అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు ముందు కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్లో ఆయన ప్రసంగించారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు ముందు కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్లో ఆయన ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒబామా తెలిపారు. ఉద్యోగ కల్పన వేగంగా జరుగుతోందని, 1999 సంవత్సరం నాటి పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయిన ఆయన పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, పవన విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని ఒబామా వెల్లడించారు. కాగా గణతంత్ర దినోత్సవానికి ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్న విషయం తెలిసిందే.