Calcutta High court judge
-
సుప్రీం జడ్జిగా బాగ్చీ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్ 3న జన్మించిన జస్టిస్ బాగ్చీ.. 2011 జూన్27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్ బాగ్చీ పేరును సిఫారసు చేసింది. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది. ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
West Bengal: ‘ఖేలా హొబే’ సృష్టికర్తపై హైకోర్టు మాజీ జడ్జి పోటీ
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాలో భాగంగా బీజేపీ ప్రకటించిన పశ్చిమబెంగాల్ అభ్యర్థుల పేర్లు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవలే జడ్జి పదవికి రాజీనామా చేసిన కలకత్తా హై కోర్టు మాజీ జడ్జి అభిజత్ గంగోపాధ్యాయ్ మేదినీపూర్ జిల్లా టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన మీద తృణమూల్ కాంగ్రెస్ తరపున స్టూడెంట్ నేత, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు కారణమైన ‘ఖేలాహొబే’ క్యాంపెయిన్ సృష్టికర్త దేబాన్షు భట్టాచార్య పోటీచేస్తున్నారు. బెంగాల్లో 2021లో జరిగిన టీచర్ల నియామకంలో పెద్ద కుంభకోణం జరిగిందని పేర్కొంటూ అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న గంగోపాధ్యాయ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలపై టీఎంసీ అధినేత మమతాబెనర్జీ గంగోపాధ్యాయ్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తరపున ఆ జడ్జి ఎక్కడినుంచి పోటీచేసినా ఓడిస్తానని, ఇందుకోసం ఉద్యోగాలు కోల్పోయిన విద్యార్థులనే అక్కడికి పంపుతానని ప్రకటించారు. తాజాగా గంగోపాధ్యాయ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వడంతో టీఎంసీ ఆరోపణలకు బలం చేకూరింది. రానున్న ఎన్నికల్లో టీఎంసీ స్టూడెంట్ నేతపై మాజీ జడ్జి గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలాహొబే పాట జనాల్లో నాని టీఎంసీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇదీ చదవండి.. మహువా మళ్లీ గెలిచేనా -
Lok Sabha elections 2024: బీజేపీలో చేరిన గంగోపాధ్యాయ్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్‌కు ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు. -
రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి
'అభిజిత్ గంగోపాధ్యాయ' కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన తరువాత.. బీజేపీలో చేరుతున్నట్లు ఈ రోజు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 7న బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. బెంగాల్లో టీఎంసీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో చేరుతున్నట్లు అభిజిత్ గంగోపాధ్యాయ ప్రకటించారు. జస్టిస్ గంగోపాధ్యాయ న్యాయమూర్తిగా తన పనిని పూర్తి చేసినట్లు, చివరి రోజు పెండింగ్‌లో ఉన్న 60 విషయాలను పరిష్కరించినట్లు, ఒక కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు. హైకోర్టులో ప్రాక్టీస్ లాయర్‌గా 24 ఏళ్లపాటు పనిచేసిన జస్టిస్ గంగోపాధ్యాయ 2018 మే 2న అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు అధికారిక రికార్డుల ప్రకారం జూలై 30, 2020న శాశ్వత న్యాయమూర్తి హోదాను పొందారు. -
కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?
కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు. ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికలు.. సీఈసీ ప్రెస్‌మీట్ -
రేపు నా రాజీనామా: జస్టిస్ అభిజిత్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధమైన పలు అంశాలపై ఈయన వెలువరించిన తీర్పులు ఇటీవల తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆయన మంగళవారం రాజీనామా పత్రం సమర్పించాక అన్ని విషయాలను మీడియాతో పంచుకుంటానంటూ బదులిచ్చారు. రాజీనామా లేఖను మంగళవారం మొదటగా రాష్ట్రపతికి, లేఖ ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తానన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ప్రభుత్వ సాయం అందుకునే, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ దర్యాప్తు జరపాలంటూ ఈడీ, సీబీఐలకు ఆదేశాలిచ్చారు. -
నన్ను జైలుకు పంపండి: జడ్జి
తన పని వెంటనే మళ్లీ తనకు ఇప్పించాలని, లేని పక్షంలో తాను మళ్లీ మరోసారి కోర్టుకు హాజరయ్యేది లేదని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ స్పష్టం చేశారు. కావాలంటే తనను జైలుకు పంపాలని కూడా చెప్పారు. సుప్రీంకోర్టును కూడా లెక్క చేసేది లేదని.. కోర్టు ధిక్కార కేసు విచారణను తాను ఎదుర్కోబోనని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ మొండికేయడంతో సుప్రీంకోర్టు ఆయనపై గతంలో బెయిలబుల్ అరెస్టు వారంటు జారీచేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట శుక్రవారం హాజరయ్యారు. తన పాలనాపరమైన, న్యాయపరమైన పనిని ఫిబ్రవరి నెలలో ఏకపక్షంగా లాగేసుకున్నందున దాన్ని వెంటనే పునరుద్ధరించాలని జస్టిస్ కర్నన్ ధర్మాసనాన్ని కోరారు. తాను ఉగ్రవాదిని గానీ, అసాంఘిక శక్తిని గానీ కానని, అంతగా కావాలనుకుంటే ధర్మాసనం తనను జైలుకు కూడా పంపుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట జస్టిస్ కర్నన్ (61) వాదించారు. అయితే, ఆయనకు కలకత్తా హైకోర్టులో మళ్లీ విధులు అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం సమర్పించాలని ఆదేశించింది. ఆయన మానసిక స్థఙతి ఏమీ బాగోలేదని, అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, అలాంటిదేమీ లేదని.. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు స్పష్టంగా తెలుస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. 20 మంది జడ్జీలపై చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారా, లేదా ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణలు చెబుతారో చెప్పాలని సుప్రీంకోర్టు జస్టిస్ కర్నన్‌ను అడిగింది. తాను చేసిన ఫిర్యాదు చట్టానికి లోబడే ఉందని ఆయన అన్నారు. దాంతో జడ్జి అయినా కూడా ఆయనకు విధివిధానాలు తెలియవని కోర్టు వ్యాఖ్యానించింది. -
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
-
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని అన్నారు. సుప్రీం కోర్టు సుప్రీమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను దళితుడు కాబట్టే టార్గెట్ చేశారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంపై జస్టిస్ కర్ణన్ స్పందించారు. మీడియాతో జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తులు పనివాళ్లు కాదని అన్నారు. 8 ఏళ్ల క్రితం తాను అవినీతి జడ్జిలపై ఫిర్యాదు చేశానని, హైకోర్టులో ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ప్రస్తుత, మాజీ జడ్జిలు కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. జస్టిస్ కర్ణన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి భార్య గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించగా.. జస్టిస్ కర్ణన్ వెళ్లలేదు. దేశ న్యాయచరిత్రలో ఓ హైకోర్టు జడ్జికి కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. మద్రాస్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కర్ణన్‌కు వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్ -
కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కానందుకు సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణన్‌కు వారెంట్ అందజేయాలని పశ్చిమబెంగాల్ డీజీపీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది.