విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ 22, 23 తేదీల్లో సమావేశం కానుంది.
మరో పది శాఖల్లో ఉద్యోగుల పంపిణీ, అభ్యంతరాల పరిష్కారంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ 22, 23 తేదీల్లో సమావేశం కానుంది. 22న మరో పది శాఖలకు చెందిన విభాగాల్లో ఉద్యోగులను పంపిణీ చేయనుంది. 23న ఉద్యోగుల అభ్యంతరాల పరిష్కారంపై చర్చించనుంది. కమిటీ ఇప్పటికే 94 శాఖలకు చెందిన 14,229 మందిని పంపిణీ చేసింది.
ఇంకా పోలీసు శాఖలో 22 వేల మంది, వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల మంది, ఇతర చిన్న శాఖల్లో మరో 6 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన 50 వేల మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులను పంపిణీ చేస్తే ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుంది.