
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18న (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్‌ను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.