వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇంతకు ముందు ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇది వరకే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
తాజాగా ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పాశం సునీల్‌కుమార్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరినందున వారిని కూడా అనర్హులుగా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ ఫిర్యాదుపై వైఎస్సార్‌సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి సంతకం చేశారు.