
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్‌ఎస్ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది.
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్‌ఎస్ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

వైఎస్ జగన్‌కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులు లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరయ్యారు.

