Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Alliance Govt By Vardhelli Murali1
గ్రేట్‌ ఆంధ్రా మ్యాజిక్‌ షో!

పీసీ సర్కార్‌ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్‌ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్‌ మ్యాజిక్‌ ట్రిక్స్‌ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్‌ ట్రిక్స్‌ మాత్రం ప్రజలను షాక్‌ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్‌ షో. అంతా మ్యాజిక్‌ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్‌ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్‌ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్‌ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్‌ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్‌ బిల్లుల భారంతో వేలాది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్‌ మ్యాజిక్‌ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్‌ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్‌ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్‌ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్‌’ గైడ్‌లైన్స్‌ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్‌ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్‌ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్‌ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్‌ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్‌ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్‌ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్‌ క్యాపి టల్‌ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్‌ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్‌’ ఈజ్‌ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్‌ ఎస్టేట్‌ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్‌ కోసం ఆయన ‘పీ–ఫోర్‌’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్‌’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్‌ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్‌ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్‌ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్‌ మేకోవర్‌ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్‌ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్‌ చానల్‌లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్‌ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

New Appointments In Ysrcp2
వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పునర్వ్యవస్థీకరణవైఎస్సార్‌సీపీలో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది. PAC శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, PAC కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.PAC మెంబర్లు1. తమ్మినేని సీతారాం2. పీడిక రాజన్న దొర3. బెల్లాన చంద్రశేఖర్4. గొల్ల బాబురావు, ఎంపీ5. బూడి ముత్యాలనాయుడు6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ7. పినిపే విశ్వరూప్8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ9. ముద్రగడ పద్మనాభం10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)13. వెలంపల్లి శ్రీనివాస్14. జోగి రమేష్15. కోన రఘుపతి16. విడదల రజిని17. బొల్లా బ్రహ్మనాయుడు18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ19. నందిగం సురేష్ బాబు20. ఆదిమూలపు సురేష్21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి23. కళత్తూరు నారాయణ స్వామి24.ఆర్కే రోజా25. వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎంపీ26. షేక్ అంజాద్ బాషా27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి28. అబ్దుల్ హఫీజ్ ఖాన్29. మాలగుండ్ల శంకర నారాయణ30. తలారి రంగయ్య31. వై.విశ్వేశ్వర రెడ్డి32. మహాలక్ష్మి శ్రీనివాస్33. సాకే శైలజానాథ్

Bengal Waqf Protests Turn Violence Court Orders Forces3
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించండివక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయంనిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.Shopping malls and shops are being looted in Shamsherganj, Murshidabad, in the name of peaceful protests against Waqf Amendment Act...Bangladeshi style of loot is happening....Is West Bengal steadily transforming to West Bangladesh ! pic.twitter.com/R2NmSNpo11— Sourish Mukherjee (@me_sourish_) April 12, 2025 Anyone has the right to PEACEFULLY protest against the Wakf law if they have a problem with it : NO ONE has right to resort to arson and violence in name of religion . West Bengal govt must come down hard on ALL involved. Spare NO ONE irrespective of community. In a surcharged… pic.twitter.com/t8IWRq0UD3— Rajdeep Sardesai (@sardesairajdeep) April 12, 2025

Rishabh Pant poor Form Continues in Ipl 20254
పంత్ నీవు ఇక మార‌వా.. రూ. 27 కోట్లు దండ‌గ! ఫ్యాన్స్ ఫైర్‌

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ పేలవ ఫామ్ కొన‌సాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎక్నా స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన పంత్ కేవ‌లం 21 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.4 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న పంత్‌.. ఆ త‌ర్వాత కూడా త‌న‌కు అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. ప్ర‌సిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పంత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రిషబ్‌.. 8 సగటుతో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన రిష‌బ్ పంత్ ఆట తీరుపై నెటిజ‌న్లు మండిపడుతున్నారు. సోష‌ల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ.27 కోట్ల దండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గ‌తేడాది జ‌రిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధ‌ర‌కు పంత్‌ను ల‌క్నో కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ ఏడాది సీజ‌న్‌లో పంత్ చేసిన స్కోర్లు..ఢిల్లీ క్యాపిటల్స్: 0 (6)సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 (15)పంజాబ్ కింగ్స్: 2 (5)ముంబై ఇండియన్స్: 2 (6)కోల్‌కతా నైట్ రైడర్స్: బ్యాటింగ్ చేయలేదుగుజరాత్ టైటాన్స్: 21 (18)ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. గుజ‌రాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 181 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ల‌క్నో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో పూర‌న్‌(61), మార్‌క్ర‌మ్‌(28) హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు.చ‌ద‌వండి: IPL 2025: సెన్సేషనల్ సుద‌ర్శ‌న్‌.. ఆరు మ్యాచ్‌ల‌లో 4 హాఫ్ సెంచ‌రీలు

Bandi Sanjay with Raja Singh Discussion Succefully Done5
రాజాసింగ్‌తో బండి సంజయ్‌ చర్చలు సఫలం

హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్ గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. అయితే గౌతంరావును గెలిపించడానికి కృషి చేస్తానని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ లైన్లలోనే పని చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కో ఆర్డినేషన్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గౌతంరావును అక్కడకు రప్పించి రాజాసింగ్ తో కరాచలనం చేయించారు బండి సంజయ్. దీనిలో రాజాసింగ్, గౌతంరావులు పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజాసింగ్‌కు బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీలో ఉండాలని బండి సంజయ్ పట్టుబట్టి మరీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లోనే తిష్టవేసిన బండి సంజయ్.. కార్పోరేటర్లతో కూడా సమావేశమయ్యారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలుగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ సందర్భంగా ముందుగా పాతబస్తీలోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి చేరుకునే క్రమంలో రాజాసింగ్‌.. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. కేటీఆర్ పై విమర్శలుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. హెచ్ సీయూ భూముల అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. కేటీఆర్ కళ్లు, చెవులు దొబ్బినాయ్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు. HCU భూముల కోసం కోట్లడింది మేము. ఎబివిపి కార్యకర్తలు ఇప్పటికీ జైల్ లో ఉన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Tamil Nadu CM MK Stalin Rips Into BJP AIADMK Alliance6
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్‌

చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్.

Hundreds Of Flights And Trains Cancelled Sandstorms Hit China7
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు

బీజింగ్‌: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్‌, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్‌ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్‌వే, హై-స్పీడ్‌ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025

Subramanian Swamy Is Serious About Tirumala Goshala Incident8
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్‌

సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్‌ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ చేశారు.Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.— Subramanian Swamy (@Swamy39) April 12, 2025టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్‌­సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్య­క్షుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్‌ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Director Arun Kumar Comments On Sethupathi Movie9
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్‌ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్‌ క్షమాపణ

సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్‌ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్‌ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం. దర్శకుడు అరుణ్‌ కుమార్‌ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్‌' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్‌ సేతుపతి రమ్య నంబీస్సన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్‌ డ్రామా హిట్‌ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్‌ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్‌ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్‌కుమార్‌ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్‌ స్టేటస్‌గా పోస్ట్‌ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్‌ సేతుపతి ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్‌ పద్మినియుమ్‌ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్‌ కుమార్‌ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్‌ కుమార్‌ వైఖరి నిజంగా మెచ్చదగింది. ఒక హిట్‌ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్‌చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి.

Actresses Lara Dutta and Pragathi empowering message on Menopause10
షేర్‌ చేసుకుందాం... కేర్‌ తీసుకుందాం

మెనోపాజ్‌ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్‌మెంట్‌ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్‌ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్‌ దొరికినప్పుడల్లా మెనోపాజ్‌ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్‌ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్‌ చేస్తున్న ఫేజ్‌. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్‌ ఏవీ మన కంట్రోల్‌లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్‌ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్‌ స్వింగ్స్‌ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్‌ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్‌ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్‌ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్‌ అంతగా హెల్ప్‌ చేయవని. ఫిజికల్‌ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్‌నిస్తుందని. అందుకే ఎక్సర్‌సైజ్, యోగాను లైఫ్‌ స్టయిల్‌ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్‌ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్‌ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్‌ లైఫ్‌ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్‌కమ్‌ సోర్స్‌ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్‌ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్‌ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్‌ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్‌ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్‌ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్‌ ప్లేస్‌లో డీల్‌ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్‌ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్‌ చేసిన తీరును షేర్‌ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్‌ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్‌ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్‌హుడ్‌ డెవలప్‌ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్‌ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్‌ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్‌ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్‌ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్‌ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్‌ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్‌ నటి.– శిరీష చల్లపల్లి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement