హాలీవుడ్‌ నిర్మాత వీన్‌స్టీన్‌ అరెస్ట్‌ | Hollywood producer Weinstein arrested | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ నిర్మాత వీన్‌స్టీన్‌ అరెస్ట్‌

Published Sat, May 26 2018 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

Hollywood producer Weinstein arrested - Sakshi

న్యూయార్క్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను న్యూయార్క్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మహిళను రేప్‌ చేయడంతో పాటు మరో మహిళపై  లైంగికదాడికి యత్నించినట్లు కేసులు నమోదయ్యాయి. వీన్‌స్టీన్‌ తమను రేప్‌ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్‌సహా 80 మందికిపైగా హాలీవుడ్‌ నటీమణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లోయర్‌ మాన్‌హట్టన్‌లోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వీన్‌స్టీన్‌.. అధికారులకు సరెండర్‌ అయ్యాడు. తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement