
అసెంబ్లీలో దర్యాప్తులు జరగవు
రాష్ట్ర అసెంబ్లీలో ఏదైనా విషయంపై దర్యాప్తులు జరగవని తెలిసీ రాజధాని ప్రాంతంలో మంత్రుల భూ కొనుగోళ్లను నిరూపించాలని సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఆ ఇంగితజ్ఞానం కూడా సీఎంకు లేకపోవడం దురదృష్టకరం
ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో ఏదైనా విషయంపై దర్యాప్తులు జరగవని తెలిసీ రాజధాని ప్రాంతంలో మంత్రుల భూ కొనుగోళ్లను నిరూపించాలని సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. బుధవారం సస్పెన్షనకు గురైన తర్వాత అసెంబ్లీ మీడియాపాయింట్‌లో ఎమ్మెల్యేలు గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి, ఎక్కలదేవి ఐజయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నారాయణస్వామి, గిడ్డి ఈశ్వరి, వి.కళావతిలతో కలసి ఆయన మాట్లాడారు. రాజధాని భూముల భూదందాపై ఆధారాలివ్వడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.
ఈ విషయంలో చంద్రబాబు విసిరిన సవాల్‌ను అంగీకరిస్తున్నామని.. అయితే అసెంబ్లీలో దర్యాప్తులు జరగవన్న ఇంగితజ్ఞానం చంద్రబాబు, అధికారపక్ష సభ్యులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆధారాలు ఎవరికివ్వాలి.. మీరే దొంగ.. దొంగ చేతికి ఆధారాలెలా ఇస్తామని సూటిగా ప్రశ్నించారు. బాబు నువ్వు నిప్పు కదా!.. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో అర్థమవట్లేదన్నారు. సీబీఐ విచారణకు ముందుకొస్తే ఆధారాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సాక్షి పత్రికపై కేసులు పెట్టారు కదా! న్యాయస్థానంలోనే.. ఆధారాలతో నిరూపణ చేస్తామన్నారు. తమ పార్టీ రాజధానికి వ్యతిరేకం కాదని, భూదందాకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
జగన్‌పై ఏకధాటిగా దాడి చేశారు
రాజధాని భూదందాపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరితే టీడీపీకి చెందిన 25 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకధాటిగా దాడి చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. భూదందాకు పాల్పడినట్టు నేరారోపణకు గురైన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిర్దోషిత్మాన్ని నిరూపించుకోవాలని ఐజయ్య డిమాండ్ చేశారు.బాబు సర్కారు విపక్షం గొంతును నొక్కేస్తోం దని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు.