
ఎమ్మెల్యే మల్లాది విష్ణు( ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మధురనగర్‌లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాటు కార్పొరేటర్ జానరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని ప్రయత్నాలు చేశాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు.
చదవండి: Andhra Pradesh: రూ.వెయ్యి కోట్లతో ప్లైవుడ్ యూనిట్
టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నెరవేర్చారని, గ్రామ సచివాలయం ద్వారా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదరికం నిర్మూలన చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విజయవాడ నగర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.