Top Stories
ప్రధాన వార్తలు

రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.

కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(APFDC) మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్‌లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులవారీపల్లి పీఎస్‌కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది.

విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్‌కు భారీ షాక్!

ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
వరుస తగ్గుదల తరువాత.. కొంచెం పెరిగిన బంగారం ధర ఈ రోజు (ఏప్రిల్ 10) ఊహకందని రీతిలో పెరిగింది. ధరల పెరుగుదలలో బహుశా ఇదే అల్‌టైమ్ రికార్డ్ అనే తెలుస్తోంది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2940 పెరిగి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రూ. 2700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2940 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.ఇదీ చదవండి: రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,04,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 95,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల)కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లను ఆహ్వానించారు. వీరితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపించి వేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు)లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక, తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేసినా, పోస్టులు పెట్టినా వారికి వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని బాంబు పేల్చింది.అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని గ్రూపులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ క్రమంలో సదరు గ్రూపులకు ఎవరైనా మద్దతు తెలిపినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని తెలిపింది. కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్‌ను ప్రతికూలంగా పరిగణిస్తామని హచ్చరికలు జారీ చేసింది. అలాగే, హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఇదే సమయంలో ఒక విదేశీయుడు ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలు, ఇతర వ్యతిరేకవీసా, గ్రీన్ కార్డ్ రద్దు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. వారు తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. స్టూడెంట్ వీసాలు (ఎఫ్ -1, జే-1 మొదలైనవి), గ్రీన్ కార్డు దరఖాస్తులు, వర్క్ పర్మిట్లు, వీసా పొడిగింపులతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం వచ్చింది.#NEW: U.S. Citizenship and Immigration Services (USCIS) will now start screening social media of any migrants for anti-semitism land any antisemitic activity the physical harassment of Jewish individuals will now be grounds for denying immigration benefit requests. This will…— Brooke Taylor (@Brooketaylortv) April 9, 2025ఇదిలా ఉండగా.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.వీసా రద్దయితే అక్రమంగా ఉంటున్నట్లే..అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధికశాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్టు అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాఖీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, హెచ్1బీపై ఉద్యోగం చేయడానికి.. అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు.

Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్.. తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో తెలియజేస్తూ.. యావరేజ్ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రాక్షని రాయల్‌గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్‌లైనర్‌తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్ మిక్స్ వీక్ రైటింగ్, స్క్రీన్‌ప్లే కారణంగా ఫెయిల్ అయింది. సిద్దు హార్డ్ వర్క్ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్ గురించి మర్చిపోవాలి. విజువల్స్ కూడా పూర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన్ ట్వీట్ చూస్తూ 2 రేటింగ్ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025

చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
న్యూఢ్లిల్లీ: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అందిస్తున్న కీలక ట్రాన్స్షిప్మెంట్ (Transshipment) సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని భారత్ 2020లో బంగ్లదేశ్‌కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.భారత ఎగుమతులకు ఆటంకంఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.అసలు కారణం ఇదే..అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు.అమెరికా సుంకాలకు తోడుగా..భారత్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ (Readymade garment industry) దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది.బంగ్లాకు ఆర్థిక సవాళ్లుఅస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తున్నదని పేర్కొన్నారు. భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం రద్దు భారత్- బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టనుంది.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు కుట్రదారు, లబ్దిదారుగా సాగిన కుంభకోణాల కేసులను నీరుగార్చేందుకు ఎంతకైనా తెగిస్తామని సీఐడీ పదే పదే స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ఎంతగా అంటే.. ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి బి.సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు ఏకంగా 10 నెలలపాటు చార్జ్షీట్లు దాఖలు చేయకుండా సాగదీయడం గమనార్హం.తాజా బదిలీల్లో హిమబిందును రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో 2023లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్ నివేదిక పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. కేసులు నీరుగార్చే కుట్ర.. సాక్షులకు బెదిరింపులు రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబుపై అవినీతి కేసులను సీఐడీ అటకెక్కించింది. ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు, అధికారులను బెదిరించి బెంబేలెత్తిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేయిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా సీఐడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్.. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను గత ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి సీఐడీ అధికారులు ఆ వివరణలతో సహా చార్జిషీట్లను సిద్ధం చేశారు. కానీ గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని సీఐడీ చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను పునఃదాఖలు చేయక పోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. చంద్రబాబు, నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గతంలో సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్‌గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా.. నిందితుడా.. అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీఐడీ తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సీఐడీ ఆ చార్జ్షీట్లను పునఃదాఖలు చేయకపోవడం గమనార్హం. అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సీఐడీ చార్జ్షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. న్యాయమూర్తిపైనే ఇంటెలిజెన్స్ నిఘా! చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం కలకలం సృష్టించింది. ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటలిజెన్స్ అధికారులు తిష్ట వేసి, ప్రతి కదలికనూ గమనిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం. నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించారు. న్యాయమూర్తి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పోలీసు అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు.

'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ.. అనుబంధాలకు ప్రతీక..!
ప్రపంచంలో ప్రతి అనుబంధం ప్రత్యేకమైనది. అయితే, కొన్ని బంధాలు మన హృదయంలో శాశ్వత స్థానం ఏర్పరచుకుంటాయి. అలాంటి ఓ అపురూపమైన బంధం – సోదర సోదరీమణుల అనుబంధం. ఈ బంధాన్ని గౌరవించేందుకు, జరుపుకునేందుకు ప్రతి ఏప్రిల్ 10న మనం "సిబ్లింగ్ డే" ను నిర్వహిస్తాం. ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ కాదు, మన వ్యక్తిత్వ వికాసం, మన భావోద్వేగ పరిణతిలో తోబుట్టువుల పాత్రను గుర్తించి గౌరవించాల్సిన రోజు.మన భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదర సోదరీమణుల బంధానికి గౌరవప్రదమైన స్థానం ఉంది. జీవితంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే మొదటి బంధం అమ్మానాన్నలతో అయితే, రెండోది తోబుట్టువులతో ఉన్న అనుబంధం. సోదర బంధం అనేది కేవలం కుటుంబ సంబంధం మాత్రమే కాదు, అది మన మానసిక అభివృద్ధిలో ఒక మూల స్థంభం. తోబుట్టువు అంటే కేవలం మనతో పుట్టిన వ్యక్తి కాదు, మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపించే వ్యక్తి.సోదర సంబంధాల మానసిక ప్రభావంఇతరులతో సురక్షితమైన అనుబంధం ఏర్పరచుకోవడం (secure attachment) మానసిక నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం. అది తల్లిదండ్రులతో ప్రారంభమైతే, తోబుట్టువులు దాన్ని స్థిరపరుస్తారు. బాల్యంలో తోబుట్టువులతో ఉన్న అనుబంధం జీవితంలో బలహీనతల్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.ఒక తమ్ముడు అన్న బాటలో నడుస్తాడు, ఒక అక్క చెల్లెల్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. ఈ అనుబంధం conflicting emotionsను సహజసిద్ధంగా ఎదుర్కొనటానికి ఒక విస్తృత ప్రయోగశాలలా మారుతుంది. అదే జీవితానికి సరిపడా సంస్కారాన్ని అందించే తొలి వేదిక.అనుబంధాల తొలి కిరణాలుబాల్యం అనేది మనసు మీద మొదటి ముద్ర వేసే దశ. ఈ దశలో తోబుట్టువులతో కలసి గడిపిన క్షణాలు – మన జీవితానికి పునాదిలా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ చేతినుంచి తొలి ముద్ద కోసం పోటీ పడిన సంఘటనలు, అమ్మానాన్నను ఫేవరెట్ అనిపించుకునే కుతూహలాలు, కలిసి తినడం, ఆడటం, తిరగడం – ఇవన్నీ కలిసి మనలో భావోద్వేగ నిబంధనలు (emotional rules) రూపుదిద్దుకుంటాయి. తోబుట్టువులు మనకు పాఠశాలలో చదవని పాఠాలు నేర్పుతారు. సహనం, సహకారం, పోటీ, సమన్వయం, పంచుకోవడంలాంటివి సహజసిద్ధంగా నేర్పుతారు. ఈ విలువలే ఎమోషనల్ హెల్త్ కు మూలం.సైకాలజీ దృష్టిలో, ఇది Social Referencing Phase. పిల్లలు తోబుట్టువుల ద్వారా – ఎలా స్పందించాలి? ఎలా సహనం వహించాలి? ఎలా స్పందన కనబర్చాలి? అనే మౌలిక విలువలు నేర్చుకుంటారు.విభేదాలు – మనస్సు ఎదిగే అవకాశాలువాస్తవానికి, తోబుట్టువుల మధ్య విభేదాలు లేకపోవడం అసాధ్యం. బాల్యంలో తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలుగుతాం, మాట్లాడకుండా ఉండిపోతాం. కానీ ఆ విభేదాల్ని ఎలా నిర్వహించామన్నదే మన భావోద్వేగ సామర్థ్యాన్ని (emotional intelligence) నిర్ధారిస్తుంది. మంచి సోదర బంధం ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ఘర్షణలను సులువుగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి.ముఖ్యంగా కౌమారంలో, అంటే టీనేజ్ లో వ్యక్తిత్వం విస్తరించటం మొదలవుతుంది. ఈ సమయంలో siblings మనకు ఒకరిపై ప్రేమ, ఒకరిపై అసూయ, ఒకరిపై గౌరవం, మరొకరిపై స్వార్థం అనే విరుద్ధ భావాల్ని అనుభవించే అవకాశం ఇస్తారు. ఇది complex emotions ని సరిగా అర్థం చేసుకునే దశ. ఇదే emotional literacy కు శిక్షణ అందించే వేదిక.అనుబంధాల పునర్నిర్మాణంవృద్ధాప్యానికి దగ్గరయ్యే దశలో – siblings మనసులోని మాటను పంచుకునే ఆత్మీయులుగా మారిపోతారు. తల్లిదండ్రులు మిగలకపోయినా, తోబుట్టువులే మనకు మిగిలే స్నేహితులు. జీవితపు అనుభవాలు, భిన్న దారుల్లో నడిచిన ప్రయాణాలు వేరువేరైనా, చివరకు చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనమే మనల్ని మళ్ళీ కలిపేస్తుంది. సైకాలజీ పరంగా ఇది Emotional Reconnection Phase. ఇది మన attachment history ని తిరిగి సవరించే అవకాశం. గతంలో జరిగిన దోషాలను అంగీకరించి, ప్రేమతో మళ్ళీ కలిసే బంధాన్ని పునఃస్థాపించుకోవచ్చు.ఈ రోజు ఏం చేయాలి? ఇప్పుడు జీవితాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఉద్యోగాలు, వ్యక్తిగత బాధ్యతలు, టెక్నాలజీ వల్ల కొందరిలో మానవ సంబంధాలు పెళుసుబారాయి. అనేకమంది తోబుట్టువులతో విభేదాల వల్ల దూరమైపోయి గిల్ట్ (guilt), శూన్యత (emptiness), లేదా మానసిక వ్యథను అనుభవిస్తూ ఉంటారనేది సైకాలజిస్ట్ గా నేను గమనించిన విషయం. అలాంటివారు ఈ రోజును భావోద్వేగం పునరాగమనానికి (emotional reconciliation) అవకాశంగా వినియోగించుకోవాలి. అందుకే ఈరోజు... • మీ సోదరుడికి / సోదరికి ఒక ఆత్మీయ సందేశం పంపండి.• చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేయండి.• సంబంధం తెగిపోయి ఉంటే, పునఃసంధానానికి ప్రయత్నించండి.• మీ బిడ్డల్లోనూ సోదర బంధం పట్ల గౌరవం పెరగాలంటే – మీరు మీ సోదర సంబంధాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వాళ్లు గమనిస్తుంటారని తెలుసుకుని మసలుకోండి.ఒక చెల్లెలి ప్రేమకు ప్రపంచ నివాళిక్లౌడియా ఎవర్ట్, న్యూయార్క్‌కి చెందిన మహిళ, తన సోదరి లిజా మరియు సోదరుడు అలాన్‌ను చిన్న వయసులోనే కోల్పోయారు. ఆ కోల్పోయిన బంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఏప్రిల్ 10 (లిజా పుట్టిన రోజు)ను సిబ్లింగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 1995లో Sibling Day Foundation ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ భావనను వ్యాపింపజేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ రోజును ఒక ప్రేమ సూచికగా, బంధాలను గుర్తచేసుకునే రోజుగా పాటిస్తోంది. సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com
స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు
బిగ్ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
మేం ఉద్యోగం చేయలేం
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
అమెరికాకు షాకిచ్చిన చైనా
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
GT VS RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్‌కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
పాపికొండల్లో అలుగుల సందడి
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
నంబర్ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
17 ఏళ్లుగా పరారీలోనే!
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
ఏప్రిల్ వేతనాలేవీ?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
టారిఫ్‌లకు ట్రంప్ బ్రేక్
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
ఒకరి వెంట మరొకరు
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు!
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
చాహల్‌తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
కొనేది.. తినేది విషమే!
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
ఇసుక తోడేళ్లు!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు
బిగ్ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
మేం ఉద్యోగం చేయలేం
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
అమెరికాకు షాకిచ్చిన చైనా
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
GT VS RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్‌కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
పాపికొండల్లో అలుగుల సందడి
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
నంబర్ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
17 ఏళ్లుగా పరారీలోనే!
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
ఏప్రిల్ వేతనాలేవీ?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
టారిఫ్‌లకు ట్రంప్ బ్రేక్
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
ఒకరి వెంట మరొకరు
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు!
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
చాహల్‌తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
కొనేది.. తినేది విషమే!
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
ఇసుక తోడేళ్లు!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమా

తెలంగాణ దండోరా
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో శివాజీ పాల్గొంటున్నారు. ‘‘అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ తీస్తున్నాం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.

ముచ్చటగా బంధాలే...
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ముచ్చటగా బంధాలే ఇచ్చటనే కలిశాయే...’ అంటూ సాగే రెండో పాటని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్ తల్లి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమా కోసం నిజాయతీగా చాలా కష్టపడ్డాం... చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ నెల 12న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తమ్ముడు (ఎన్టీఆర్) వస్తాడు’’ అన్నారు.

బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
బంగారు వర్ణం శారీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..రోడ్డు పక్కన చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ..ఎల్లో శారీలో అనసూయ అందాలు..బ్లాక్ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఇస్తాంబుల్‌లో ప్రియాంక మోహన్ చిల్.. .వైట్ శారీలో మెరిసిపోతున్న కాజోల్.. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol)

అబ్కీ బార్.. అర్జున్ సర్కార్ అంటోన్న నాని.. హిట్-3 సాంగ్ వచ్చేసింది!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్-3. శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ మూడో చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన హిట్, హిట్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అబ్కీ బార్.. అర్జున్ సర్కార్..అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు మిక్కీ జె మేయర్ సంగీతమందించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన మెలోడి సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.Lil something to start the heat. Fireworks on 14th. All hell breaks loose on May 1st. #AbKiBaarArjunSarkaar full song is here. https://t.co/6URUQmtchs #HIT3 pic.twitter.com/z104cXigpE— Nani (@NameisNani) April 9, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

ICC World Cup Qualifiers: పాకిస్తాన్ గెలుపు బోణీ
లాహోర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 38 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. 179 పరుగులకేసిద్రా అమీన్ (112 బంతుల్లో 51; 3 ఫోర్లు), ఆలియా రియాజ్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... మునీబా అలీ (32) రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో జానె మగుర్ 3 వికెట్లు పడగొట్టగా... కెల్లి, కారా ముర్రె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు తడబడింది. 44 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై పరాజయం ముటగట్టుకుంది. కెప్టెన్ గాబీ లూయిస్ (67 బంతుల్లో 44; 5 ఫోర్లు), అమీ హంటర్ (54 బంతుల్లో 44; 4 ఫోర్లు), ఒర్లా ప్రెండెర్‌గాస్ట్ (37) పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డయానా బేగ్ 4, నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం స్కాట్లాండ్తో పాకిస్తాన్ జట్టు తలపడుతుంది. హీలీ మాథ్యూస్ సెంచరీ వృథా... మరో మ్యాచ్‌లో కెప్టెన్ హీలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టినా... వెస్టిండీస్ జట్టుకు పరాజయం తప్పలేదు. బుధవారం జరిగిన పోరులో విండీస్ 11 పరుగుల తేడాతో స్కాట్లాండ్ చేతిలో ఓడింది. మొదట స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. సారా బ్రైస్ (56 బంతుల్లో 55; 6 ఫోర్లు), మేగన్ మెక్కాల్ (45; 5 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో హీలీ మాథ్యూస్ 4 వికెట్లు పడగొట్టగా... అలీనె, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హీలీ మాథ్యూస్ (113 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగి అజేయంగా నిలిచినా... మరో ఎండ్ నుంచి ఆమెకు సరైన సహకారం లభించలేదు. జైదా జేమ్స్ (45; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూస్ మొండిగా పోరాడింది. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ 3 వికెట్లు తీసింది.

‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
జట్టు ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యం అని టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) స్పష్టం చేశాడు. మ్యాచ్‌లో పరిస్థితులను బట్టే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టానికి చోటు ఉండదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచిస్తూ ఆడానని పేర్కొన్నాడు.‘అహం’ పనికిరాదు..‘జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ‘నేను’ అనే అహం బ్యాటింగ్‌లో ఎప్పుడూ కనిపించకూడదు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం సరైన బ్యాటింగ్ అనిపించుకోదు. నేను మ్యాచ్‌లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకే ప్రయత్నిస్తా. దానిని బట్టే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇది నేను గర్వించే విషయం కూడా.నేను మంచి లయ అందుకొని జోరు మీదుంటే నాపై బాధ్యత వేసుకుంటా. మరో బ్యాటర్ బాగా ఆడుతుంటే అతడూ అదే బాధ్యత తీసుకుంటాడు’ అని విరాట్ విశ్లేషించాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 256 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తం 8168 పరుగులు చేశాడు. అయితే తొలి మూడు సీజన్లలో ఎక్కువగా మిడిలార్డర్లో బరిలోకి దిగిన అతడు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 38 ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలే ఉన్నాయి.నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలుఅయితే 2011 నుంచి కోహ్లి ఆట మలుపు తిరిగింది. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘ఆర్సీబీ తరఫున మొదటి మూడేళ్లు నాకు టాపార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. కాబట్టి ఐపీఎల్లో గొప్పగా ఆడలేదు. అయితే 2010లో కాస్త నిలకడ వచ్చింది. 2011 నుంచి రెగ్యులర్‌గా మూడో స్థానంలోకి వచ్చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలైంది’ అని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా ఆడటం వల్లే టీ20 ఫార్మాట్లో తన ఆటను మెరుగుపర్చుకోవడం సాధ్యమైందని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి విరాట్ కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. ఆటగాడిగా.. కెప్టెన్‌గా అభిమానులను అలరించిన కోహ్లి.. జట్టుకు ఇంత వరకు ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఇక ఐపీఎల్-2025 సందర్భంగా బెంగళూరు ఫ్రాంఛైజీ రజత్ పాటిదార్‌ను తమ సారథిగా ప్రకటించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచింది. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పాటిదార్ రాణిస్తుండటం విశేషం. మరోవైపు.. కోహ్లి కూడా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం

DC vs RCB: ఢిల్లీకి ఎదురుందా!
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఇరు జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడుతుంది. తాజా సీజన్లో జోరు మీదున్న ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచింది. గత మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటీదార్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అర్ధశతకాలతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు ఘన విజయం సాధించింది. ఇదే జోరు కొనసాగిస్తూ తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆర్సీబీ బలంగా ఉండగా... కొత్త సారథి అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం ఎరగకుండా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయిన ఇరు జట్లు ఈ సారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇతర మైదానాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య ఆర్సీబీ అదరగొడుతుందా... లేక ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తుందా చూడాలి! విరాట్‌పైనే భారం... మునుపటి ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లి తిరిగి సాధికారికంగా ఆడుతుండటం బెంగళూరు జట్టుకు ప్రధాన బలం. ఫిల్ సాల్ట్ అడపా దడపా రాణిస్తుండగా... కెపె్టన్ రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్ గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో విలువ చాటుకున్నారు. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ రూపంలో మంచి హిట్టర్లు అందుబాటులో ఉన్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జితేశ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతోనే జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ప్రత్యర్థి జట్టు ప్రధాన పేసర్ స్టార్క్‌ను ఈ దళం ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. టి20ల్లో స్టార్క్‌పై కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో 31 బంతులు ఎదుర్కొన్న విరాట్ 72 పరుగులు చేశాడు.మరి ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు తీసిన స్టార్క్‌ను కోహ్లి ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. గత సీజన్లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ ఈసారి మెరుగ్గా కనిపిస్తోంది. హాజల్‌వుడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారం మోయనుండగా... కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్నర్లే బలం... ఇంటా బయటా అనే తేడా లేకుండా చక్కటి ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్... బెంగళూరుపైనా అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అనుభవానికి మరో ఓపెనర్ మెక్‌గుర్క్ మెరుపులు తోడవుతుండటంతో ఆ జట్టుకు మెరుగైన ఆరంభాలు దక్కుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంపై మంచి అవగాహన ఉన్న కర్ణాటక ప్లేయర్ కేఎల్ రాహుల్ మరోసారి కీలకం కానున్నాడు. ఇక వన్‌డౌన్‌లో అభిషేక్ పొరెల్ నమ్మదగ్గ ఆటగాడిగా ఎదుగుతున్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మలతో మిడిలార్డర్లో ప్రతిభకు కొదవలేదు. ఈ మ్యాచ్‌లో ప్రధానంగా ఢిల్లీ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బెంగళూరు స్టార్ కోహ్లికి మధ్య ఆసక్తికర సమరం ఖాయమే. గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి 8 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన సారథి అక్షర్‌పై ఒకింత ఒత్తిడి ఉంది. సహచరులు రాణిస్తున్న చోట అతడు కూడా బంతితో మెరవాల్సిన అవసరముంది. స్టార్క్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనుండగా... అక్షర్, కుల్దీప్, విప్రాజ్ నిగమ్ స్పిన్ భారం మోయనున్నారు. మూడు మ్యాచ్‌ల అనుభవమే ఉన్న విప్రాజ్ నుంచి కూడా బెంగళూరు బ్యాటర్లకు ముప్పుపొంచి ఉంది. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), సాల్ట్, కోహ్లి, పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్, ముకేశ్ కుమార్.

రష్మిక అదుర్స్
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్ చేతిలో 1–2తో ఓడిపోయిన భారత్ వెంటనే తేరుకుంది. బుధవారం థాయ్‌లాండ్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1తో గెలుపొందింది. భారత్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లోనూ శుభారంభం అందించింది. ప్రపంచ 170వ ర్యాంకర్ లానియానా తారారుడి (థాయ్‌లాండ్)తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 345వ ర్యాంకర్ రష్మిక 6–2, 6–4తో సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రెండో మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి మూడో సెట్లో గాయం కారణంగా వైదొలిగింది. మనాన్చాయ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సహజ తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో 7–6 (7/3)తో సొంతం చేసుకుంది. మూడో సెట్లో సహజ 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా ఆమె తప్పుకుంది. ఫలితంగా థాయ్‌లాండ్ స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం సత్తా చాటుకుంది. పీంగ్‌టార్న్–పట్చారిన్ (థాయ్‌లాండ్) ద్వయంతో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన 7–6 (7/3), 3–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచి భారత్‌కు 2–1తో విజయాన్ని ఖరారు చేసింది.
బిజినెస్

ప్రముఖ కంపెనీలో 1600 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ తమ నెదర్లాండ్స్ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్మెంట్, సపోర్ట్ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.స్థానిక మేనేజ్మెంట్ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్‌తో పాటు ట్రేడ్ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్ ప్లాంటు 6.75 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసింది.భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్‌లో డిమాండ్ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు.

రూ.91 వేల దిగువకు పసిడి
న్యూఢిల్లీ: స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర బుధవారం రూ. 1,050 మేర క్షీణించింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 90,200కి దిగి వచ్చింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం కూడా అంతే తగ్గి రూ. 89,750కి పరిమితమైంది.వెండి ధర మాత్రం కేజీకి రూ. 500 పెరిగి రూ. 93,200కి చేరింది. వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఎకానమీని మాంద్యంలోకి తోసేస్తాయనే భయాలతో అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధర పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.అంతర్జాతీయంగా బంగారం రేటు ఒక దశలో ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు 3,103 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా విధించిన 104 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా 84 శాతానికి సుంకాలను పెంచుతామంటూ ప్రకటించడం వాణిజ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. చైనా టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇక రుణాలు మరింత చౌక!
రుణగ్రహీతలకు మరోసారి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత చౌకగా లభించేలా.. ఈఎంఐల భారం ఇంకాస్త దిగొచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకపక్క ముదురుతున్న ట్రంప్ టారిఫ్ వార్.. మరోపక్క దిగజారుతున్న వృద్ధి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తూ... వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న సంకేతాలివ్వడం విశేషం! ఆర్బీఐ చర్యలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా తక్షణం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్ల కోతకు ఓకే చెప్పింది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగిలే అవకాశం ఉండటంతో కీలక పాలసీ రేటు.. రెపోను వరుసగా రెండోసారి తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలోని పరిపతి విధాన కమీటీ (ఎంపీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటేశారు. దీంతో బ్యాంకుల రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. ప్రతీకార సుంకాల్లో భాగంగా దాదాపు 60 దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించడం తెలిసిందే. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వడ్డించారు. మరోపక్క, అమెరికాతో అమీతుమీ అంటూ చైనా కూడా దీటుగా సుంకాలతో విరుచుపడుతుండటంతో వాణిజ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి సమీక్షలో దాదాపు ఐదేళ్ల తర్వాత (2020 మే) తొలిసారి రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఇప్పుడు మరో పావు శాతం కోతతో రెపో రేటు 2022 నవంబర్ స్థాయికి దిగొచ్చింది.వృద్ధి రేటు అంచనాలు డౌన్... ట్రేడ్ వార్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశి్చతుల ప్రభావంతో మన ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క, మాంద్యం ఆందోళనలు, ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయంగా చమురు రేటు దిగొస్తుండటంతో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.5 శాతానికి కుదించింది. ఇతర ముఖ్యాంశాలు... → పరపతి విధాన స్థితిని ఇప్పుడున్న ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ తగ్గించింది. అంటే, ఎలాంటి తీవ్ర ప్రతికూలాంశాలు లేకపోతే, రాబోయే సమీక్షల్లో రేట్ల తగ్గింపు లేదా యథాతథ స్థితిని కొనసాగించడం జరుగుతుంది. → పర్సన్–టు–మర్చంట్ (పీ2ఎం) పేమెంట్లకు సంబంధించి యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి అనుమతించింది. ప్రస్తుతం పర్సన్–టు–పర్సన్ (పీ2పీ), పీ2ఎం పరిమితి రెండూ రూ. లక్షగా ఉంది. అయితే, పీ2ఎంలో కొన్ని నిర్దిష్ట వినియోగాలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా అధిక పరిమితులకు మినహాయింపు ఉంటోంది. అయితే, ఇప్పుడు ఆర్బీఐ అనుమతితో పీ2ఎంపై ఉన్న రూ. లక్ష పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచడానికి ఎన్‌పీసీఐకి అవకాశం లభిస్తుంది. పీ2పీ పరిమితి మాత్రం రూ. లక్షగానే కొనసాగుతుంది. → బంగారు రుణాలపై నిబంధనలను కఠిన తరం చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. రుణాల మంజూరు సమయంలో తనఖాగా పెట్టే పసిడి స్వచ్ఛత, బరువు లెక్కింపు ఇతరత్రా పద్ధతులకు సంబంధించి గోల్డ్ లోన్ పరిశ్రమలోని రుణదాతలంతా ఇకపై ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను అనుసరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచీల్లోనూ ఒకే ప్రామాణిక విధానం అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. → తదుపరి పాలసీ సమీక్ష 2025 జూన్ 4 నుంచి 6 వరకు జరుగుతుంది.4 బ్యాంకులు బోణీ...ఆర్బీఐ రెండోసారి రెపో తగ్గింపు ప్రకటనతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు బోణీ చేశాయి. ఇందులో ఇండియన్ బ్యాంక్ అత్యధికంగా రెపో ఆధారిత రుణ రేటు (ఆర్బీఎల్ఆర్)ను 35 బేసిస్ పాయింట్లు (0.35%) తగ్గింంచి 8.7%కి చేర్చింది. శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌లో పావు శాతం కోతతో ఇప్పుడున్న 9.1% నుంచి 8.85 శాతానికి తగ్గించాయి. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. యూకో బ్యాంక్ గురువారం నుంచి అమలయ్యేలా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.8%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గను న్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉంది.నేను భారతంలో సంజయుడిని కాదు... వడ్డీ రేట్లు ఏ స్థాయికి చేరుతాయో చెప్పలేను. నేను భారతంలో సంజయుడిని కాదు. సంజయ్‌ని మాత్రమే. నాకు అలాంటి దివ్య దృష్టి ఏదీ లేదు. పాలసీ నిర్ణయం కస్టమర్లకు బదిలీ అయ్యేందుకు తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ)ను అందిస్తాం. తాజా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు తమ దేశీ ప్రాధాన్యతలను అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్గృహ రుణాలపై ఊరట ఇలా... ఆర్బీఐ వరుసగా రెండో సారీ రెపో రేటును పావు శాతం తగ్గించడంతో గృహ రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75% వడ్డీ రేటుతో తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.44,186 చొప్పు న నెలవారీ వాయిదా(ఈఎంఐ) పడు తుంది. బ్యాంకులు ఈ పావు శాతం కోతను నేరు గా కస్టమర్లకు బదలాయిస్తే... వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గు తుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ. 43,391కి దిగొస్తుంది. అంటే నెలకు రూ.795 చొప్పున మిగిలినట్లు లెక్క. మిగతా రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పులు జరగకుండా అదే వడ్డీ రేటు కొనసాగితే మొత్తం వడ్డీ రూ. 1,90,649 ఆదా అవుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ నెలవారీ చెల్లించే ఈఎంఐని ఇంతకుముందు లాగే (రూ.44,186 చొప్పున) కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఎకానమీకి దన్ను... రెపో రేటు తగ్గింపుతో పాటు పరపతి విధాన స్థితిని తటస్థం నుంచి సానుకూలానికి మార్చడం అనేది దేశీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. టారిఫ్ ప్రభావం నుంచి ఎకానమీకి చేదోడుగా నిలిచేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్వాహన పరిశ్రమకు సానుకూలం... ఆర్బీఐ రెపో తగ్గింపుతో వాహన కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ అమ్మకాలు పుంజుకుని ఆటోమొబైల్ రంగంలో సానుకూల సెంటిమెంట్ నెలకొంటుంది. – శైలేష్ చంద్ర, సియామ్ ప్రెసిడెంట్వృద్ధికి ఊతం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రెపో కోతతో పాటు పరపతి విధానాన్ని సానుకూలానికి మార్చడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్. దీనికి ప్రభుత్వ సానుకూల ఆర్థిక విధానం కూడా తోడవ్వడంతో వృద్ధి పుంజుకుంటుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయ్... రియల్టీ రంగంలో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్ నింపేలా సరైన సమయంలో రేట్ల కోత నిర్ణయం వెలువడింది. దీనివల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొచి్చ... మధ్య ఆదాయ, అందుబాటు ధర ఇళ్ల విభాగాల్లో అమ్మకాలు పుంజుకుంటాయి. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు

ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీస్ ఇండియా లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సెంచర్, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వార్షిక ర్యాంకింగ్ కెరీర్ వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, దీర్ఘకాలిక విజయం కోసం ఉత్తమ పని ప్రదేశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ కెరీర్లలో ఎలా ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది.ముందంజలో టెక్ టైటాన్స్టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ల ఆధిపత్యం భారత ఉపాధి రంగంలో టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. ఈ కంపెనీలు తమ ఉద్యోగుల కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అప్ స్కిల్లింగ్, నాయకత్వ అభివృద్ధి, సృజనాత్మక-ఆధారిత పని వాతావరణంలో భారీగా పెట్టుబడులు పెడతాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌లో టీసీఎస్ ముందంజలో ఉంది.కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో యాక్సెంచర్ పవర్ హౌజ్‌గా ఉంటూ గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను నడిపిస్తోంది.ఏఐ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సస్టెయినబిలిటీ కన్సల్టింగ్‌పై ఇన్ఫోసిస్ దృష్టి సారించింది.ఎమర్జింగ్ ట్రెండ్స్.. హైరింగ్ తీరుతెన్నులులింక్డ్ఇన్ ర్యాంకింగ్ కొన్ని ఆకర్షణీయమైన ధోరణులతో భారతదేశపు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌ను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.టాప్ ఇన్-డిమాండ్ రోల్స్: ఫ్రాడ్ అనలిస్టులు, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎనలిస్టులు వంటి ఉద్యోగాలకు కంపెనీలు చురుగ్గా నియామకాలు జరుపుతున్నాయి.డిమాండ్ ఉన్న నైపుణ్యాలు: ఏఐ ఇంజినీరింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో నైపుణ్యానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.పరిశ్రమ మార్పులు: టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, టాప్ 25 కంపెనీల్లో 19 కంపెనీలు ఈ రంగాలకు చెందినవే కావడం గమనార్హం.కొత్త కంపెనీలే: ఈ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా మొదటిసారి ప్రవేశించినవే కావడం యజమాని ప్రాధాన్యతలు, వర్క్ ప్లేస్ అప్పీల్ లో మార్పును సూచిస్తోంది.జాబితాలో టాప్ 10 కంపెనీలు ఇవే..1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): ఐటీ సర్వీసెస్2. యాక్సెంచర్: కన్సల్టింగ్ అండ్ ఐటీ సర్వీసెస్3. ఇన్ఫోసిస్: ఐటీ సర్వీసెస్4. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్: ఫైనాన్షియల్ సర్వీసెస్5. కాగ్నిజెంట్: ఐటీ సర్వీసెస్6. ఒరాకిల్: సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్7. జేపీ మోర్గాన్ ఛేజ్: ఫైనాన్షియల్ సర్వీసెస్8. అమెజాన్: ఈ-కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఫైనాన్షియల్ సర్వీసెస్
ఫ్యామిలీ

మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్‌ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్‌గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?)

ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది.

ఇదేం పెళ్లిరా నాయనా!
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.అధికారుల వార్నింగ్గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.కేసు నమోదుపెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్స్టోరీబాల్య వివాహాలు వద్దుసోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఫొటోలు


హనుమాన్ పూజలో కేటీఆర్.. స్వాములతో కలిసి భోజనం (ఫొటోలు)


చీరలో స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న హెబ్బా పటేల్ (ఫోటోలు)


‘జాక్’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)


కాబోయే భర్తతో కలిసి అభినయ బ్యాచ్‌లరేట్ పార్టీ (ఫోటోలు)


పట్టుచీర, నగలతో స్నేహ లుక్ అదిరిందిగా (ఫోటోలు)


చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)


విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)


చీరకట్టులో కుందనపు బొమ్మలా కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్
అంతర్జాతీయం

సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్

ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..
మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్‌కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్‌లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

చైనా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
బీజింగ్: చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్హువా కౌంటీలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో నర్సింగ్ హోమ్(ఆసుపత్రి)లో మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా జిన్హువా వెల్లడించింది. అలాగే, పలువురు తీవ్రంగా గాయపడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.Deadly fire claims 20 lives at nursing home in northern ChinaThe blaze struck a facility in Chengde City, with survivors relocated to a nearby hospital for treatment and observation, Xinhua News reports.#China pic.twitter.com/dOdt0UNX1w— MOCez🇷🇺🇮🇶🇾🇪🇨🇳🇵🇰🇵🇸🇱🇧🇮🇷🇰🇵☀️ (@Mousacisse1) April 9, 2025
జాతీయం

జైన మతంతో భారత్‌కు గుర్తింపు
న్యూఢిల్లీ: భారతదేశ గుర్తింపును నిర్మించడంలో జైన మతం అమూల్యమైన పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, యుద్ధాలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి పెను సవాళ్లకు అసలైన పరిష్కార మార్గాలు జైన ధర్మంలో ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘నవకర్ మహామంత్ర దివస్’ సందర్భంగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. జైన మతంతో ముడిపడి ఉన్న ప్రాచీన కట్టడాలు, జైన గురువుల బోధనలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పార్లమెంట్ భవనంలో జైన తీర్థంకరుల విగ్రహాలకు స్థానం కలి్పంచినట్లు తెలిపారు. జైన మత ప్రభావం మన పార్లమెంట్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా జీవించాలని జైనిజం బోధిస్తున్నట్లు గుర్తుచేశారు. హింసను ఎంతమాత్రం అంగీకరించదని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణను బోధించే జైనమత సూత్రాలు అందరికీ ఆచరణీయమని పిలుపునిచ్చారు. భారత ఆధ్యాతి్మక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. జైన సాహిత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసే పథకం తీసుకొచ్చామని తెలిపారు. పాళీ, పాకృత బాషలను ప్రాచీన భాషలుగా గుర్తించామని వివరించారు.మనమంతా తొమ్మిది ప్రతిజ్ఞలు చేద్దామని మోదీ సూచించారు. అవేమిటంటే... 1. నీటిని సంరక్షించుకుందాం.. జల సంరక్షణ మనందరి బాధ్యత 2. మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటుదాం 3. పరిశుభ్రతను ప్రోత్సహిద్దాం 4. స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిద్దాం 5. దేశంలో పర్యటిద్దాం.. పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం.. పేదలకు సాయం అందిద్దాం 6. రసాయనాలకు తావులేకుండా ప్రకృతి వ్యవసాయం చేద్దాం7. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు స్వీకరిద్దాం.. తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం.8. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకుందాం9. క్రీడలు, యోగాను మన నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకుందాం

బీహార్‌లో పిడుగుల వాన.. 13 మంది మృతి
బీహార్‌లో పలు జిల్లాలను ఈదురు గాలులు, వడగళ్ల వానలు అతలాకుతలం చేశాయి. బుధవారం ఉదయం రాష్ట్రంలోని బెగుసరాయ్, దర్భంగా, మధుబని, సమస్తిపూర్లలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మధుబని జిల్లాలోని పిప్రౌలియా గ్రామంలో ముగ్గురు మృతి చెందగా, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తిపుర్‌లో ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయినట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.బాధిత కుటుంబాలకు సీఎం నీతీష్ కుమార్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 13 మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్‌లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది. An Air India spokesperson says, “Air India confirms that an incident of unruly passenger behaviour was reported to the cabin crew operating flight AI2336, from Delhi to Bangkok, on 9 April 2025. The crew followed all laid down procedures, and the matter has been reported to the… pic.twitter.com/QwMB1pWr2E— ANI (@ANI) April 9, 2025 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.

16 రోజుల్లో.. ఉగ్ర విధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే. పాక్ నుంచి కథ నడిపిన రియాజ్... పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్‌కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్‌లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది. సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు.. ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్‌పేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో రెక్కీ చేసినా.. దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్‌మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్‌పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు. మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్క్ చేసి.. ఆ సైకిల్‌ను మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్‌కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్‌బజార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్‌పేట రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది. విధ్వంసానికి ముందే గది ఖాళీ.. రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్‌పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్‌తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు. మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్‌కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు.

Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్‌నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
దొడ్డబళ్లాపురం: ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లయ్యింది. భర్త, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం ఏదో సాఫీగా సాగిపోతోంది. అయితే సోషల్ మీడియా అనే భూతం జీవితంలో చిచ్చు పెట్టింది. ఇన్‌స్టాలో పరిచయమైన యువకునితో ఆమె వెళ్లిపోవడంతో భర్త లబోదిబోమంటున్నాడు. వారం రోజుల కిందట అతడిని వివాహం చేసుకుని సదరు వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసి భర్తకు షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోయి.. అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా జక్కసంద్రలోని రాఘవేంద్రనగరలో చోటుచేసుకుంది. నేత్రావతి ఈ స్టోరీలో సూత్రధారి. నేత్రావతికి 13 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నేత్రావతి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె సంతోష్ అనే యువకున్ని పెళ్లి చేసుకుని వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అది చూసి మొదటిభర్త నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరాడు. గోడు వెళ్లబోసుకుంటున్న రమేశ్, అత్తమామలు మోసం చేసింది: అత్తమామలు రమేశ్, అతని తల్లిదండ్రులు ఠాణా వద్ద మీడియాతో మాట్లాడారు. కోడలు తమను మోసం చేసిందని, రెండేళ్లుగా ఇన్‌స్టా ప్రియునితో దందా సాగిస్తోందని వారు ఆరోపించారు. తమ మనవన్ని కూడా తీసుకెళ్లిందని, ఆ చిన్నారి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వాపోయారు. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినలేదని అన్నారు. నేత్రావతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అనాథ అనే జాలితో పెళ్లి చేసుకుంటే ఇలా చేసిందని రమేశ్ వాపోయాడు. తన భార్యకు రూ.50 లక్షల విలువ చేసే పొలం ఉందని, రెండో భర్త దానిపై కన్నేశాడని చెప్పాడు. పోలీస్‌స్టేషన్‌కు నేత్రావతి ఈ కేసులో ట్విస్టులు ఇంకా ఉన్నాయి. నేత్రావతి, తన లాయరుతో బుధవారం నెలమంగళ ఠాణాకు వచ్చింది. భర్త ఇంటిలో ఉన్న తన వస్తువులను తీసుకెళ్లడానికి పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది. మొదటి భర్త రోజూ తాగి వచ్చి కొడతాడని, అతనితో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. ఇటీవలే అతనిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. జిల్లాలో ఇది సంచలనమైంది.
వీడియోలు


తమ్ముడు రిలీజ్ పై అంజాద్ బాషా రియాక్షన్


పోసాని కృష్ణమురళీపై ఆగని కక్షసాధింపు చర్యలు


టీడీపీకి ఊడిగం చేస్తావా.. శివ శంకర్ మాస్ వార్నింగ్


భద్రతలో డొల్లతనం.. ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు!


ఉచితం ముసుగులో ఇసుక లూటీకి తెగబడుతున్న పచ్చ ముఠాలు


లాభాల్లో ఆసియా మార్కెట్లు


రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం


YSRCP కార్యకర్త విష్ణును బెల్ట్ తో కొట్టిన ఎస్ఐ మల్లికార్జున


బంగ్లాదేశ్ సారథి యూనస్ కు షాక్ ఇచ్చిన భారత్


1000 కోట్ల బడ్జెట్ తో మహేష్, రాజమౌళి సినిమా