Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian Home Ministry Alerted All States Check Details Here1
Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

న్యూఢిల్లీ, సాక్షి:​ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్‌ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.

Kommineni Srinivasa Rao Reaction On Ys Jagan Raptadu Tour2
‘కూటమి’ డైవర్ట్‌ పాలిటిక్స్‌.. వైఎస్‌ జగన్‌పై పెద్ద కుట్రే జరుగుతుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్‌ జగన్‌ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్‌ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్‌ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్‌ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్‌ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్‌ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్‌ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్‌పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే. పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్‌ పవన్ కళ్యాణ్‌లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్‌లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్‌లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు. మరి చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు. వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

How Vanajeevi Ramaiah Haritha Yagnam Helps Society Environment3
రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?

వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్‌ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్‌ డైయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లనూ ఫిల్టర్‌ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్‌ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Eluru DIG Ashok Kumar Clarity On Pastor Praveen Kumar Incident4
పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌: ఏలూరు డీఐజీ

ఏలూరు, సాక్షి: పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్‌ పెట్టారు. మద్యం మత్తులో బైక్‌ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్‌ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్‌ నుంచి పాస్టర్‌ బైక్‌ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్‌ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్‌ ప్రవీణ్ ‌కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్‌ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్‌ కుమార్‌ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్‌ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్‌ బంకులలో యూపీఐ పేమెంట్స్‌ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్‌ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్‌ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్‌ లైట్‌ డ్యామేజ్‌ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ అని ఏలూరు డీఐజీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు.

Devotees Wear Chappals At Near Tirumala Temple5
తిరుమలలో మరో అపచారం

సాక్షి, తిరుమల: తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే, మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. ‘తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయట పడింది. పాద రక్షలు వేసుకుని మహా ద్వారం వరకు భక్తులు వెళ్ళారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్ళుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి.రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు. భద్రత డొల్లతనం ఏమిటి అన్నది తెలుస్తోంది. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోయాయి, దీనికి ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి. జేసీబీలతో వెళ్ళి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయటపెడదాం. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నా. దీనికి కారణమై సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుమల భద్రత ఎంత అధ్వాన్న పరిస్థితికి వెళ్ళింది అనేది తేట తెల్లమైంది. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అని చెప్తే, మాపై ఎదురు దాడి విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

SC land Mark Judgement On President Decision On Bills Reserved By Governor6
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మహదేవన్‌ నేతృత్వంలోని తాజాగా బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్‌ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్‌ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్‌ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది.

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online7
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్‌ చేసుకోండిలా..

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌ AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.

IPL 2025: Delhi Dust Storm Strikes MI Practice Session, Rohit Screams Come Back8
IPL 2025: బీభత్సం సృష్టించిన గాలి దుమారం.. భయంతో కేకలు పెట్టిన రోహిత్‌ శర్మ

దేశ రాజధాని ఢిల్లీని నిన్న (ఏప్రిల్‌ 11) సాయంత్రం గాలి దుమారం వణికించింది. ఇది సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలి దూమారం ప్రభావం ముంబై ఇండియన్స్‌ ప్రాక్టీస్‌ సెషన్‌పై కూడా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ నిమిత్తం ఆ జట్టు నిన్న సాయంత్రం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తుంది. Straight out of a 🌪️ movie#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/Tv7j3ILf9v— Mumbai Indians (@mipaltan) April 11, 2025ఈ క్రమంలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ బృంద సభ్యులు భయంతో వణికిపోయారు. స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కేకేలు పెడుతూ బృంద సభ్యులను మైదానం నుంచి తిరిగి రమ్మంటూ అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తమ అధికారిక​ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో రోహిత్‌ కేకేలు పెడుతుండగా.. దీపక్ చాహర్, కోచ్‌లు మహేల జయవర్ధనే, లసిత్ మలింగ డగౌట్‌ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు.రోహిత్‌.. సహచరులను మైదానం వీడి సురక్షితంగా డగౌట్‌కు చేరుకోవాలని కేకేలు పెడుతూనే తన సహజ శైలిలో జోక్‌లు వేశాడు. తనవైపు ఫోకస్‌ పెట్టిన కెమెరామెన్‌ను "నా ముఖం ఏం చూపిస్తున్నావు. ఆ వీడియో తీసుకో" అంటూ అరిచాడు. గాలి దూమారం ధాటికి స్టేడియంలో వస్తువులు గాల్లో ఎగురుతూ కనిపించాయి.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ఏప్రిల్‌ 13వ తేదీ రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్‌ సమయానికి ఢిల్లీలోని వాతావరణం క్లియర్‌గా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు వర్షం​ నుంచి కాని, గాలి దుమారం నుంచి కాని ఎలాంటి ముప్పు లేదని ప్రకటన విడుదల చేసింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి గుజరాత్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. కేకేఆర్‌, ఆర్సీబీ, పంజాబ్‌, లక్నో, రాజస్థాన్‌ వరస స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్‌, సీఎస్‌కే చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.ఇవాళ (ఏప్రిల్‌ 12) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో లక్నోతో గుజరాత్‌ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది.

UPI Outage As Several Users Face Issue With Payments9
యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్‌పీసీఐ

దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్‌ వెల్లడించింది.గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీస్పందించిన ఎన్‌పీసీఐకొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్‌పీసీఐ ట్వీట్ చేసింది.NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated. We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025

India Highest Paid Directors: 3 Telugu Directors in Top 510
అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే డైరెక్టర్లు.. టాప్‌ 5లో ముగ్గురు మనోళ్లే!

సినిమా రెమ్యునరేషన్‌ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్‌ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్‌ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్‌లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్‌ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్‌ మెగా డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్‌... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్‌ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్‌ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్‌ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్‌... అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్‌ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్‌ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్‌ డైరెక్టర్‌ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్‌ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్‌ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్‌ ఎఎ22ఎక్స్‌ఎ6 పేరుతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో అనౌన్స్‌ చేసిన ప్రాజెక్ట్‌ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్‌ పెంచిన డైరెక్టర్‌జవాన్‌ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్‌ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్‌, రూ. 55–65 కోట్లతో సంజయ్‌ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement