాల నిర్వహణ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత మన ఇంటి వంటగది నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిశుభ్రతతో పాటు కాలుష్యాన్ని అరికట్టాలని, ప్లాస్టిక్‌ను కూడా నిరోధించాలని కోరారు. విద్యార్థులలో ఈ అంశాలపై అవగాహన పెరగాలన్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్తను గుర్తించి వేరు చేయాలని, రెండేళ్ల కిందటే ఈ సంస్కరణలను జీహెచ్ఎంసీలో ప్రారంభించామని తెలిపారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. నగర వాసుల్లో కూడా చైతన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే హోటళ్లు, పంక్షన్ హాల్ నిర్వాహకులు చెత్త డీకంపోజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
బ్రేకింగ్: జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట ఐదుగురు నిందితులను హాజరుపర్చారు. భద్రత కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం లేదని, జైలు నుంచే వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెడతామని జైలు అధికారులు తెలిపారు. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబులకు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండటంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. జంట పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికారులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి.