Top Stories
ప్రధాన వార్తలు

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
న్యూఢిల్లీ: భారత్ తన అంతరిక్ష యాత్రలో అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మూహూర్తం ఖరారైంది. భారత్ కు చెందిన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్((ఐఎస్ఎస్) లోకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో శుభాన్ష్ శుక్లా స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టే విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్ర సాంకేతికత మంత్రి డా. జితేందర్ సింగ్. ‘అంతర్జాతీయ స్పేష్ మిషన్ భారత వ్యోమగామిని తీసుకువెళ్లడానికి మూహూర్తం ఖరారు చేయబడింది . వచ్చే నెలలో ‘గగన్ యాత్రి’ గ్రూప్ కు కెప్టెన్ గా ఉన్న శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్నారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. ఇస్రో సరికొత్త హద్దులను ఛేదించడానికి ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష యాత్రకు సిద్ధంగా ఉన్నాడు.మన అంతరిక్ష కలలు మరింత ఎత్తును తాకడానికి ఈ సన్నాహక యాత్ర కచ్చితంగా మైలురాయి కాబోతుంది’ అని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. యాక్సియోమ్ 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన స్పేస్ క్రాఫ్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విటన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి పైలట్ గా శుభాన్ష్ శుక్లా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు ఉజ్ నాన్ స్కీ(పోలెండ్), టిబోర్ కపూ( హంగేరీ)లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన అనంతరం భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది. ఇస్రో వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ఐఏఎన్ఎస్ లోకి అడుగుపెడితే అక్కడకు వెళ్లిన తొలి భారతీయుడిగా, రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇస్రో మావనసహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్ష్ ఒకరుగా ఉన్నారు.

Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.

‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే న్యాయవ్యవస్థ జోక్యం అనేది కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజుల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవహరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు.

కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'కోపైలట్' (Copilot) తీసుకొచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలను అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తోంది. మొత్తం మీద ప్రశ్న మీది.. సమాధానం నాది అన్నట్టుగా ఈ కోపైలట్ యూజర్లకు ఉపయోగపడుతోంది.ప్రతి ప్రశ్నకు సమాధానం అందించే.. కోపైలట్ ఈ వేసవిలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.➢బడికి సెలవులు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులకు ఓ టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే.. పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. వారిని అదుపులో పెట్టడం కొంత కష్టమైన పనే. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే.. వారు బుద్ధిమంతుల్లా చెప్పినమాట వింటారు. మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రత్యమ్నాయం ఉండాలి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన, సులభమైన బొమ్మలు తయారు చేయడానికి, మంచి స్టోరీస్ కోసం 'కోపైలట్'ను ఉపయోగించుకోవచ్చు.➢పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతే.. వారి షెడ్యూల్ అక్కడ వేరుగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలో వారికి పాలుపోదు. తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంత సేపు ఆదుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టు ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు.➢వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి.. పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. వచ్చే విద్యాసంవత్సరానికి వెళ్లే విద్యార్థులను కూడా ఎలా సిద్ధం చేయాలనే బేసిక్స్ కూడా ముందుగానే కోపైలట్ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వొచ్చు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్‌కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?➢సమ్మర్ అంటేనే.. చాలామంది అకేషన్స్ లేదా వెకేషన్లకు వెళ్లిపోతుంటారు. దాదాపు చాలామంది లాంగ్ ట్రిప్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా పిల్లలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడంలో, ప్యాకింగ్ చెక్‌లిస్ట్‌లు, విహారయాత్రకు ప్లాన్ చేయడానికి కోపైలట్ ఓ సలహాదారుడిగా ఉపయోగపడుతుంది. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానాలు ఉంటాయి.కోపైలట్ అనేది టెక్నాలజీలో ఒక అద్భుతం. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అది ఇచ్చే సూచనలలో ఉపయోగకరమైన ఎంచుకోవాలి. ఇది మొత్తం యూజర్ మీదనే ఆధారపడి ఉంటుంది.

IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్‌రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31)

తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
హైదరాబాద్: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది.

భూ దందా.. జమ్మలమడుగులో ‘బాబాయ్-అబ్బాయ్’ రాజ్యాంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. తాము చెప్పిందే వేదమంటూ ప్రభుత్వ భూమిని టీడీపీ యువనేత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వివాదంలో బాబాయ్ ఎంట్రి ఇవ్వగా.. అది మరువక ముందే మరొక భూదందాకు అబ్బాయ్ తెరలేపారు. బాబాయ్, అబ్బాయ్‌లు కలిసి దోచేసుకుంటున్నారు.పెద్ద ముడియం మండలం పాపాయపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేయించిన టీడీపీ యువనేత.. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జాకు తెరతీశారు. ఎకరా రూ.6 లక్షల చొప్పున సదరు కంపెనీకి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.ఎన్వోసీలు తీసుకురావడం, చదును చేయడం అంతా మా పనేనంటున్న యువనేత.. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపెనీ అప్పనంగా అమ్మేస్తున్నారు. ఆ 500 ఎకరాల్లో పేదలకిచ్చిన డీకేటీ పట్టాలున్నా, వాటిపై కోర్టులో కేసు ఉన్నా టీడీపీ యువనేత పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని తహశీల్దార్ చెబుతున్నారు. తమ భూములను దౌర్జన్యంగా చదును చేస్తున్నారంటు డీకేటీ పట్టాదారులు వాపోతున్నారు.

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున్ సన్నాఫ్ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్,పృథ్వి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సాసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్విడుదల: ఏప్రిల్ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసేంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన అర్జున్ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్ మాఫీయా అర్జున్ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్ కమీషనర్‌గా శ్రీకాంత్ రావడంతో కథలో స్పీడ్ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్ కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్ చేసిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్ చీరను ధరించి స్పెషల్ లుక్‌లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్ అండ్ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్ అండ్ డైమండ్స్ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
చల్లటి కబురు!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
పెరుగుతున్న మత సమ్మతి
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
త్వరలో ఆర్థిక మాంద్యం!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
అమ్మా..ఊపిరాడలేదు!
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
ఇన్ఫోసిస్ డీలా
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
చల్లటి కబురు!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
పెరుగుతున్న మత సమ్మతి
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
త్వరలో ఆర్థిక మాంద్యం!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
అమ్మా..ఊపిరాడలేదు!
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
ఇన్ఫోసిస్ డీలా
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
సినిమా

కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
కార్లలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు పెట్రోల్ వాహనాలు ఉపయోగిస్తున్నప్పటికీ.. చాలామంది ఎలక్ట్రిక్ మోడల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయాడు. ఖరీదైన ఓ కారుని ఇప్పుడు తన గ్యారేజీలోకి తీసుకొచ్చేశాడు. రెహమాన్.. తెలుగు, తమిళ, హిందీతో సహా పలు భాషల్లో గత కొన్ని దశాబ్దాలుగా పాటలు స్వరపరుస్తున్నారు. తెలుగులోనూ రామ్ చరణ్ 'పెద్ది' పనిచేస్తున్నారు. సరే ఈ సంగతులంతా పక్కనబెడితే తాజాగా మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడల్ తోపాటు బీఎస్6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. ఇప్పుడు తాను కొన్న కారులోనూ డాల్బీ ఆట్మస్ సౌండింగ్ ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఇతడే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.రెహమాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. దాదాపు 29 ఏళ్లపాటు కాపురం చేసిన తర్వాత భార్య సైరాభానుకి కొన్నాళ్ల క్రితం విడాకులు ఇచ్చేశారు. కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్) View this post on Instagram A post shared by ARR (@arrahman)

ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్ గురించి బయటపెట్టాక ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఓ తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. దాదాపు 60 ఏళ్ల వయసులో డేటింగ్ ఉన్నానంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు.అయితే తాజాగా అమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి సందడి చేశారు. వారితో పాటు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సోఫీ షైన్ కూడా ఉన్నారు. చైనాలో జరిగిన రెండో మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో వీరు కనిపించారు. వీరితో పాటు అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నారు.గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్కాగా.. ఇటీవలే తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌కు మీడియాను పరిచయం చేశాడు. వీరిద్దరూ దాదాపు 25 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. బెంగళూరులో నివసించే గౌరికి గతంలోనే వివాహమై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా ఈ జంట చైనాలోని మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా కనిపించారు. కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందు డైరెక్టర్ కిరణ్ రావుతో జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నారు. అంతకుముందే రీనా దత్తాను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమీర్ సితారే జమీన్ పర్ మూవీలో కనిపించనున్నారు. చివరిసారిగా లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంతో విఫలమైంది.

జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
మలయాళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. కొన్నిరోజుల క్రితం 'ఎల్ 2:ఎంపురాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన గురించి పక్కనబెడితే కొడుకు ప్రణవ్(Pranav Mohanlal) గురించి ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ లాల్ కొడుకు కూడా హీరోనే. కాకపోతే చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. అతడి పేరు ప్రణవ్ మోహన్ లాల్. తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి నచ్చిన మలయాళ మూవీ 'హృదయం'లో హీరో ఇతడే. అయితే ఇదే చిత్రంలో నటించిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శినితో(Kalyani Priyadarshan) ఇతడు ప్రేమలో ఉన్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వినిపించేవి. కానీ అవి నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మలయాళ డైరెక్టర్ అల్లెప్పీ అష్రఫ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రణవ్ ఓ జర్మన్ అమ్మాయితో డేటింగ్(Pranav Girlfriend)లో ఉన్నాడు. కల్యాణితో కాదు. కల్యాణి ప్రియదర్శన్ తల్లి లిసీతో నేను మాట్లాడాను. ప్రణవ్-కల్యాణి అన్నాచెల్లి లాంటి వారని ఆమె చెప్పింది అని అన్నాడు.హీరోగా కంటే ప్రకృతి ప్రేమికుడిగా ప్రణవ్ ఫేమస్. ఎందుకంటే ఎప్పుడు దేశాలు తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయా ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం స్పెయిన్ టూర్ కి వెళ్లినప్పుడు అక్కడే ఓ పశువుల సాలలోనూ పనిచేశాడు. అయితే సదరు జర్మన్ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం)

విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న జనని అయ్యర్ నిశ్చితార్థం(Janani Iyer Engagement) చేసుకుంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు సాయి రోషన్ అనే పైలట్ తో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇంతకీ జనని ఎవరు? ఏయే సినిమాలు చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) తమిళనాడుకు చెందిన జనని అయ్యర్.. విశాల్ 'వాడు వీడు' సినిమాలో(Vaadu Veedu Movie) ఓ హీరోయిన్ గా చేసింది. ఇది తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు కాస్త పరిచయమే. దీని తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. కాకపోతే అవి తెలుగులో డబ్ కాలేదు.అయితేనేం అడపాదడపా సినిమాలు చేస్తున్న జనని.. ఇప్పుడు పెద్దల కుదిర్చిన పెళ్లికి రెడీ అయింది. ఏప్రిల్ 11న తన ఎంగేజ్ మెంట్ జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జంట చూడముచ్చటగా ఉంది. త్వరలోనే పెళ్లి ఎప్పుడు ఉండబోతుంది ఏంటనేది ప్రకటిస్తారు.(ఇదీ చదవండి: ఓర్నీ'పుష్ప 2' మొత్తం గ్రాఫిక్సే.. వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ ఈ సీజన్ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్‌తో భర్తీ చేసింది. బ్రెవిస్ ఈ సీజన్ మెగా వేలంలో 75 లక్షల బేస్ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్కే మేనేజ్మెంట్ అతనికి బంపరాఫర్ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్ సైన్ చేసుకుంది. వాస్తవానికి ఈ సీజన్లో సీఎస్కేకు ఓ ఓవర్సీస్ బెర్త్ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్‌మెంట్‌గా కాకుండానే బ్రెవిస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్‌ను ఈ సీజన్ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తారు. బ్రెవిస్ ఓవరాల్‌గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. బ్రెవిస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ బ్రెవిస్ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్ ఫామ్ కష్టాల్లో ఉన్న సీఎస్కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. ఈ సీజన్లో సీఎస్కే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్లో సీఎస్కే ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ చేరికతో సీఎస్కే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్లో సీఎస్కే బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు.

ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్‌మ్యాన్.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.గార్డెన్లో తిరిగేందుకు వచ్చారా?‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ‘‘ఆరోజు వైజాగ్‌లో మ్యాచ్. ఓవర్ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్‌కు వచ్చినట్లు గార్డెన్లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.అందుకే నాకు కోపం వచ్చిందికానీ వాళ్లేమో గ్రౌండ్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్ శర్మ జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.106 పరుగుల తేడాతో గెలుపుకాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్‌గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక భారత్‌కు పొట్టి ప్రపంచకప్ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్ క్రికెట్లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన రోహిత్ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!

‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
‘రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)- కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్ ద్రవిడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ వచ్చిన రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ తలపడింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఓవర్ సమయంలో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్ పరాగ్‌తో పాటు షిమ్రన్ హెట్‌మెయిర్‌ను రాయల్స్ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడిని సూపర్ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ డగౌట్లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025

MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!
బిజినెస్

భవిష్యత్తులో సివిలియన్ హెలికాప్టర్లకు గిరాకీ
భారత్‌లో వచ్చే ఐదేళ్లలో సివిలియన్ హెలికాప్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ అంచనా వేసింది. మెడికల్ ఎమర్జెన్సీలు, డిజాస్టర్ రిలీఫ్, లా ఎన్ఫోర్స్మెంట్, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఇందుకు కారణమని తెలిపింది. ఇది కీలకమైన సేవల కోసం హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని సూచిస్తుంది.ప్రస్తుత పరిస్థితులు ఇలా..దేశంలో ప్రస్తుతం 250 సివిల్ హెలికాప్టర్లున్నాయి. ఇది ప్రపంచ సివిలియన్ ఫ్లీట్‌లో సుమారు ఒకశాతంగా ఉంది. ఈ వాటా ప్రస్తుతానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్లకు అపారమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తుంది. కొండ రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధంభారత ప్రభుత్వం కూడా ఈ సర్వీసులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రాంతీయ హెలికాప్టర్ సేవలతో సహా సరసమైన విమాన కనెక్టివిటీని అందించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెలిపోర్టులను ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఎయిమ్స్ రిషికేశ్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఎయిర్‌బస్ హెచ్ 125 హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బందిని, రోగులను తరలిస్తున్నారు.

అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుమస్క్కు చెందిన శాటిలైట్ కమ్యునికేషన్ సిస్టమ్ స్టార్‌లింక్ కూడా భారత్‌లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). ఎందుకు.. ఏమిటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్‌ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.భారత్‌కు మంచి అవకాశాలుభారతదేశం ఈ ధోరణిలో పెద్ద అవకాశాలను కలిగి ఉందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వర్ధమాన పారిశ్రామికవేత్తలు, యువ పెట్టుబడిదారులు ఆశాజనకమైన, భవిష్యత్తు ఉన్న లోహాలపై దృష్టి సారించి ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాపర్, ఇతర ముఖ్యమైన ఖనిజాలను ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్‌ను ప్రారంభించాలని కూడా ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనులను పునరుద్ధరించడం ఆ లోహానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారతదేశంలో బంగారం ధరలు గురువారం (ఏప్రిల్ 17) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.98,170 పలికింది. ప్రపంచవ్యాప్త డిమాండ్‌తో బంగారం ధరలు పెరిగిపోయి పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోతున్న క్రమంలో అగర్వాల్ భవిష్యత్‌లో కాపర్‌ను పెట్టుబడి ఎంపికగా గుర్తించారు. ఇది ఆర్థిక వృద్ధికి, ఆరోగ్యకరమైన పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని అన్నారు.కాపర్‌కు గల ఈ పునరుద్ధరణ భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప లాభాలను తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు పర్యావరణ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అగర్వాల్ ఈ విషయంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా భారతదేశం కాపర్ రంగంలో స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రస్థానం భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025

రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరినొకరు కమ్యునికేట్ అవ్వడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్మార్ట్ఫోన్లు చాలా అవసరం. అయితే ఈ రంగంలో నిత్యం కొత్త కంపెనీలు విభిన్న మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన ఫోన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది. కొన్ని సంస్థలు అందించిన వివరాల ప్రకారం రూ.10,000లోపు ధర ఉన్న టాప్ 10 మొబైళ్ల వివరాలు కింది తెలియజేశాం.ఇదీ చదవండి: ఫెడ్ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరికఐటెల్ కలర్ ప్రో 5జీ: 6.6 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్(ఎంపీ కెమెరా).ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (ఆక్టాకోర్, 2.4గిగాహెర్ట్జ్) ప్రాసెసర్.పోకో సీ 71: 6.88 అంగుళాల డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.పోకో ఎం7 5జీ: స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.మోటో జీ35 5జీ: 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, యూనిసోక్ టీ760 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.రెడ్ మీ ఏ4 5జీ: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.వివో వై18టీ: యూనిసోక్ టీ612 చిప్సెట్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఒప్పో ఏ3ఎక్స్ 4జీ: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.టెక్నో స్పార్క్ 30సీ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఫ్యామిలీ

Good Friday మనిషి కొరకు దైవపుత్రుడే...
క్రీస్తును శిలువ వేసిన రోజు శుక్ర వారం. అయితే ఆ శిలువ ద్వారా మానవాళికి మహత్తర సందేశం అందిన రోజుగా పవిత్ర శుక్రవా రంగా అది పరిగణింపబడింది. అందుకే ఇది ‘గుడ్ ఫ్రైడే’గా పేరొందింది. క్రైస్తవ సమాజంలో ఇది ప్రాముఖ్యం కల్గిన రోజు. ప్రభువు మరణంలో, ఒక మనిషి మరో మని షిని ప్రేమించాలి అనే సందేశం ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రేమతోనే సాటి మనిషిని క్షమిస్తాడు. తోటి మనిషి పట్ల సహనం ప్రదర్శిస్తాడు. అదే ప్రేమతో సాటివానికి సాయం చేస్తాడు. ప్రభువంతటి గొప్పవాడే ఏకంగా మనిషి కోసం మరణించాడే, మరి నేనేమి చేస్తున్నాను? అని ప్రతి వ్యక్తీ ప్రశ్నించుకుంటాడు. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ప్రాముఖ్యం ఉంది. వీటినే మరో రీతిగా చెప్పుకోవలసి వస్తే, జననం, మరణం, పునరుత్థానం అని వివరించు కోవాలి. జనన పునరుత్థానాల్లో దైవిక భావన కనిపిస్తోంది. కానీ మర ణంలో మాత్రం అచ్చంగా మానవీయత కనిపిస్తోంది. మానవీయ గుణగణాల కలబోత అది. మిగిలిన రెండు పండుగలకూ సమన్వయం చేకూర్చి, క్రీస్తు తత్త్వానికి పరిపూర్ణత్వాన్ని అందించిన రోజు ఇది.క్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు ఇది. ఎన్నో అద్భుతాలు చేసిన క్రీస్తుకు ఈ మరణం నుంచి తప్పించుకోవడానికీ, అసలు తనకు ఆ మరణమే ఎదురుపడకుండా చేసుకోగల శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ తండ్రి దేవుని మాటకు విధేయత చూపి మరణాన్ని ఆహ్వానించడంలో గొప్ప సందేశం కనిపిస్తోంది. వాస్తవానికి తప్పు చేసిన మానవుణ్ణి ఈ మరణమే మాటి మాటికీ హెచ్చరిస్తోంది. ఎన్ని ఫ్రైడేలు లేవు? కానీ, ఇది జనహితం కలిగించిన శుభకరమైన శుక్రవారం. ఇదే క్రీస్తు పవిత్రతను చాటిన పవిత్ర శుక్రవారంగా కూడా పిలువబడుతోంది. క్రైస్తవులు తెల్లటి వస్త్రాలు ధరించి ఈ రోజంతా చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. తమ పాపాలే ఈ రకంగా క్రీస్తును శిలువ వేసి మరణానికి గురిచేశాయి అనే పశ్చాత్తాప బాధతో ఉంటారు. ఇక మీదట తప్పిదాలు, దగా – మోసాలు చేయకుండా కొత్త జీవన విధానంతో ముందుకు సాగిపోతారు. క్రీస్తు మరణం విషాద భరితం. దుఃఖ పరివేదనం. అయినా ఆత్మ ప్రక్షాళనం చేసే చావు కేక. అది మానవుణ్ణి ప్రతి క్షణం మేల్కొల్పుతుంది. – డా.దేవదాసు బెర్నార్డ్ రాజు(నేడు ‘గుడ్ ఫ్రైడే’)

World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్‌మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్‌లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్‌పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)

గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. )

శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు..
పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్ ఆర్ట్ క్యాంప్ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్‌లు వేసి ఆర్థికంగా సంపాదిస్తున్నారు. కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్ ఆర్ట్ క్యాంపులో పాల్గనవచ్చు. చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు తెలుపుతున్నారు. కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు.. సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు. – సంతోష్, అధ్యాపకుడు, సంస్కృత భాష మధుబని పెయింటింగ్‌లో శిక్షణ మధుబని పెయింటింగ్‌ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. – రాజేశ్, మధుబని పెయింటింగ్ అధ్యాపకుడు ఆసక్తి గలవారు 8886652030,8886652004లలో సంప్రదించగలరు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. మొత్తం 9 అంశాలలో శిక్షణ (చదవండి: హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.

భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్‌కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు.

భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్‌డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్‌క్లోజర్‌లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

బీజేపీ నూతన చీఫ్ ఎంపిక వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ అగ్ర నాయకత్వం వేగవంతం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షు ల ఎంపికను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసేందుకు అగ్రనేతలు విస్తృత సంప్రదింపులు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మూడు గంటల పాటు కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ లు పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్, సంతోష్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత అమిత్ షా, నడ్డా విడిగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించడంతో పాటు ఈ నెల 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్టీ జాతీయ ఎన్నికల అధికారి తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే ప్రణాళికతో పార్టీ ముందుకెళ్లనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత భేటీలో ఐదారుగురు నేతల పేర్లే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీఎల్ సంతోశ్ తో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2020 ఫిబ్రవరిలో నడ్డా తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. పరిమిత మూడేళ్ల కాలం పూర్తయ్యాక కూడా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. దాంతో ఇప్పటికీ ఆయనే అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన బీజేపీ ఇప్పటివరకు 15 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించింది. ఏప్రిల్ 19 లేదా 20వ తేదీన మరో ఆరేడు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తోంది. పార్టీ సొంత నియమనిబంధనావళి ప్రకారం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్షుల ప్రకటన తర్వాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రేసులో పురందేశ్వరి, మాధవ్, పార్థిసారధి రెడ్డిల పేర్లపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ పాత్ర సైతం ఉంటుందని తెలుస్తోంది. బిహార్‌లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగొచ్చు. పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు ఉండొచ్చు. ఈ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో కమలదళ సారథుల ఎంపిక కొనసాగనుంది.

ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సైనిక బంకర్
బెంగళూరు: భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్‌ను లేహ్‌లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్‌ను పోతపోయడం విశేషం. అప్పటికప్పుడు తయారుచేసిన ప్రత్యేక కాంక్రీట్ మిక్సర్‌ను ముందే డిజైన్ చేసిన విధంగా 3డీ విధానంలో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇండియన్ ఆర్మీ తరఫున అరుణ్ కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)హైదరాబాద్‌తోపాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ సాంకేతికతలు, ఉత్పత్తుల అంకుర సంస్థ సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా ‘ప్రబల్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బంకర్‌ను నిర్మించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తు, అత్యల్ప ఆక్సిజన్(హ్యాలో) పరిస్థితుల్లో ప్రపంచంలో నిర్మించిన తొలి బంకర్ ఇదేనని ప్రబల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ‘‘అత్యంత మారుమూల ప్రదేశానికి ఈ ప్రింటర్‌ను తీసుకురావడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇంత ఎత్తులో దాదాపు కేవలం 40–50 శాతం ఆక్సీజన్ అందుబాటులోనే మేం, మా ప్రింటర్ పనిచేయాల్సి వచ్చింది. శత్రుసైన్యం బుల్లెట్లను తట్టుకునేలా అధునాతన డిజైన్‌లో పటిష్టంగా, పరిసరాల్లో కలిసిపోయే రంగులో బంకర్‌ను నిర్మించాం’’ అని ఆయన వెల్లడించారు. గతంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెండ్ హిందూ ఆలయాన్ని సైతం ఇదే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నిర్మించింది.

వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు.

మూడో రోజూ ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయనను ఆరు గంటలపాటు ప్రశ్నించి, స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొత్తం మూడు రోజుల్లో 16 గంటలపాటు వాద్రాను ప్రశ్నించడం గమనార్హం. మూడో రోజు తన భార్య ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై రాజకీయ క్షుద్ర వేట జరుగుతోందని ఆరోపించారు. రాబర్ట్ వాద్రాపై ఈడీ త్వరలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

వన్ వే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న చెరువుమట్టి టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరు నుంచి చెరువు మట్టిని రంగాపూర్ ఇటుకబట్టీకి తరలిస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత కొందరిని ఇళ్లకు పంపించారు. కండక్టర్ కూకట్ల శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే ప్రమాదంపెద్దపల్లిలోని శాంతినగర్ నుంచి అప్పన్నపేట వరకు రాజీవ్ రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. వాహనాలను వన్ వే లో నడిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ నాగేందర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగిందని కమాన్‌పూర్ ప్రాంత ప్రయాణికుడు సదయ్య తెలిపాడు. ప్రమాదంలో 27మంది గాయపడగా 22 మంది మహిళలే ఉన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెండ్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశం పర్యవేక్షించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలుపెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణీకులకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్షతగాత్రులు వారి బంధువులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ మరో 10 మంది వైద్యబృందం అందుబాటులో ఉంటూ బాధితులకు మెరుగైన సేవలందిస్తారని పేర్కొన్నారు.

వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు.

విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. సాక్షి టీవీతో బాధితురాలుఅలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు.