గృహ అవసరాల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝులిపించారు.
బెల్లంపల్లి: గృహ అవసరాల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝులిపించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సోమవారం పలు హోటళ్ల పై దాడులు నిర్వహించిన సివిల్‌సప్లై, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 15 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.