Ben
-
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్‌ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్‌గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?) -
Anna Ben: కల్కి బ్యూటీ టాప్ లుక్స్.. ఓసారి చూసేయండి (ఫోటోలు)
-
లక్షలాది జీవితాలను మార్చిన విప్లవమూర్తి
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా సామాజిక సేవకు తమ జీవితాలను అందించిన అనేకమందిలో ఇలా భట్ లేదా అందరికీ చిరపరిచితమైన ఇలా బెన్ ఒకరు. ఆకాశమే హద్దుగా దేశ భవిష్యత్తు గురించి కలలు కన్న ఇలాబెన్ అహ్మదాబాద్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామి నని గర్వంగా భావించారు. ‘‘జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో కార్మికులకు దగ్గర కావడమే. ఎందుకంటే.. ఈ దేశానికి పునాదు లైన వీరు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవు తున్నారు’’ అనేవారు ఆమె. ఆ కాలపు విద్యార్థి నేత రమేశ్ భట్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇలా బెన్ అతడినే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామి గానూ మారిపోయారు. విద్యాభ్యాసం తరు వాత ఇలా బెన్ మజూర్ మహాజన్ (టెక్స్టైల్ లేబర్ అసోసి యేషన్–టీఎల్‌ఏ)లో చేరిపోగా... రమేశ్ భట్ అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్‌లో చేరారు. మిల్లు వర్కర్ల ట్రేడ్ యూనియన్ అయిన టీఎల్ఏను స్థాపిం చింది అనసూయ సారాభాయ్ అయినప్పటికీ దీని రాజ్యాంగాన్ని రచించింది మాత్రం స్వయంగా మహాత్మా గాంధీ కావడం గమనార్హం. ట్రేడ్ యూనియన్ ప్రాముఖ్యం, నిర్వహణ వంటి అనేక అంశాలను టీఎల్‌ఏ లోనే నేర్చుకున్న ఇలా బెన్ ఇక్కడే మొదటిసారి అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులను కూడా కలిశారు. వారంతా కాయగూరలు అమ్మే, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే, దుస్తులు కుట్టే కష్టజీవులైనప్ప టికీ పేదలుగానే ఉండటం ఆమెలోని ఆలోచనలను తట్టిలేపింది. వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఇలా బెన్ 1972లో ‘సేవా’ సంస్థను ప్రారంభించారు. చిన్నగా మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశం.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్త అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమాలకు ఆధారభూతమైంది. ఒక్కో మహిళా కార్మికురాలు... యూనియన్ కోసం తమ చిన్న చిన్న సంచి ముడులు విప్పి పావలా చొప్పున చెల్లించడం ఇలా బెన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే కేవలం వీరి హక్కుల కోసం పోరాడటమే సరిపోదని ఇలా బెన్ వేగంగా గుర్తించారు. యజమానుల మనసు మార్చే.. మున్సిపాలిటీ, పోలీస్ వంటి వ్యవస్థలు మహిళా కార్మికులను దోచుకోకుండా రక్షించేందుకు తగిన చట్టాలూ అవసరమని భావించారు. ఇజ్రాయెల్ పర్యటనలో సహకార సంఘాలు, ట్రేడ్ యూనియన్ల పనితీరుపై అవగాహన పెంచుకున్న ఇలా బెన్ వాటిని భారత్‌లోనూ స్థాపించే ప్రయత్నం మొదలుపెట్టారు. మహిళా కార్మికులకు తాము పొదుపు చేసుకున్న డబ్బును దాచుకునేందుకు బ్యాంకుల్లాంటి వ్యవస్థలేవీ లేకపోవడం గుర్తించిన ఆమె... వారితో ఓ సహకార బ్యాంకును ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఇదో విప్లవాత్మకమైన చర్యే. ఆలోచనలు, కార్యాచరణ రెండూ అలాగే ఉండేవి. సమాజంలోని అట్టడుగు పేదల జీవితాలు మార్చే ఈ పనులకు ఆమె పెట్టుకున్న పేరు ‘అభివృద్ధికి పోరాటం’. ఇలా బెన్ మార్గాన్ని ఒక్క గుజరాత్‌లోనే కాదు... భారత్‌తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ అనుకరించారు. ఇలా బెన్ ఆలోచనలు ఎంత విప్లవాత్మకంగా ఉండేవంటే.. కొన్ని పనులు చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావనీ, అసలు సమస్య ఆలోచనా ధోరణులు మార్చడంలోనే ఉందనీ ఆమె గుర్తించారు. చట్టాలు, విధానాలు, దృక్పథాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే అసంఘటిత రంగ మహిళా కార్మికుల హక్కుల సాధన సాధ్యమని నమ్మి ఆచరించారు. ఇలా బెన్ కృషికి గుర్తింపు చాలా వేగంగానే రావడం మొదలైంది. 1977లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. ఆ తరువాతి కాలంలో పద్మశ్రీ, పద్మభూషణ్‌లు కూడా! రాజ్యసభ సభ్యు రాలిగా నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలు డాక్టరేట్లతో సత్కరించాయి. నెల్సన్ మండేలా స్థాపించిన అంతర్జాతీయ బృందం ‘ద ఎల్డర్స్’లోనూ ఆమెకు సభ్యత్వం లభించింది. ఇలా బెన్ రాజ్యసభ సభ్యురాలిగా వీధి వ్యాపారులు, ఇళ్లలోంచి పనిచేసేవారి కోసం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆమె కృషి ఫలితంగానే వీధి వ్యాపారుల బిల్లు చట్టమైంది. పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా బెన్ కోరింది ఒక్కటే... అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయమని! 1988లో వీరిపై చేసిన అధ్య యనం ‘శ్రమశక్తి’ పేరుతో విడుదలైంది. శ్రామికులను సంఘటిత పరచడం ఎంత ముఖ్యమైందో ఇలా బెన్‌కు బాగా తెలుసు. అందుకేనేమో... అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన కార్మిక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆమె స్ఫూర్తితో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్‌తోపాటు ఇళ్లల్లో పని చేసేవారు, చెత్త ఏరుకునేవారికీ సంఘాలు ఏర్పడ్డాయి. ఇంట ర్నేషనల్ లేబర్ యూనియన్లోనూ ఇలా బెన్ ఇళ్లల్లోంచి పనిచేసుకునే వారి కోసం ఓ సదస్సు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలతో ఆమె ‘వీగో’ పేరుతో ఒక అంత ర్జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇలా బెన్ సాధించిన అతి గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది పేద మహిళా కార్మికుల జీవితాలను మార్చడమే కాదు.. విద్యావంతులు, ప్రొఫెషనల్స్ కూడా ఉద్యమంలో పాల్గొనేలా చేయడం! గత ఏడాది ‘సేవా’ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి. అయితే ఇలా బెన్ మాత్రం అప్పటికి కూడా రానున్న యాభై ఏళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురాగలమో చూడాలన్న ఆశాభావంతోనే ఉండేవారు. రేనానా ఝాబ్వాలా, వ్యాసకర్త ప్రఖ్యాత సామాజిక కార్యకర్త (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’
యువరాజ్‌సింగ్ మైదానంలో పరుగుల కోసం ఎంత శ్రమిస్తాడో.. అంతే సరదాగా ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించిన యువీ ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ అనుమతితో కెనడాలో గ్లోబల్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. ఎప్పుడూ మైదానంలో చిలిపిగా ఉండే.. తాజాగా జరిగిన మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు బెన్ కట్టింగ్‌ను (ఆస్ట్రేలియా) యాంకర్ ఎరిన్ హాలండ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, కాస్త దూరంలో ఉన్న యువీ.. వారిద్దరి సంభాషణ మధ్యలో దూరి.. ‘ఇంతకూ.. మీ ఇద్దరి వివాహం ఎప్పుడు’ అని సరదాగా ప్రశ్నించాడు. దీంతో వారిద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఇంటర్వ్యూ కొనసాగించారు. ఇక ఎరిన్ హాలండ్.. బెన్ కట్టింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎరిన్ ట్విటర్లో.. డోంట్ వర్రీ యువీ.. మా వివాహనికీ తప్పకుండా ఆహ్వానిస్తాం’ అని ట్వీట్ చేశారు. ఐపీఎల్-2016లో ఎస్ఆర్హెచ్, 2019లో ముంబై ఇండియన్స్ జట్లలో బెన్, యువ సహచర ఆటగాళ్లు కావడం గమనార్హం. -
స్థానిక సమాచారం కోసం గూగుల్ ‘నైబర్లీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానిక సమాచారం కోసం చాలా సందర్భాల్లో ఇంటిదగ్గర వారిని సంప్రదిస్తాం. అదే వేరే ప్రాంతానికి వెళ్తే రోడ్డునపోయే అపరిచితులను అడగాల్సి వస్తుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో అడుగు ముందుకేసి ‘నైబర్లీ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఓపెన్ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఖాతా ఉన్న బ్యాంకు ఎస్బీఐ అనుకుందాం. ఏటీఎంకు వెళ్లాల్సి వస్తే.. ఎస్ఎంఎస్ లేదా వాయిస్ రూపంలో ‘దగ్గరలో ఎస్బీఐ ఏటీఎం ఎక్కడ ఉంది’ అని అడిగితే చాలు. నైబర్లీ యాప్‌ను వాడుతున్న అక్కడి ప్రాంతం వారు ఎస్ఎంఎస్ రూపంలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తారు. బాగా స్పందించే వారికి టాప్ నైబర్ స్టేటస్ ఇస్తారు. నోటిఫికేషన్ల పరిమితిని యూజర్లు సెట్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా త్వరలో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైజాగ్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. నేటి (శనివారం) నుంచి హైదరాబాద్‌లో పనిచేయనుంది. రెండు వారాల్లో దేశవ్యాప్తంగా నైబర్లీ సేవలను అందుకోవచ్చని గూగుల్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ బెన్ ఫోనర్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నైబర్లీ యాప్‌ను భారత మార్కెట్ కోసం దేశీయంగా అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఇంగ్లిషుతోపాటు తెలుగు వంటి ఎనిమిది భారతీయ భాషల్లో యాప్ పనిచేస్తుంది. అవసరమైతే మరిన్ని స్థానిక భాషలను జోడిస్తాం. 15 లక్షల మందికిపైగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. భారతీయులది స్నేహపూర్వక మనస్తత్వం కాబట్టే తొలుత నైబర్లీని ఇక్కడ అమలులోకి తెచ్చాం. ఇతర దేశాలకు ఈ యాప్‌ను పరిచయం చేసే అవకాశమూ ఉంది’ అని వివరించారు. -
మూడో రౌండ్లో సౌరవ్ ఘోషాల్
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సౌరవ్ 11–4, 11–3, 11–4తో బెన్ కోల్మన్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జోష్నా 9–11, 13–11, 5–11, 9–11తో సల్మా హనీ (ఈజిప్ట్) చేతిలో... దీపిక 7–11, 11–5, 9–11, 14–12, 8–11తో ఒలివియా బ్లాచ్‌ఫోర్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
పొట్టేళ్ల కొట్లాట
-
ఓటమి దిశగా బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో తొలి టెస్టు కింగ్స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 302 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎదురీదుతోంది. సోమవారం నాలుగో రోజు కడపటి వార్తలందే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో నాలుగు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఇంకా పర్యాటక జట్టు 139 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (107 బంతుల్లో 53; 4 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అంతకుముందు మూడో రోజు ఆదివారం స్పిన్నర్ బెన్ (5/39) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోమినుల్ హక్ (112 బంతుల్లో 51; 7 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్ (79 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. డారెన్ బ్రేవో ఐదు క్యాచ్‌లు పట్టడంతో ఓ ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకున్న రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు లకెక్కాడు. గతంలో భారత్‌పై డారెన్ స్యామీ ఈ ఫీట్ సాధించాడు. బ్లాక్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.