India tour
-
సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (sunita Williams)కు ప్రధాని మోదీ (narendra modi) లేఖ రాశారు. భారత్‌లో పర్యటించాలని కోరారు.దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకున్నారు.As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025ఈ తరుణంలో సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు. అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్‌ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. -
భారత పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్.. షెడ్యూల్ ఖరారు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్.. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు రానున్నారు. పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దేశాల పర్యటనపై పుతిన్,మోదీల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ సారి పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు.మోదీ ఈ ఏడాది రెండుసార్లు రష్యాలో పర్యటించారు. జులైలో రష్యా రాజధాని మాస్కోలో 22వ రష్యా-ఇండియా సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. రెండోసారి ఈ అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు. -
భారత్‌లో మాల్దీవుల అధ్యక్షుని పర్యటన త్వరలో
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన ఏ తేదీల్లో పర్యటించనున్నారన్నది వెల్లడించలేదు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మొయిజ్జు తొలిసారి భారత్ వచ్చారు. చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ బలగాలు మాల్దీవులు విడిచివెళ్లిపోవాలని షరతు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, ఈ ఏడాది ఆరంభంలో మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినపుడు అప్పటి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మరింత దూరేం పెరిగింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవుల ఉద్యమం తీవ్రమైంది. మంత్రుల వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాల్సి వచ్చింది. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్‌స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్‌ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్‌వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్‌గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్‌ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్‌కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్‌పూర్‌లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్‌వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్‌వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
పెట్టుబడులకు టెమాసెక్ ఆసక్తి
ముంబై: గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో టెమాసెక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. సగటున 1.5 బిలియన్ డాలర్లు దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెల్త్‌కేర్ రంగంలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో 2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్‌కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, క్యూర్‌ఫిట్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
లంకకు స్నేహహస్తం
‘నేను రణిల్ విక్రమసింఘేను... రణిల్ రాజపక్సను కాదు’ అన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే భారత్ పర్యటనకొచ్చేముందు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావొస్తుండగా తన తొలి విదేశీ పర్యటనకు ఆయన మన దేశాన్నే ఎంచుకున్నారు. సందర్భం ఏమైనా కావొచ్చుగానీ, రణిల్ అలా వ్యాఖ్యానించక తప్పని పరిస్థితులైతే శ్రీలంకలో ఈనాటికీ ఉన్నాయి. రణిల్‌ను ఇప్పటికీ రాజపక్స ప్రతినిధిగానే చాలామంది పరిగణిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటి, ఎక్కడా అప్పుపుట్టని స్థితి ఏర్పడిన పర్యవసానంగా నిరుడు జనాగ్రహం కట్టలు తెంచుకుని అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఐఎంఎఫ్ 290 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాక దేశం కాస్త కుదుటపడిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, అధిక ధరలు పీడిస్తున్నాయి. సుమారు 68 శాతం మంది జనాభా అర్ధాకలితో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమసింఘే భారత పర్యటనకొచ్చారు. ఆపత్స మయాల్లో ఆదుకోవటం నిజమైన మిత్ర ధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రణిల్ ఏలుబడి మొదలయ్యాక 400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. ఆ తర్వాతే ఐఎంఎఫ్ రుణం మంజూరైంది. శ్రీలంక దాదాపు 8,300 కోట్ల డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోగా, అందులో సగం విదేశీ రుణాలే. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండటం లంకకు వరం. మన దేశం నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహ హస్తం అందించటంలోని మర్మం అదే. ఎల్టీటీఈని ఎదుర్కొనడానికి కావాల్సిన 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు, ఎఫ్ 7 జెట్ ఫైటర్లు, విమాన విధ్వంసక తుపాకులు, జేవై–11 రాడార్ ఇవ్వటంతో లంక, చైనాల మధ్య అనుబంధం పెరిగింది. ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు తలుపులు బార్లా తెరిచారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70 శాతం ప్రాజెక్టులు చైనావే. ఒక్క హంబన్ టోటా నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా 3 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. సింగపూర్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న హంబన్‌టోటా నౌకాశ్రయం పడకేసింది. దాన్ని నిర్వహించటం చేతకాక 99 ఏళ్లపాటు చైనాకు ధారాదత్తం చేయడానికి లంక అంగీకరించాల్సివచ్చింది. ఏమైతేనేం శ్రీలంక విదేశీ రుణాల్లో 10 శాతం చైనావే. కానీ నిరుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఒక లెక్క ప్రకారం 2025 వరకూ శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించాల్సిన స్థితిలో పడింది. గత ఏణ్ణర్ధంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంకనుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి గణనీయంగా నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచీ, ఐఎంఎఫ్ నుంచీ అందు తున్న సాయం లంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదనీ, దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనీ శుక్రవారం మన విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో అతిశయోక్తి లేదు. మన ఇతిహాసం రామాయణం లంకతో ముడిపడి వుంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు అక్కడున్నాయి. ఇవన్నీ ఇక్కడినుంచి వెళ్లే యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని కుంగ దీస్తున్నాయి. కనీసం జెనరేటర్లతో నడిపిద్దామన్నా ఇంధన కొరత పీడిస్తోంది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52 శాతం. పరిశ్రమల్లో వీటి వాటా 75 శాతం. ఉపాధి కల్పనలోనూ దీనిదే ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవటం,ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రణిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇరు దేశాల మధ్యా సమస్యలు లేకపోలేదు. లంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండికొడుతున్నాయని లంక ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాకుతో తరచు లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందనీ, గత రెండేళ్లుగా 619 మంది జాలర్లు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారనీ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మన దేశం అప్పగించిన కచ్చాతీవు దీవిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక లంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలనీ, స్వయంపాలనకు అవకాశమీయాలనీ, వారు గౌరవప్రదంగా జీవించటానికి తోడ్పడాలనీ మన దేశం అడుగుతోంది. రణిల్ తాజా పర్యటన ఇలాంటి సమస్యల పరిష్కారానికి దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ భవిష్యత్తులో మరింత పటిష్టమవుతాయి. -
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
నేపాల్‌తో పటిష్ఠ బంధం
అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆ పదవి చేపట్టాక విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని, బుధవారం నాలుగు రోజుల పర్యటన కోసం రావటం ఈ సంగతినే మరోసారి తెలియజెబుతోంది. ఆయనకు వామపక్ష నేపథ్యం ఉంది. రాచరికాన్ని కూలదోసి ప్రజాతంత్ర రిపబ్లిక్కు పట్టంగట్టిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఆయన నేతృత్వంలోని మావోయిస్టు పార్టీయే. అందువల్లే తొలి దఫా 2008లోనూ, ఆ తర్వాత 2016లోనూ అధికారంలోకొచ్చినప్పుడు ఆయన సహజంగానే చైనా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆయన ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలా కనబడుతోంది. ఎందు కంటే మొన్న మార్చి నెలాఖరున చైనా నిర్వహించిన కీలకమైన బావ్ ఫోరం ఫర్ ఆసియా సమా వేశానికి రారమ్మని ఆ దేశం పిలిచినా, అక్కడి అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపారు. నేపాల్ ప్రధాని పీఠాన్ని ఎవరు అధిరోహించినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్ రావటం సంప్రదాయంగా వస్తోంది. కొత్త అధినేత రాగానే ఆహ్వానించటం భారత్‌కు కూడా రివాజైంది. కానీ ఈసారి మన దేశం ప్రచండను పిలిచేందుకు ఆర్నెల్ల సమయం తీసుకుంది. ఆయన పర్యటన మూడుసార్లు వాయిదాలు పడి ప్రస్తుత కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి నేపాల్‌లో ప్రచండకు మునుపటంత ఆకర్షణ లేదు. 275 స్థానాలుండే నేపాల్ పార్లమెంటుకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 227 స్థానాలు గెల్చుకున్న ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ఇప్పుడు రెండంకెల స్థాయికి పడిపోయింది. ఆమాటకొస్తే నేపాల్‌లో ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోదగ్గ బలం లేదు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు) తర్వాత మూడో స్థానంలో ప్రచండ పార్టీ ఉండగా... ప్రస్తుతం ఎనిమిది పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయన వైఖరిలో మార్పు తెచ్చిందనుకోవాలి. భారత్ – నేపాల్ సంబంధాల్లో అడపా దడపా ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి నిజమే అయినా అవి నిలకడగానే ఉన్నాయి. నేపాల్‌తో మనకు 1,850 కిలోమీటర్ల నిడివి సరిహద్దు ఉంది. ఆ రీత్యా వ్యూహాత్మకంగా మన దేశానికి నేపాల్ అత్యంత ముఖ్యమైన దేశం. సముద్ర తీరం లేకపోవటం వల్ల సరుకు రవాణా, సర్వీసుల రంగాల్లో దాదాపుగా అది మన దేశంపైనే ఆధార పడుతుంది. నేపాల్ దిగుమతులన్నీ మన రేవుల ద్వారానే సాగుతాయి. ఇంధన రంగంలోనూ ఈ సహకారం కొనసాగుతోంది. ఆ దేశంలో భారత్ పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది. మన దేశానికి నేపాల్ 450 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మన సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అలాగే నేపాల్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారత్ సాయం అందిస్తోంది. గురువారం ఇరుదేశాల ప్రధానులూ ఆన్లైన్లో రెండు చెక్‌పోస్టు లనూ, బిహార్ నుంచి సరుకు రవాణా రైలును ప్రారంభించారు. ఇవిగాక రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఏడు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. నేపాల్‌ను ఎప్పటికప్పుడు మంచి చేసుకునేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలీకృతమైంది కూడా. ఒక్క ప్రచండ అనేమిటి... భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలి శర్మ సైతం చైనా వ్యామోహంలో పడి మన దేశంపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి. కనుకనే చైనా పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలోవున్నా నేపాల్‌పై మన దేశం పెద్దన్న పాత్ర పోషించా లనుకోవటం అప్పుడప్పుడు సమస్యలకు కారణమవుతున్న సంగతి కాదనలేనిది. ఉదాహరణకు 2016లో రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసే దశలో నేపాల్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమించాయి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవా లని, వారితో చర్చించి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలని మన దేశం సూచించింది. కానీ దీన్ని నేపాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెరై ప్రాంతంలో భారీయెత్తున ఉద్యమాలు సాగాయి. దాంతో మన దేశంనుంచి వంటగ్యాస్ రవాణా నెలల తరబడి నిలిచిపోయింది. ఉద్యమాల వెనక భారత్ ప్రమేయం ఉన్నదనీ, తమను లొంగదీసుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారనీ నేపాల్ ఆరోపించింది. ఈ పరిస్థితిని అప్పట్లో చైనా చక్కగా వినియోగించుకుంది. వాస్తవానికి ఇప్పుడు సరిహద్దుల విషయంలో ప్రచండపై ఒత్తిళ్లు ఎక్కువే ఉన్నాయి. ఉత్తరా ఖండ్‌లోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ చాన్నాళ్లుగా వాదిస్తోంది. వాటిని తమ దేశంలో భాగంగా చూపుతూ మూడేళ్ల క్రితం మ్యాప్‌లు కూడా ముద్రించింది. వాటికి సంబంధించిన బిల్లుల్ని కూడా అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అనంతర కాలంలో ఈ వివాదం సద్దుమణిగింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరింది. దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోదీకి ప్రచండ సూచించారు. ఇరుగుపొరుగు అన్నాక సమస్యలు సహజం. వాటిని ఒడుపుగా పరిష్కరించుకోవటంలోనే ఆ దేశాల పరిణతి కనబడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ ‘సూపర్ హిట్’ చేస్తామనీ, వాటిని హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్తామనీ ప్రచండకు నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఇదొక మంచి పరిణామం. తదుపరి కార్యాచరణ ఆ దిశగా చురుగ్గా కదిలితే శతాబ్దాలనాటి ఇరు దేశాల సంబంధాలూ మరింత ఉన్నత స్థాయికి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు. -
భౌగోళిక రాజకీయ బంధం
పర్యటన పట్టుమని రెండే రోజులు. అలాగని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. మార్చి 20, 21ల్లో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా జరిపిన భారత పర్యటన గురించి ప్రత్యేకించి చెప్పుకొనేది అందుకే. ఇండియా జీ20కీ, జపాన్ జీ7 దేశాల కూటమికీ సారథ్యం వహిస్తున్న వేళ ఇరు దేశాల నేతలూ సమావేశం కావడం కచ్చితంగా విశేషమే. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తీవ్రంగా తప్పుబడుతున్న జీ7 అజెండా జపాన్‌ది కాగా, అదే ఉక్రెయిన్ అంశం కారణంగా జీ20లో ఏకాభిప్రాయం రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి భారత్‌ది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాధినేతల సమావేశం, స్నేహపూర్వక సంభాషణలు – పానీపురీ చిరుతిళ్ళతో ఛాయాచిత్రాలు, భారత్‌లో లక్షల కోట్లలో పెట్టుబడులు పెడతామని కిషిదా ప్రకటన, చైనా కట్టడికి ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ అవసరం అంటూ కొత్త పల్లవిని ఎత్తుకోవడం – ఇలా 27 గంటల సుడిగాలి పర్యటనలో గుర్తుండే ఘటనలు అనేకం. సరిగ్గా చైనా అధ్యక్షుడు రష్యాలో పర్యటిస్తున్న వేళ జపాన్ ప్రధాని భారత్‌కు రావడం ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయాలకు మచ్చుతునక. పదిహేనేళ్ళ క్రితం 2008లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌లోనే తన సిద్ధాంతమైన పసిఫిక్, హిందూ మహాసముద్రాల సంగమాన్ని వ్యూహాత్మక దర్శనం చేశారు. ఇప్పుడు కిషిదా ‘క్వాడ్’ కూటమిలో ఇతర భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాల్లో కాక భారత్‌లో ‘స్వేచ్ఛా వాణిజ్యంతో కూడిన ఓపెన్ ఇండో–పసిఫిక్’ అంటూ సైద్ధాంతిక ప్రకటన చేయడం విశేషం. భారత, జపాన్ ప్రధానుల ద్వైపాక్షిక సమావేశాలు 2006 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఈసారి మోదీ జపాన్‌కు వెళ్ళాలి. అయితే, కిషిదా తానే హడావిడిగా భారత్‌కు రావడానికి కారణం ఉంది. మార్చి మొదట్లో భారత్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్ విదేశాంగ మంత్రి హాజరు కాలేదు. ప్రతినిధిని పంపారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్న అరుదైన కలయికకు హాజరవడం ఎంత ముఖ్యమో ఒకప్పటి విదేశాంగ మంత్రి కిషిదాకు తెలుసు. భౌగోళిక – రాజకీయ పటంలో తన స్థానాన్నీ, ప్రాధాన్యాన్నీ పెంచుకోవాలనుకొంటున్న తమ దేశం పక్షాన ఆయన ఠక్కున తప్పు దిద్దుకొన్నారు. నిజానికి, భారత – జపాన్‌లు ఏడు దశాబ్దాల సుదీర్ఘ స్నేహాన్ని గడచిన 2022లోనే ఘనంగా జరుపుకొన్నాయి. ఒకప్పుడు మామూలు ప్రపంచ భాగస్వామ్యంగా మొదలై నేడు వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా అది పెంపొందింది. అయితే, ఇప్పటికీ ఆర్థిక భాగస్వామ్యంలో, జనం మధ్య సంబంధాల్లో అంతరాలున్నాయి. వాటి భర్తీకి కిషిదా తాజా పర్యటన దోహదకారి. అలాగే, ఈ పర్యటనను కేవలం దౌత్య తప్పిదాన్ని సరిదిద్దే యత్నంగానే చూడనక్కర లేదు. జీ20లో అన్ని దేశాలూ కలసి చేయాల్సిన ప్రకటనకు చిక్కులు విడిపోలేదు గనక ప్రస్తుత జీ20, జీ7 సారథులిద్దరూ వివరంగా మాట్లాడుకొనడానికి ఇది సదవకాశమైంది. హిరోషిమాలో జరిగే జీ7 సదస్సులో పరిశీలకుడిగా పాల్గొనాలంటూ కిషిదా ఆహ్వానం, మోదీ అంగీకారం చెప్పుకోదగ్గవే. అయిదేళ్ళలో తమ సంస్థలు భారత్‌లో 5 లక్షల కోట్ల యెన్లు (4200 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతాయని గత మార్చిలో మాటిచ్చిన జపాన్ నెమ్మదిగా అయినా ఆ దిశగా అడుగులు వేస్తోంది. కిషిదా వెల్లడించిన భౌగోళిక రాజకీయాల్లో, వ్యూహాల్లో కీలకమైన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ ప్రతిపాదన భారత్‌కూ లాభదాయకమే. ఇండో– పసిఫిక్‌లో చైనాకు ముకుతాడు వేయడా నికి పొరుగు దేశంతో కలసి నడవ్వచ్చు. కాకపోతే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా – తన గడ్డపై అమెరి కన్ సైనిక స్థావరాలను కొనసాగనిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సైద్ధాంతిక స్నేహాన్ని కొనసాగిస్తున్న జపాన్ రక్షణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞాన సహకారంపై ఆరు విడతల చర్చల అనంతరం కూడా భారత్‌తో సంయుక్త భాగస్వామ్యానికి అడుగేయలేదు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ‘సహ– ఆవిష్కరణ, సహ–రూపకల్పన, సహ–సృష్టి’ అవసరమంటూ తాజా పర్యటనలో కిషిదాకు మోదీ చెప్పాల్సి వచ్చింది. మూడో దేశంతో కలసి రక్షణ విన్యాసాలు అనేకం చేస్తున్నప్పటికీ, రక్షణ రంగంలో భారత్, జపాన్‌లు చేతులు కలపనిదే సంపూర్ణ ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో–పసిఫిక్’ సాధ్యం కాదని కిషిదాకూ తెలుసు. అలాగే, భారీ భారత విపణిలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, భారత్‌లో వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులకు జపాన్‌లో తటపటాయింపు పోవాల్సి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టాల్సి ఉంది. మొత్తానికి ఉమ్మడి బెడదైన చైనా వల్ల భారత్, జపాన్‌లు మరింత సన్నిహితం కావచ్చు. నిరుడు 3 సార్లు, ఈ ఏడాది ఇకపై మరో 3 సార్లు ఇరువురు ప్రధానులూ కలవనుండడంతో ఇండో– పసిఫిక్ భౌగోళిక రాజకీయాల్లో మరిన్ని అడుగులు ముందుకు పడవచ్చు. భారత్‌కు కూడా రానున్న నెలలు కీలకం. భారత ప్రధాని మేలో జీ7 సదస్సులో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ‘క్వాడ్’ సమావేశంలో పాల్గొంటారు. అటుపైన అమెరికాను సందర్శించనున్నారు. రాగల కొద్ది నెలల్లోనే ఎస్సీఓ, జీ20 సదస్సుల నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్లకు రెండు సార్లు ఆతిథ్య మిచ్చే అవకాశం భారత్‌కు రానుంది. వీటన్నిటి నేపథ్యంలో కిషిదా పర్యటన రానున్న సినిమాకు ముందస్తు ట్రైలర్. ప్రపంచం మారుతున్న వేళ మన భౌగోళిక రాజకీయ స్థానాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఇది మంచి తరుణం కావచ్చు. విశ్వవేదిక సిద్ధమైంది. మరి, మనమూ సంసిద్ధమేనా? -
సతత హరిత వ్యూహాత్మకం
ఢిల్లీలోని చాణక్యపురిలో రోడ్డుపై దుకాణంలో తేనీరు సేవించిన జర్మనీ అధినేత! ఇది, ప్రధాని మోదీతో కలసి సంయుక్త మీడియా ప్రకటన మినహా జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత అధికారిక పర్యటనపై హడావిడి వార్తలు, ప్రకటనలు మీడియాలో కనిపించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన షోల్జ్ భారత పర్యటన అప్రధానమనుకుంటే పొరపాటే. రాష్ట్రపతిని కలసి సంభాషించడం, ప్రధానిని కలసి చర్చించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలతో గోష్ఠి జరపడం – ఇలా ఫిబ్రవరి 25, 26ల్లో షోల్జ్ సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పటికే జపాన్, చైనా, ఆసియాన్ దేశాల్లో పర్యటించిన ఆయన తమ దేశ ఇండో–పసిఫిక్ విధానంలో భాగంగా భారత్‌తో బంధం దృఢమైనదని తేల్చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఏడాది నిండిన వేళ ఈ పర్యటన వ్యూహాత్మకంగా కీలకమనేది అందుకే. పదహారేళ్ళ సుదీర్ఘ ఏంజెలా మెర్కెల్ పాలన తర్వాత 2021 డిసెంబర్లో జర్మనీ ప్రభుత్వాధినేత అయిన షోల్జ్ ఆ పైన మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే, 2011 తర్వాత ఒక జర్మన్ నేత భారత్‌లో ప్రత్యేకంగా పర్యటించడం కూడా ఇదే ప్రథమం. అలా ఈ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. జర్మన్ అధినేత వెంట వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందంలో సీమెన్స్, శాప్ సంస్థలు ఉన్నాయి. ఐటీ, టెలికామ్ సహా కీలక రంగాల్లో భారత సంస్థలతో ఒప్పందాలు చేసు కున్నాయి. స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, నవీన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతే లక్ష్యంగా ప్రధాని మోదీతో షోల్జ్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా, యూరప్ తన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దుతున్న వేళ షోల్జ్ చర్చలు కీలకమయ్యాయి. సహజంగానే ఉక్రెయిన్ వ్యవహారం అజెండాలో ముందుంది. అయితే, రష్యా వ్యతిరేక వైఖరి తీసుకొనేలా ఒత్తిడి తెచ్చే కన్నా... అందరికీ కావాల్సిన మనిషిగా, మధ్యవర్తిత్వం నెరిపే వీలున్న దేశంగా భారత్‌తో జర్మనీ జత కడుతోంది. జీ20 సారథిగా భారత్ ఈ యుద్ధానికి త్వరగా తెరపడేలా చేసి, ఆర్థిక పునరుజ్జీవనం జరిపించాలని భావిస్తోంది. అందుకీ పర్యటనను సాధనంగా ఎంచుకుంది. రష్యా రక్షణ ఉత్పత్తుల సరఫరాలపై భారత్ ఆధారపడినందున జలాంతర్గాముల సంయుక్త తయారీ లాంటి అంశాల్లో భారత్‌తో చేయి కలుపుతూ, సరఫరా వ్యవస్థల్లో మార్పుకు చూస్తోంది. ఈ భౌగోళిక – రాజకీయ సంక్షోభాన్ని కాస్త పక్కనపెడితే, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పటిష్ఠం చేసుకొనేలా ఒక దార్శనిక పత్రాన్ని మోదీతో కలసి షోల్జ్ ఆమోదించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికత నుంచి కృత్రిమ మేధ (ఏఐ) దాకా పలు హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు అంతర్ ప్రభుత్వ పత్రాలతో పాటు, మూడు వ్యాపార ఒప్పందాల పైనా చేవ్రాలు జరిగింది. నూతన ఆవిష్కరణల పత్రంలో ప్రధానంగా హరిత ఉదజని సహా ఇంధన, స్వచ్ఛ సాంకేతి కతల్లో భాగస్వామ్యానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. హరిత ఉదజని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూడడమే ఉమ్మడి దీర్ఘకాలిక లక్ష్యం. కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక రంగాల్లో జోరందుకున్నాయి. గత డిసెంబర్లో జర్మన్ విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. షోల్జ్ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు కలసిన మోదీ, షోల్జ్‌ల మధ్య మంచి స్నేహం నెలకొంది. నిరుడు మేలో 6వ ఇండియా– జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రతింపులలో (ఐజీసీ) ఇరువురు నేతలూ తొలిసారి సమావేశమయ్యారు. ఆపైన జర్మనీ సారథ్యంలోని ‘జీ7’ సదస్సుకు మోదీని షోల్జ్ ఆహ్వానించారు. జూన్‌లో ఆ వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇక నవంబర్‌లో ‘జీ20’ సదస్సు వేళ ఇండొనేసియాలో ద్వైపాక్షిక చర్చలతో బంధం బలపడింది. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే విషయంలో భారత, జర్మనీల దృక్పథం చాలావరకు కలుస్తుంది. నియమానుసారమే అంతర్జాతీయ క్రమం సాగాలనీ, ఐరాస నిబంధనావళిలోని అంతర్జాతీయ న్యాయ ఆదేశిక సూత్రాలను గౌరవించాలనీ ఇరుదేశాల వైఖరి. ఈ అభిప్రాయాలతో పాటు ఇండో– పసిఫిక్ విధానంలో భాగంగా అంతర్జాతీయ అవస రాలు, అనివార్యతలు ఉభయ దేశాలనూ మరింత దగ్గర చేశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), ఈయూలో భాగం కాని థర్డ్ కంట్రీల్లో అభివృద్ధి పథకాలపై చర్చల్ని త్వరితగతిన ఖరారు చేయాలని జర్మనీ గట్టిగా యత్నిస్తోంది. గతంలో ఆరేళ్ళు చర్చించినా, 2013లో తొలిసారి మన ఎఫ్‌టీఏ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు షోల్జ్ సైతం ఎఫ్టీఏకు వ్యక్తిగతంగా కట్టుబడ్డారు. ఇవన్నీ ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ పలుకుబడికి నిదర్శనం. జర్మనీ విదేశాంగ మంత్రి ఆ మధ్య అన్నట్టు, ‘ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను అధిగమిస్తున్న భారత్‌ను సందర్శిస్తే, ప్రపంచంలో ఆరోవంతును చూసినట్టే.’ అలాగే, ‘21వ శతాబ్దంలో ఇండో– పసిఫిక్‌లోనూ, అంతకు మించి అంతర్జాతీయ క్రమాన్ని తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావం భారత్‌దే.’ ఇక, మన దేశంలో దాదాపు 1800 జర్మనీ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. భారత్‌లో భారీ విదేశీ పెట్టుబడుల్లోనూ ముందున్న ఆ దేశం వేలల్లో ఉద్యోగ కల్పనకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో షోల్జ్ ఆత్మీయ స్నేహం, అవసరమైన మిత్రుడితో మోదీ అనుబంధం అర్థం చేసుకోదగినవి. 141 కోట్ల జనాభాతో అపరిమిత ఇంధన అవసరాలున్న వేళ, హరిత ఇంధనం సహా అనేక అంశాల్లో జర్మనీతో బంధం భవిష్యత్తుకు కీలకమైనది. ఈ సమయం,సందర్భాలను అందిపుచ్చుకోవడమే భారత్‌కు తెలివైన పని. -
‘‘రైజినా డైలాగ్’’కు ఇరాన్ దూరం
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే ‘‘రైజినా డైలాగ్’’ సదస్సుకు ఇరాన్ హాజరు కావడం లేదు. ఈ సదస్సుకి హాజరుకావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సిన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్పై ప్రచార వీడియోలో ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కట్ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్షుడితో పాటు నిరసనకారుల్ని చూపించడాన్ని ఆక్షేపించిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దానిని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరుకాబోవడం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్‌ను నిర్వహిస్తోంది. -
ఇండియా టూర్‌కు కేన్ మామ డుమ్మా.. కారణం ఏంటంటే..?
New Zealand Tour Of India 2023: వచ్చే ఏడాది (2023) జనవరిలో జరుగనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జరుగనున్న వన్డే సిరీస్ కోసం జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిన్న (డిసెంబర్ 18) ప్రకటించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ, హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ లేకుండానే న్యూజిలాండ్ వన్డే జట్టు భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ ముగ్గురూ భారత్ కంటే ముందు పాకిస్తాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (జనవరి 10, 12, 14) పాల్గొని అట్నుంచి అటే న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (సీఎన్‌జెడ్) వెల్లడించింది. ఫిబ్రవరిలో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ టీమ్ స్వదేశంలో పర్యటించనున్న నేపథ్యంలో వర్క్ లోడ్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎన్‌జెడ్ ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో భారత్‌తో వన్డే సిరీస్‌కు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్న సీఎన్‌జెడ్.. ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ లూక్ రాంచీ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలిపింది. విలియమ్సన్, సౌథీ స్థానాలను మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ భర్తీ చేస్తారని పేర్కొంది. కాగా, భారత పర్యటనలో న్యూజిలాండ్ తొలుత వన్డే సిరీస్ ఆడనుంది. జనవరి 18, 21, 24 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అనంతరం జనవరి 27, 29 ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్‌కు జట్టును సీఎన్‌జెడ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి -
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. ‘జలియన్‌వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డు సాధించారు ఈ కేరళ దంపతులు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు తిరిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. బెన్నీ కొట్టరత్తిల్, అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘయాత్ర చేశారు. డిసెంబర్ 1, 2021 నాడు ‘చలో భారత్’ అని బయలుదేరి 216 రోజులలో 17 రాష్ట్రాలలో తిరిగి జూలై 3, 2022న ఇల్లు చేరారు. ఏడు నెలల మూడు రోజుల తమ పర్యటనలో వారు గడించిన అనుభవాలు మరొకరు పొందలేనివి. ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయడం కాదు. మణికట్టు మీదున్న వాచ్‌లో ‘ఓ... ఇవాళ ఐదు వేల అడుగులు నడిచాను’ అని లెక్క చూసుకోవడం కాదు. నడుస్తూ ఉండాలి. రోజంతా నడుస్తూ ఉండాలి. వారమంతా నడుస్తూ ఉండాలి. నెలంతా నడుస్తూ ఉండాలి. నడవగలరా? కొట్టాయం దంపతులు బెన్నీ, మాలి నడిచారు. దేశమంతా నడిచారు. పాదాలతోపాటు కనులు, మనసు, ఆత్మ ధన్యం చేసుకున్నారు. వారు ఇదంతా ఎలా చేశారు? ‘ప్లాన్ చేయకుండా. ప్లాన్ చేస్తే చాలా పనులు జరగవు. మీనమేషాలు లెక్కెట్టకండి... అనుకున్నదే తడవు చేసేయండి’ అనేది వీరి ఫిలాసఫీ. కోవిడ్ ‘రోడ్డున పడేసింది’ ప్రపంచంలో అందరి జీవితాలు గందరగోళం అయినట్టే బెన్ని, మాలి జీవితాలు కూడా గందరగోళం అయ్యాయి. 50 ఏళ్ల బెన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయివేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసేవాడు. కాని కోవిడ్ వల్ల 2019లో ఉద్యోగం పోయింది. భార్యాభర్తలు తమ సొంత ఊరు కొట్టాయం చేరుకున్నారు. చేయడానికి పని దొరకలేదు. చివరకు బెన్నీకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది ఒక హాస్పిటల్లో. ఆ సమయంలో పోస్ట్ కోవిడ్ అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్‌లు చాలా చూశాడు బెన్ని.‘తగినంత వ్యాయామం లేకనే ఇవన్నీ’ అని అర్థమైంది. మరి తానేం చేస్తున్నట్టు? అప్పటికే ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. 2019 నవంబర్‌లో ఒక సైకిలెక్కి ‘అలా దేశం చూసి వస్తా’ అని భార్యకు చెప్పి బయలు దేరాడు. కేవలం 58 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు 13 రాష్ట్రాల మీదుగా. ఆ పని కిక్ ఇచ్చింది. మళ్లీ 2021 జూలైలో ఒక సైకిల్ యాత్ర చేశాడు భూటాన్, నేపాల్ వరకు. మూడోసారి కూడా ప్లాన్ చేస్తుంటే భార్య మాలి ‘నన్ను కూడా తీసుకెళతావా?’ అంది అతడు సైకిల్ తుడుస్తుంటే... ‘మనిద్దరం సైకిల్ మీద ఎక్కడెళ్లగలం. నడవాల్సిందే’ అన్నాడు బెన్నీ. ‘అయితే నడుద్దాం పద‘ అంది మాలి. యాత్ర మొదలైంది. డిసెంబర్లో యాత్ర మొదలు డిసెంబర్ 1, 2021న ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్’ వరకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు బెన్నీ, మాలి. ‘మాకు పిల్లలు లేరు, మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. స్నేహితులు సాయం చేసిన డబ్బు, ఒక టెంట్, నీళ్ల బాటిళ్లు, అవసరమైన మందులు, అన్నింటి కంటే ముఖ్యంగా పవర్ బ్యాంకులు... వీటిని తీసుకుని బయలుదేరాం. మాకు ఆధారం గూగుల్ మేప్సే’ అంటాడు బెన్నీ. ఈ యాత్రను వీళ్లు 17 రాష్ట్రాల మీదుగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా అంత సులభమా.. ఎండా గాలి చలి దుమ్ము... బాత్రూమ్ కష్టాలు... నిద్రకు చోటు... దొంగల భయం... ఇవన్నీ ఉంటాయి. ‘మేమిద్దరం పదే పదే ఒకటే మాట చెప్పుకున్నాం. ఏది ఏమైనా యాత్రను సగంలో ఆపి వెనక్కు పోయేది లేదు అని. ఏం జరిగినా సరే ముందుకే వెళ్లాలి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం’ అంటారు ఇద్దరూ. ఎన్నో అనుభవాలు మొత్తం 216 రోజుల యాత్రలో వారు చలికాలం, ఎండాకాలం చూశారు. చలికాలం టెంట్ సాయపడినా ఎండాకాలం టెంట్లో పడుకోవడం దుర్లభం అయ్యింది వేడికి. ‘టెంట్ బయట పడుకుంటే దోమలు నిర్దాక్షిణ్యం గా పీకి పెట్టేవి’ అన్నాడు బెన్నీ. అదొక్కటే కాదు.. భార్య భద్రత కోసం అతడు సరిగా నిద్రపోయేవాడు కాదు. ‘చీమ చిటుక్కుమన్నా లేచి కూచునేవాణ్ణి‘ అన్నాడు. వీళ్ల కాలకృత్యాల అవసరాలకు పెట్రోలు బంకులు ఉపయోగపడేవి. గుళ్లు, గురుద్వారాలు, పోలీస్ స్టేషన్ల వరండాలు, బడులు... ఇవన్నీ వారు రాత్రి పూట ఉండే చోటుగా మారేవి. బడ్జెట్ కోసం రొట్టెల మీదే ఎక్కువ ఆధారపడేవారు. ‘వెస్ట్ బెంగాల్ పురూలియాలో రాత్రి తాగుబోతుల బారిన పడి పారిపోయాం. తమిళనాడు విల్లుపురం గుడిలో పడుకుంటే దొంగలు వచ్చారు. అట్టపెట్టెల వెనుక ఉండటం వల్ల మమ్మల్ని చూడలేదు. కుక్క మొరగడంతో పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వేడి వేడి అన్నం, కూర తినడంతో మా ప్రాణం లేచి వచ్చింది. పంజాబ్‌లో జనం చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ముసలాయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి మరుసటి రోజుకి కట్టి ఇచ్చాడు’ అన్నారు వారు. ఎన్నెన్ని అందాలు అమృత్సర్, మురుడేశ్వర్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, కశ్మీర్, వాఘా బోర్డర్... ఇవన్నీ ఈ దంపతులు తమ కాళ్ల మీద నడుస్తూ చూసి సంతోషించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఎందరికి ఉంటుంది ఈ తెగువ. వారు తమ యాత్రానుభవాలను వారి యూట్యూబ్ చానల్ ‘వికీస్ వండర్ వరల్డ్’లో వీడియోలుగా పోస్ట్ చేశారు. తిరిగి వచ్చాక ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడు బెన్నీ. కాసింత సంపాదన చేసుకుని భార్యతో ఈసారి బైక్ మీద రివ్వున దూసుకెళ్లాలని ఆశ. ఎందుకు నెరవేరదూ? (క్లిక్: పర్యాటకుల స్వర్గధామం.. కాస్ పీఠభూమి) -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
సచిన్, అమితాబ్‌లా ఫీల్ అయ్యా: బ్రిటన్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్లో పర్యటనను బోరిస్ జాన్సన్ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్లో తన స్వాగత హోర్డింగ్స్ చూసి.. ఆయన ఓ సచిన్ టెండూల్కర్, బిగ్‌బీ అమిత్ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్ ప్రకటించారు. మరోవైపు.. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది చదవండి: భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు -
భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే
లండన్: ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21, 22తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్ నుంచి నేరుగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలపై చర్చిస్తారు. 22న ఢిల్లీలో మోదీతో సమావేశమవుతారు. రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ఇ రుపక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపైనా చర్చ జరగనుంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందంటూ ఈ సందర్భంగా జాన్సన్ ప్రశంసలు కురిపించారు. ‘అరాచక దేశాల వల్ల భారత్, ఇంగ్లాండుల్లో శాంతికి ముప్పుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశం’ అన్నారు. తనది ఉభయతారక పర్యటన కాగలదని ఆకాంక్షించారు. చదవండి: త్వరలో ఉద్యోగులకు సీఎం స్టాలిన్ శుభవార్త? -
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన
-
దక్షిణాఫ్రికాతో భారత్ తొలిపోరు.. ఈ సారైనా!
పర్యటనకు ముందు దక్షిణాఫ్రికాలో పుట్టిన ‘ఒమిక్రాన్’ కలకలం రేపింది. భారత్ పర్యటనను ఒకదశలో ప్రశ్నార్థకంగా మార్చింది. ఇప్పుడు కూడా ఈ వేరియంట్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కానీ భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌ను మాత్రం ఆపలేకపోయింది. పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలతో క్రికెట్ విందు టీవీల ముందుకొచ్చింది. ఆంక్షలు, లాక్డౌన్ వార్తలతో విసిగెత్తుతున్న వారికి ఈ సిరీస్ క్రికెట్ న్యూస్ కిక్ ఎక్కించడం ఖాయం. గతంలో ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా ఈసారైనా సఫలం కావాలని ఆశిద్దాం. సెంచూరియన్: సఫారీ గడ్డపై తొలి సవాల్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ‘బాక్సింగ్ డే’ టెస్టు జరగనుంది. తొలి టెస్టుపై మొదటి రోజు నుంచే పైచేయి సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఓపెనింగ్ జోడీ బలం, మిడిలార్డర్లో కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లతో కూడిన బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది. విశేషానుభవం గల రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండటం జట్టుకు బాగా ఉపకరిస్తుంది. మరోవైపు సొంతగడ్డ అనుకూలతలతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రన్నరప్ భారత్‌ను ఆరంభం నుంచే ఇబ్బందుల్లోకి నెట్టాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా భావిస్తోంది. పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే లేని లోటు జట్టును బాధిస్తున్నప్పటికీ సత్తాగల ఆటగాళ్లు ఉన్న సఫారీ జట్టు... భారత్‌కు ఐదు రోజులూ పెను సవాళ్లు విసిరేందుకు ‘సై’ అంటోంది. ఐదుగురు బౌలర్లతో... ఎప్పటిలాగే సారథి కోహ్లి ఐదుగురు బౌలర్ల ఫార్ములాతోనే బరిలోకి దిగే అవకాశముంది. సీమ్ వికెట్ దృష్ట్యా ఈసారి భారత టీమ్ మేనేజ్మెంట్ పేస్ బౌలర్లకే పెద్దపీట వేయనుంది. ఈ నేపథ్యంలో నలుగురు సీమర్లు శార్దుల్ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లతో బరిలోకి దిగడం ఖాయం. స్పిన్నర్ అశ్విన్ తన అనుభవాన్ని జతచేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ విజయవంతమైన జోడీగా ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇందులో ఇక ఏ మార్పు ఉండబోదు. టాపార్డర్‌లో చతేశ్వర్ పుజారా, మిడిలార్డర్లో కోహ్లి జట్టును నడిపిస్తాడు. అయితే ఫామ్‌లో లేని రహానేకు ఈ మ్యాచ్‌లోనూ చాన్స్ లేనట్లే! అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకున్న శ్రేయస్ వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. దీంతో తెలుగు ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారికి కూడా తుది జట్టులో అంతంత మాత్రంగానే అవకాశాలున్నాయి. లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు అశ్విన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నారు. రబడపైనే భారం ఈ సీజన్ ఐపీఎల్, టి20 ప్రపంచకప్‌లో సీమర్ నోర్జే చక్కగా రాణించాడు. దీంతో సొంతగడ్డపై అతనే తురుపుముక్కగా జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ తుంటి గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమవడం జట్టుకు శాపమైంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ భారమంతా రబడపైనే పడింది. ఇన్‌గిడి, ఒలీవర్లు ఉన్నప్పటికీ నోర్జే అంతటి ప్రస్తుత పేస్ పదును వీరికి లేదు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సొంతగడ్డపై తన మాయాజాలం కనబరిచేందుకు తహతహలాడుతున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఎల్గర్, మార్క్రమ్, పీటర్సన్, డసెన్లతో పాటు వికెట్ కీపర్ డికాక్ అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఎల్గర్, మార్క్రమ్ శుభారంభమిస్తే... మిడిలార్డర్లో డసెన్, బవుమా ఇన్నింగ్స్‌ను భారీస్కోరువైపు నడిపించగలరు. పిచ్, వాతావరణం సెంచూరియన్ వికెట్ ఆరంభంలో మందకొడిగా ఉంటుంది. పిచ్‌పై పచ్చిక దృష్ట్యా రెండు, మూడో రోజుల్లో పేసర్లకు అనుకూలిస్తుంది. తొలి రెండు రోజుల్లో చిరుజల్లులు కురిసే అవకాశముంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే/శ్రేయస్ అయ్యర్/ హనుమ విహారి, రిషభ్ పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్/ఇషాంత్ శర్మ. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డెర్ డసెన్, బవుమా, డికాక్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, రబడ,డిన్గిడి, ఒలీవర్. శ్రేయస్, రాహుల్ -
భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు రానున్నారు. ఈ నెల 28న ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆయన ప్రధాని మోదీని సైతం కలవనున్నారు. భారత్–అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయిలో బలపరచడంతో పాటు భవిష్యత్తులో అవి మరింత ధృఢంగా కొనసాగేలా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ చర్చల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రానున్నాయని తెలిపింది. కోవిడ్–19 మహమ్మారి ప్రస్తావన కూడా ఇందులో రానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండో–పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు కేంద్రం తెలిపింది. భారత పర్యటన అనంతరం బ్లింకెన్ కువైట్ వెళ్లనున్నారు. అక్కడ కూడా దేశస్థాయి అధికారులతో సమావేశాలను నిర్వహించనున్నారు. జూలై 26–29 వరకు భారత్, కువైట్‌లను సందర్శించనున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. -
500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..
లండన్: 146 టెస్టుల్లో 517 వికెట్లు పడగొట్టినా ఇంగ్లండ్ అండ్ వేల్స్(ఈసీబీ) మాజీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వాపోయాడు. ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సెలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అతరువాత దానికి కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించాడు. టెస్టు ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడల్లా(రొటేషన్ పద్ధతి కారణంగా) రాణిస్తున్న నేను సహజంగానే ఉత్తమ జట్టులో ఉంటానని ఆశించానని, కానీ సెలెక్టర్ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో తన పేరు లేకపోవడం బాధించిదని ఎడ్ స్మిత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రొటేషన్ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో ఇంగ్లండ్.. న్యూజిలాండ్, భారత్ జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుంది. జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. కాగా, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌కే పరిమితమైన 34 ఏళ్ల బ్రాడ్.. 146 టెస్టులు, 121 వన్డేలు, 56 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను సాధించిన మొత్తం వికెట్లలో 10 వికెట్ల మార్క్‌ను 3 సార్లు, ఐదు వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. అతను టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతని కెరీర్లో సెంచరీతో పాటు13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు -
మరోసారి రద్దు: భారత్‌కు రాలేకపోతున్న బోరిస్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత భారత పర్యట నను రద్దు చేసుకు న్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది అయితే తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు. పర్యటన రద్దుపై ఆయన స్పందిస్తూ.. భారత్‌లో కరోనా తీవ్ర పంజా విసురుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని మోదీతో చర్చించిన అనంతరం ఇరువురూ కలసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో తాము కూడా కరోనా వల్ల దెబ్బతిన్నామని, అదే స్థితిలో ఇప్పుడు భారత్ ఉందని చెప్పారు. ఈ స్థితి నుంచి భారత్ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దైన నేపథ్యంలో త్వరలోనే ఓ వర్చువల్ సమావేశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వ్యక్తిగతంగా ఆ దేశ అధికారులను కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఉండగా, బ్రిటన్‌లో ఇటీవల భారత మూలాలున్న డబుల్ మ్యూటంట్ వైరస్ కేసులు 77 నమోదైన నేపథ్యంలో.. భారత్‌ను ప్రయాణ నిషేధ జాబితాలో చేరుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట చదవండి: తస్మాత్ జాగ్రత్త! లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ -
టీకా తీసుకున్నా వస్తున్నా.. బోరిస్ భారత పర్యటన ఖరారు
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాల్గొనాల్సి ఉండగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల పెరుగుదలతో పర్యటన రద్దయ్యింది. అప్పటి పర్యటన ఇప్పుడు ఖరారైంది. ఏప్రిల్ 26వ తేదీన భారత్‌కు ఆయన రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఎన్ని రోజుల పర్యటన.. ఎక్కడెక్కడ పర్యటిస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో 26వ తేదీన పర్యటించాల్సిన బోరిస్ మళ్లీ ఈసారి ఏప్రిల్ 26వ తేదీన ఖరారైంది. దీంతో 26వ తేదీతో ఏదో ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. అయితే ఆ పర్యటనలో భాగంగా చెన్నెకు కూడా వెళ్తారని సమాచారం. ఈ మేరకు బ్రిటన్ అధికారులు చెన్నెలో పరిస్థితులు గమనిస్తున్నట్లు తెలుస్తోంది. బోరిస్ ప్రస్తుత పర్యటనతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు కొలిక్కి రానున్నాయి. భవిష్యత్‌లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది. బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం (సీపీటీపీపీ)లో చేరాలని భారత్‌కు అధికారికంగా అభ్యర్థన చేసింది. ఈ పర్యటనతో ఆ అంశాలపై ఒక స్పష్టత రానుంది. అయితే శుక్రవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్నారు. ‘చాలా బాగుంది.. చాలా వేగవంతం’ అని లండన్‌లోని ఆస్పత్రిలో ఆస్ట్రాజెన్‌కా టీకా వేయించుకున్న అనంతరం బోరిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌పై 56 ఏళ్ల బోరిస్ నమ్మకం వెలిబుచ్చారు. ప్రతిఒక్కరూ టీకా పొందాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. -
టీకా తీసుకున్నా వస్తున్నా.. బోరిస్ భారత పర్యటన ఖరారు
-
భారత్‌లో అమెరికా రక్షణ మంత్రి పర్యటన
న్యూఢిల్లీ: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయడ్ జే ఆస్టిన్ తొలిసారిగా భారత్‌లో పర్యటనకు వచ్చారు. మూడురోజుల ఈ పర్యటనలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేసుకోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. యూఎస్ నుంచి 30 మల్టీమిషన్ ఆర్మ్డ్ ప్రెడేటర్ డ్రోన్స్‌ను కొనుగోలు చేసే 300 కోట్ల డాలర్ల డీల్ తాజా పర్యటనలో తుదిదశకు చేరవచ్చని భావిస్తున్నారు. బోయింగ్, లాక్‌హీడ్ నుంచి 1800 కోట్ల విలువైన 114 ఫైటర్ జెట్లను కొనుగోలుపై కూడా చర్చలు జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యానుంచి భారత్ కొనుగోలు చేయదలిచిన ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థపై చర్చిస్తారని భావిస్తున్నారు. అమెరికా ఈ ఒప్పందం విషయంలో మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి ఆస్టిన్ ప్రధాని మోదీని శుక్రవారం కలిశారు. అనంతరం మాట్లాడుతూ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీతో రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చించామన్నారు. -
తన రూటే సపరేటు...
సుమారు ఎనిమిదేళ్ల క్రితం... ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన ఆ కుర్రాడు చివరి టెస్టులో బరిలోకి దిగాడు. నెమ్మదైన పిచ్‌పై టీమిండియా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ 229 బంతులు ఆడిన అతను అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత గడ్డపై తొలి మ్యాచ్‌లోనే అతను కనబర్చిన పట్టుదల చూసి ఇంగ్లండ్ భవిష్యత్తు తార అంటూ ప్రశంసలు కురిశాయి. తర్వాతి రోజుల్లో తనపై అంచనాలను నిలబెట్టుకుంటూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన ఆ కుర్రాడే జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్... నాగపూర్‌లో మొదలైన రూట్ ప్రస్థానం ఇప్పుడు చెన్నైలో వందో టెస్టు వరకు చేరింది. ఈతరం ఫ్యాబ్–4లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రూట్ అందరికంటే ముందుగా టెస్టు మ్యాచ్‌ల సెంచరీ మైలురాయిని చేరుకోవడం విశేషం. సాక్షి క్రీడా విభాగం భారీగా పరుగుల వరద పారించి ఒకే సిరీస్‌తో స్టార్‌గా మారిపోయిన రికార్డు అతనికి లేదు. రూట్ పేరు చెప్పగానే విధ్వంసక ఇన్నింగ్స్‌లు గానీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శనలు గానీ సగటు క్రికెట్ అభిమానికి గుర్తుకు రావు. అయినా సరే రూట్ సాధించిన ఘనతలు అతని విలువేమిటో చెబుతాయి. అతని కెరీర్ గ్రాఫ్ ఆసాంతం ఒకే రీతిలో, నిలకడగా సాగిపోయింది. క్రీజ్‌లో సుదీర్ఘ సమయం నిలిచే పట్టుదల, ఏకాగ్రత, ఓపిక, చూడచక్కటి కళాత్మక షాట్లు ... ఇలా సగటు టెస్టు బ్యాట్స్‌మన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ రూట్లో ఉన్నాయి. మెరుపు షాట్లు లేకపోయినా... చూస్తుండగానే చకచకా పరుగులు రాబట్టగలిగే శైలితోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో రూట్ 19 సెంచరీలు చేస్తే ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఓడిపోలేదంటే (15 విజయాలు, 4 ‘డ్రా’) జట్టులో అతని ప్రాధాన్యత అర్థమవుతుంది. వైఫల్యాల నుంచి... కెరీర్ ఆరంభంలో రూట్‌కు ఆరో స్థానంలోనే బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చాయి. అదే స్థానంలో తన సొంత మైదానం హెడింగ్లీలో సెంచరీ అనంతరం అతని ప్రదర్శనను చూసిన ఇంగ్లండ్ సెలక్టర్లు ఓపెనర్‌గా అవకాశాలు ఇచ్చారు. అయితే 2013–14లో ఆసీస్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. చివరి టెస్టులో అతనికి చోటు కూడా దక్కలేదు. అయితే కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో శ్రీలంకపై చేసిన సెంచరీతో రూట్ కెరీర్ మలుపు తిరిగింది. తర్వాతి ఏడాదే భారత్‌పై చేసిన రెండు సెంచరీలతో రూట్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బోర్డుతో గొడవల అనంతరం కెవిన్ పీటర్సన్ కెరీర్ అనూహ్యంగా ముగిసిపోవడంతో ఆ స్థానాన్ని ఆక్రమించిన అతను జట్టులో పాతుకుపోయాడు. 2015 ఏడాదిలో టెస్టుల్లో 1,385 పరుగులు చేయడం రూట్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. అతడిని ఐసీసీ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ను కూడా చేసింది. ఉపఖండంలోనూ... సాధారణంగా ఇంగ్లండ్ క్రికెటర్లకు ఆసియా దేశాల్లో పేలవ రికార్డు ఉంటుంది. అయితే స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం ఉన్న రూట్ దీనికి భిన్నం. ముఖ్యంగా స్వీప్ షాట్ రూట్‌కు ఉపఖండంలో భారీగా పరుగులు తెచ్చి పెట్టింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2 టెస్టుల్లోనే చేసిన 426 పరుగులు అతని సామర్థ్యాన్ని చూపించాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఆసియా ఖండం లో అందరికంటే ఎక్కువ సగటు రూట్ (54.13)దే కాగా, కనీసం 8 వేల పరుగులు చేసిన వారిలో కూడా అతనే అత్యుత్తమం. కెరీర్లో 99 టెస్టుల తర్వాత చూస్తే రూట్ చేసినన్ని పరుగులు మరే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కూడా చేయలేదు. 2016లో భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన సిరీస్‌లోనూ 49.10 సగటుతో 491 పరుగులు చేసిన రూట్ జట్టు తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచి తన సత్తా ఏమిటో చూపించాడు. ఇదే సిరీస్ తర్వాత రూట్ ఇంగ్లండ్ 80వ టెస్టు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. వారితో పోలిస్తే... ఫ్యాబ్–4లో సహజంగానే కోహ్లి, స్మిత్, విలియమ్సన్‌లతో రూట్‌కు పోలిక ఉంటోంది. అయితే గణాంకాలపరంగా చూస్తే ఈ ముగ్గురికంటే అతను ఒకింత వెనుకబడినట్లే అనిపిస్తోంది. సాధించిన సెంచరీల సంఖ్య, సగటులో స్మిత్ (61.80/27), విలియమ్సన్ (54.31/24), కోహ్లి (53.41/27)లతో పోలిస్తే రూట్ (49.39/19) రికార్డు గొప్పగా కనిపించదు. కానీ ఇంగ్లండ్ క్రికెట్‌కు సంబంధించి అతను సాధించిన రికార్డులు మాత్రం అతడిని ఆ దేశపు బెస్ట్ బ్యాట్స్‌మన్ జాబితాలో నిలబెట్టాయి. ప్రస్తుతం 30 ఏళ్ల వయసు, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా టెస్టుకు దూరం కాని ఫిట్నెస్, ఇంగ్లండ్ జట్టు ఎక్కువ సంఖ్యలో ఆడే టెస్టులు... ఇవన్నీ చూస్తే ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల అలిస్టర్ కుక్ (12,472 పరుగులు) రికార్డును రూట్ (8,249) తొందరలోనే అందుకోగలడు. -
కోవిడ్ వల్ల తీవ్ర అలసటకు లోనయ్యా: మొయిన్ అలీ
సాక్షి, న్యూఢిల్లీ: గత నెలలో శ్రీలంక పర్యటనకు బయల్దేరిన సందర్భంగా కోవిడ్ బారిన పడ్డ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఆతరువాత తాను ఎదుర్కొన్న భాయానక అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అందులో తనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో, 14 రోజుల పాటు హోటల్ గదిలో క్వారంటైన్లో ఉన్నానని, ఆ రోజులను తలచుకుంటుంటే ఇప్పటికీ భమయమేస్తుందని ఆయన వెల్లడించాడు. కోవిడ్ ప్రభావం వల్ల తీవ్ర అలసటకు లోనయ్యానని, అలాంటి పరిస్థితి తన జీవితంలో మునుపెన్నడూ ఎదురుకాలేదని పేర్కొన్నాడు. రుచిని కోల్పోవడంతో పాటు, తలనొప్పి, గొంతులో మంట లాంటి సమస్యల వల్ల తీవ్ర అలసటకు గరుయ్యానన్నాడు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ సందర్భంగా భగవంతున్ని ప్రార్ధించానన్నాడు. అయితే ఆ భయానక పరిస్థితులను ఎంతో స్థైర్యంతో ఎదుర్కొన్నానని, కష్ట కాలం పూర్తయ్యేవరకు ఓపిగ్గా వ్యవహరించానని తెలిపాడు. కష్టకాలం తరువాత సుఖాలు ఉంటాయనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. హోటల్ గదిలో ఒంటరిగా గడపడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని, దానిని నుంచే బయటపడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని తన అనుభవాలను పంచుకున్నాడు. కాగా, మొయిన్ అలీ ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్నాయి. -
ఆ క్రికెటర్ రెండో టెస్టులో ఆడనున్నాడు
సాక్షి, లండన్: భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహం థోర్‌్ప ప్రకటించాడు. తొలుత బెయిర్‌స్టోకు తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించాలని భావించిన ఆ జట్టు మేనేజ్మెంట్.. అనూహ్యంగా అతను రెండో టెస్ట్‌కు జట్టుతో కలుస్తాడని ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ జో రూట్ తరువాత అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టోను తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించడంపై విమర్శలు రావడంతో మేనేజ్మెంట్ అతన్ని రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకోగా, అందులో బెయిర్‌స్టో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 46.33 సగటుతో 139 పరుగులు సాధించాడు. కాగా, భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు రోటేషన్ పద్ధతి కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్క్ వుడ్, సామ్ కర్రన్, బెయిర్‌స్టోలకు ఆ జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 13న, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్‌లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. -
మా దేశానికి రావొద్దు...
న్యూఢిల్లీ: తజికిస్తాన్లో పర్యటించాలనుకున్న భారత కుర్ర ఫుట్‌బాలర్లకు ‘కరోనా’ షాకిచ్చింది. తమ దేశంలో భారత అండర్–16 ఫుట్‌బాల్ జట్టు పర్యటనను తజికిస్తాన్ రద్దు చేసింది. అండర్–15 దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య చాంపియన్ అయిన భారత కుర్రాళ్ల జట్టు రేపు అక్కడికి బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఏఎఫ్సీ అండర్–16 చాంపియన్‌షిప్ రన్నరప్ అయిన తజికిస్తాన్‌తో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో తజికిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను కరోనా ప్రభావిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 35 దేశాలున్నాయి. ఈ జాబితాలోని దేశాల్లో తమ దేశస్థులు పర్యటించడాన్ని... ఆ దేశస్థులు తమ దేశంలో పర్యటించడాన్ని తజికిస్తాన్ నిషేధం విధించడం వల్లే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నట్లు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య స్పష్టం చేసింది. ఆడండి కానీ... ఆటోగ్రాఫ్‌లు వద్దే వద్దు! ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్–19)తో అమెరికాలో ఆరుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తమ ఆటగాళ్లకు, జట్ల కోచ్‌లు, ఫిజియో, ఇతర సిబ్బందికి తు.చ. తప్పకుండా పాటించే మార్గదర్శకాలు జారీచేసింది. ఆటగాళ్లెవరూ అభిమానులతో కలవరాదని కచ్చితంగా చెప్పేసింది. ఆటోగ్రాఫ్‌లు చేసేందుకు, పెన్నులను ముట్టుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉండాలని ఎన్బీఏ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమ ప్రధాన ఉద్దేశమని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరచాలనం ఇవ్వం: జో రూట్ శ్రీలంకలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు మంగళవారం అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు అక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోరని కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు. కరోనా ఎఫెక్ట్ వల్లే పరస్పర కరచాలనం చేయొద్దని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడైతే కోవిడ్–19 ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా శుచి–శుభ్రతను పాటిస్తామని, తమ క్రికెట్ బోర్డు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటామని రూట్ చెప్పాడు. నిర్‘బంధి’ంచారు... అబుదాబీలో విదేశీ సైక్లిస్ట్‌లకు వింత అనుభవం ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వచ్చిన జట్లలో కొందరికి కరోనా సోకడంతో వాళ్లని వెంటనే వారి స్వదేశాలకు పంపేసిన అబుదాబీ వర్గాలు మిగతా వారిని బస చేసిన హోటల్ గదుల్లోనే నిర్బంధించింది. ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లకు, సిబ్బందికి నిర్బంధం విధించిన యూఏఈ ప్రభుత్వం వైరస్ బారిన పడిన ఇద్దరు ఇటాలియన్ అధికారుల్ని ఉన్నపళంగా ఇటలీకి ప్రత్యేక విమానాల్లో పంపించింది. -
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్‌లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్‌కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్‌లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్!
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం 11:45 గంటలకు అహ్మదాబాద్ సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్నర్లు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్ నెక్లైన్తో, పఫ్పుడ్ స్లీవ్స్‌తో డ్రెస్ చాలా అందంగా ఉంది. మామూలుగానే ఎత్తుగా ఉండే ఆమె డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా పొడవైన ఎర్రటి హైహీల్స్ ధరించి మరింత ఎత్తుగా కనిపించారు. (ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు.. ) ఇవాంకా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్ టీన్ యూఎస్ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అందాల రాశిగా గుర్తింపు వచ్చినా... తర్వాతికాలంలో ఇవాంకా మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. చదవండి : ట్రంప్ దంపతులకు మోదీ ఘన స్వాగతం విజయాలు.. వివాదాలతో సహజీవనం! -
అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్..
-
నమస్తే ట్రంప్
-
తండ్రితో పాటు భారత పర్యటనకు ఇవాంకా!
-
భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది
వాషింగ్టన్: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను వచ్చే వారం భారత్ సందర్శిస్తున్నాను. అక్కడ వాణిజ్యం గురించి చర్చలు జరుపుతాను. వ్యాపారపరంగా అనేకానేక సంవత్సరాలుగా భారత్ మనను దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో అది కూడా ఒకటి. వీటన్నింటిపై కాస్త మాట్లాడాలి‘ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా సుమారు 3%గా ఉంటుంది. అమెరికాకు ప్రయోజనకరమైతేనే డీల్.. భారత పర్యటన సందర్భంగా భారీ డీల్ కుదరవచ్చన్న అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు ట్రంప్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత్‌తో ఏదైనా భారీ డీల్ కుదుర్చుకోవచ్చని, అప్పటిదాకా చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగవచ్చని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటేనే ఏ ఒప్పందమైనా కుదుర్చుకుంటామన్నారు. ఆతిథ్యంపై భారీ అంచనాలు.. భారత్‌లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంకు వెళ్లే దారిలో దాదాపు కోటి మంది దాకా స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ నాకు చెప్పారు. అయితే, దీంతో ఓ చిన్న సమస్య రావొచ్చు. ఇప్పుడు సమావేశమైన ఈ ప్రాంగణం సుమారు 60వేల మందితో కిక్కిరిసిపోయింది. వేల మంది లోపలికి రాలేక బైటే ఉండిపోయారు. అయినప్పటికీ.. భారత్‌లో కోటి మంది ప్రజల స్వాగతం చూశాక.. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే వారు కంటికి ఆనకపోవచ్చు‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ వెంటే ఇవాంకా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్ లేడీ మెలానియా తన భర్త ట్రంప్‌తో పాటు భారత్ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్‌తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి డాన్ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రీన్ తదితరులున్నారు. 24న తాజ్ మహల్ ఫిబ్రవరి 24న వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. 25న రాజ్‌ఘాట్ ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్1బీ వీసా విషయంలో భారత్ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది. సర్వం వచ్చేసింది ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్ అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్, రోడ్ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్‌సీఏ రోడ్‌రన్నర్. దీన్నే మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్‌మాస్టర్ కార్గో విమానాలు అహ్మదాబాద్ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు. ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ అందులోని చాణక్య సూట్లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జిబుష్‌లు సేదతీరారు. ట్రంప్ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. కాగా, ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి. సాదర స్వాగతం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది. సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం అయితే ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు భారత్ పర్యటనకు రానున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం అత్యంత శక్తివంతమైనది. అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: ట్రంప్ మూడు గంటల పర్యటన ఖర్చెంతో తెలుసా..! ఇందులోని సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్ ఫోర్స్ వన్ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్ వన్‌పై దాడులు జరిగితే మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి' -
కెమ్ ఛో ట్రంప్ కాదు.. నమస్తే ట్రంప్
న్యూఢిల్లీ: హౌడీ మోడీ తరహాలో అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనే భారీ కార్యక్రమం ‘‘కెమ్ ఛో ట్రంప్’ ’పేరును ‘నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లిష్‌లో హౌ డూ యూడూ అనే అర్థం వచ్చేలా గుజరాతీ భాషలో కెమ్ ఛో (ఎలా ఉన్నారు? ట్రంప్) అని పేరు పెట్టారు. కానీ అది స్థానిక భాషలో ఉండడంతో ఒక ప్రాంతానికి పరిమితమైనట్టుగా ఉంది. అగ్రరాజ్యాధిపతి పాల్గొనే ఆ కార్యక్రమానికి జాతీయ భావాన్ని తలపించడం కోసం కేంద్రం ఆదేశాల మేరకు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ అని మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూడా ట్రంప్ సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటాం: జైషే మొహమ్మద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘‘ముస్లింలను వేధిస్తే ఇక చూస్తూ కూర్చోం. క్షమించడమన్నదే లేదు’’ అని ఒక వ్యక్తి వీడియో ద్వారా హెచ్చరించాడు. ట్రంప్ పర్యటనకి కాస్త ముందు పాకిస్తానే ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. -
ఇవ్వడంలో మనదే పైచేయి
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి. వీసాల జారీలో మాత్రం చిన్నచూపు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది. వీసాల జారీలో సమతుల్యత ఉండాలి భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. – కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్ విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం ‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొ. పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ -
కెమ్ ఛో ట్రంప్!
అహ్మదాబాద్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరాలో ప్రధాని మోదీ, ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్?’ అని అర్థం. గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ఇది జరగనుంది. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) స్నైపర్ బలగాలను మోహరించనుంది. ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి. 22 కిలోమీటర్ల రోడ్ షో ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్ అధికారులు, 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం, అటునుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షోలో ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నాం. అమెరికా సీక్రెట్ సర్వీస్ దళాలతోపాటు నిఘా విభాగం, సీక్రెట్ సర్వీస్ పోలీసులు నిఘాలో పాలుపంచుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేసిన కొత్త అతిథులను, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం. రోడ్ షోతోపాటు స్టేడియం వద్ద అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేసి, సహకరించాలి’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ ప్రజలను కోరారు. ఫేస్బుక్ ఇచ్చిన గౌరవం: ట్రంప్ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తనకు తొలిస్థానం, మోదీకి రెండో స్థానం ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో ప్రకటించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్..ఫేస్బుక్ తనకు మొదటి స్థానం, భారత ప్రధాని మోదీకి రెండో స్థానం ఇవ్వడాన్ని ప్రస్తావించారు.మోదీ ఫేస్బుక్ ఖాతాలో 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2.75 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. లైక్‌ల దృష్ట్యా చూసినా ఇద్దరి మధ్య అంతరం భారీగా∙ఉంది. మోదీకి 4.45 కోట్ల లైక్‌లు వస్తుండగా, అందులో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 2.6 కోట్లు ట్రంప్‌కు వస్తుంటాయి. రూ.800 కోట్లతో.. అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు. నూతనంగా నిర్మించిన స్టేడియంలోని సుమారు 1.20 లక్షల మంది ప్రజలు, ప్రముఖులు వారికి స్వాగతం పలుకుతారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ చెప్పారు. ‘ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా తిరిగి నిర్దేశిత మార్గాల్లో వెళ్లిపోతారు. స్టేడియం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి’ అని ఆయన తెలిపారు.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో కూడా ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి అతిథులకు స్వాగతం పలకనున్నారు. ఈ మార్గంలో సాంస్కృతిక ఘనతను చాటే పలు చిత్రాలను ఏర్పాటు చేశారు. -
భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏ.ఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. -
భారత పర్యటనకు సత్యా నాదెళ్ల
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24–26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్ వస్తున్నారని ఒక ఈ–మెయిల్ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్ హోదాలో ఇప్పటికే పలు మార్లు ఈయన భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే కాగా, ఈ సారి పర్యటన ఎందుకనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కంపెనీ స్పష్టంచేయలేదు. -
వెల్కమ్ ట్రంప్..గోడచాటు పేదలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీగా ఏర్పాట్లు చేస్తుండగా గుజరాత్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడ నిర్మాణం చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడికి పేదరికం ఛాయలు కనిపించకుండా ఉండేందుకు గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న మార్గంలోని పేదల ఇండ్ల పొడవునా కిలోమీటర్ పొడవైన గోడను నిర్మిస్తోంది. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ఉన్న 500 పూరిగుడిసెలు కనిపించకుండా చేసేందుకు సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు దాదాపు 7 అడుగుల ఎత్తైన ఈ గోడను నిర్మించడంతోపాటు, దాని పొడవునా ఖర్జూర మొక్కలు నాటి ఆ మార్గాన్ని అందంగా తయారుచేయనున్నారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న 16 ప్రధాన మార్గాల్లో రోడ్లు వేస్తున్నారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో యంత్రాంగం బిజీగా ఉంది. ఈ మొత్తం పనుల కోసం అహ్మదాబాద్ అధికారులు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు మీడియా పేర్కొంది. జపాన్ ప్రధాని షింజో అబే(2017), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(2014) పర్యటనలప్పుడు గుజరాత్ ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపట్టింది. 2017లో ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన సమయంలో హైదరాబాద్‌లో ఆమె పర్యటించే ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లందరినీ తెలంగాణ యంత్రాంగం వేరే చోటికి తరలించిన విషయం తెలిసిందే. భారత పర్యటనపై మెలానియా ఉత్సాహం భారత్‌లో పర్యటనకోసం తానెంతో ఉత్సుకతతో ఉన్నానని అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా చెప్పారు. అహ్మదాబాద్, న్యూఢిల్లీలో పర్యటనకు తమను సాదరంగా ఆహ్వానిస్తోన్న భారత ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బలపడనున్న బంధాన్నీ సెలబ్రేట్ చేసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని మెలానియా ప్రకటించారు. తమ ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదనీ, ఇది భారత్–అమెరికాల మధ్య స్నేహ బంధాల్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ ఆమె ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
వెల్కమ్ ట్రంప్
-
అధ్యక్షుడికి అదిరిపోయే ఆహ్వానం
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చిరస్మరణీయ ఆహ్వానం పలుకుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్రంప్ భారత పర్యటన చాలా ప్రత్యేకమైనదని, ఇది అమెరికా–భారత్‌ల మధ్య స్నేహం బలపడేందుకు ఉపకరిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ‘భారత్, అమెరికాలకు ప్రజాస్వామ్యం పట్లా, భిన్న భావాలకూ అవకాశం ఇచ్చే విషయంలో ఒకేరకమైన నిబద్దత ఉన్నది. ఈ ఇరుదేశాల మధ్య స్నేహం, ఈ ఇరుదేశాల పౌరులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా రానున్నారు. భారత్ పర్యటన కోసం వేచి చూస్తున్నా: ట్రంప్ భారత్ పర్యటనకోసం తాను వేచి ఉన్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. మోదీ తనకు మంచి స్నేహితుడనీ అతను చాలా గొప్ప వ్యక్తి అని అమెరికా అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. సరైన ఒప్పందం కావాలి... భారత్‌తో వాణిజ్య ఒప్పందం సాధ్యమేననీ అయితే అది సరైన ఒప్పందం కావాలని ట్రంప్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ రెండు దేశాలు అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదని చెప్పారు. అహ్మదాబాద్‌లో భారీ రోడ్ షో.. డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో భాగంగా ఈసారి ఢిల్లీలో కాకుండా నేరుగా అహ్మదాబాద్‌కి చేరుకుంటారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 10 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేయబోయే రోడ్‌షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని మొటేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్–మోదీలు ఇద్దరూ ఆవిష్కరిస్తారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంకన్నా ఈ స్టేడియం పెద్దదని అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చునే అవకాశం ఉంది. గుజరాత్ బడ్జెట్ సమావేశాలు వాయిదా... ట్రంప్ పర్యటన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ని ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ట్రంప్ పర్యటనలో భాగంగా ఏర్పాటుచేయబోయే రోడ్ షో, బహిరంగ సభలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హౌడీ ట్రంప్.. గత యేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై నుంచి మోదీ, ట్రంప్ ఉపన్యసించారు. ఈ సభకు అమెరికాలో ఉంటోన్న దాదాపు 50,000 మంది భారతీయులు హాజరయ్యారు. అదే తరహాలో ట్రంప్రాక దృష్ట్యా అహ్మదాబాద్‌లో ‘హౌడీ ట్రంప్’పేరిట భారీ సభను ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు దాదాపు లక్షమంది జనం హాజరుకానున్నారు. ఈ సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌లు ప్రసంగించనున్నారు. -
తమిళుల సమస్యలను పరిష్కరించండి
న్యూఢిల్లీ: శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సను ప్రధాని మోదీ కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, తమిళుల సయోధ్య ప్రక్రియను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలుచేయాలని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్న రాజపక్స శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృ్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలో తమిళుల సమస్యల పరిష్కారానికి కొలంబో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మానవతా కోణంలో స్పందించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. -
క్రేజీ కపుల్ భారత యాత్ర!
వయసేమో డెబ్భయ్ మూడు. గుండె ఆపరేషన్ జరిగి నెలలు కూడా కాలేదు. ఇంతలోనే... మూడు చక్రాల కారేసుకుని... దేశం కాని దేశమంతా తిరిగేస్తానని ఎవరైనా అంటే మీరేమంటారు? మతిగానీ పోయిందా? అనేస్తాం. ఒకరు కాకుండా ఓ జంట ఇలా బయలుదేరితే.. క్రేజీ కపుల్ అనాల్సిందే. వాళ్లే.. అలన్ బ్రాత్‌వెయిట్, పాట్ బ్రాత్‌వెయిట్! అరవై ఏళ్ల తరువాత జీవితం చివరకు వచ్చేసినట్లే అని భూమికి ఒక దిక్కున ఉన్న వాళ్లు అనుకుంటారు. కానీ మరో దిక్కున ఉన్న వాళ్లకు మాత్రం అప్పుడే అసలైన జీవితం మొదలైనట్లు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం అలన్, పాట్ బ్రాత్‌వెయిట్ దంపతులు. బ్రిటన్‌కు చెందిన వీరు నాలుగు రోజుల క్రితం భారత్‌లో ఓ సాహసయాత్ర మొదలుపెట్టారు. సాహసయాత్ర అని ఎందుకు అనాల్సి వస్తుందంటే.. కచ్చితంగా మూడు నెలల క్రితమే ఆలన్‌కు ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగింది. విమానం ఎక్కవచ్చు అని డాక్టర్లు సర్టిఫై చేయడమే తడవు.. రెండేళ్లుగా వీరు చాలా జాగ్రత్తగా, ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకున్న ‘ద ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్’ కోసం భారత్‌కు విచ్చేశారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ వీరి సాహసయాత్రకు కావాల్సిన మూడు చక్రాల కారు ముంబైకి చేరుకుంది. మీరు చదివింది కరెక్టే.. ఎప్పుడో 1909లో నిర్మించి.. 2011లో మళ్లీ లాంచ్ చేసిన మూడు చక్రాల ‘మోర్గన్’ కారులోనే వీరు భారత్ మొత్తం తిరిగేయనున్నారు. ముంబై నుంచి బయలుదేరిన అలన్, పాట్లు సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బిట్రిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ క్రేజీ కపుల్ తమ సాహసయాత్ర తాలూకూ ఉద్దేశాలు.. వివరాలు వెల్లడించారు. మోర్గన్‌ను చూపించాలనే..! నిజానికి అలన్, పాట్లకు భారత్ కొత్తేమీ కాదు. అలన్ వాళ్ల అమ్మ కర్ణాటకలోని బెల్గామ్ లో జన్మిస్తే అమ్మమ్మ పుట్టింది మైసూరులో. తాత, అమ్మమ్మల పెళ్లి జరిగింది ముంబైలోనైతే.. అలన్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంది సిమ్లాలో. అప్పట్లో అలన్ తండ్రి బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ అధికారి. ఈ నేపథ్యంలో తాము గతంలో రెండుసార్లు (2013, 2017) ఇండియాకు.. మరీ ముఖ్యంగా బెల్గామ్‌కు వచ్చామని అలన్ తెలిపారు. 2017లో బెల్గామ్ నుంచి కేరళకు వెళుతూండగా.. బెంగళూరుకు చెందిన కొందరు హ్యార్లీ డేవిడ్సన్ మోటర్‌బైక్‌లలో ఆయనకు ఎదురయ్యారు. ‘‘ఆ మోటర్ బైక్‌ల చేస్తున్న ధ్వనులు.. నడుపుతున్న వారి ఉత్సాహం చూసిన నాకు.. అకస్మాత్తుగా వీళ్లకు.. బ్రిటన్‌లో తయారైన మోర్గన్ కార్లు చూపించాలి అనిపించింది’’ అంటారు అలన్. అలా ఈ ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్‌కు బీజం పడిందన్నమాట! ‘ద ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మోర్గన్ కారులో హైదరాబాద్ చేరుకున్న అలన్, పాట్ బ్రాత్ వెయిట్ దంపతులు స్వచ్ఛంద సంస్థ గూంజ్ కోసం మోర్గన్ కారులో భారత్‌లో తిరగాలన్న ఆలోచన మొదలైన తరువాత ఈ యాత్రకు ఏదైనా ఒక లక్ష్యం ఉండాలని అలన్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ’గూంజ్’ ఆయన కళ్లల్లో పడింది. నగరాలు వ్యర్థాలుగా పారబోసే వస్తువుల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, గ్రామీణులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ‘గూంజ్’ కోసం రెండు లక్షల పౌండ్ల (1.86 కోట్ల రూపాయలు) నిధులు సేకరించాలని అలన్, పాట్లు నిర్ధారించుకున్నారు. తమ సాహసయాత్రకు సంబంధించిన డాక్యుమెంటరీని తీసి దాన్ని అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు అమ్మగా వచ్చే డబ్బును గూంజ్కు ఇవ్వాలన్నది ప్లాన్. తద్వారా గూంజ్ చేస్తున్న పనుల గురించి భారత్‌తోపాటు ప్రపంచమంతా తెలుస్తుందని.. వాళ్లు తమ కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చునని అలన్ తెలిపారు. దీంతోపాటు రాల్ఫ్ లారెన్, మోర్గన్ మోటర్ కంపెనీ, యూకే విదేశీ, కామన్వెల్త్ కార్యాలయాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇదీ ప్రస్థానం..! భారత్‌లో 34 రోజుల్లో 5600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నది అలన్, పాట్ల ప్రణాళిక. ముంబై నుంచి హైదరాబాద్... అక్కడి నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి.. ఆ తరువాత విశాఖకు యాత్ర కొనసాగుతుంది. విశాఖ నుంచి కోల్‌కతా.. అక్కడి నుంచి న్యూఢిల్లీ వెళతారు. దేశ రాజధాని నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పాల్గర్ వచ్చి ఆ తరువాత ముంబైకి చేరడంతో యాత్ర ముగుస్తుంది. యాత్రను చిత్రీకరించేందుకు అలన్, పాట్ల మోర్గన్ కారును మరికొన్ని వాహనాలు అనుసరిస్తూంటాయి. నాలుగు రోజుల యాత్ర అనుభవాలేమిటన్న ప్రశ్నకు అలన్ సమాధానమిస్తూ.. ఆగిన ప్రతిచోట జనాలు బోలెడన్ని సెల్ఫీలు తీసుకుంటున్నారని ఈ లెక్కన చూస్తే తన యాత్ర సఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. రహదారులు కొన్నిచోట్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తమ్మీద యాత్ర సజావుగానే సాగుతోందని ముక్తాయించారు. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ట్రంప్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. అంతకుమించి ఇప్పుడు ఈ విషయంపై ఇంకా ఏమీ చెప్పలేమని స్పష్టం చేసింది. ట్రంప్ పర్యటన ఖరారైన తరువాత వివరాలను వెల్లడిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ట్రంప్ ఈ ఫిబ్రవరిలో భారత్ వస్తున్నారని, గుజరాత్‌లోని ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన సబర్మతి నదిని సందర్శిస్తారనిగుజరాత్ సీఎం రూపానీ గతంలో అన్నారు. -
ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు. -
లంకతో కరచాలనం
ఈమధ్యే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గోతబయ రాజపక్స తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని గురువారం ఇక్కడికొచ్చారు. పదిరోజులనాడు జరిగిన ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) అధిక శాతం ఓట్లు సాధించింది మొదలు కొని ఇరు దేశాల సంబంధాలపైనా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. గోతబయ సోదరుడు మహిందా రాజపక్స అయిదేళ్ల క్రితం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భారత్ విషయంలో వ్యవహ రించిన తీరు నేపథ్యంలో ఈ ఊహాగానాలు తలెత్తాయి. అయితే భారత్ భద్రతకు ఇబ్బందిగా పరిణ మించే విధాన నిర్ణయాలేవీ తీసుకోబోమని గోతబయ ఇప్పటికే చెప్పారు. చైనాతో తమ సంబంధాలు పూర్తిగా వాణిజ్యపరమైనవేనని వివరించారు. బహుశా మన ప్రభుత్వానికి కూడా ఇందుకు సంబం ధించిన సంశయాలున్నట్టున్నాయి. కనుకనే గోతబయ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్ కొలంబో వెళ్లి ఆయన్ను కలిశారు. భారత్ పర్యటనకు రావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని ఆయనకు అందించారు. శ్రీలంకతో మన సంబంధాలు శతాబ్దాలనాటివి. అయితే ఈ సంబంధాల్లో గత కొన్నేళ్లుగా ఆటుపోట్లు తప్పడం లేదు. ముఖ్యంగా మహిందా ఏలుబడిలో ఆ దేశం చైనాకు సన్నిహితమై మనల్ని దూరం పెట్టింది. హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ఈ ప్రాంతం మీదుగానే తూర్పు, పడమర దేశాల మధ్య నిరంతరం సరుకు రవాణా సాగుతుంటుంది. కనుకనే అది తమ అదుపాజ్ఞల్లో ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆటాడించవచ్చునని అగ్రరాజ్యాలు ఆశిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న లంక మన ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే అది మన భద్రతకు ముప్పు కలిగిస్తుంది. వాస్తవానికి చైనా ఒక వ్యూహం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని మనకు సవాలు విసురుతోంది. ఈ విషయంలో మన సమస్యలు మనకున్నాయి. మామూలుగా అయితే విదేశాంగ విధానం విషయంలో ఏ రాష్ట్ర ప్రభు త్వమూ జోక్యం చేసుకోదు. ఫలానా విధంగా ఉండాలని కేంద్రాన్ని కోరదు. కానీ లంకతో సంబంధా లకు ఇది వర్తించదు. శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం లేదా సింహళ తీవ్రవాద సంస్థలూ విరుచుకుపడినప్పుడల్లా తమిళనాట ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ప్రభాకరన్ నేతృత్వంలోని లిబరేషన్ టైగర్ల సంస్థ శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతంలో ఆధిపత్యం చలాయించినప్పుడు, ఉగ్రవాద దాడు లకు పాల్పడినప్పుడు లంక సర్కారు ఆ వంకన అక్కడి తమిళులపై దమనకాండ ప్రయోగించేది. అలాంటి పరిణామాలు తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని గట్టిగా హెచ్చరించాలని, అక్కడున్న తమిళుల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బయల్దేరేవి. ఈ పరిస్థితుల్లో సహజంగానే మన దేశం లిబరేషన్ టైగర్ల అణచివేతకు సహకరించలేకపోయింది. దాంతో రాజపక్స చైనాకు దగ్గరయ్యారు. అది ఉదారంగా ఇచ్చిన యుద్ధ విమానాలు, మారణాయుధాలు, రాడార్ల సాయంతో 2009లో ప్రభా కరన్తోసహా లిబరేషన్ టైగర్లందరినీ మట్టుబెట్టాక ఆయన పూర్తిగా చైనాపై ఆధారపడటం మొదలుపెట్టారు. ఇదే అదునుగా అక్కడి మౌలిక సదుపాయాల రంగంపై చైనా దృష్టి కేంద్రీకరించి భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో నౌకాశ్రయాలు, రహదారులు నిర్మించడానికి సిద్ధ పడింది. చూస్తుండగానే చైనా పెట్టుబడులు అమాంతం పెరిగిపోగా, మన వాటా క్షీణించింది. వాణిజ్య సంబంధాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే చైనాతో సంబంధాలకు ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో లంకకు ఆలస్యంగా అర్థమైంది. పెట్టుబడులన్నిటిపై అది వసూలు చేసిన వడ్డీలు కాబూలీవాలాను తలపించాయి. ప్రాజెక్టులన్నీ లంకకు గుదిబండలుగా మారాయి. రుణాలను చెల్లించడం మాట అటుంచి వడ్డీలు కట్టడానికే దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దేశ సార్వ భౌమత్వానికి పాతరేస్తున్న ఈ ప్రాజెక్టులపై స్థానికుల్లో నిరసనలు పెల్లుబికాయి. ఉద్యమాలు ఉధృత మయ్యాయి. పర్యవసానంగా కొలంబో పోర్టు సిటీ వంటివి చాన్నాళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రాజె క్టుల్ని రద్దు చేసుకుంటే చైనాకు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రావడంతో లంక సంకటంలో పడింది. గత్యంతరం లేక కొలంబో పోర్టు సిటీ ప్రాజెక్టును చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. ఇది తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని లంక ప్రజానీకం భావిస్తుంటే, భారత్ భద్రతకు సమ స్యగా మారుతుందని మన ప్రభుత్వం అనుకుంటోంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక మహిందా రాజపక్స మన దేశంపై ఆక్రోశం వెళ్లగక్కారు. భారత్ హైకమిషన్ కార్యాలయం తన ఓటమికి పావులు కదిపిందని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన స్వరం తగ్గించినా, గోతబయ మాత్రం నిరుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మన దేశాన్ని నిందిం చారు. అయితే మన దేశం కూడా మొన్నటిదాకా పాలించిన సిరిసేనపై అసంతృప్తిగా ఉంది. చైనాతో ఆయన దృఢంగా వ్యవహరించలేదన్న అభిప్రాయంతో ఉంది. కనుకనే ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండి పోవడమే కాదు... గోతబయ ఎన్నికయ్యాక వెనువెంటనే ఆయన్ను అభినందించింది. ఇరు దేశాలూ చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. కొలంబో పోర్టులో జపాన్ సహ కారంతో మన దేశం ఒక టెర్మినల్ నిర్మించడానికి సుముఖత వ్యక్తం చేసి చాన్నాళ్లయింది. అలాగే ట్రింకోమలీ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు, మరొకచోట 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం ప్రతిపాదనలు సిరిసేన కాదనడంతో ఆగిపోయాయి. వీటిని ఖరారు చేసుకోవడంతోపాటు గోత బయతో లంకలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, దానివల్ల మన దేశానికి ఏర్పడగల ముప్పు వగైరా అంశాలు చర్చించాల్సి ఉంది. దౌత్యసంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు అల కలు, అపోహలు తప్పవు. నరేంద్రమోదీ, రాజపక్స శుక్రవారం జరిపే చర్చలు ఇరు దేశాల సంబం ధాల మెరుగుదలకు దోహదపడతాయని ఆశించాలి. -
షకీబ్ భారత్‌కు వస్తాడా!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కీలకమైన భారత పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లా బోర్డుతో ఇటీవల చెలరేగిన వివాదాల కారణంగా షకీబ్ భారత్ వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ముందుగా కాంట్రాక్ట్ విషయంలో సహచరులతో కలిసి సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్... ఆ తర్వాత తన వ్యక్తిగత స్పాన్సర్ ఒప్పందం విషయంలో కూడా బోర్డుతో తలపడాల్సి వచ్చింది. టెలికామ్ సంస్థ ‘రోబీ’ బంగ్లా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా... దానికి ప్రత్యర్థి అయిన ‘గ్రామీన్‌ఫోన్’కు షకీబ్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేయగా, షకీబ్ ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా గత మూడు రోజుల్లో బంగ్లాదేశ్ మొత్తం జట్టు రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనగా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షకీబ్ గైర్హాజరయ్యాడు. టీమ్ బుధవారం భారత్‌కు బయల్దేరాల్సి ఉంది. షకీబ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కావాలనే ఇదంతా చేస్తూ జట్టును దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమైన ఆటగాళ్లు కూడా చివరి నిమిషంలో తప్పుకునే ప్రమాదం ఉన్నట్లు తనకు అనిపిస్తోందన్న హసన్... షకీబ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
బంగ్లాదేశ్ వస్తుందా భారత్‌కు?
ఢాకా: భారత్‌లో బంగ్లా పర్యటనకు ఇంకా రోజుల వ్యవధే ఉంది కానీ... ఆటగాళ్ల అనూహ్య నిర్ణయం ఈ సిరీస్‌ను సందిగ్ధంలో పడేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమని మీడియా సమావేశంలో తెగేసి చెప్పారు. సమ్మె బావుట ఎగరేసిన వారిలో మేటి క్రికెటర్లు కెపె్టన్ షకీబుల్ హసన్, మహ్ముదుల్లా, ముషి్ఫకర్ రహీమ్ సహా మొత్తం 50 మంది ఆటగాళ్లున్నారు. దీంతో జాతీయ క్రికెట్ లీగ్‌తో పాటు భారత పర్యటనకు ఆటగాళ్ల సమ్మె దెబ్బ తగలనుంది. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. ఇందులో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగమైన 2 టెస్టుల సిరీస్, మూడు టి20లు ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాలో శిక్షణ శిబిరం మొదలు కావాల్సి ఉంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్గత వ్యవహారం. బీసీసీఐ పరిధిలో లేని అంశం. ఏదేమైనా సిరీస్ జరగాలనే ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఓ టెస్టు జరగనుంది. ఒకవేళ సిరీస్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి పాయింట్ల (120)ను భారత్‌కే కేటాయిస్తుంది. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన ఖరరు
-
భారత్‌తో కలిసి పనిచేస్తాం: అమెరికా
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్న పాంపియో గురువారం భారత్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత విదేశాంగ మంత్రిగా నియమితులైన జయశంకర్‌కు పాంపియో అభినందనలు తెలిపారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేత ఒకరు భారతలో పర్యటించడం ఇదే ప్రథమం. 28నుంచి జపాన్‌లో జరిగే జి–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో పాంపియో భారత పర్యటనకు ప్రాధాన్యం లభించింది. పర్యటనలో భాగంగా పాంపియో విదేశాంగ మంత్రి జయశంకర్, తదితర మంత్రులతో సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.‘భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పరం లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఈ పర్యటన చక్కని అవకాశంగా భావిస్తున్నాం.’అని కుమార్ అన్నారు. -
భారత్‌కు వస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో జూన్ 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ దేశ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య బంధాలను బలపరిచేలా సమావేశాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 28, 29 తేదీలలో జపాన్‌లోని ఒసాకా పట్టణంలో జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో మైఖేల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు ఇతర అధికారులతోనూ భేటీలు జరగనున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాతో చెప్పారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంతో పాటు ప్రపంచ సమస్యలను గురించి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. హెచ్ 1బీ వీసాలపై అమెరికా నిబంధనలు విధిస్తున్న అంశం గురించి మీడియా ప్రతినిధులు రవీశ్ వద్ద ప్రస్తావించగా, ఈ విషయం గురించి అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదన్నారు. భారత్‌కు రానున్న పాంపియో ఏ విషయాలు మాట్లాడాలో ఇప్పుడే ఊహించడం సరికాదన్నారు. అమెరికాలో భారత నిపుణులు ప్రతి రంగంలో ఉన్నారని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంలో వీరు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అమెరికాతో సంబంధాల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇలా ఆలోచిస్తే సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు. ఇరుదేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, వాణిజ్యం రూ. పదిలక్షల కోట్లకు పెరిగిందన్నారు. భారత్ పర్యటన అనంతరం పాంపియో శ్రీలంక, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కూడా వెళ్లనున్నారు. ఇండో–పసిఫిక్ దేశాలతో యూఎస్ సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. -
సత్యార్థి సోల్జర్
‘కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్’ తో కలిసి దేశవ్యాప్తంగా పని చేస్తున్న పిల్లల హక్కుల కార్యకర్తలలో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చందన మర్రిపల్లి ఒకరు. సత్యార్థి ఫౌండేషన్ ‘బచ్పన్ బచావో ఆందోళన్’ చేపట్టి దాదాపుగా భారత్ దేశమంతటా పర్యటించింది. బాల కార్మికులను, అపహరణకు గురయిన పిల్లలను గుర్తించి వారిని పనుల్లో నుంచి తప్పించి బడుల్లోకి పంపిస్తోంది. లైంగిక దోపిడీకి బలవుతున్న బాల్యానికి సంరక్షించడానికి తాపత్రయ పడుతోంది. ఈ పర్యటనల క్రమంలో ప్రత్యక్షానుభంతో తాను తెలుసుకున్న అనేక సంగతులను చందన ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘బచ్పన్ బచావో ఆందోళన్ (బిబిఎ)లో భాగంగా 2017లో భారత్ యాత్ర నిర్వహించాం. ఆ యాత్ర కన్యాకుమారి నుంచి తెలంగాణ మీదుగా కాశ్మీర్ వరకు ఆగింది. ఏడు మార్గాలుగా సాగిన మా భారత్ యాత్ర 22 రాష్ట్రాలు, యూటీలను సందర్శించింది. ఆ పర్యటనలో సమాజానికి ‘పిల్లల మీద దాడి జరగకూడదు, పిల్లలు అపహరణకు గురి కాకూడదు’ అని పిలుపునిచ్చాం. ‘చైల్డ్ రేప్‌కి శిక్ష కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. భారత్ యాత్ర తర్వాత ఇచ్చిన నివేదిక కారణంగానే 16వ లోక్‌సభ యాంటీ ట్రాఫికింగ్ బిల్‌కు చట్టం రూపం వచ్చింది. బిబిఎ కి 14 రాష్ట్రాల్లో పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మా కార్యకర్తలు చురుగ్గా పని చేస్తూ తమ దృష్టికి వచ్చిన విషయాలను పోర్టల్‌లో పోస్ట్ చేస్తారు. అలా మాకు ఒడిషా నుంచి పెద్దసంఖ్యలో బాలకార్మికులు తెలంగాణకు తరలి వచ్చినట్లు తెలిసింది. ఒడిషా వాళ్లు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారనే కోణంలో స్థానికంగా విచారించినప్పుడు.. వాళ్లంతా ఇటుకలు తయారు చేసే బట్టీల్లో పనిచేయడానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటుక బట్టీల మీద నిఘా పెట్టాం. ఆ నిఘాలో మేము ఊహించిన వాటితోపాటు ఊహించని నిజాలూ బయటపడ్డాయి. పేదరికం చేసే ఒప్పందం ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఉంటాయి. ఆ బట్టీల్లో పని చేయడానికి శ్రామికులను బయటి నుంచి తీసుకువస్తుంటారు బట్టీల యజమానులు. ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుకలు చేసే శ్రామికులు ఇటుక బట్టీల పక్కనే ఇటుకల్లేని గుడారాల్లో తలదాచుకుంటారు. పాములు, తేళ్లు ఆ గుడారాల చుట్టూ సంచరిస్తూనే ఉంటాయి. వాటి బారి నుంచి తమను తాము కాచుకుంటూ బతుకీడుస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే శ్రామికుల కుటుంబాల్లోని పిల్లలతో కూడా పని చేయించుకునేటట్లు ఒప్పందం చేసుకుంటున్నారు! ఇది ఇటుక బట్టీల యజమానులకు– శ్రామికుల కుటుంబాలకు మధ్య జరిగే ఒడంబడిక. పేదరికం శాసిస్తున్న జీవితాల్లో ఆ పేదరికమే దగ్గరుండి మరీ చేయించే కట్టుబానిసత్వాలు ఇవన్నీ. అలా కుటుంబం మొత్తం పని చేస్తుంటారు. పదేళ్ల పిల్లలను కూడా ఒక తలకాయగా లెక్కించేసి ముందుగానే కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చేస్తారు. అలా బడిలో బలపంతో అక్షరాలు దిద్దాల్సిన బాల్యం తన ప్రమేయం లేకుండానే ఇటుక రాళ్లను పేర్చడానికి అలవాటు పడిపోతుంది. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలను బడికి పంపించాలని, పనులకు పంపించకూడదని మన దగ్గర చట్టాలన్నాయి. అయినా పనుల్లో చేర్చేది తల్లిదండ్రులే అయినప్పుడు ఆపగలిగింది ఎవరనేదే ప్రశ్న. ఒకవేళ తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలకు ఏదో పని నేర్పించాలనుకుంటే దానికీ నిబంధనలున్నాయి. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయించరాదు. కానీ ఇటుకబట్టీల్లో పనులు పగటి పూటకంటే రాత్రిళ్లే ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పిల్లల చేత పని చేయించరాదనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. బట్టీల మధ్య ఇరుగ్గా ఉండే సందుల్లో సులువుగా నడుస్తూ ఇటుకలను తిరగేయడం వంటి పనులు పెద్దవాళ్ల కంటే పిల్లలే బాగా చేస్తారని ఆ పనులు పిల్లల చేతనే చేయించడం చూశాం. ఇంతకంటే అసలైన ఘోరం, అమానవీయం మరొకటుంది ఇక్కడ! చీకటే నాలుగ్గోడలు! ఇటుక బట్టీల దగ్గర నివాసం ఉండే శ్రామికుల కోసం టాయిలెట్లు ఉండవు. రాత్రి కావడమే వాళ్లకు నాలుగ్గోడలు. స్నానం చేయాలన్నా, ఇతర కాలకృత్యాలైనా తెల్లవారకముందే పూర్తవ్వాలి. లేకుంటే మళ్లీ రాత్రి జనం నిద్రకు ఉపక్రమించిన తర్వాతే. అప్పుడు కూడా ఏజెంట్ల నిఘా కళ్ల నీడల్లో సంచరించాల్సిందే. టీనేజ్‌లో ఉన్న ఆడపిల్లలు దూరంగా వెళ్తుంటే... వాళ్ల కదలికలను గమనిస్తూ టార్చ్ లైట్ వేస్తుంటాడు ఏజెంట్. ఇదేం పని అని అడిగితే ఆ అమ్మాయిలు ఎటూ పారిపోకుండా చూస్తున్నామంటారు. పిల్లల బాల్యాన్ని పనిగంటలుగా మార్చి కొనుగోలు చేసిన వ్యాపారి కబంధ హస్తాల్లో నుంచి బయటపడడం అంత సులభం కూడా కాదు. అయినా వాళ్ల ప్రతి కదలిక మీదా ఓ కన్ను ఉంటుంది. ఇంతే కచ్చితంగా శ్రామికుల సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే ఒక్కటీ కనిపించవు. శ్రామికులను కుటుంబాలతోపాటు పనిలో పెట్టుకున్నప్పుడు పాటించాల్సిన లేబర్ ‘లా’ను పట్టించుకోవడం ఎక్కడా కనిపించలేదు మాకు. శ్రామికులు సౌకర్యంగా నివసించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ యజమానులే చేయాలి. పిల్లల కోసం స్పెషల్ స్కూల్ కూడా నిర్వహించాలి. అది కూడా ఏ ప్రాంతం నుంచి శ్రామికులను తీసుకువచ్చారో ఆ భాషలోనే చదువు చెప్పించాల్సి ఉంటుంది. రెండు నెలల కిందట కూడా ఇలాంటి దయనీయ స్థితిలో దాదాపుగా వెట్టిచాకిరి చేస్తున్న పిల్లలను సంరక్షించాం. బాండెడ్ లేబర్ యాక్ట్‌ని ఉల్లంఘిస్తే పని చేయించుకున్న యజమానులతోపాటు తల్లిదండ్రులకూ శిక్ష ఉంటుందని చెప్పిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అసలైన దయనీయం పిల్లల బాల్యాన్ని తుంచేయడంలో సమాజం బాధ్యత కూడా ఎక్కువే. ఒక కాలనీలో పిల్లలు స్కూలు ఎగ్గొట్టి అల్లరిచిల్లరగా తిరుగుతుంటే ఆ కాలనీ వాళ్లు చూసి కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పరు. హైదరాబాద్ సిటీలో ఓ బస్తీలో పిల్లలు మద్యం తాగుతున్నట్లు కాలనీలో అందరికీ తెలుసు. కానీ ఒక్కరు కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పలేదు, అధికారులకూ చెప్పలేదు. పిల్లల సంరక్షణ కోసం మన దగ్గర చట్టాలున్నాయి. కానీ సంబంధిత డిపార్ట్మెంట్లకు సమాచారం చేరడం లేదు. ఆ గ్యాప్‌ని భర్తీ చేయడానికి సత్యార్థి ఫౌండేషన్ పని చేస్తోంది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ముందుగా వెళ్లి పరిస్థితిని గమనిస్తాం. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలకు తెలియచేసి వారి సమన్వయంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, పిల్లల్ని బడికి పంపేలా చూడడం వంటివి మా వంతు బాధ్యతగా చేస్తున్నాం. లీగల్ అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. మా విజ్ఞప్తి ఒక్కటే... ‘పిల్లలు అపహరణకు గురయినట్లు తెలిసినా, పిల్లల చేత పని చేయించడాన్ని చూసినా, పిల్లలు ఇతర వేధింపులకు బలవుతున్నట్లు తెలిసినా, వ్యసనాల బారిన పడుతున్నట్లు గమనించినా వెంటనే మాకు తెలియచేయండి’ అని అర్థిస్తుంటాం.ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్లో సమావేశంలో కైలాష్ సత్యార్థి గారు పాల్గొన్నారు. మేము చేసుకున్న తీర్మానాల్లో ముఖ్యమైనవి.. బడికి పోవాల్సిన వయసులో ఉన్న పిల్లలు పనికి పోతున్నట్లు ఒక్క కేసు కూడా లేని రోజు కోసమే మా పోరాటం. పిల్లలందరూ బడిలో ఉండాలనేది మా ఫౌండేషన్ ఆశయం’’ అని ముగించారు చందన. – వాకామంజులారెడ్డి ఫొటోలు : నాగరాజు బాల్యం విలువైనది మాది రాజన్న సిరిసిల్ల జిల్లా (ఒకప్పటి కరీంనగర్ జిల్లా)లోని రుద్రంగి గ్రామం. మా ఊర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి మహిళను నేను. ఆడపిల్లలను చదివించడంలో అంతటి వెనుకబాటుకు గురయి ఉంది మా గ్రామం. నాన్న టీచర్, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావడం, అమ్మకు చదువుకోవాలనే కోరిక ఉండి కూడా చదువుకోలేకపోవడంతో నన్ను చదివించి తాను సంతోషపడడం... నన్ను పీజీ వరకు తీసుకెళ్లింది. పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించడం అంటే ఇటు సూర్యుడు అటు ఉదయించినంత గందరగోళమన్నమాట. మా నాన్న మా ఊరి ఉద్యమకారుడనే చెప్పాలి. టీచర్‌గా ఆయన బడికి వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోలేదు. ప్రతి ఇంటికీ తిరిగి పిల్లల్ని బడికి పంపించమని పెద్దవాళ్లను బతిమిలాడి మరీ తీసుకెళ్లేవారు. నా చిన్నప్పుడు నాన్నను అలా చూశాను. పీజీలో సోషల్ వర్క్ చేశాను. దాంతో నా కెరీర్‌ని కూడా సామాజిక కార్యకర్తగానే మలుచుకున్నాను. మొదట ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, హెచ్ఐవి ప్రాజెక్ట్‌లతో పని చేశాను. ప్రస్తుతం సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నాను. బాల్యం విలువైనది. పిల్లల కోసం పనిచేయడం సంతోషంగా నాకు ఉంది. చందన మర్రిపల్లి, పిల్లల హక్కుల కార్యకర్త, చీఫ్ కో ఆర్డినేటర్(తెలంగాణ), సత్యార్థి ఫౌండేషన్ -
పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు కట్ట్ఘుబడి ఉన్నాం
-
అజేయ భారత్ యాత్ర
సంగీత శ్రీధర్.. అజేయ భారత్ యాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోన్న భారత్‌ను ప్రపంచం ముందు సమున్నతంగా ఆవిష్కరించేందుకు సాహసోపేత యాత్ర చేపట్టారు. యాభై ఏళ్ల సంగీత స్వయంగా వాహనం నడుపుతూ ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించారు. 39 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని 175వ రోజు సోమవారం ఆమె హైదరాబాద్‌చేరుకున్నారు. ఇప్పటి వరకు 280 నగరాల్లో పర్యటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, స్వచ్ఛ భారత్‌ను, మహిళల స్వయం సమృద్ధి, స్వావలంబన, సామాజిక భద్రత లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. యాత్ర లక్ష్యాన్ని, విశేషాలను, తన అనుభవాలను ఇలా వివరించారు. అరబ్– ఇండియా గుడ్‌విల్ జర్నీ.. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నేను రెండున్నర దశాబ్దాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాను. ఒమన్ సాంకేతికశాఖ మంత్రిత్వశాఖలో ఈ–గవర్నెన్స్ అడ్వయిజర్‌గా కీలక విధుల్లో ఉన్నాను. మా వారు శ్రీధర్ ఓ ఆయిల్ కంపెనీ సీఈఓ. కుమారుడు అస్వత్ అమెరికాలో స్థిరపడ్డాడు. చాలాకాలం క్రితమే అరబ్‌లో స్థిరపడిన నేను గతేడాది ఆగస్టు 18న ‘యూఏఈ– ఇండియా గుడ్ విల్ జర్నీ’ పేరుతో ఈ సాహస యాత్రను చేపట్టాను. అన్ని రకాల సదుపాయాలు ఉన్న టాటా హెక్సా వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ పర్యటిస్తున్నా. ముంబై నుంచి మొదలైన యాత్రలో ఇప్పటి వరకు ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో పర్యటించా. ఈశాన్య రాష్ట్రాలను చుట్టేశా. అండమాన్ నికోబార్ మినహా ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించాను. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చా. విజయవాడ, ఒంగోలు తదితర నగరాల మీదుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక దక్షిణాది రాష్ట్రాలను పూర్తి చేసుకొని మార్చి నాటికి తిరిగి ముంబై చేరుకుంటా. ‘ఎక్కడికెళ్లినా ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు. అన్ని నగరాల్లో తమ సొంత ఇంటి వ్యక్తిలా చూసుకుంటున్నారు. దేశమంతా ఇప్పుడు నాకు ఒక కుటుంబంలా అనిపిస్తోంది’. స్వచ్ఛభారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని చోట్ల టాయిలెట్ల నిర్మాణాన్ని, పారిశుద్ధ్య నిర్వహణను ప్రధానంగా ప్రచారం చేస్తున్నాను. ఈ పర్యటనలో నాకెదురైన అనుభవాలపై త్వరలో పుస్తకం రాస్తాను. వాహనమే నా ‘లైఫ్ లైన్’.. నేను పయనిస్తున్న టాటా హెక్సా వాహనమే నా లైఫ్‌లైన్. 300 ఓల్టుల విద్యుత్‌ను అందజేసే సోలార్ ప్యానల్స్ ఉన్న ఈ వాహనంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. కంప్యూటర్, ఫోన్, ల్యాప్‌టాప్ తదితర అవసరాలకు సరిపడా విద్యుత్ లభిస్తుంది. భోజనం, వసతి, నిద్ర అన్నీ వాహనంలోనే. స్నానం తదితర అవసరాల కోసం పబ్లిక్ టాయిలెట్లను వినియోగిస్తున్నా. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన టాయిలెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ‘మ్యాప్ మై ఇండియా’ ఆధారంగా వాహనం వెళ్లాల్సిన మార్గం నిర్ధారణ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ, రూట్కోర్సు, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ నమోదవుతాయి. ప్రతి రోజు జర్నీ వివరాలను యూఏఈ నుంచి నా భర్త శ్రీధర్ పర్యవేక్షిస్తుంటారు. ప్రతిరోజు ఒక్క పూట మాత్రమే భోజనంచేస్తూ మిగతా వేళల్లో పండ్లు, సలాడ్లతో గడిపేస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో, విజయవంతంగా నా యాత్ర కొనసాగిస్తున్నా. -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్..!
మెల్బోర్న్ : మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తలిగింది. గాయం కారణంగా ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన స్టార్క్ భారత పర్యటనకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. స్టార్క్ స్థానంలో కనే రిచర్డ్స్‌సన్ జట్టులోకి వస్తాడని వెల్లడించింది. ఇంగ్లండ్‌లో జరగబోయే ప్రపంచకప్‌కు భారత పర్యటన తమ ఆటగాళ్లకు ఒక వార్మప్‌లాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఇప్పటికే టీమ్‌కు దూరం కాగా, తాజాగా స్టార్క్ కూడా జట్టులో లేకపోవడంతో పర్యాటక జట్టు బౌలింగ్ దళం బలహీనపడనుంది. ఫిబ్రవరి 24నుంచి 13 మార్చి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 టి20 మ్యాచ్‌లు, 5 వన్డేలు జరుగనున్నాయి. 15మంది సభ్యుల జట్టును సెలెక్టర్ ట్రివర్ హోన్స్ ప్రకటించారు. (హైదరాబాద్‌లో వన్డే, వైజాగ్‌లో టి20) భారత్‌లో పర్యటించనున్న ఆసీసీ జట్టు ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టాన్ టర్నర్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ కారే, పాట్ కమిన్స్, నాథన్ కల్టర్ నీలే, జ్యే రిచర్డ్స్‌సన్, కనే రిచర్డ్స్‌సన్,, జాసన్ బహ్రెండార్ఫ్, నాథన్ లయన్, ఆడమ్ జంపా, డీయార్సీ షార్ట్. -
సహకార బలోపేతానికి కార్యాచరణ
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతానికి మూడేళ్ల పాటు వ్యూహాత్మక కార్యక్రమాన్ని అమలుపరచాలని భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయించాయి. రక్షణ, వ్యాపారం, తీరప్రాంత భద్రత తదితర భిన్న రంగాల్లో సంబంధాల విస్తరణకు ఈ కొత్త ప్రయోగం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు, రామఫోసా స్పందిస్తూ..వ్యూహాత్మక కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తేవాలని రెండు దేశాల మంత్రులు, అధికారులను ఆదేశించామని తెలిపారు. దక్షిణాఫ్రికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు నైపుణ్యాభివృద్ధిలోనూ కలసిపనిచేస్తున్నాయి. -
ఆసీస్‌ను దెబ్బతీయాలంటే చేయాల్సిందేమిటి?
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ముగిసిందనుకునేలోపే... పది రోజుల వ్యవధితో మరో సిరీస్. అదీ ఆస్ట్రేలియా గడ్డపై! ఒక విధంగా ఇది ఆ దేశంలో సుదీర్ఘ పర్యటనకు విజయ కాంక్ష పెంపొందించే ఇంధనంలా పనికొచ్చేదే! జయాపజయాల గణాంకాలు కూడా మన వైపే ఉన్నందున కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఇచ్చేదే! మరి టీమిండియా దీనిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది? తాజాగా విండీస్‌తో ముగిసిన సిరీస్‌ను ‘సన్నాహకంగా’ పరిగణిస్తూ... పొట్టి ఫార్మాట్లో కంగారూలను కంగుతినిపించాలంటే చేయాల్సిందేమిటి? సరిదిద్దుకోవాల్సిన లోపాలేమిటి? సాక్షి క్రీడా విభాగం: అనుకున్నంత తేలిగ్గా ఏమీ సాగలేదు విండీస్‌తో టి20 సిరీస్. మొదటి, మూడో మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. విరాట్ కోహ్లి గైర్హాజరీలో బ్యాటింగ్ భారం పూర్తిగా రోహిత్ శర్మ పైన పడగా, బుమ్రా విశ్రాంతి నేపథ్యంలో బాధ్యత తీసుకోవాల్సిన భువనేశ్వర్... లయ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్ స్పిన్ మంత్రం, యువ పేసర్ ఖలీల్ అహ్మద్ మెరుపులు లేకుంటే మరిన్ని కష్టాలు ఎదురయ్యేవి. తద్వారా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సరిదిద్దాల్సిన అంశాలున్నాయని స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ‘ఫినిషింగ్’ ఎంత కీలకమో తెలిసొచ్చింది. గెలుపు కారణంగా ఇవన్నీ పెద్దగా కనిపించడం లేదు కానీ, ఓడి ఉంటే తప్పకుండా చర్చకు వచ్చేవి. ఆస్ట్రేలియాలో అధిగమించాల్సిన సమస్యలివి. మరోవైపు ఈసారి పర్యటనలో ముందుగా టి20 సిరీస్ నిర్వహిస్తుండటం మన జట్టుకు మేలు చేయనుంది. అసలే బలహీనంగా ఉన్న కంగారూలను పొట్టి ఫార్మాట్లో దెబ్బకొట్టి మానసికంగా పైచేయి సాధించవచ్చు. తద్వారా టెస్టు సిరీస్ నెగ్గేందుకు మార్గం వేసుకోవచ్చు. బ్యాటింగ్ కిం కర్తవ్యం? పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నది రోహిత్, ధావన్, కోహ్లి త్రయం! అయితే, వీరిలో ధావన్‌ను అంతగా నమ్మలేని పరిస్థితి. ఒక సిరీస్ బాగా ఆడితే మరో దాంట్లో చేతులెత్తేస్తున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌ల్లో 8 మ్యాచ్‌లకు అతడు చేసింది ఒకటే అర్ధశతకం. అదీ చివరి మ్యాచ్‌లో. విజయానికి పరుగు దూరంలో, తీవ్ర ఒత్తిడి సమయంలో వికెట్ ఇచ్చేసి దానికీ సార్థకత లేకుండా చేసుకున్నాడు. ధావన్ ఫామ్ అందుకోవడం సంతోషకరమని ఆదివారం మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ పేర్కొనడమే జట్టు బ్యాటింగ్ పరిమితులను చెబుతోంది. ఆసీస్ సిరీస్‌కు కోహ్లి వస్తున్నాడు కాబట్టి... 4, 5 స్థానాల సంగతే తేల్చుకోవాల్సి ఉంది. మనీశ్ పాండే కంటే కేఎల్ రాహులే ఉత్తమమని స్పష్టమైనందున అతడికే అవకాశాలిస్తే సరిపోతుంది. ధోనికి ప్రత్యామ్నాయంగా రిషభ్ పంత్‌ను తీసుకున్నామంటూనే, దినేశ్ కార్తీక్‌తో కీపింగ్ చేయించారు. ఫీల్డర్‌గా పంత్ ఏమంత సౌకర్యంగా లేడు. వీరిద్దరిలో వికెట్ల వెనుక ఉండేది ఎవరో ఖరారు చేసుకోవాలి. భువీకేమైంది? ప్రధాన పేసర్ భువనేశ్వర్ పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనే అనుమానం ఇంకా వెంటాడుతూనే ఉంది. తప్పనిసరి అయి విశ్రాంతిని మాన్పించి వన్డే సిరీస్ మధ్యలో తీసుకొచ్చినా అతడు ఫిట్‌గా కనిపించలేదు. పరుగులు ధారాళంగా ఇచ్చాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఆ మ్యాజిక్‌ను స్వదేశంలో అలవాటైన పిచ్‌లపై చూపలేకపోయాడు. కొంత తడబడినా కుర్రాడు ఖలీల్ మెరుగనిపించాడు. దీన్నిబట్టి చూస్తే బుమ్రానే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అటు వన్డే, ఇటు టి20ల్లో బుమ్రా కట్టడి చేశాడు. కుల్దీప్ స్పిన్ బలమే అనుకున్నా, గతంలో ఆడిన బ్రాడ్ హాగ్ కారణంగా చైనామన్ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఆస్ట్రేలియన్లు అవగాహనతో ఉండొచ్చు. మరి ఈ సవాల్‌ను కుల్దీప్ ఎలా ఛేదిస్తాడో చూడాలి. మొత్తమ్మీద భువీ మునుపటిలా స్వింగ్ అందుకుంటే ఆసీస్‌ను సులువుగానే ఓడించవచ్చు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ధావన్ ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం. అతడు వన్డే సిరీస్‌లో ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు. పంత్ పరుగులు చేయాలన్న కసితో ఉన్నాడు. జట్టుకు, ఆటగాళ్లకు పరీక్ష పెట్టే ఆసీస్ పర్యటన భిన్నమైన సవాల్‌తో కూడుకున్నది. విండీస్‌పై సిరీస్ గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ప్రదర్శనను మేం పునరావృతం చేయాల్సి ఉంది. – రోహిత్ శర్మ, భారత తాత్కాలిక కెప్టెన్ ►ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. వీటిలో 10 గెలిచింది. ఐదింటిలో ఓడింది. ►మొత్తం 15 మ్యాచ్‌ల్లో భారత్‌కు ధోని (13), కోహ్లి (2) మాత్రమే కెప్టెన్లుగా ఉన్నారు. ఇదే సమయంలో ఆసీస్‌కు ఏడుగురు సారథులు మారారు. -
విదేశీ జంట.. వినోదమంట
వ్యాపార పనుల నిమిత్తం సిటీకి వచ్చిన ఓ విదేశీ జంట.. భారత్‌లోని ప్రముఖ నగరాలను చుట్టేసింది. వారి ట్రిప్ విమానంలోనో, కారులోనో కాదు. బైక్‌పై సాగింది. అక్టోబర్ 11న నగరంలో ప్రారంభమైన వీరి రైడ్ 23న ముగిసింది. మట్టి రోడ్లపై ప్రయాణిస్తూ,ప్రజలతో మమేకమవుతూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకున్నారు మెక్సికో కపుల్ రౌల్ రిసెండిజ్, కారోలినా. వివిధ దేశాలను చుట్టేసి... అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక విశేషాలు, ప్రజల అభిరుచులు తెలుసుకోవాలని కొంతమందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పనిలో పనిగా ఆయా దేశాలు వెళ్లినప్పుడు సమయం కేటాయించి ఓ ట్రిప్వేసేస్తారు. అలా మెక్సికో నుంచి భారత్ వచ్చిన ఓ జంట బైక్‌పై ఇక్కడి ప్రదేశాలను చుట్టేసింది. సాక్షి, సిటీబ్యూరో :మెక్సికోకు చెందిన పారిశ్రామికవేత్త రౌల్ రిసెండిజ్, కారోలినా దంపతులు. వీరు మెక్సికోలోని క్యాండీస్ ఐస్‌క్రీమ్ సంస్థ యజమానులు. వీరికి ఏడుగురు సంతానం. తమ దేశంలో బైక్ రైడ్లు చేస్తుంటారు. వీరి దగ్గర బీఎండబ్ల్యూ, ఏడు కేటీఏం బైక్‌లు ఉన్నాయి. రౌల్ ఇప్పటికే 12 దేశాల్లో బైక్ రైడ్ చేశారు. ఆయనకు ఫ్లైట్‌లో వెళ్లడం కంటే బైక్‌పై తిరుగుతూ ఆయా ప్రాంతాల గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. వ్యాపార పనుల నిమిత్తం తొలిసారి భారత్ వచ్చిన వీరు ఇక్కడి ప్రదేశాలను చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి అక్టోబర్ 11న బైక్ రైడ్ ప్రారంభించారు. సిటీకి చెందిన ట్రావెల్ గైడ్ నాగార్జునరెడ్డి సహకారంతో నాగపూర్, జబల్పూర్, ఖజురహో, ఓర్చా, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, ఇండోర్.. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలను చుట్టేసి అక్టోబర్ 23న తిరిగొచ్చారు. ఆ ట్రిప్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా... ? విదేశీ రైడర్లకు మీరిచ్చే సలహాలు. భద్రత ముఖ్యం. మంచి కండీషన్డ్ బైక్‌ను ఎంచుకోవాలి. ఇక్కడి భాష, సంప్రదాయాలు తెలిసిన గైడ్ ఉండాలి. అయితే రోడ్ ట్రిప్‌లు పూర్తిగా మనం ప్లాన్ చేసుకున్నట్లు సాగవు. అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాలి. విదేశీయులు రోడ్ ట్రిప్ చేసేందుకు భారత్ సేఫ్ కంట్రీ. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ. ఇక్కడ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తగ్గితే టూరిస్టులు మరింత మంది ఇక్కడ రోడ్ ట్రిప్‌లు చేస్తారు. ? బైక్ రైడ్ ఎంచుకోవడానికి కారణం. రోడ్డు ప్రయాణం చేసినప్పుడే ఆ ప్రాంతం గురించి, అక్కడి ప్రజల గురించి వివరంగా, కరెక్టుగా తెలుసుకోగలం. భారత్ గొప్ప సంస్కృతి ఉన్న దేశం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు ఇది నెలవు. చరిత్ర గురించి తెలుసుకోవడమంటే మాకు ఎంతో ఇష్టం. ? ఈ ట్రిప్‌లో మీ అనుభవాలు. చాలా వరకు మంచి అనుభవాలే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు స్నేహంగా ఉంటారు. సంస్కారం గొప్పది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆహారం విభిన్నం. విదేశీయులకు ఇక్కడి అభిరుచులు, అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు చూడడం కనులపండగే. ఇక చేదు అనుభవాలంటే డ్రైవింగ్ స్టైల్. చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అస్సలు బాగాలేవు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అలాంటి చోట్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రోడ్డు మార్గంలో దేశం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది పెద్ద ఇబ్బంది. ఇక మరో ముఖ్య విషయం అపరిశుభ్రత. రోడ్డు పక్కన ఉండే దాబాలు, రెస్టారెంట్లలో టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూస్తే బాగుంటుంది. ? ఇండియా గురించి ఏం తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చే ముందు వరకు ఇండియా గురించి పెద్దగా ఏం తెలియదు. ఈ దేశానికి చాలా చరిత్ర, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలున్నాయని మాత్రమే విన్నాం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలను చూసి ఇంకా చాలా తెలుసుకున్నాం. యోగా, మెడిటేషన్ భారత్‌లోనే పుట్టాయని తెలుసుకున్నాం. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టే ఇక్కడి ప్రజలు ప్రశాంత స్వభావంతో ఉన్నారు. ఇక ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోరు. అదే పనిగా హారన్ కొట్టినా, గమ్మున పక్కకు వెళ్లిపోతారు. అదే మెక్సికోలో అయితే ఒక్కసారి కంటే ఎక్కువ హారన్ కొడితే గొడవకి దిగుతారు. బిర్యానీ.. ఇరానీ హైదరాబాద్ నుంచే మా రోడ్ ట్రిప్ ప్రారంభించాం. ఇక్కడి చారిత్రక కట్టడాలు, చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సాంకేతిక, ఐటీ రంగాల్లో నగరం పురోగమిస్తోంది. ఒక నగరం త్వరగా అభివృద్ధి చెందేందుకు ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్ టెస్ట్ అదిరింది. వీటిని టేస్ట్ చేయడానికి మళ్లీ వస్తాం. -
ట్రంప్‌ను కాదని ట్రయంఫ్ ఒప్పందం...!
భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అధ్యాయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన శ్రీకారం చుట్టబోతోంది. రష్యాతో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు (ఐదు వ్యవస్థల కొనుగోలుకయ్యే వ్యయ ఒప్పందం దాదాపు రూ.50 వేల కోట్లు–550 కోట్ల డాలర్లు) కుదుర్చుకుంటే భారత్‌కు ఆంక్షలు తప్పవన్న అమెరికా తాజా హెచ్చరికల నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య కీలకాంశాలపై చర్చ జరిగినా క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందమే కీలకంగా మారనుంది. అయితే పుతిన్ పర్యటన భారత రక్షణరంగానికే పరిమితం కాకుండా అంతరిక్ష, ఇంధన రంగాల్లో పరస్పరసహకారానికి ఉపయోగపడనుంది. ఏమిటీ ఆంక్షలు ? 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సిరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ ) చట్టాన్ని గత ఆగస్టులో అమెరికా ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించేలా రష్యాతో లావాదేవీలు నెరపొద్దంటూ తన మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలకు గతంలోనే అగ్రరాజ్యం విజ్ఞప్తి చేసింది. కాట్సా సెక్షన్ 23 పరిధిలోకి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఇతర అంశాలు వస్తాయని స్పష్టంచేసింది. రష్యా నుంచి చైనా వివిధ సైనిక ఉత్పత్తులు, ఎస్–400 వ్యవస్థను కొనుగోలు చేసినందుకు అమెరికా గత నెలలోనే ఆంక్షలు విధించింది. నాటో కూటమి మిత్రపక్షం టర్కీ కూడా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై అమెరికా గుర్రుగా ఉంది. మినహాయింపుపై భారత్ ఆశాభావం..! ప్రస్తుతం అమెరికా–రష్యా అంతర్గత పోరులో భారత్ చిక్కుకుంది. ఈ ఒప్పందం విషయంలో ఏదో ఒక రూపంలో అమెరికా ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆశాభావంతో భారత్ ఉంది. రష్యాతో భారత్‌కు దీర్ఘకాలిక సైనిక సంబంధాలున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఎస్–400 వ్యవస్థపై ఇప్పటికే పలుపర్యాయాలు చర్చలు సాగిన నేపథ్యంలో ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా–సోవియట్ ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో 80 శాతానికి పైగా సైనిక పరికరాలు రష్యా నుంచే భారత్‌కు వచ్చాయి. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో అమెరికా అతి పెద్ద ఆయుధాల సరఫరాదారుల్లో ఒకటిగా (గత పదేళ్లలో 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలతో) నిలుస్తోంది. తమ ఆయుధాల దిగుమతిలో ముందువరసలో ఉన్న భారత్‌పై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించకపోవచ్చుననే అభిప్రాయంతో మనదేశం అధికారులున్నారు. క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ‘ప్రత్యేక మాఫీ’ లేదా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరనున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌పై పైచేయి.. ఈ క్షిపణి వ్యవస్థలతో మన రక్షణరంగం పాకిస్తాన్‌పై పైచేయి సాధించడంతో పాటు చైనాతో (ఈ దేశం ఇప్పటికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది) సరిసమానంగా నిలిచేందుకు దోహదపడుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలో మొదటి క్షిపణి వ్యవస్థ, నాలుగున్నరేళ్లలో మొత్తం అయిదు వ్యవస్థలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఎస్–400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (సామ్) వ్యవస్థలోని కమాండ్ పోస్ట్‌లో యుద్ధ నిర్వహణ పద్ధతులు, క్షిపణి ప్రయోగం, రాడార్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, ఇతర యుద్ధ ప్రయోగాలను పసిగట్టి, వాటిని ఛేదించే ఏర్పాట్లున్నాయి. ఈ క్షిపణి వ్యవస్థలను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లాంఛర్ వాహనాలపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ క్షిపణి వ్యవస్థ సులువుగా ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉండడంతో యుద్ధమొచ్చినప్పుడు ఏ నగరాన్నయినా వైమానికదాడుల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ తక్కువ దూరం (షార్ట్ రేంజ్) నుంచి ప్రయోగించే నాసర్(హతఫ్–9) అణు క్షిపణిని నిరోధించేందుకు ఈ ఎస్–400 ఉపకరిస్తుంది. ప్రత్యేకతలేంటీ ? రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంఛర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. ఈ వ్యవస్థ దాదాపు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెడుతుంది. 400 కి.మీ పరిధి నుంచే 36 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు. పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. శత్రుదేశాల నుంచి భిన్న పరిధుల్లో వచ్చే క్షిపణులు, ఇతర ప్రయోగాలను ఇందులోని సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అడ్డుకుంటాయి. -
భారత్, రష్యా భాయి–భాయి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వార్షిక ద్వైపాక్షిక భేటీలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలకగా మోదీ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పుతిన్ విమానాశ్రయంలో దిగిన అనంతరం మోదీ ఇంగ్లిష్, రష్యా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘భారత్‌కు స్వాగతం పుతిన్. భారత్–రష్యాల స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే మన చర్చల కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఏకాంతంగా విందు ఆరగిస్తూ ద్వైపాక్షిక సహకారం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని ఓ అధికారి చెప్పారు. 19వ భారత్–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగనుంది. రక్షణ రంగంలో సహకారం, ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థపై ఒప్పందం, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చించే అవకాశం ఉంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసే ఒప్పందం శుక్రవారం దాదాపుగా ఖరారవనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రష్యా నుంచి ఎవరూ ఆయుధాలు కొనకూడదంటూ ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. అవసరమైనప్పుడు ప్రతేకంగా ఏదైనా దేశం కోసం ఈ ఆంక్షలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కు అధికారం ఉంది. ఆంక్షలున్నా సరే రష్యా నుంచి క్షిపణుల కొనుగోలుకే భారత్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష, వాణి జ్య, ఇంధన, పర్యాటక తదిరత రంగాల్లో ఒప్పందాలు కూడా భారత్–రష్యామధ్య కుదిరే అవకాశం ఉంది. -
పుతిన్ భారత పర్యటన ఖరారు..!
సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4,5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పుతిన్ పాల్గోననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల నేతల అధినేతలు జూలైలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే. -
భారత్‌లో పర్యటించేందుకు ట్రంప్ ఆసక్తి
-
ఇస్లామాబాద్‌లో భారత బృందం
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపేందుకు, అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం గత నెలలో పాకిస్తాన్లో పర్యటించింది. ఇటీవల భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్ కట్జూ నేతృత్వం వహించారు. ప్రముఖ విద్యావేత్త జేఎస్ రాజ్‌పుత్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. పాకిస్తాన్ బృందానికి ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఇనాముల్ హాక్ నేతృత్వం వహించారు. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరిగిన ఈ భేటీలో ఏ విషయాలు చర్చించారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ద్వైపాక్షిక సంబంధాలపై అన్ని కోణాల్లోనూ చర్చలు జరపడంతోపాటు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘నిమ్రానా∙డైలాగ్’గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా కూడా ఈ చర్చలు జరిగాయి. మోదీ ప్రధాని అయ్యాక 2015లో ఒక్కసారే జరిగాయి. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ స్వాగతం పలికారు. ఓలి శనివారం ప్రధాని మోదీతో ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఉన్న జీబీ పంత్ వ్యవసాయ, సాంకేతికత యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడి సంకరణ విత్తనాల ఉత్పత్తి కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అదే యూనివర్సిటీ ఓలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. -
నా ఉద్దేశంలో బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అదే
ఫిల్మ్ ప్రిజర్వేషన్, ఫిల్మ్ పై సినిమాలు తీయడంలోని ప్రాముఖ్యత గురించిన ఈవెంట్లో పాల్గొనడానికి హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో క్రిస్టోçఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఇంటర్స్టెల్లార్, డంకర్క్’ సినిమాలను ప్రదర్శించారు. అలాగే నోలన్ కొన్ని ఇండియన్ సినిమాలు చూశారు. ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ –‘‘ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను కలవాలని, వాళ్ల స్టైల్ తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ ప్రయాణం ద్వారా అది నెరవేరింది. ఈ విజిట్‌లో సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ (1955) సినిమా చూశాను. నా దృష్టిలో ‘పథేర్ పాంచాలి’ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్. దర్శకుడు సత్యజిత్ రే చేసిన ఎక్స్ట్రార్డినరీ వర్క్ ఇది. ఫ్యూచర్లో మరికొన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇండియాకు రావటానికి అది కూడా ఒక కారణమే’’ అని అన్నారాయన. -
మధ్యప్రదేశ్‌లో హిల్లరీ
ఇండోర్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆమె మధ్యప్రదేశ్‌లోని మాండవ్ జిల్లా, ధార్‌లోని జహాజ్ మహాల్‌ను ఆమె సందర్శించారు. ప్రైవేటు విమానంలో ఇండోర్‌కు చేరుకున్న హిల్లరీ.. ఖర్గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్‌లో బస చేశారు. పర్యటనలో భాగంగా నర్మదా నదిలో హిల్లరీ బోటింగ్‌కు వెళ్లనున్నారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహేశ్వరీ చీరల మ్యూజియంను ఆమె సందర్శించనున్నారు. #MadhyaPradesh: Hillary Clinton visited Jahaz Mahal in Dhar's Mandu. She is on a visit to the state from 11-13 March. pic.twitter.com/oXQoC0hesy — ANI (@ANI) March 12, 2018 -
ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన
-
ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన
శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌కు స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్న మోదీ. మాక్రన్ వెంట ఆయన భార్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు. శనివారం మోదీ, మాక్రన్ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. -
భారత్ పర్యటనే ట్రూడో కొంప ముంచబోతుందా?
ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పర్యటన ఆయన కొంప ముంచబోతోందా? అంటే.. అవుననే సర్వేలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ ఓటమి పాలు కావటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. కెనడియన్ నెట్వర్క్ అయిన గ్లోబల్ న్యూస్ తాము నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ట్రూడో ఎనిమిది రోజుల భారత పర్యటన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణమని తెలిపింది. అందులో ఫెడరల్ ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీకి కేవలం 33 శాతం ఓట్లను మాత్రమే కైవసం చేసుకుని ఓటమి పాలవుతుందని తేల్చేసింది. మొత్తం పోలింగ్‌లో పాల్గొన్నవారిలో 40 శాతం ప్రజలు భారత్‌తో సంబంధాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం 16 శాతం మాత్రమే ఇరు దేశాల మైత్రిపై ఆసక్తి చూపినట్లు సర్వేలో తేలిందని గ్లోబల్ న్యూస్ సీఈవో, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు డార్రెల్ల్ బ్రిక్కర్ వెల్లడించారు. అంతేకాదు ఓటింగ్‌లో ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 54 శాతం ప్రజలు ఓటేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యతిరేకంగా ఎన్నికల దాకా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బ్రిక్కర్ అభిప్రాయపడ్డారు. 2019 అక్టోబర్‌లో కెనెడా ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రధాని వేషంతో.. పరేషాన్..!!
న్యూఢిల్లీ: దుమారం రేగుతోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శల పాలవుతున్నారు. వారం రోజుల పాటు ఇండియాలో పర్యటించేందుకు ఫిబ్రవరి 17న వచ్చిన ట్రూడో సంప్రదాయానికి భిన్నంగా కాషాయ వస్త్రాలతో కూడిన బాలీవుడ్ వేషధారణలో తిరగడంతో ఈ విమర్శల పరంపర ప్రారంభమైంది. దీనిపై నెటిజన్లు, మీడియా కెనడియన్ ప్రధానిపై మండిపడుతున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందిసూ..''ఇంతలా నటించాల్సిన అవసరం లేదు. ట్రూడో వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. మీలా మేము రోజూ అంత ఆహార్యంగా బట్టలు ధరించలేము. బాలీవుడ్లో కూడా అలాంటి వస్త్రాలు వేసుకోరు'' అంటూ ట్వీట్ చేశారు. ట్రూడో చేతులు జోడించి ప్రజలకు దండాలు పెడుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. విమర్శలకు బదులిస్తూ.. ట్రూడో తనకు సంప్రదాయ దుస్తుల అంటే అమితమైన ఇష్టమని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తాను సూట్ వేసుకోలేదనా? లేదా సంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకున్నాననా? తేల్చుకోవాలన్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకో.. ఓ ట్వీ్టర్ ఖాతాదారుడు 90వ దశకంలో వచ్చిన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ 'దిల్వాలే దుల్హానియా లేజాయెంగే' చిత్రంలోని సందర్భాన్ని గుర్తుచేస్తూ చేతులకు గోరింటాకు పెట్టుకో.. అని ట్రూడోను గేలీ చేశాడు. ట్రూడో సినిమా ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నాడు.. హాస్యనటుడు ట్రెవర్ నొహ ట్రూడోని ఉద్దేశించి..కెనడా ప్రధాని ఆస్కార్ పురస్కార చిత్రం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' లోని జయహో పాట ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నారని జోక్ పేల్చారు. కాగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ట్రూడో చేస్తున్న ఇండియా పర్యటనను 'విపత్తుని కొని తెచ్చే సందర్శన' అంటూ వ్యాఖ్యానించింది. స్వేచ్ఛావహ వాతావరణం గల దేశానికి అధినేత, స్త్రీవాది, సినిమా హీరోని పోలిన రూపం, ప్రజల పక్షపాతి అన్న పేరున్న జస్టిన్ ట్రూడో వ్యవహారం చూసి అందరూ నివ్వెర పోయారని తెలిపింది. ట్రూడో తన వారం రోజుల ఇండియా పర్యటనను ఏ మాత్రం ప్రయోజనం లేకుండా నిరాశతో నింపేశారని చురకలంటించింది. -
‘ఐ లవ్ ఇండియన్ మీడియా’
న్యూఢిల్లీ : అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్ దేశీయ మీడియాపై పొగడ్తల వర్షం కురిపించారు. భారత మీడియాను తాను చాలా ప్రేమిస్తానని... కఠినంగా, క్రూరంగా ఉండే అమెరికా మీడియతో పోల్చుకుంటే, భారత మీడియా చాలా మృదువుగా ఉంటుందన్నారు. ఒక్కడ జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో ట్రంప్ జూనియర్ పాల్గొన్నారు. ‘భారత మీడియాను ప్రేమిస్తున్నట్టు చెబుతున్న భారత చరిత్రలో మొదటి వ్యక్తిని నేనే. వీరు చాలా మృదువుగా ఉంటారు’ అని తెలిపారు. ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు వచ్చినప్పటికీ భారతీయుల ముఖంపై చిరునవ్వు చెదరదని చెప్పారు. ‘నేను తొలిసారి ఇక్కడికి రాలేదని, కానీ 10 ఏళ్లతో తర్వాత భారత పర్యటనకు’ వచ్చినట్టు తెలిపారు. రాజకీయాలపై మాట్లాడటానికి నిరాకరించిన జూనియర్ ట్రంప్, తాను ఇక్కడి ఒక వ్యాపారవేత్తలాగే వచ్చానన్నారు. ఇండో-పసిఫిక్ సంబంధాలు : కోఆపరేషన్‌పై కొత్త శకం అనే అంశంపై మాట్లాడతారని ముందస్తుగా షెడ్యూల్ సన్నద్ధం చేయగా.. చివరి నిమిషంలో జూనియర్ ట్రంప్ తన ప్రసంగాన్ని మార్చేశారు. భారత్‌లో వ్యాపార పరిస్థితుల మార్పులపై ఆయన ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా మంచి మంచి డీల్స్ కుదిరాయని, ప్రస్తుతం 10 టైమ్స్ కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే సామర్థ్యం వచ్చిందన్నారు. ట్రంప్ జూనియర్ తన వ్యాపారానికి సంబంధించిన పనుల నిమిత్తం భారత్‌లో పర్యటిస్తున్నారు. ట్రంప్ టవర్స్ పేరిట ట్రంప్ జూనియర్ ఇక్కడ తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అమెరికా తర్వాత ట్రంప్ భారీ ప్రాజెక్టులు ఉన్నది భారత్‌లోనే. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌పై అక్కడి మీడియా పెద్ద ఎత్తున్నే విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాను ఉద్దేశిస్తూ.. భారత మీడియాపై పొగడ్తలు కురిపించారు ట్రంప్ జూనియర్. -
‘అదే భారత్ విలక్షణత’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికంలో మగ్గే ప్రజలు సైతం సంతోషంగా నవ్వగలగడం తనను అబ్బురపరిచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అన్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ భారత్‌లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. దేశంలోని పలు నగరాల్లో చేపట్టిన ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతారు. జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనని, ప్రైవేట్ సిటిజన్‌గా పర్యటన కొనసాగిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హెతర్ నౌర్ట్ చెప్పారు. ఎలాంటి అధికారిక హోదాలో ట్రంప్ పర్యటించడంలేదని స్పష్టం చేశారు. భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు జూనియర్ ట్రంప్ హాజరవనున్నారు. మరోవైపు దేశరాజధానిలోని ఓ స్టార్ హోటల్లో ట్రంప్ రియల్ఎస్టేట్ డెవలపర్లతో భేటీ అయ్యారు. కోల్‌కతా, ముంబయి, పూణే, గుర్గావ్ తదితర నగరాల్లోనూ భారత ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లతో ఆయన సమావేశమవుతారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
భారత్‌కు చేరుకున్న కెనడా ప్రధాని
న్యూఢిల్లీ: ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబ సమేతంగా శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. మరుసటి రోజు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
నెతన్యాహుకు ఆత్మీయ స్వాగతం
న్యూఢిల్లీ: ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయనను హత్తుకుని భారత పర్యటనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి. ముంబై, ఆగ్రా, గుజరాత్లో నెతన్యాహు పాల్గొనే కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. నెతన్యాహు పర్యటనపై మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు నెతన్యాహుకు స్వాగతం.. భారత్‌లో మీ పర్యటన చరిత్రాత్మకమే కాకుండా ప్రత్యేకమైంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ సందర్భంగా.. తనకు లభించిన అపూర్వ స్వాగతానికి నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రాత్రి నెతన్యాహు, ఆయన సతీమణికి ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. తీన్ మూర్తి–హైఫా చౌక్‌గా పేరు మార్పు అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి– హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. ‘హైఫా నగరం విముక్తికి మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల నిస్వార్థ త్యాగానికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఇజ్రాయెల్ ప్రధాని సమక్షంలో వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాం. ఈ చరిత్రాత్మక దినాన ఈ ప్రాంతానికి తీన్ మూర్తి–హైఫా చౌక్‌గా నామకరణం చేస్తున్నాం.’ అని సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు ఈ పర్యటనలో భాగంగా మోదీ, నెతన్యాహులు వివిధ అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. ఢిల్లీ, ఆగ్రా, గుజరాత్, ముంబైలో నెతన్యాహు పర్యటిస్తారు. చమురు, సహజవాయువు, పునరుత్పాదక ఇంధనం, సైబర్ భద్రత, తదితర ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి. 15 ఏళ్ల తర్వాత.. 15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. -
భారత్‌కు బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. పది రోజులపాటు సాగే ఆసియా పర్యటనలో భాగంగా ముందుగా ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఛార్లెస్ దంపతులు ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో యూకేలో జరగబోయే కామన్వెల్త్ దేశాధినేతల సమావేశంలో చర్చింబోయే అంశాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం సుమారు 12.19 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే దేశాల్లో భారత్ మూడో అతిపెద్ద దేశం. అంతేకాకుండా, అక్కడి ఉద్యోగాల కల్పనలో మనవాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. అలాగే భారత్‌లో బ్రిటన్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో 1.5 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 1.8 శాతం కాగా, జీడీపీలో వీరు ఆరు శాతం సమకూర్చుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ ఛార్లెస్ వెంట ఆయన సతీమణి డచెస్ ఆప్ కార్న్‌వాల్ కెమిల్లా పార్కర్ బౌల్స్ ఉన్నారు. ఈ దంపతులు సింగపూర్, బ్రూనై, మలేసియాలో కూడా పర్యటించనున్నారు. ప్రిన్స్ చార్లెస్ భారతదేశ పర్యటనకు రావటం ఇది తొమ్మిదోసారి. ఇంతకుమునుపు ఆయన 1975, 1980, 1991, 1992, 2002, 2006, 2010, 2013లో మన దేశంలో పర్యటించారు. -
అబేను గుజరాత్‌కే ఎందుకు తీసుకెళ్లారు? : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో కాలు మోపిన విషయం తెలిసిందే. అయితే ఓ దేశ ప్రధాని స్థాయి వ్యక్తిని.. పైగా మన దేశంతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు వచ్చిన తరుణంలో దేశ రాజధానిలో కాకుండా.. ఓ రాష్టంలో బస ఎందుకు ఏర్పాటు చేశారు? అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. కేవలం రాజకీయ కారణాలతోనే జపాన్ ప్రధానిని మోదీ గుజరాత్‌కు తీసుకెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలోనే కేవలం రాజకీయ ప్రయోజనం పొందేందుకే మోదీ, అబేను కావాలనే అక్కడికి(గుజరాత్) తీసుకెళ్లారు. కీలక ఒప్పందాలు చేసుకోవటానికి వచ్చిన ఒక అతిథిని గౌరవించే తీరు ఇదేనా? అని మనీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, నేడు జపాన్ ప్రధాని అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది. అదే సమయంలో జపాన్ ప్రధాని సతీమణి అకి అబే అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోషియేషన్ను సందర్శించనున్నారు. -
భారత్ పర్యటనపై ఇవాంక ట్రంప్ స్పందన
-
మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
-
మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
భారత్, మలేసియాల మధ్య కుదిరిన 7 ఒప్పందాలు న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదం లాంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, మలేసియాలు అంగీకరించాయి. ప్రధాని మోదీ, భారత్‌లో పర్యటిస్తున్న మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ల మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో ద్వైపాక్షికసంబంధాలు ప్రస్తావనకొచ్చాయి. రెండు దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో విమాన సేవలు, ఇరు దేశాల విద్యార్హతలకు పరస్పర గుర్తింపు ఇవ్వడం, క్రీడల్లో సహకారం, అహ్మదాబాద్‌లోని ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా మలేషియాలో శిక్షణ కార్యక్రమాలు, మలేషియాలో 2.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న ఎరువుల కర్మాగారం ఏర్పాటు తదితరాలున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని, ఉగ్ర చర్యలను ఏ విధంగానూ సమర్థించలేమని ఇరువురు నేతలు ప్రకటించారు. -
త్వరలోనే సర్దుకుంటుంది
పేలవ ఫామ్‌పై ఆసీస్ ఓపెనర్ వార్నర్ రాంచీ: భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా అంతా భావించారు. అయితే టెస్టు సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి వార్నర్ చేసింది 131 పరుగులే. బెంగళూరు టెస్టులో చేసిన 33 పరుగులే ఈ సిరీస్‌లో అతడి అత్యధిక స్కోరు. అయితే తన బ్యాటింగ్ తీరులో ఎలాంటి లోపం లేదని, త్వరలోనే భారీ స్కోరు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ‘నా ఆటలో ఎలాంటి లోపం లేదు. ఇంతకంటే బాగా నేను బంతిని బాదలేను. అయితే ప్రస్తుతానికి పరుగులు రావడం లేదు అంతే. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నా సన్నాహకాల్లోనూ ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్థాయి క్రికెటర్‌కైనా ఇలాంటి స్థితి వస్తుంది. స్వదేశంలో కావచ్చు.. విదేశీ పర్యటనలో కావచ్చు ఫామ్ కోల్పోవాల్సి వస్తుంది. ఇదంతా క్రికెట్లో భాగమే. ఇలాంటి దశలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి’ అని వార్నర్ తెలిపాడు. చివరి టెస్టులో రెన్షాతో కలిసి శుభారంభాన్ని అందివ్వగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
జయంత్, పాండ్యాలపై దృష్టి
నేటి నుంచి బంగ్లాదేశ్, భారత్ ‘ఎ’ వార్మప్ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ తమ సన్నాహాలను ప్రారంభించింది. నేటి (ఆదివారం) నుంచి జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో అభినవ్ ముకుంద్ నేతృత్వంలోని భారత్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది. స్థానిక జింఖానా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కు అధికారిక ఫస్ట్ క్లాస్ హోదా లేదు. భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ తిరిగి తన ఫామ్ చాటుకునేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. తొడ కండరాల గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు దూరమైన జయంత్ ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా తరఫున బరిలోకి దిగాడు. అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలు, టి20ల్లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ ఫార్మాట్లో తన మార్కును చాటుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో పాటు ఐదేళ్ల అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ అభినవ్ ముకుంద్ ప్రదర్శన కూడా ఆసక్తికరం. అయితే రిజర్వ్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చినా రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్‌లలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప ముకుంద్‌కు అవకాశం దక్కదు. వీరే కాకుండా రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించిన ప్రియాంక్ పంచల్, అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌లకు కూడా ఈ మ్యాచ్ కీలకమే. రంజీల్లో టాప్ స్కోరర్‌గా నిలిచి అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రియాంక్‌కు అంతర్జాతీయ స్థాయి బౌలర్లు టస్కిన్, షకీబ్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం చిక్కనుంది. అలాగే లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ తన బౌలింగ్ నైపుణ్యంతో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్, తమీమ్ ఇక్బాల్లాంటి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ కూడా గమనించదగ్గ ఆటగాళ్లు. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ సీమర్లు అనికేత్ చౌదరి, హైదరాబాదీ సీవీ మిలింద్ ఏమేరకు రాణిస్తారనేది వేచి చూడాలి. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం టెస్టుల్లో ఎడమచేతి పేసర్ల లోటు అలాగే ఉండిపోయింది. వీరిలో ఎవరు రాణించినా భవిష్యత్‌లో జట్టులో చోటు దక్కించుకోవచ్చు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైన బంగ్లాదేశ్ భారత గడ్డపై సత్తా నిరూపించుకోవాలనే కసితో ఉంది. అలవాటైన ఉపఖండ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో చెలరేగి తామేంటో చూపాలనుకుంటోంది. దీనికి ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను చక్కగా వినియోగించుకోనుంది. కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్, షకీబ్, తమీమ్ ఫామ్‌లో ఉండడం వారికి కలిసొచ్చే విషయం. జట్ల వివరాలు భారత్ ‘ఎ’: అభినవ్ ముకుంద్ (కెప్టెన్), ప్రియాంక్, శ్రేయస్ అయ్యర్, ఇషాంక్ జగ్గీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ నదీమ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అనికేత్ చౌదరి, సీవీ మిలింద్, నితిన్ సైని. బంగ్లాదేశ్: ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇమ్రుల్ కైస్, తమీమ్ ఇక్బాల్, మోమినుల్ హక్, మహ్ముదుల్లా, షబ్బీర్ రహమాన్, షకీబ్, లిటన్ దాస్, టస్కీన్ అహ్మద్, శుభాషిస్ రాయ్, కమ్రుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్, తైజుల్ ఇస్లామ్, షఫీయుల్ ఇస్లామ్, మెహదీ హసన్ మిరాజ్. బంగ్లా క్రికెటర్లు టస్కీన్, మోమినుల్, మహ్ముదుల్లా -
ఆస్ట్రేలియా స్పిన్ సలహాదారులుగా
శ్రీరామ్, పనేసర్ సిడ్నీ: తమ భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు అన్ని విధాలుగా సంసిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా భారత ఉప ఖండంపై స్పిన్ విభాగంలో రాణించడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనికోసం భారత మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌తోపాటు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌లను తమ స్పిన్ సలహాదారులుగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నియమించుకుంది. ఈనెల 29 నుంచి స్మిత్ సేన దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించనుంది. ‘ఆసీస్ జట్టుతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌లో పర్యటించడాన్ని విదేశీ జట్లు అత్యంత కష్టంగా భావిస్తుంటాయి. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్‌కు సహకరిస్తాను’ అని భారత్ తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన 40 ఏళ్ల శ్రీధరన్ అన్నారు. -
జాగ్రత్త... ముందున్నది భారత్
సహచరులకు ఆసీస్ సారథి స్మిత్ హెచ్చరిక సిడ్నీ: పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న ఆస్ట్రేలియా త్వరలో జరగనున్న భారత్ పర్యటనపై కలవరపడుతోంది. మన ముందున్నది క్లిష్టమైన సిరీస్ అని కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన సహచరులను హెచ్చరించాడు. భారత్ ఉపఖండపు పరిస్థితుల్ని సాధ్యమైనంత తొందరగా ఆకళింపు చేసుకోకపోతే కష్టాలు తప్పవని చెప్పాడు. ‘అక్కడ ఆడటం పూర్తిగా భిన్నమైనది. అక్కడి పిచ్‌లు మా ఆస్ట్రేలియాలో మాదిరిగా ఉండవు. మా వాళ్లు ముందు దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది’ అని అన్నాడు. కంగారూ జట్టు 2004 తర్వాత భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు మాథ్యూ రెన్షా, పీటర్ హ్యాండ్స్కోంబ్ బాగా ఆడుతున్నారని... కానీ వారికి భారత పిచ్‌లపై ఏమాత్రం అనుభవం లేదన్నాడు. ఏదేమైనా తమకు భారత్‌లో కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని అన్నాడు. ‘భారత పర్యటన ఎపుడైనా సరే సవాలుతో కూడుకున్నది. అక్కడ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఇందులో కష్టపడటం మినహా ఇంకే మార్గం లేదు. తేలిగ్గా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని అన్నాడు. -
ట్రంప్ కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే...
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లకంటే మిన్నగా సంబురాలు జరుపుకొన్న పాకిస్థాన్.. మరోసారి కశ్మీర్ విదాదాన్ని ట్రంప్ పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఏడున్నర దశాబ్ధాల కశ్మీర్ వివాదంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్న భారత్ ను ట్రంప్ దారికి తెస్తాడని, ఆ విధంగా పాకిస్థాన్ పంతం నెగ్గుతుందని గడిచిన కొద్ది రోజులుగా దాయాది దేశంలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్తలపై పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి, ప్రధాని సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ మంగళవారం తొలిసారిగా స్పందించారు. ఇస్లామాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గనుక కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే.. ఆయనకు నోబెల్ పురస్కారం దక్కాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి లేదా ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలని పాక్ మొదటి నుంచి కోరుకుంటున్నదని అజీజ్ గుర్తుచేశారు. గత అక్టోబర్ లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అధ్యక్షుడిగా గెలిస్తే, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నలుగుతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తాను త్వరలోనే భారత్ లో పర్యటించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉడీ ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరువాత భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు దాదాపు క్షీణించడం, అటు అంతర్జాతీయ సమాజంలో పాక్ ఏకాకిగా మారుతున్న నేపథ్యంలో అజీజ్ ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ 3న భారత్ (అమృత్ సర్) వేదికగా జరుగనున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు వెల్లడించిన సర్తాజ్ అజీజ్.. తన పర్యటనతో ఇరుదేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు సడలుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉడీ ఘటన తర్వాత పాక్ ఉన్నతస్థాయి వ్యక్తులు ఇండియాకు రానుండటం ఇదే మొదటిసారి. భారత్ తో ఎల్లప్పుడూ సత్పంబంధాలనే కోరుకుంటామన్న ఆయన.. ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ ప్రధాన ఉద్దేశం అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణమే కాబట్టి భారత అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరపబోనని తెలిపారు. హార్ట్ ఆఫ ఏషియా: అఫ్ఘానిస్థాన్ అమెరికా తలపెట్టిన పాశవిక యుద్ధంతో కకావికలమైన అఫ్ఘానిస్థాన్ ను పునర్మించడంలో భాగంగా 2011 నుంచి హార్ట్ ఆఫ ఏషియా సదస్సులు నిర్వహిస్తున్నారు. భారత్ సహా మొత్తం 14 దేశాలు(పాకిస్థాన్, రష్యా, చైనా, ఇరాన్, కజకిస్థాన్, అఫ్ఘాన్, కర్గీజ్, తజకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ, అజర్ బైజాన్, టర్కీలు) ఈ కూటమిలో భాగస్వాములు. దీనికి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, డెన్మార్క్, కెనడా, ఈజిప్ట్, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాక్, జపాన్, నార్వే, పోలండ్, స్పెయిన్, స్విడన్ ల మద్దతు కూడా ఉంది. ‘హార్ట్ ఆఫ్ ఏషియా’ను ఐక్యరాజ్య సమితి సహా నాటో, సార్క్, షాంఘై సహకార సమితి, ఇస్లామిక్ సహకార కూటములు గుర్తించాయి. డిసెంబర్ 3న అమృత్ సర్ లో జరగనున్నది హార్ట్ ఆఫ్ ఏసియా ఏడో శిఖరాగ్ర సమావేశం. -
భారత్‌కు గట్టి పోటీనిస్తాం: కుక్
ముంబై: ప్రపంచ నంబర్‌వన్ భారత క్రికెట్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తమను అండర్డాగ్స్ గా పరిగణించినా ఎలాంటి ఇబ్బంది లేదని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పష్టం చేశాడు. నిజానికి తమను అలా భావిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న ఇంగ్లండ్ ఈనెల 9 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు ద్వారా భారత పర్యటనను ఆరంభించనుంది. 2012లో కుక్ బృందం 2-1తో నెగ్గిన అనంతరం భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోరుుంది లేదు. ‘నంబర్ వన్ జట్టుతో ఆడడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. అదీకాకుండా వారి సొంత గడ్డపై ఆడటమంటే మాకు కఠిన పరీక్షగానే భావించాలి. అలాగే మా జట్టులో చాలామందికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అరుునా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్ద జట్లతో మేం కూడా మంచి సిరీస్‌లే ఆడాం. గతేడాది నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గాం. భారత్ నుంచి ఎదురయ్యే సవాల్‌ను స్వీకరించేందుకు మా ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు’ అని ఉపఖండంలో 60కి పైగా సగటు కలిగిన కుక్ ధీమా వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితం గ్రేమ్ స్వాన్, మోంటీ పనేసర్లతో కూడిన స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని, ప్రస్తుతం తాము అలాంటి స్థితిలో లేమని అంగీకరించాడు. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు అనువైన పరిస్థితులు జట్టులో ఉన్నట్టు తెలిపాడు. ‘అండర్సన్ రాక మాకు సానుకూలం’ గాయంతో బాధపడుతున్న పేసర్ జేమ్స్ అండర్సన్ మంగళవారం జట్టుతో చేరనున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. అరుుతే ఫిట్నెస్ను నిరూపించుకున్నప్పటికీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని కెప్టెన్ కుక్ తెలిపాడు. అండర్సన్ రాక జట్టు బలాన్ని పెంచుతుందని, విశాఖలో జరిగే రెండో టెస్టుకు తను ఆడే అవకాశాలున్నట్టు చెప్పాడు. -
ఆస్ట్రేలియాలో ఆగిపోయిన ప్రధాని ఫ్లైట్
సిడ్నీ: న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ భారతదేశ పర్యటనకు అనూహ్యంగా అవాంతరం ఎదురైంది. సోమవారం భారత్‌కు బయలుదేరిన ఆయన విమానంలో స్వల్ప లోపం ఏర్పడటంతో ఆయన ఆస్ట్రేలియాలో ఆగిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఫోన్ ద్వారా వెల్లడించారు. జాన్ కీ భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ముంబయిలో భేటీ అవనున్నారు. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీని కూడా కలువనున్నారు. ఈరోజే(సోమవారం) ఆయన భారత్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. ఆయన బయలుదేరిన రాయల్ న్యూజిలాండ్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 757 అక్లాండ్‌లోని వెనుపాయ్ ఎయిర్ బేస్ నుంచి ప్రారంభమై ఇంధనం కోసం టౌన్స్‌విల్లేలో దిగింది. అయితే, అది తిరిగి బయలుదేరేముందు స్వల్ప సమస్య ఉన్నట్లు గుర్తించి అక్కడే విమానం ఆపేశారు. విమానయాన సంస్థ నుంచి మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. -
నవంబర్‌లో భారత్‌కు బ్రిటన్ ప్రధాని
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకూ మూడురోజుల పాటు ఆమె భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. థెరిసా మే ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత యూరప్ మినహా బయట దేశాలతో ద్వైపాక్షిక చర్చలకు రావటం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో థెరెస్సా మే చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య తదితర అంశాలపై ఈ పర్యటనలో చర్చ జరగనుంది. ఆమె వెంట 16 మంది వ్యాపార ప్రతినిధులు కూడా భారత్‌కు రానున్నారు. కాగా మే నెలలో చైనాలో హాంగ్ఝౌలో జరిగిన జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ... థెరిసాను భారత్‌లో పర్యటించేందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
నేడు భారత్‌కు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్... రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (నేడు) భారత్ కు చేరుకుంటారు. కిమ్ తన పర్యటనలో భాగంగా న్యూట్రిషన్, పునరుత్పాదక ఇంధన వృద్ధికి భారత్ తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలకు ఆర్థికంగా చేయూతనందించడానికి తగిన మార్గాలను అన్వేషించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలుస్తారు. పేదరిక నిర్మూలనకు పటిష్టమైన చర్యలు అవసరమని ఈ సందర్భంగా కిమ్ అభిప్రాయపడ్డారు. -
ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు
న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ మిడిల్టన్లకు ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్ హౌస్‌లో మధ్యాహ్న విందు ఇచ్చారు. ఇండియా గేట్ పక్కనేవున్న ఈ భవంతిలో విలియం జంటకు మోదీ స్వాగతం పలికారు. భారత శాకాహార, మాంసాహార వంటకాల్ని వడ్డించారు. సంతూర్ వాద్యకారుడు రాహుల్ శర్మ ఈ విందులో వీనులవిందైన సంగీతం వినిపించారు. బీటిల్స్ గీతం ‘లెట్ ఇట్ బీ’ ఆకర్షణగా నిలిచింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. కాగా, విలియం జంట ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం అస్సాం చేరుకుంది. తేజ్‌పూర్‌లో సీఎం తరుణ్ గొగోయ్ ఘనస్వాగతం పలికారు. అస్సాం పర్యటనలో ఈ జంట ఒంటి కొమ్ము రైనోలకు ప్రసిద్ధి చెందిన కజిరంగ జాతీయ పార్కును సందర్శిస్తుంది. -
ప్రిన్స్ జంటకు ఢిల్లీ స్వాగతం
ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన సతీమణి కేట్ మిడి ల్టన్‌ల రెండో రోజు భారత పర్యటన ఉత్సాహంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న వీరు మహాత్మాగాంధీ స్మృతి వనంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న మ్యూజియంను సందర్శించారు. గాంధీ వాడిన చరఖా గురించి తెలుసుకున్నారు. 30 మంది స్కూలు విద్యార్థులతో విలియం దంపతులు ముచ్చటించారు. 45 నిమిషాలు గాంధీ స్మృతివనంలో వారిద్దరూ గడిపారు. క్రీమ్ రంగు దుస్తుల్లో మిడిల్టన్ మెరిసిపోయారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 90వ జన్మదినం సందర్భంగా రాత్రి బ్రిటిష్ హైకమిషనర్ ఇచ్చిన విందుకు విలియం జంట హాజరైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చట అంతకుముందు ఉదయం ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముంబై లో నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ప్రపంచంలోని ఆరో వంతు జనాభా కల్గిన భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పాత్ర చాలా కీలకమని విలియం అన్నారు. విలియం దంపతులు టెక్ రాకెట్‌షిప్ అవార్డుల్ని అందచేశారు. మహింద్రా గ్రూపు రూ పొందించిన సిమ్యులేటింగ్ ఫార్ములా కారునుయువరాజు నడిపారు. దోసె మిషన్‌పై దోసె వేసి రుచి చూశారు. మంగళవారం ఈ జంటకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. -
విలియమ్ మనోడే!
న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియమ్‌కు భారతీయ మూలాలున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. విలియమ్ తల్లి ప్రిన్సెస్ డయానా పూర్వీకులది భారత్ కావడంతో.. విలియమ్లో భారతీయ డీఎన్ఏ ఉందని తెలిసింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఎలీజా కెవార్క్.. 1812లో కేథరిన్ స్కాట్ ఫోర్బ్స్‌కు జన్మనిచ్చారు. ఈమె విలియమ్ తల్లి డయానాకు పూర్వికురాలు. ఎలీజా కెవార్క్ కుటుంబంలో విలియమ్ది పదహారో తరం. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో విలియమ్ దంపతుల విందు భేటీ సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలియమ్ దంపతులకు భారతీయ సంస్కృతి, ఇక్కడి వంటకాలపై ఆసక్తి కూడా ఎక్కువే. విలియమ్‌కు కారమంటే పెద్దగా ఆసక్తి లేదని.. కానీ తనకు కారమంటే చాలా ఇష్టమని ఆయన భార్య కేట్ ఇటీవల చెప్పారు. -
భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట
♦ ముంబైలో 26/11 దాడుల మృతులకు విలియమ్, కేట్ నివాళి ♦ సచిన్‌తో కలసి క్రికెట్ ఆడిన విలియమ్ దంపతులు ♦ బాలీవుడ్, కార్పొరేట్ ప్రముఖులతో విందు.. నేడు ఢిల్లీకి పయనం ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలో దిగిన అనంతరం నేరుగా తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. విలియమ్ జంట భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్‌లో నాలుగు రోజుల పర్యటన తర్వాత భూటాన్‌కు వెళ్లనున్నారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటనను వినియోగించుకోవాలని బ్రిటన్ యువరాజు భావిస్తున్నారు. బ్యాట్ పట్టిన యువరాజు దంపతులు విలియమ్ దంపతులు తొలిరోజు ముంబైలో బిజీగా గడిపారు. తాజ్ హోటల్ నుంచి ఓవల్ మైదానానికి చేరుకున్న వీరు అక్కడ సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడి అందరినీ అలరించారు. పలు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతోపాటు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడారు. సచిన్ మొదటిబంతిని విలియమ్‌కు విసరగా, ఆ తర్వాత ఓ చిన్నారి బంతిని వేసింది. చిన్నారి రెండో బంతికి విలియమ్ ఔట్ కాగా, ఆ తర్వాత రాకుమారి కేట్ బ్యాట్ పట్టారు. సచిన్ అద్భుతమైన క్రికెటర్ అని, బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు నేర్పారని విలియమ్ చెప్పారు. వీరితో కలసి ఆడటం మరిచిపోలేనని, ఇది తనకు మధుర స్మృతి అని సచిన్ పేర్కొన్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు బాసటగా నిలుస్తూ తమ ఉదారతను చాటుతున్నారన్నారు. ముంబైకి చెందిన మూడు చారిటీ సంస్థలు మ్యాజిక్ బస్, డోర్‌స్టెప్, ఇండియాస్ చైల్డ్ లైన్ కోసం వారు క్రికెట్ ఆడారు. రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఈ జంట పలువురు కార్పొరేట్, బాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన 34 ఏళ్ల కేట్.. అలెంగ్జాడర్ మెక్ క్వీన్ డిజైన్ చేసిన రెడ్ప్రింటెడ్ డ్రెస్‌ను ధరించి ముంబైలో అడుగుపెట్టారు. క్రికెట్ ఆడేటప్పుడు అనిత డోంగ్రే రూపొందించిన ప్రింటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో మెరిశారు. నేడు ఢిల్లీకి... విలియమ్ జంట సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. వీరు అక్కడ అమర సైనికులకు నివాళులర్పించిన అనంతరం, రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. లెక్కలంటే భయం: విలియమ్ విలియమ్ దంపతులు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతో సందడిగా గడిపారు. వారితో కలసి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. మీరేం చదువుతున్నారు, మీకు ఏ సబ్జెక్టులంటే ఇష్టం, మీ హాబీలు ఏంటి అని ఆప్యాయంగా పలకరించారు. మీరు కష్టపడి చదివితే మీ కలలను సాకారం చేసుకోవచ్చని 33 ఏళ్ల విలియమ్ చెప్పారు. ఒక చిన్నారి తనకు మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఇష్టమని, తాను టీచర్ కావాలని అనుకుంటున్నానని చెప్పగా, తనకు మాత్రం మ్యాథ్స్ అంటే భయమని విలియమ్ అన్నారు. -
ముంబైలో యువరాణి కేట్ సందడి
-
సచిన్ తో క్రికెట్.. సిక్సర్ కొట్టిన కేట్
ముంబైలో ఆదివారం ఇద్దరు విశిష్ట అతిథులు సందడిచేశారు. ఏడురోజుల భారత్, భుటాన్ పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు విలియమ్స్ చార్లెస్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ లు నగరంలో ఏర్పాటుచేసిన వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఓవల్ మైదాన్ లో వీధిబాలులతో కలిసి క్రికెట్, ఫుట్ బాల్ ఆడిన కేట్, విలియమ్ లు బాలలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలోమెస్ట్రో సచిన్ టెండూల్కర్, దిలిప్ వెంగ్ సర్కార్ లు కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన యువరాజదంపతులు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కు వెళ్లారు. హోటల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 26/11 మృతుల స్మారకం వద్ద నివాళులు అర్పించారు. కేట్, విలియమ్ లు బసచేసే సూట్ ను ప్రత్యేకంగా అలకరించినట్లు తాజ్ యాజమాన్యం చెప్పింది. బాలీవుడ్ ప్రముఖులతో ఆదివారం సాయంత్రం భేటీకానున్న కేట్, విలియమ్ లు తర్వాతి రోజు తాజ్ మహల్ ను సందర్శిస్తారు. పలు కార్యక్రమాల అనంతరం భూటాన్ వెళతారు. బ్రిటన్ యువరాజు పర్యటన సందర్భంగా ముంబైలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'మమ్మల్ని భయపెట్టలేరు'
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే మంగళవారం వేడుకల అనంతరం ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో భారత్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. విమానం ఎక్కేముందు విలేకరులతో మాట్లాడిన హోలాండే.. ఫ్రాన్స్, భారత్ లు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో వెనకడుగువేయబోమని తేల్చిచెప్పారు.'మేం దేనికీ భయపడం, మమ్మల్నెవ్వరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు' అని హోలాండే ఉద్ఘాటించారు. ఉదయం రాజ్ పథ్ లో జరిగిన గణతంత్రవేడుకల్లో విశిష్టఅతిథిగా పాల్గొన్న హోలాండే.. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పలువురితో కరచాలనం చేస్తూ హుషారుగా గడిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ ఎట్ హోమ్ కు హాజరయ్యారు. తన మూడు రోజుల భారత పర్యటనలో హోలాండే.. చండీగఢ్ లో నిర్వహించిన వాణిజ్య సదస్సు భారత ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఉభయదేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థల అధిపతులు హాజరయ్యారు. చండీగఢ్‌లోని రాక్‌గార్డెన్, క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలను కూడా హోలాండే సందర్శించారు. రెండో రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. -
జర్మనీతో అనుబంధం
యూరప్‌లో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మెరిసిపోతున్న జర్మనీతో భారత్‌కు మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరగడంతోపాటు 18 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్, రైల్వే రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. కాలుష్య రహిత ఇంధన వనరులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలాంటి అంశాల్లోనూ రెండు దేశాలూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే జర్మనీ సంస్థలకు సత్వరం అనుమతులు లభించే ప్రక్రియను అమలు చేయడంపై ఒప్పందం కుదరింది. వచ్చే అయిదేళ్లలో భారత్‌లో సౌరశక్తి రంగంలో వివిధ ప్రాజెక్టుల అమలుకు వంద కోట్ల యూరోలు (రూ. 7,300 కోట్లు) వెచ్చించాలని జర్మనీ నిర్ణయించింది. ఆర్నెల్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ‘మేకిన్ ఇండియా’ను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సమయంలో మన దేశం చొరవతో న్యూయార్క్‌లో జరిగిన జీ-4 దేశాల సమావేశంలో మెర్కెల్ పాల్గొన్నారు. అయితే ఇరుదేశాలమధ్యా ఇటీవలికాలంలో ఏర్పడిన కొన్ని పొరపొచ్చాల ప్రభావమూ ఈ సమావేశాలపై ఉందని చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషా బోధనను నిలిపేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిరుడు నవంబర్‌లో జారీచేసిన ఉత్తర్వు జర్మనీకి అసంతృప్తి కలిగించింది. ఇలా హఠాత్తుగా, ఏకపక్షంగా నిలిపేయడం తగదని పిల్లల తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది అనవసర వివాదం. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉండటంతోపాటు ఆ రంగంలో అత్యుత్తమ శ్రేణి విద్యాబోధన చేస్తున్న జర్మనీ యూనివర్సిటీల్లో ఉన్నతస్థాయి చదువుల కోసం వెళ్లాలని ఇంజనీరింగ్ పట్టభద్రులు తహతహలాడతారు. వారు జర్మన్ భాష నే ర్చుకోవడం తప్పనిసరి. అలాంటపుడు విద్యాలయాల్లో ఆ భాషా బోధనను తొలగించడం సరైన నిర్ణయం కాదు. మెర్కెల్ వినతి మేరకు కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషా బోధనకు మన దేశం అంగీకరించింది. అదే సమయంలో తమ దేశంలో సంస్కృతంతోపాటు పలు భారతీయ భాషల బోధనకు జర్మనీ కూడా అంగీకరించింది. ఇక జీవీకే ఫార్మా సంస్థ ఔషధాల క్లినికల్ పరీక్షల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ మొన్న ఆగస్టులో 700 ఔషధాల అమ్మకాలపై ఈయూ నిషేధం విధించడం పర్యవసానంగా తలెత్తిన వివాదం మరొకటి. దీనికి నిరసనగా మన దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) చర్చల నుంచి వైదొలగింది. మేథో హక్కులు, ఆటోమొబైల్ రంగంలో విధిస్తున్న టారిఫ్‌లు, ఈయూ ఎగుమతి చేసే వైన్, డైరీ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు వంటి అంశాల్లో ఏర్పడిన వివాదాలు సద్దుమణిగే దశలో ఈ ఔషధ అమ్మకాల నిషేధం సమస్య వచ్చిపడింది. ఈ విషయంలో చొరవ తీసుకుని ఈయూకు నచ్చజెప్పాలని, ఔషధ అమ్మకాలపై విధించిన నిషేధం తొలగింపజేయటంతోపాటు ఎఫ్‌టీఏ చర్చలు పునఃప్రారంభం కావడానికి చర్యలు తీసుకోవాలని మెర్కెల్‌ను మోదీ అభ్యర్థించారు. ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే అది భారత్, జర్మనీలకు మాత్రమే కాదు... ఈయూకి సైతం మేలు చేస్తుంది. ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎఫ్‌టీఏ చర్చలు ఏదో ఒక అంశంలో ఇబ్బందులు తలెత్తి నిలిచిపోతున్నాయి. ఈయూతో ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే ప్రధాన దేశమైన జర్మనీలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా జర్మనీ పెట్టుబడులు, ఆ దేశ ఉత్పత్తులు వెల్లువలా వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌టీఏ విషయంలో మెర్కెల్ ఏమేరకు తోడ్పడతారన్నది చూడాల్సి ఉంది. ఇక పరస్పర న్యాయ సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ) కుదుర్చుకోవడం విషయంలో జర్మనీ ఆసక్తి ప్రదర్శించలేదని చెబుతున్నారు. భారత్‌లో ఉగ్రవాద నేరాలకు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడి జర్మనీలో తలదాచుకునే నేరస్తులను అప్పగించడానికి...అలాగే అక్కడ నేరాలు చేసి మన దేశంలో ఉంటున్నవారిని పంపించేందుకు ఈ ఒప్పందం అవకాశం ఇస్తుంది. అయితే మన దేశ చట్టాల్లో మరణశిక్షలు ఉండటంవల్ల దీన్ని కుదుర్చుకోవడం సాధ్యపడదని జర్మనీ తేల్చిచెప్పింది. జర్మనీ మరణశిక్షల్ని రద్దు చేయడమేకాక అలాంటి శిక్షలు అమలు చేసే దేశాలకు నేరస్తుల్ని అప్పగించడంలో సహకరించరాదన్న నియమం పెట్టుకుంది. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఉమ్మడిగా కృషి చేయాలని మోదీ, మెర్కెల్ నిర్ణయించారు. ఈ ఉమ్మడి ప్రకటన ఉక్రెయిన్ వివాదాన్ని ప్రస్తావించడం గమనార్హం. అక్కడి సంక్షోభాన్ని నివారించడానికి జరిగే దౌత్యపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రెండు దేశాలూ స్పష్టం చేశాయి. వాస్తవానికి ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును...ముఖ్యంగా క్రిమియాను అది విలీనం చేసుకోవడాన్ని జర్మనీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. రష్యాతో ఉన్న సాన్నిహిత్యంవల్ల మన దేశం మాత్రం ఆ అంశంలో అనిర్దిష్టంగానే ఉంది. అయినప్పటికీ ‘అన్ని దేశాల సార్వభౌమత్వానికీ, వాటి ప్రాదేశిక సమగ్రతకూ భారత్, జర్మనీలు గట్టిగా మద్దతిస్తున్నాయని’ ఉమ్మడి ప్రకటన స్పష్టంచేసింది. ఇప్పటికైతే రెండు దేశాలమధ్యా కుదిరిన ఒప్పందాలు మౌలికంగా ఆర్థికాంశాలకు సంబంధించినవే. ఇవి వ్యాపార, వాణిజ్య రంగాలకు విస్తరించాల్సి ఉంది. మిగిలిన యూరప్ దేశాలు ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత దశలో భారత్‌తో చెలిమి అత్యంత ముఖ్యమని జర్మనీ భావిస్తున్నది. కనుక భవిష్యత్తులో రెండు దేశాలమధ్యా బహుళ రంగాల్లో దృఢమైన బంధం ఏర్పడగలదని ఆశించవచ్చు. -
నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్!
న్యూఢిల్లీ: సహచర క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా బడా వ్యాపారవేత్తలతో కూడిన భారీ బృందంతో జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్ భారత్ కు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న మోర్కెల్ బృందానికి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఘనస్వాగతం పలికారు. 'నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్! మీకు, మీ బృందానికి హృదయపూర్వక ఆహ్వానం. మీ పర్యటనతో భారత్- జర్మనీల మైత్రి మరింత ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నా' అంటూ ఏంజెలా రాకను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రేపు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మోర్కెల్ భేటీ కానున్నారు. ఆరు మాసాల వ్యవధిలో రెండోసారి జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో పలు వాణిజ్య, రక్షణ ఒప్పందాలతోపాటు భారత్- యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఏంజిలా మోర్కెల్ బెంగళూరునూ సందర్శిస్తారు. Namaste Chancellor Merkel! Warm welcome to you & the delegation. I look forward to fruitful discussions & strengthening India-Germany ties. — Narendra Modi (@narendramodi) October 4, 2015 -
భారత్ పర్యటనకు పాక్ ఫుట్‌బాల్ జట్టు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో ఆడేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్లో జరగనున్న ‘శాఫ్’ కప్ కోసం పొరుగుదేశం జట్టు ఇక్కడికి రానుంది. అయితే ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నా... పాక్ ఫుట్‌బాల్ జట్టు కు మాత్రం అనుమతి లభిస్తుందని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల న్యూఢిల్లీలో తీసిన టోర్నీ డ్రాలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్లు కలిసి మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన ఈ దక్షిణాసియా చాంపియన్‌షిప్‌కు పాకిస్తాన్ ఒక్కసారి కూడా గైర్హాజరు కాలేదు. డిసెంబర్ 23 నుంచి జనవరి 3, 2016 వరకు తిరువనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాక్ ఆటగాళ్లు హెచ్ఐఎల్లో పాల్గొనేలా హెచ్ఐతో చర్చలు జరుపుతామని పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) కార్యదర్శి సుభాన్ అహ్మద్ తెలిపారు. ఆటను మెరుగు పర్చుకోలేకపోవడంతో పాటు పెద్ద మొత్తం లో వచ్చే డబ్బును పాక్ ఆటగాళ్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ ఆటగాళ్ల మితిమీరిన ప్రవర్తన కారణంగా వాళ్లను హెచ్ఐఎల్కు దూరంగా పెట్టారు. -
అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్‌లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనున్నాయి. అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభమవుతుంది. సోమవారం బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేశాయి. పటిష్టమైన టీమిండియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే పోరు అభిమానులకు వినోదాన్ని అందించనుంది. కాగా హైదరాబాద్, విశాఖపట్నంలో ఒక్క మ్యాచ్ కూడా జరగకపోవడం తెలుగు క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం. సిరీస్ షెడ్యూల్ ఇదే: టి-20 సిరీస్: మ్యాచ్ వేదిక తేదీ తొలి-20 ధర్మశాల అక్టోబరు 2 రెండో టి-20 కటక్ అక్టోబరు 5 మూడో టి-20 కోల్‌కతా అక్టోబరు 8 వన్డే సిరీస్ తొలి వన్డే కాన్పూర్ అక్టోబరు 11 రెండో వన్డే ఇండోర్ అక్టోబరు 14 మూడో వన్డే రాజ్‌కోట్ అక్టోబరు 18 నాలుగో వన్డే చెన్నై అక్టోబరు 22 ఐదో వన్డే ముంబై అక్టోబరు 25 టెస్టు సిరీస్ తొలి టెస్టు మొహాలీ నవంబర్ 5-9 రెండో టెస్టు బెంగళూరు నవంబర్ 14-18 మూడో టెస్టు నాగ్‌పూర్ నవంబర్ 25-29 నాలుగో టెస్టు ఢిల్లీ డిసెంబర్ 3-7 -
15 రోజుల్లో 4వేల కిలోమీటర్లు పూర్తి
మోదీ స్ఫూర్తిగా ప్రయాణం రంగారెడ్డి(తాండూరు): ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తితో తాండూరు పట్టణానికి చెందిన జొల్లు ప్రవీణకుమార్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై చేపట్టిన భారత దేశయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గత నెల 31వ తేదీన తాండూరులో ప్రారంభించిన ఈ యాత్ర తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, చిత్తూరుతోపాటు తమిళనాడులో 8 జిల్లాలు, కేరళలో 7 జిల్లాల్లో పూర్తయ్యింది. కర్ణాటకలోని 8 జిల్లాల్లో ఈయాత్ర పూర్తయి ప్రస్తుతం గుల్బర్గా జిల్లాలోకి ప్రవేశించింది. తాండూరు నుంచి ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, వీరశైవ సమాజం ప్రతినిధులు, స్నేహితులు గుల్బర్గాకు వెళ్లి ఆయనను కలిశారు. గుల్బర్గాలోని శ్రీశరణు బసవేశ్వర దేవాలయంలో అప్పాజీని ప్రవీణ్‌కుమార్ కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఫోన్లో మాట్లాడారు. యాత్ర చేపట్టిన 15 రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో సుమారు 4వేల కి.మీ. పూర్తి చేసినట్టు తెలిపారు. రోజుకు సుమారు 250-300కి.మీ. వరకు ప్రయాణం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి చోటా ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు మంచి ఆదరణ చూపారన్నారు. స్వచ్ఛభారత్తోపాటు భ్రూణ హత్యల నివారణ, మహిళలను గౌరవించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు,పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆదివారం గుల్బర్గా నుంచి బీజాపూర్‌కు బయలుదేరనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని తెలియజేశాడు. -
2 నెలలు సమయం ఇవ్వండి
బీసీసీఐని కోరిన వెస్టిండీస్ జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు అధ్యక్షుడు కామెరాన్ బీసీసీఐకి లేఖ రాశారు. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. -
ఒబామా పర్యటనపై లెఫ్ట్ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసనలు పలుచోట్ల ఒబామా, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం సాక్షి నెట్వర్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం రాష్ర్టవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘ఒబామా గోబ్యాక్’, ‘మానవాళి శత్రువు గోబ్యాక్’ అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్తూపం నుంచి సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు తమ్మినేని వీరభద్రం (సీపీఎం), అజీజ్‌పాషా (సీపీఐ), మురహరి (ఎస్‌యూసీఐ-యూ), దయానంద్ (ఫార్వర్డ్‌బ్లాక్), సిద్ధులు (లిబరేషన్), జానకిరాములు (ఆర్ఎస్పీ) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఒబామాకు తాము వ్యతిరేకం కాదని, ఆయన సామ్రాజ్యవాదానికి, అమెరికాకు అధినేతగా ఉన్నందుకే వ్యతిరేకిస్తున్నామన్నారు. నియంతృత్వవాదిగా వివిధ దేశాలపై దాడులు చేసి వారి హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. సీపీఐ నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ ఒబామా పర్యటన వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభం తప్ప సామాన్యులకు ఏం ప్రయోజనం ఉండదన్నారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద నారాయణ, ప్రభృతుల అరెస్ట్.. ఒబామా పర్యటనను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించిన సీపీఐ నాయకులు కె.నారాయణ, గుండా మల్లేశ్, టి.వెంకటరాములు, ఎన్. బాలమల్లేష్, డా.సుధాకర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడినుంచి వారిని బొల్లారం పీఎస్‌కు తరలించారు. ఆయా ఒప్పందాలతో దేశాన్ని దోచుకునేందుకు వస్తున్న ఒబామాకు కేంద్రం రెడ్‌కార్పెట్ పరచడం సిగ్గుచేటని ఈ సందర్భంగా నారాయణ ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాద అమెరికాకు మోదీ ప్రభుత్వం గులాంగిరీ చేస్తున్నదని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్టకార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ప్రపంచ ప్రజలను పీడిస్తున్న ఒబామాను గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒబామా పర్యటనను నిరసిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. -
ఒబామా.. గో బ్యాక్!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను నిరసిస్తూ వామపక్షాల నేతృత్వంలో నిరసనలు హోరెత్తాయి. ఒబామా...గో బ్యాక్ అన్న నినాదం మిన్నంటింది. చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించారు. మదురై, తిరుచ్చిల్లో నిరసనలు వాగ్యుద్ధానికి దారి తీశాయి. సాక్షి, చెన్నై : భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఒబామా, భార త ప్రధాని నరేంద్ర మోదీల మధ్య పలు అంశాలకు సంబంధించిన ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే, ఈ ఒప్పందాలన్నీ భారత్ మీద ప్రభావం చూపించేవిగా, దేశ ప్రజల నడ్డి విరిచే రీతిలో సంతకాలు చేయనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. భారత్‌ను నిర్బంధించి మరీ ఈ ఒప్పందాలకు అమెరికా కసరత్తులు చేసినట్టుగా ప్రచారం సాగింది. దీంతో ఒబామా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. భారత్‌లో చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల వ్యవహారంతో పాటుగా దేశ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే రీతిలో సాగనున్న ఒప్పందాల సంతకాలను వ్యతిరేకించే విధంగా ఒబా మా పర్యటనను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. నిరసనల హోరు సీపీఎం, సీపీఐల నేతృత్వంలో రాష్ట్రంలో వారికి పట్టున్న అన్ని ప్రాంతాల్లో శనివారం నిరసనలు చేపట్టారు. చెన్నై లో అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నిం చారు. మదురైలో ప్రధాన తపాలా కార్యాలయాన్నిముట్టడించారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ నిరసన చోటు చేసుకుంది. ఉదయాన్నే సీపీఎం శాసన సభా పక్ష నేత సౌందరరాజన్, సీపీఐ నాయకుడు వీర పాండియన్ల నేతృత్వంలో ఆ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు ర్యాలీగా జెమిని వంతెన సమీపంలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి బయలు దేరారు. ముందుస్తుగా అనుమతి కోరినా, పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహంతో నిరసన కారులు ముందుకు సాగారు. వీరిని సమీపంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు నిరసనకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒబామాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, వ్యంగ్య చిత్రాలను చేత బట్టి నిరసన తెలియజేశారు. ఒబామా గో బ్యాక్ అని నినదిస్తూ కాసేపు నిరసన అనంతరం అక్కడి నుంచి వెను దిరిగారు. నిరసనను ఉద్దేశించి సౌందరరాజన్ మాట్లాడుతూ, భారత్‌ను నిర్బంధించి మరి కొన్ని రకాల సంతకాలకు అమెరికా ఒడి గట్టిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కొన్ని మందుల్ని అధిక ధరలో భారత్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజల మనో భావాలకు వ్యతిరేకంగా, భారత ప్రజల నడ్డి విరిచే విధంగా ఒబామా పర్యటన సాగనుందని, అందుకే వ్యతిరేకిస్తున్నామన్నారు. వాగ్యుద్ధం : మదురైలో సీపీఎం, సీపీఐ నాయకులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఒబామాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గో బ్యాక్ అని హెచ్చరిస్తూ ఆ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా, నిరసనకు దిగారు. సీపీఎం అభ్యర్థి అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు ఒబామాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. -
భారత్ పర్యటనకు ముందు ఒబామా కీలక ప్రసంగం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు ముందు కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒబామా తెలిపారు. ఉద్యోగ కల్పన వేగంగా జరుగుతోందని, 1999 సంవత్సరం నాటి పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయిన ఆయన పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, పవన విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని ఒబామా వెల్లడించారు. కాగా గణతంత్ర దినోత్సవానికి ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్న విషయం తెలిసిందే. -
25 నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ పర్యటనలో ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శిస్తారు. ఒబామా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని నిన్న గాంధీనగర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ చెప్పారు. గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో ప్రత్యేక బృందాలు మోహరిస్తాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం. -
షీఖ్ కబాబ్..గులాబ్ జామున్
భారత వంటకాలను ఆస్వాదించిన ఫెడరర్ న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ భారత్‌లో అడుగు పెట్టిన దగ్గరినుంచి అతని ఆట మొదలు అన్నీ విశేషాలే! తొలిసారి తన ఆటతో మన అభిమానులను అలరించిన ఈ స్టార్... భారత్ టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్‌లో ఆహారం రుచి చూడాలని ఉందంటూ గతంలోనే ప్రకటించిన రోజర్, ఇప్పుడు వాటిని ఆస్వాదించాడు. ఐపీటీఎల్ ఆడేందుకు ఢిల్లీలో ఉన్న ఫెడరర్, తన తండ్రి, టీమ్‌తో కలిసి హోటల్ మౌర్యలో భోజనం చేశాడు. అనేక రకాల శాకాహార, మాంసాహాల వెరైటీలు తన డిన్నర్లో ఉండేలా చూసుకున్నాడు. భారీ సైజు నాన్ కీ రోటీని అమిత ఇష్టంగా తిన్నాడు. దీంతో పాటు సికందరీ రాన్, ముర్గ్ మలై కబాబ్, షీఖ్ కబాబ్, తందూరి గోబి, తందూరీ ఆలూ, దాల్ బుఖ్రాలను తీసుకున్నాడు. ఇక భోజనం చివర్లో వేర్వేరు రకాల మిఠాయిలు రుచి చూశాడు. కుల్ఫీ, ఫిర్ని, గులాబ్ జామున్ ఇందులో ఉన్నాయి. మొత్తానికి ఈ స్విస్ స్టార్‌కు మన భోజనం భలే నచ్చింది! దీపికతో ఆటా పాటా... ఐపీటీఎల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఫెడరర్, బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్, ఆమిర్‌ఖాన్‌లతో సరదాగా కొద్ది సేపు టెన్నిస్ ఆడాడు. ఐపీటీఎల్ డిన్నర్లో భాగంగా దీపిక, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లతో కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం. -
జిల్లాలో జాతిపిత జాడలు
నమో నమో బాపూ మాకు న్యాయమార్గమే చూపూ నిరంతరం మా హృదంతరంలో నిలిచి ఉండు మూర్తీ నిత్య సత్య కీర్తీ అని కవులు కొనియాడిన మహాత్మా గాంధీ స్మృతులు జిల్లాలో ఎన్నెన్నో... స్వాతంత్య్రపోరాటంలో భాగంగా దేశపర్యటనలో మన జిల్లాకు మహాత్మాగాంధీ పలుమార్లు వచ్చారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలలో ఆయన పర్యటన స్మృతులు వాడని తలపులే. రాజమండ్రిలో... తొలిసారిగా గాంధీ మహాత్ముడు 1921 మార్చి 30న రాజమండ్రి వచ్చారు. ఆయనతోపాటు లాలా లజపతిరాయ్, చిత్తరంజన్‌దాస్, ఇతర జాతీయ నాయకులు వచ్చారు. అప్పుడు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న మైదానంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. నూలు వడకడం ప్రాధాన్యత, దురలవాట్లకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై గాంధీజీ ప్రసంగించారు. తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలివ్వాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. రెండోసారి 1921 ఏప్రిల్ 6న రాజమండ్రి వచ్చారు. అప్పుడు పాల్‌చౌక్ (ప్రస్తుతం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఫ్రీడంపార్కు ఉన్న స్థలం)లో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని టంగుటూరి ప్రకాశం తెలుగులోకి అనువదించారు. మూడోసారి 1929 మే 6న రాజమండ్రి వచ్చి కందుకూరి వీరేశలింగం పురమందిరం (టౌన్‌హాల్)ను సందర్శించారు. నాలుగోసారి 1933 డిసెంబర్ 24న పాల్‌చౌక్‌లో మహాత్ముడు ప్రసంగించారు. ఆ సందర్భంగా గాంధీజీని సన్మానించారు. హరిజన నిధికి సన్మాన సంఘం సభ్యులు రూ.1300 విరాళంగా సమర్పించారు. చివరిసారిగా మహాత్ముడు 1946 జనవరి 20న రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి రైల్వేస్టేషను ఎదుట ఉన్న ప్రాంగణంలో మహాత్ముడు ప్రసంగించారు. సుమారు లక్షమంది ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో రాజమహేంద్రవర హిందీప్రచారమండలి తరఫున రూ.500 విరాళాన్ని గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ హిందీ ప్రసంగాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి కళావెంకటరావు తెలుగులోకి అనువదించారు. కాకినాడలో... మహాత్మా గాంధీ కాకినాడను రెండు సార్లు సందర్శించారు. 1920లో నగరంలో ఆయన పలు సమావేశాలను నిర్వహించారు. ఆ స్మతి చిహ్నంగా ఆసమావేశాలు జరిగిన ప్రాంతంలో (ప్రస్తుతం గాంధీనగర్) గాంధీపార్కును పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1940 ఆగస్టు 9న ఇక్కడ గాంధీజీ విగ్రహాన్ని డాక్టర్ రాజగోపాలాచారి ప్రారంభించారు. గాంధీజీ చిన్ననాటి ఫోటోలతో పాటు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలకు సంబంధించిన అనేక చిత్రాలను పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో భద్రపరిచారు. 1921 ఏప్రిల్ 3వ తేదీన కాంగ్రెస్ సేవాదళ్ హరిజనుల కోసం కాకినాడలో నిర్వహించిన సేవాశిబిరాల్లో పాల్గొనేందుకు గాంధీజీ రెండోసారి కాకినాడ వచ్చారు. సుమారు ఏడు రోజులు ఆయన ఇక్కడ బస చేశారు. దళితులకు మేలు జరిగేలా స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించారు. కాకినాడలో విద్యార్థులకు వసతిగృహాలను ప్రారంభించారు. ప్రస్తుతం గాంధీభవన్ ఉన్న ప్రాంతంలో బాపూజీ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. ఆయన బస చేసిన గాంధీభవన్ ద్వారా నాటి ప్రముఖులు తనికెళ్ల సత్యనారాయణమూర్తి , మెర్ల సుబ్బారావు అందించిన ఆర్థిక సాయంతో ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈట్రస్టు ద్వారా లైబ్రరీ, విద్యార్థులకు సేవా కార్యక్రమాలు, కళాకారుల వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. -రాజమండ్రి కల్చరల్ / బాలాజీ చెరువు (కాకినాడ) -
భారత పర్యటనకు క్రిస్ గేల్ దూరం!
అంటిగువా: భారత పర్యటనకు డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ దూరమయ్యాడు. గాయం కారణంగా వెస్టిండీస్ జట్టు నుంచి క్రిస్ గేల్ తప్పుకున్నాడు. వచ్చెనెలలో భారత్ లో పర్యటించే వెస్టిండీస్ జట్టు ఎంపిక జరిగింది. భారత్ లో అక్టోబర్ 8న ప్రారంభమయ్యే వెస్టిండీస్ జట్టుకు డ్వేన్ బ్రావో కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. మార్లన్ శ్యామ్యుల్, డ్వేన్ స్మిత్,జెరోమ్ టేలర్ లు జట్టులోకి వచ్చారు. గత సంవత్సరం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు శ్యామ్యూల్, స్మిత్ లు దూరంగా ఉన్నారు. గాయం కారణంగా టేలర్ గత నాలుగు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నారు. -
భారత్‌కు చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
-
భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు
అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. బుధవారం ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో జిన్‌పింగ్ బృందానికి ఘనస్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. భారత్‌తో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు జిన్ రావడం విశేషం. మోడీ, జిన్ ఇద్దరూ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
ఒక్కసారైనా ఇండియాను చూడాల్సిందే
భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీయులలో చాలామంది యాత్రాకథనాలు రాశారు. అయితే ఒక చైనా వనిత భారతదేశంపై తాజాగా రాసిన పుస్తకం ‘ది ఫర్దర్ ఐ వాక్, ద క్లోజర్ ఐ గెట్ టు మీ’ (ముందుకు నడిచేకొద్దీ, వెనక్కి నేను నాలోకి) ప్రస్తుతం చైనాలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఆ మహిళా యాత్రికురాలి పేరు హాంగ్ మి. వయసు 34. హాంగ్ మి 2009లో తన అమెరికన్ భర్త టామ్ కార్టర్‌తో కలిసి దాదాపుగా భారతదేశం మొత్తం పర్యటించారు. భిన్న రకాల సంస్కృతులను దగ్గరగా వీక్షించారు. అప్పటి అనుభవాలన్నిటినీ క్రోడీకరించి చైనా భాషలో ఈ యాత్రాకథనాన్ని రచించారు. ఇండియాపై చైనాలో ఇంటివంటి దేశవాళీ పుస్తకం రావడం ఇదే ప్రధమం అట. హాంగ్ మి మాటల్లో చెప్పాలంటే ఇదొక స్వీయ రూపాంతరీకరణ యాత్రారచన. అప్పట్లో హాంగ్, ఆమె భర్త ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు, మారుమూల గ్రామాలలో కూడా పర్యటించారు. ఈ రెండు వైరుధ్యాల నడుమ భారతీయ సంస్కృతిలో ఆమె ఒక ఏకసూత్రతను సాధించారు. అదే... భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశ సందర్శనలో భాగంగా హాంగ్ మి కుంభమేళా, ఒంటెల మేళా, హోలీ వంటి పండుగలలో పాలుపంచుకున్నారు. అలాగే ఆనాటి ఎన్నికల ప్రచార సరళిని దగ్గరగా గమనించారు. వీటన్నిటి విశేషాలను అందంగా తన పుస్తకంలో పొందు పరిచారు. ఈ ప్రయత్నం వెనుక తన భర్త టామ్ ప్రోత్సాహం కూడా ఉందంటారు హాంగ్. టామ్‌కు కూడా కొంత రచనానుభవం ఉంది. అంతకు ముందే ఆయన చైనాలోని 33 ప్రావిన్సుల సంస్కృతీ సంప్రదాయాలను ఛాయా చిత్రాల రూపంలో ఒక పుస్తకంగా తెచ్చారు. హాంగ్ దంపతుల భారతదేశ పర్యటన బడ్జెట్ రోజుకు 20 అమెరికన్ డాలర్లు అయ్యిందట. ప్రధానంగా వీరు ఉత్తర, దక్షిణ,పశ్చిమ ప్రాంతాలను సందర్శించారు. ఇక్కడ టామ్ గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పకోడానికి ఆయన భార్య హాంగ్ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ‘దిల్ బోలే హడి ప్ప’ చిత్రంలోని ఒక క్రికెట్ సన్నివేశానికి గాను పదవ బ్యాట్స్ మన్‌గా టామ్ ఎంపికయ్యారట. ఇక ప్రధానంగా చెప్పుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఈ దంపతులు ఒడిషాలో ఉన్నప్పుడు అనుకోకుండా కొందరు మావోయిస్టులను కలిసి, వారిని ఇంటర్వ్యూ చెయ్యడం. అయితే ఈ వివరాలు పుస్తకంలో సంక్షిప్తంగా మాత్రమే ఉన్నాయి. ‘‘అన్నిటినీ కూర్చడం పెద్ద సమస్యే అయింది. అందుకే కొన్నిటికి అప్రమేయంగా ప్రాధాన్యం తగ్గింది’’ అంటారు హాంగ్ మి. ఇక ఈ పర్యటనలో హాంగ్‌కి సంతృప్తిని కలిగించినవి సాంస్కృతిక వేడుకలు కాగా, ఇబ్బంది పెట్టినది మాత్రం మన ఆహారపు అలవాట్లలో ఆమె ఇమడలేక పోవడం. మొత్తానికి భారతదేశ పర్యటన కొత్తలోకాలకు ద్వారాలు తెరిచిందని, ప్రపంచ సందర్శకులు, పర్యాటకులు తమ జీవితంలో ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందేనని హాంగ్ మి తన పుస్తకం ముందు మాటలో రాసుకున్నారు. -
చైనాతో బంధాలు బలోపేతం
జిన్‌పింగ్ పర్యటనపై మోడీ ఆశాభావం న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టనున్న భారత పర్యటన ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న అహ్మదాబాద్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని సోమవారం ట్విట్టర్లో తెలిపారు. బౌద్ధమతంతో గట్టి అనుబంధమున్న ఉభయ దేశాల బంధాలు జిన్‌పింగ్ పర్యటనతో పటిష్టమవుతాయన్నారు. గుజరాత్‌లోని బౌద్ధక్షేత్రాల చిత్రాలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీటిలో ఆయన స్వస్థలమైన వాద్నగర్లో జరిపిన తవ్వకాల చిత్రాలూ ఉన్నాయి. ‘నేను జన్మించిన వాద్నగర్ కూడా బౌద్ధమత ప్రభావం గల ప్రాంతమే. గుజరాత్లో చాలా బౌద్ధమఠాలు, సన్యాసులు ఉన్నట్లు చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ చెప్పారు’ అని తెలిపారు. కాగా, మోడీ అహ్మదాబాద్‌లో ఈ నెల 17న సబర్మతి నది ఒడ్డున జిన్‌పింగ్‌కు వ్యక్తిగత విందు ఇవ్వనున్నారు. 50 ఏళ్ల కిందట అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి కూడా నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంజాబ్‌లోని నంగల్‌లో సట్లేజ్ ఒడ్డున విందు ఇచ్చారు. పర్యటనలో సరిహద్దు వివాదంపై చర్చ జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా సరిహద్దు వివాదంపై చర్చించనున్నట్లు భారత్ తెలిపింది. ఇరు దేశాల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుందని, సరిహద్దు వివాదం వంటివాటిపై చ ర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా, భారత రైల్వే ఆధునీకరణ, పారిశ్రామిక రంగాల్లో 10 వేల కోట్ల డాలర్ల నుంచి 30 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. లడఖ్‌లో చొరబాట్లు లేహ్: ఓ పక్క చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు సిద్ధమవుతుండగా, మరోపక్క ైచె నా పౌరులు పెద్ద సంఖ్యలో భారత్‌లోకి చొరబడ్డారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని డెమ్చోక్లోకి చైనా పౌరులు తమ ప్రభుత్వ వాహనాల్లో అక్రమంగా ప్రవేశించారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. వీరిని వాస్తవాధీన రేఖ అవతలి తోషిగాంగ్ గ్రామం నుంచి వాహనాల్లో తీసుకొచ్చారని, వారం నుంచి చైనా ఈ ప్రాజెక్టు పనులకు అభ్యంతరం చెబుతోందని లేహ్ డిప్యూటీ కమిషనర్ సిమ్రాన్‌దీప్ సింగ్ చెప్పారు. చైనా ఆర్మీ ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదంతాన్ని భారత విదే శాంగ శాఖ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. సరిహద్దు వివాదంపై చైనాతో చర్చిస్తామని పేర్కొంది. -
మోడీ ఊరికి చైనా అధ్యక్షుడు!
-
మోడీ ఊరికి చైనా అధ్యక్షుడు!
* గుజరాత్ నుంచి భారత పర్యటన.. * జీ జిన్‌పింగ్‌తో భారత భద్రతా సలహాదారు దోవల్ భేటీ.. బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొద్దిరోజుల్లో చేపట్టే భారత పర్యటనను గుజరాత్ నుంచి ప్రారంభించే అవకాశముంది. ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీ స్వగ్రామమైన వాద్‌నగర్‌కు కూడా వెళ్తారని భావిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారమిక్కడ జిన్‌పింగ్‌తో సమావేశమై, ఆయన పర్యటన షెడ్యూలును ఖరారు చేశారు. దీని వివరాలు తెలియకున్నా.. జిన్‌పింగ్ ఈ నెల 17న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తారని చైనా అధికారులు చెప్పారు. వాద్నగర్లో పర్యటించాలని దోవల్ చైనా అధినేతను గట్టిగా కోరారు. ‘మీరంటే తనకెంతో గౌరవమని మోడీ మాకు చాలాసార్లు చెప్పారు. చైనా తత్వవేత్త హుయాన్ త్సాంగ్ వాద్‌నగర్‌కు వచ్చారని కూడా ఆయన మీకు చెప్పారు’ అని జిన్‌పింగ్‌తో అన్నారు. మోడీ పంపిన ఆహ్వాన లేఖను, ప్రత్యేక సందేశాన్ని అందించారు. జిన్‌పింగ్‌ను తన ఊరికి తీసుకెళ్తానని మోడీ ఆయనకు చెప్పారని, ఆయన వాద్నగర్ పర్యటన సమయం షెడ్యూలు తదితరాలపై ఆధారపడి ఉంటుందని తర్వాత మీడియాకు చెప్పారు. చైనా నేత పర్యటనను రేపోమాపో ప్రకటిస్తామన్నారు. విదేశీనేతలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని మోడీ అంటున్నారని, ఇది అందులో భాగమేనని పేర్కొన్నారు. శక్తిమంతులైన మోడీ, జిన్‌పింగ్‌లు సరిహద్దు వివాదాలనికి పరిష్కారం కనుక్కోగలరని, ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతస్థాయికి తీసుకుపోగలరని అన్నారు. కాగా, తన పర్యటన ఖరారు కోసం దోవల్ బీజింగ్ రావడం చైనాతో సంబంధాలకు భారత్, మోడీ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని జిన్‌పింగ్ దోవల్‌తో అన్నారు. భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నానని, ఆ దేశ విజయాలను అవగాహన చేసుకోవడానికి పర్యటన తోడ్పడుతుందని పేర్కొన్నారు. జిన్‌పింగ్ ఈ నెల 14-19 మధ్య మాల్దీవులు, శ్రీలంక, భారత్‌లలో పర్యటిస్తారని చైనా విదేశాంగ తెలిపింది. ఆయన 17న నేరుగా అహ్మదాబాద్ చేరుకుని, మోడీ అతిథ్యం స్వీకరించి, అనంతరం ఢిల్లీ వెళ్తారని సమాచారం. -
మీతో కలసి పనిచేయాలనుకుంటున్నా
మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేఖ న్యూఢిల్లీ: ఇటీవలి తన భారత పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన భేటీ పట్ల పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇరుదేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలపై మీతో కలసి చర్చించేందుకు సానుకూల దృక్పథంతో ఎదురు చూస్తున్నానని అందులో పేర్కొన్నారు. ఈ లేఖ గత వారాంతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. మే 26న జరిగిన మోడీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ హాజరవడం, ఆ మరుసటి రోజున ఆయనతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలతోసహా పలు విషయాలపై చర్చించడం తెలిసిందే. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మనం పరస్పరం వ్యక్తం చేసుకున్న అర్థవంతమైన ఆలోచనలతో సంతృప్తిగా తాను స్వదేశానికి మరలానని లేఖలో నవాజ్ పేర్కొన్నారు. ‘‘ఇరుదేశాలకు ప్రయోజనం కలిగించేలా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విషయంలో మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. మనం చేసే ప్రయత్నాలు మరింత మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయగలవని ఆశిస్తున్నా’’ అని నవాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరుదేశాల్లోనూ లక్షలాది మంది పేదరికంలో మగ్గుతున్నారని, వారిపై మనం దృష్టి సారించాల్సి ఉందని అంటూ.. మనం చేపట్టే నిర్మాణాత్మక చర్యలు ఇరుదేశాల సంక్షేమానికి, సౌభాగ్యానికి దోహదం చేయగలవని తాను బలంగా నమ్ముతున్నానని పాక్ ప్రధాని పేర్కొన్నారు. -
భారతదేశ పర్యటన మరువలేనిది
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: ఇండియా పర్యటన ఎంతో మధురానుభూతిని ఇచ్చిందని అమెరికా, ఈజిప్ట్ దేశాలకు చెందిన పర్యాటకులు కొనియాడారు. శుక్రవారం వారు పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత సహకార సంఘం, దుకాణాలు, చేనేత గృహాలను సందర్శించి వస్త్రాలు, ఇక్కడి ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేశారు. పట్టుచీర కట్టుకుని, బొట్టుపెట్టుకుని అలరించారు. ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌లోని ఆయుర్వేద కేం ద్రాలు, చరిత్రక ప్రదేశాలు, ఆశ్రమాలను సందర్శించి ప్రజల జీవనశైలి, ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేశామని అమెరికాకు చెందిన బాలరీ లిబీ అన్నారు. ఇండియాలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలను మరెక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఈ బృందంలో ఈజిప్ట్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక అక్భార్ జర్నలిస్ట్ ఆహ్మద్‌నాశి, జాన్‌బిప్లర్ ఉన్నారు. వీరికి కేరళకు చెందిన స్నేహితుడు నవీన్‌రాజ్ మార్గదర్శకం చేశారు. -
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని షరాన్ మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియెల్ షరాన్ (85) శనివారం టెల్ హషోమర్లోని ఆస్పత్రిలో మృతి చెందారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. 2001లో ప్రధాని అయిన షరాన్, 2006లో అస్వస్థతకు లోనై, కోమాలోకి చేరుకునేంత వరకు పదవిలో ఉన్నారు. 2003లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. భారత్‌లో పర్యటించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని ఆయనే. -
న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా ఎంపిక