ఓటమి దిశగా బంగ్లాదేశ్ | Sulieman Benn takes five as West Indies skittle Bangladesh for 182 on Day 3 | Sakshi
Sakshi News home page

ఓటమి దిశగా బంగ్లాదేశ్

Published Tue, Sep 9 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

ఓటమి దిశగా బంగ్లాదేశ్

ఓటమి దిశగా బంగ్లాదేశ్

వెస్టిండీస్‌తో తొలి టెస్టు

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 302 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎదురీదుతోంది. సోమవారం నాలుగో రోజు కడపటి వార్తలందే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో నాలుగు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఇంకా పర్యాటక జట్టు 139 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (107 బంతుల్లో 53; 4 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు.

అంతకుముందు మూడో రోజు ఆదివారం స్పిన్నర్ బెన్ (5/39) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోమినుల్ హక్ (112 బంతుల్లో 51; 7 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్ (79 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. డారెన్ బ్రేవో ఐదు క్యాచ్‌లు పట్టడంతో ఓ ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకున్న రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు లకెక్కాడు. గతంలో భారత్‌పై డారెన్ స్యామీ ఈ ఫీట్ సాధించాడు. బ్లాక్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement