Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Another Grand Palace At Capital Amaravati1
చంద్రబాబు మరో మహా ప్యాలెస్‌

సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరా­బాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్‌మ­నేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్‌..! వీటికి­తోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజ­ధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కా­లిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్‌ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పు­న ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్‌ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకు­ముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతం హైటెక్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూ­డలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్‌ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్న­మాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంత­మైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్‌ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్‌ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్ర­బాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్‌ రాజభవనం నిర్మా­ణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగ­పూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్‌ జగన్‌ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూ­డలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణా­నికి పూను­కున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజ­లను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటి­కప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

More Policemen Affected by the Red Book Constitution in Andhra Pradesh2
ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి

గుంటూరు,సాక్షి: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసినా సరే.. ముసుగు వేయలేదంటూ పోలీసులుపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా ఆదేశాలతో పదకొండు మంది పోలీసులపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. శనివారం ఎస్పీ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్ మీట్‌లో హాజరు పరచేందుకు పోలీసులు ప్రయత్నించారు.అయితే, నేను ముసుగు వేసుకొను అని గోరంట్ల మాధవ్ పోలీసులు తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరు పరచలేదని ఎస్పీని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్‌మీట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సీతారామయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆకస్మితంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో పదిమంది పోలీసుల పైన వేటు పడింది. అరండల్ పేట సీఐ వీరాస్వామితో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశించింది.

Mudragada Padmanabham Letter To YS Jagan Mohan Reddy3
వైఎస్‌ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ

కాకినాడ,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు.

Blasting Centuries: Abhishek Sharma In IPL, Mohammad Rizwan And James Vince In PSL]4
ఒకే సమయంలో విధ్వంసకర శతకాలు.. ఐపీఎల్‌లో అభిషేక్‌.. పీఎస్‌ఎల్‌లో రిజ్వాన్‌, విన్స్‌

క్రికెట్‌ అభిమానులు శనివారం (ఏప్రిల్‌ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్‌ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్‌ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్‌ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్‌.నిన్న సాయంత్రం సన్‌రైజర్స్‌, పంజాబ్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో మరో సూపర్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌.. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (63 బంతుల్లో 105 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో షాయ్‌ హెప్‌ 8, ఉస్మాన్‌ ఖాన్‌ 19, కమ్రాన్‌ ఘులామ్‌ 36, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ 44 పరుగులు (నాటౌట్‌) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్‌ అలీ, అబ్బాస్‌ అఫ్రిది, ఖుష్దిల్‌ షా తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్‌ విన్స్‌ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్‌ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌ (12) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. టిమ్‌ సీఫర్ట్‌ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్‌ బౌలర్లలో అకీఫ్‌ జావిద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌, ఉసామా మిర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Is Chiranjeevi Convince Tamannaah Bhatia to Announce Breakup with Vijay Varma5
తమన్నా-విజయ్‌ బ్రేకప్‌.. సలహా ఇచ్చిన చిరంజీవి?

మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా (Tamannaah Bhatia)- విజయ్‌ వర్మ (Vijay Varma) కొంతకాలం క్రితమే బ్రేకప్‌ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు షాకయ్యారు. అయితే ఈ బ్రేకప్‌ను బాహాటంగా ప్రకటించమని మెగాస్టార్‌ చిరంజీవి సలహా ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.చిరంజీవి సలహారిపబ్లిక్‌ వరల్డ్‌ కథనం ప్రకారం.. ఈ ఏడాది తమన్నా- విజయ్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి తండ్రి ఆరా తీయగా తమన్నా నిరాసక్తత చూపించింది. తనకు ఇష్టం లేదని తెలిపింది. విజయ్‌ తనకు కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. అతడి ఒత్తిడి వల్లే మీడియా ముందు పలుమార్లు జంటగా కలిసి కనిపించామని బాధపడింది. మరి.. ఈ బ్రేకప్‌ వార్తను జనాలకు ఎలా చెప్పగలవు? అని పేరెంట్స్‌ అడగ్గా.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకుని బ్రేకప్‌ న్యూస్‌ను మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.చిరంజీవి జోక్యం నిజమా?ఇది చూసిన నెటిజన్లు.. వాళ్లిద్దరి మధ్యలో చిరంజీవి ఎందుకు జోక్యం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మేట్లుగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో బ్రేకప్‌ను దాచడం వల్ల ఒరిగేదేముంది.. ఉన్న విషయం బయటకు చెప్పమని చిరు సలహా ఇచ్చినట్లున్నాడు.. అందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి

BJP Slams TMC MP Yusuf Pathan Insta Post6
యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ ఫైర్‌.. కొంచమైనా సిగ్గుగా లేదా? అంటూ..

కోల్‌కతా: వక్ఫ్‌ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు మృతిచెందగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో రెండ్రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.కాగా, మాజీ టీమిండియా క్రికెటర్, టీఎంసీ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటైన బహరంపూర్ నుండి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా మరికొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు.బెంగాల్‌ దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ Instagram‌ వేదికగా తన ఫొటోలను షేర్‌ చేశారు. ఆయన కాఫీ తాగుతున్న ఫొటో ఒకటి కాగా.. దర్జాగా, ఉల్లాసంగా ఉన్న మరో ఫొటోను షేర్‌ చేశారు. దీంతో, ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం, పఠాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారి ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Yusuf Pathan (@yusuf_pathan) ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘బెంగాల్‌ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉండగా.. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు! ఇంతలో యూసుఫ్ పఠాన్.. ఒక ఎంపీగా ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్‌ కాంగ్రెస్‌ అంటే అని’ ఘాటు విమర్శలు చేశారు. యూసుఫ్‌ పోస్టుపై అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటనలపై కలకత్తా హైకోర్టులో శాసనసభ విపక్షనేత సువేందు అధికారి పిటిషన్‌ దాఖలు చేశారు. శనివారం సెలవైనా అత్యవసర విచారణ జరపడానికి జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ ధర్మాసనం ఆదేశించింది. పరిణామాలపై తాము కళ్లు మూసుకోలేమని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ వ్యాఖ్యానించారు. వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. Bengal is burningHC has said it can’t keep eyes closed and deployed centra forcesMamata Banerjee is encouraging such state protected violence as Police stays silent! Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered… This is TMC pic.twitter.com/P1Yr7MYjAM— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025

PM Modi Pays Tribute To Jallianwala Bagh Massacre7
Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్(Jallianwala Bagh) హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటి(ఏప్రిల్‌ 13)తో జలియన్‌వాలా బాగ్‌ ఘటనకు 105 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ తదితరులు జలియన్‌వాలా బాగ్‌ అమరులకు నివాళులు అర్పించారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ జలియన్‌వాలా బాగ్‌ ఘటనలో వీరుల త్యాగం మనలో దేశభక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి ఏటా ఏప్రిల్ 13న ‘జలియన్‌వాలా బాగ్ దివస్’ జరుపుకుంటారు. 1919లో జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వలస పాలనలో భారతీయుల విషయంలో జరిగిన అత్యంత క్రూరమైన దాడులలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. నాడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar)లోని జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌లో బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు నిరాయుధ ప్రదర్శనకారులపై సైనికులు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో వెయ్యిమందికిపైగా జనం ‍ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ హత్యాకాండ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమం బలపడింది. జలియన్‌వాలా బాగ్‌ ఘటన బ్రిటిష్ వలస పాలకుల క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: సియాచిన్‌ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్‌ విజయం

Full Traffic Jam On Srisailam Saleshwaram Road8
శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. సలేశ్వరంలో భక్తుల సందడి

అమ్రాబాద్‌: వరుస సెలవుల కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో రద్దీగా మారింది. సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో, సలేశ్వరానికి వెళ్లే మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది. టోల్‌గేట్‌ వద్ద ఛార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు భారీ సంఖ్యలో​ బయలుదేరారు. ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద చార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో, 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్‌ క్రాస్‌ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.Situation at saleshwaram jathara pic.twitter.com/37j3IcqLjf— 🚘 𝐊𝐂𝐑_𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 🌈™🚘 (@KCR_Vidheyudu) April 13, 2025ఇదిలా ఉండగా.. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను భక్తులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. Yesterday #Saleshwaram was crowded with devotees. If you’re planning to visit, please plan accordingly. I’d suggest avoiding taking kids along, if possible. https://t.co/QckyDl4udO pic.twitter.com/TWHB1i9Wqo— Rudra🚩 (@Mee_Rudra) April 13, 2025

Why Apple manufactures iPhones outside the US?9
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికంగా తయారీని పునరుద్ధరించడానికి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వంటి దేశాల్లో భారీగా తయారవుతున్న యాపిల్‌ వంటి అమెరికన్‌ కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కంపెనీ కూడా చాలాకాలంగా ఈమేరకు సుంకాల నుంచి మినహాయింపు కావాలని యూఎన్‌ను కోరుతుంది. దాంతో అమెరికా ఇటీవల ఫోన్లు, కంప్యూటర్లను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అసలు యాపిల్‌ కంపెనీ తన ఉత్పత్తులను ఎందుకు యూఎస్‌లో తయారు చేయదో నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికాలో ఐఫోన్ల తయారీ అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ సహా సిలికాన్ వ్యాలీలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులు పాల్గొన్నారు. అందులోని సారాంశాన్ని 2012లో న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో మరణించడానికంటే కొన్ని నెలల ముందు ఈ సమావేశం జరిగింది. అందులో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతున్న సమయంలో అమెరికాలో ఐఫోన్లు తయారు చేయడానికి ఏమి కావాలని ఒబామా ఒక ప్రశ్న అడిగారు. దానికి స్పందించిన స్టీవ్‌జాబ్స్‌ నిర్మొహమాటంగా యాపిల్‌ తయారీకి యూఎస్‌ కంటే ఇతర దేశాలే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: డజను మంది మాజీ ఉద్యోగులు న్యాయపోరాటంయాపిల్ ఇతర దేశాల్లో ఉత్పత్తులను తయారు చేసేందుకు గల కొన్ని కారణాలను మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైనా వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇందులో నైపుణ్యం కలిగిన కార్మికులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాయి. యూఎస్‌లో లేబర్‌, ఉత్పత్తి ఖర్చులు ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. అమెరికాలో ఐఫోన్లు తయారైతే వాటి ధర మూడింతలు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కూడా ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి కంపెనీల ద్వారా యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

Excessive Sweating Symptoms Causes And Treatment10
తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..?

చెమట పట్టడం అందరిలో కనిపించే ఓ జీవక్రియ. వాతావరణంలో వేడిమి పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా దేహ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు చెమటలు పట్టి... అవి దేహంలోని ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి కావడంతో దేహం చల్లబడుతుంది. ఇదే పని వ్యక్తులు శారీరక శ్రమ చేసినప్పుడూ, బాగా ఆటలాడినప్పుడూ జరుగుతుంది. అంతేకాదు... బాగా ఆందోళనకు గురైనప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది మానవ మనుగడకు ప్రకృతి చేసిన ఏర్పాటు. కొందరిలో అతిగా చెమటలు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు తెలిపే కథనమిది. మనుషుల్లో ఎక్రైన్‌ అలాగే అపోక్రైన్‌ గ్లాండ్స్‌ అనే రెండు రకాల గ్రంథులుంటాయి. వీటిల్లో ఎక్రైన్‌ గ్లాండ్స్‌ అనే చెమట గ్రంథులు పుట్టినప్పటి నుంచీ ఒంటి నిండా వ్యాపించి ఉంటాయి. అయితే అపోక్రైన్‌ గ్రంథులనేవి బాహుమూలల్లోనూ, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర ఉండి, కొంతకాలం తర్వాత (అంటే ముఖ్యంగా యుక్తవయసుకు వచ్చాక) అవి క్రియాశీలమవుతాయి. అందుకే చిన్నప్పుడు కాకుండా యుక్తవయసుకు వచ్చాకే బాహుమూలాల్లోనూ, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర చెమట పట్టడం మొదలవుతుంది. చెమటలు పట్టడం కొందరిలో మరీ ఎక్కువ...కొందరిలో చెమట పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలూ ఎదురవుతాయి. కొందరిలో అరికాళ్లు తేమగా అవుతుంటాయి. మరికొందరిలో అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడంతో ఏది పట్టుకున్నా తడిసిపోవడం, జారిపోవడం కూడా జరుగుతుంటుంది. ‘హైపర్‌ హిడరోసిస్‌’లో మళ్లీ రెండు రకాలు. అవి... జనరలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌ (దేహమంతటా విపరీతంగా చెమటలు పట్టడం) లోకలైజ్‌డ్‌ హిడరోసిస్‌ (దేహంలోని కొన్ని చోట్లలోనే చెమటలు ఎక్కువగా పట్టడం). జనరలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌కి కారణాలు... చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నందున చెమటలు పట్టడం పెద్దగా జరగదు. కానీ వేసవిలో... అందునా మార్చినుంచి వాతావరణంలో వేడిమి పెరగడంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చెమటలకు మరికొన్ని కారణాలు... విపరీతమైన దేహశ్రమ లేదా వ్యాయామం తర్వాత వైరల్‌ ఫీవర్స్, మలేరియా, క్షయ వంటి జబ్బులతో జ్వరం వచ్చి తగ్గాక గుండెకు సంబంధించిన వ్యాధుల్లో అంటే షాక్, హార్ట్‌ ఫెయిల్యూర్స్‌లో ఎండోక్రైన్‌ లేదా హార్మోనల్‌ డిజార్డర్స్‌లో (అంటే హైపర్‌ పిట్యుటరీజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్‌కసులినోమా, డయాబెటిస్‌ వంటి సమస్యల్లో) లింఫోమా, కార్సినాయిడ్‌ సిండ్రోమ్‌ వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో గర్భిణుల్లో అలాగే మెనోపాజ్‌కు దగ్గరవుతున్నప్పుడు స్థూకాలయం ఉన్నవారిలో మద్యం తాగాక ఫ్లూయాక్సిటిన్‌ వంటి మందులు వాడుతున్నప్పుడు పార్కిన్‌సన్స్‌ జబ్బులున్నవారిలో, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్‌ సమస్యలున్నవారిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.లోకలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌ రకాలు... ఎమోషనల్‌ ఆర్‌ ఎసెన్షియల్‌ హైపర్‌ హిడరోసిస్‌ : తీవ్రమైన ఉద్విగ్నత ఉన్నప్పుడు లేదా ఉద్వేగాలు లేదా భయాలకు లోనైనవారిలో అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుండటం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే యాగ్జిలరీ హైపర్‌ హిడరోసిస్‌ : బాహుమూలాల్లో చెమటలు పట్టడం ∙గస్టెటరీ హైపర్‌ హిడరోసిస్‌ : బాగా వేడివీ లేదా బాగా ఘాటైన మసాలాలతో కూడిన ఆహారాలు తీసుకుంటున్నప్పుడు కొందరిలో పెదవుల చుట్టూ లేదా ముక్కు మీద, నుదుటి మీద, తలలో విపరీతంగా చెమటలు పట్టడం పోశ్చరల్‌ లేదా ప్రెజర్‌ హైపర్‌ హిడరోసిస్‌ : కుర్చీల్లో కూర్చున్నప్పడు లేదా సీట్‌కు అనుకుని ఉన్న శరీరభాగమంతా చెమటలు పట్టడం వంటి రకాలు కూడా చూడవచ్చు ఎమోషనల్‌ లేదా ఎసెన్షియల్‌ హైపర్‌ హిడరోసిస్‌ : ఉన్నవాళ్లలోనూ కాస్త వైవిధ్యమైన లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కొందరిలో అరచేతులు, అరికాళ్లలో మాత్రమే చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి లక్షణాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి కొందరిలో వేసవిలో అరచేతుల్లో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంతో చేతుల్లోని వస్తువులు తడిసిపోవడం, జారిపోవడం జరుగుతుండవచ్చు. అలాగే కాళ్ల నుంచి చెమటలు కారుతున్నప్పుడు వాళ్ల అరికాళ్ల గుర్తులు నేల/గచ్చు మీద కనిపిస్తుంటాయి. కొందరిలో చెప్పులూ జారిపోవచ్చు ఇంకొందరిలో పగటిపూట చాలా ఎక్కువగానూ, రాత్రుళ్లు తక్కువగానూ, నిద్రలో పూర్తిగా లేకుండానూ ఉండవచ్చు. లేదా మరికొందరిలో దీనికి పూర్తి భిన్నంగా ఉండవచ్చు.ఇలా చెమట పట్టేవారిలోనూ రెండు రకాలుగా చెమటలు పట్టవచ్చు. అవి... కంటిన్యువస్‌ స్వెటింగ్‌ : చెమటలు నిరంతరమూ ధారాపాతంగా పడుతుండవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.ఫేజిక్‌ స్వెటింగ్‌ : ఏ చిన్న పనిచేసినా లేదా ఏ చిన్నపాటి ఒత్తిడికి గురైనా అప్పడు మాత్రమే కంటిన్యువస్‌గా చెమటలు పడతాయి.అరచేతులూ... అరికాళ్లలో చెమటలతో సమస్యలిలా... పిల్లల్లో ఇలా చెమట పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమటలు ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగి΄ోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలు సాధారణంగా చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు టెన్నిస్, క్రికెట్‌ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్‌ లేదా టెన్నిస్‌ రాకెట్‌ జారి΄ోతుంటాయి∙ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం నలుగురు కలిసే సోషల్‌ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం లేదా నిర్భయంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేకపోవడం కొందరిలో నడుస్తుండగానే చెప్పులు / పాదరక్షణలు జారిపోవడం (ఇలాంటివారు షూ వేసుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనమే ఉంటుంది. అయితే విపరీతమైన చెమటల కారణంగా వారి మేజోళ్లు తడిసి΄ోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన పొడి మేజోళ్లు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటలు, మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి.. కాంటాక్ట్‌ డర్మటైటిస్‌: చర్మానికి సంబంధించిన అలర్జీలు రావడం ∙పామ్‌ఫోలిక్స్‌ : చర్మంపై చిన్న చిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం పిట్టెడ్‌ కెరటోలైసిస్‌ : చర్మానికి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడం డర్మటోఫైటోసిస్‌: చర్మంపై ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడం.చికిత్సలు... చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గి΄ోతుంది. తగ్గకపోతే ఈ కింది సూచనలు/చికిత్సలు అవసరమవుతాయి. యాంటీ పెర్‌స్పెరెంట్లు : ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫార్మాల్‌డిహైడ్, గ్లూటరాల్‌ డిహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్‌ హెగ్జాహైడ్రేట్‌... వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. యాంటీ పెర్‌స్పిరెటంట్లు ఎక్కువగా లేదా డాక్టర్‌ సలహా లేకుండా వాడటం వల్ల కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ అనే అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ డియోడరెంట్లు : ఇవి చెమటను తగ్గించవు, నిరోధించవు. కానీ చెమట వల్ల దుర్వాసనను కొంత తగ్గిస్తాయి. అయాన్‌ ఫోరోసిస్‌ : ఇదికరెంట్‌ ద్వారా చేసే చికిత్స బొట్యులినమ్‌ టాక్సిన్‌ : ఇదో రకం విషం. ఇంజెక్షన్‌ సహాయంతో చేసే చికిత్స ఇది శస్త్రచికిత్స : సింపాథెక్టమీ అనే సర్జరీ. (ఇటీవల దీన్ని ఎక్కువగా సిఫార్సు చేయడం లేదు. దీంతో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నందున అంతగా ప్రోత్సహించడం లేదు).జాగ్రత్తలు... రోజూ స్నానం చేయాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచిది ∙మాయిష్చరైజర్‌ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్‌ సబ్బులు వాడటం మంచిది చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్‌ / నూలు దుస్తులు ధరించడం మేలు ఎప్పటికప్పుడు బాగా ఉతికిన, శుభ్రమైన బట్టలనే ధరిస్తుండాలి. (చదవండి: ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్‌ చెయ్యొచ్చా..?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement