కలకత్తా: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాలో భాగంగా బీజేపీ ప్రకటించిన పశ్చిమబెంగాల్ అభ్యర్థుల పేర్లు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవలే జడ్జి పదవికి రాజీనామా చేసిన కలకత్తా హై కోర్టు మాజీ జడ్జి అభిజత్ గంగోపాధ్యాయ్ మేదినీపూర్ జిల్లా టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన మీద తృణమూల్ కాంగ్రెస్ తరపున స్టూడెంట్ నేత, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు కారణమైన ‘ఖేలాహొబే’ క్యాంపెయిన్ సృష్టికర్త దేబాన్షు భట్టాచార్య పోటీచేస్తున్నారు.
బెంగాల్‌లో 2021లో జరిగిన టీచర్ల నియామకంలో పెద్ద కుంభకోణం జరిగిందని పేర్కొంటూ అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న గంగోపాధ్యాయ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలపై టీఎంసీ అధినేత మమతాబెనర్జీ గంగోపాధ్యాయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తరపున ఆ జడ్జి ఎక్కడినుంచి పోటీచేసినా ఓడిస్తానని, ఇందుకోసం ఉద్యోగాలు కోల్పోయిన విద్యార్థులనే అక్కడికి పంపుతానని ప్రకటించారు.
తాజాగా గంగోపాధ్యాయ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వడంతో టీఎంసీ ఆరోపణలకు బలం చేకూరింది. రానున్న ఎన్నికల్లో టీఎంసీ స్టూడెంట్ నేతపై మాజీ జడ్జి గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలాహొబే పాట జనాల్లో నాని టీఎంసీ గెలుపులో కీలక పాత్ర పోషించింది.
Comments
Please login to add a commentAdd a comment