వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు భారత్ పర్యటనకు రానున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం అత్యంత శక్తివంతమైనది.
అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: ట్రంప్ మూడు గంటల పర్యటన ఖర్చెంతో తెలుసా..!
ఇందులోని సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్ ఫోర్స్ వన్ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం.
హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్ వన్‌పై దాడులు జరిగితే మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి'
Comments
Please login to add a commentAdd a comment