
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు resultsbie.ap. gov.in వెబ్‌సైట్‌తో పాటు మన మిత్రా వాట్సాప్ (9552300009)నంబర్‌కు హాయ్ అని సందేశం పెట్టడం ద్వారా ఫలితాలను పొందవచ్చని పేర్కొంది. ‘సాక్షి’ www. sakshieducation. com వెబ్‌సైట్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.